Home » Yerramsetti sai » Death Cell

 

    సురేష్ నిశ్శబ్దంగా వింటున్నాడు.
    ఆమె లేచి నిలబడింది.
    "ఇంకేమయినా ప్రాబ్లమ్స్ వుంటే మనసులో దాచుకోకండి వెల్ కమ్ టు రివీల్"
    సురేష్ తలూపాడు.
    ఆమె వెళ్ళి పోయింది. మరి కాసేపట్లో టి.వి. వి.సి.ఆర్ . రెండూ ఓ నౌకరు అతని గదిలోకి తీసుకొచ్చి వుంచాడు.
    నౌకరు వెళ్ళిపోగానే క్యాసెట్ అన్ చేశాడు విష్ణు.
    "అర్జున్ గారు ఆఫీస్ లో వుండగా ఈ క్యాసెట్ తీశాము ఫ్రెండ్! అయన మాట్లాడే పద్దతి, అయన నడక, అయన నవ్వు, అయన ఫోన్ లో మాట్లాడే తీరు , అన్నీ జాగ్రత్తగా గమనించాలి. అవన్నీ రెండు రోజుల్లో ప్రాక్టీస్ చేయగలరనుకుంటాను. ఆఫ్ కోర్స్ ఇది ఉద్యోగం! కనుక చేయక తప్పదు. అంత ఎక్కువ జీతం తీసుకుంటున్నప్పుడు."
    వీడియో పిక్చర్ ప్రారంభమయింది.
    ఓ వ్యక్తీ లగ్జూరియాస్. ఆఫీస్ లో వున్నాడు. అతన్ని చూడగానే గుండెల్లో రైళ్ళు పరుగెత్తసాగినాయ్. అచ్చం తన ముఖమే. ఏమీ తేడా లేదు. ప్లాస్టిక్ సర్జరీ పర్ ఫెక్ట్ గా చేశారు తనకు! ప్రక్కనే వున్న అద్దం వేపు అప్రయత్నంగా తిరిగింది అతని తల.
    ఇద్దరూ కవల పిల్లల్లా కనబడుతున్నారు.
    గంటన్నర సేపు నడిచిందా క్యాసెట్. ఆ గంటన్నరలో ఆఫీస్ లో అతని కార్యక్రమం అంతా స్పష్టంగా తెలిసిపోయింది సురేష్ కి.
    వి.సి.ఆర్ ఆఫ్ చేశాడు విష్ణు.
    "రేపట్నుంచి అర్జున్ సంతకం కూడా ప్రాక్టీస్ చేయాలి సురేష్! అంటే కంప్లీట్ రోజంతా బిజీ అయిపోతారు . ఇంక బోర్ అనేదే వుండదు. ఏమంటారు?"
    సురేష్ మాట్లాడలేదు. క్షణక్షణానికి భయం పెరిగిపోతోంది. ముందు అతని రూపం, తరువాత అతని పద్దతులూ, ఇప్పుడు అతని సంతకం. ఏం జరగబోతోంది? తన్నేందుకి వన్నీ చేయటం?
    "ఏమిటో ఆలోచిస్తున్నావు మిస్టర్ సురేష్! ఇదంతా ఎందుకు చేయాలీ అని కదూ. వినయ్ కూడా ఈ వివరాలు తెలుసుకోవాలనే తొందర పడ్డాడు. పూర్ ఫెలో! ఏ లోకంలో ఉన్నాడో గానీ......."
    ఆ పేరు వినబడగానే శరీరం శీతలం కమ్ముతోంది.
    "ఉద్యోగం అన్నాక వుద్యోగమే సురేష్! సైడ్ ట్రాక్ లో కెళ్ళ కూడదు. సహదేవ్ యిష్టపడడు అలాంటిది. గుడ్ నైట్!"
    అతను వెళ్ళిపోయాడు.
    రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు అతనికి. క్షణక్షణానికి తులసి గుర్తు కొస్తోంది. తను ఘోరమయిన తప్పు చేశాడు.
    డబ్బు కోసం - తులసి లాంటి ఒండర్ పుల్ గాళ్ సాన్నిధ్యం వదులుకుంటారా ఎవరయినా? ఆరు నెలలు కాదు, ఆరు రోజులు కూడా ఎక్కువే!
    ఉదయం డ్రస్ చేసుకుంటుండగా గదిలోంచి వచ్చిందా యువతి మళ్ళీ.
    "గుడ్ మార్నింగ్" అందామె చేతి మీదున్న చిలుక.
    "డ్రస్ లన్నీ చక్కగా సరిపోతున్నాయనుకుంటాను కదూ?" నవ్వుతూ అడిగిందామె.
    "ఆ! అవును!" నిజంగానే ఆ ఖరీదయిన డ్రస్ లు తనకు అద్భుతంగా సూటవుతున్నాయ్.
    "రాత్రి సినిమా చుశారనుకుంటాను. అన్నీ ఈజీ మూమెంట్స్ సురేష్ మీలాంటి యింటిలిజేంట్ పర్ సన్ తేలిగ్గా అనుకరించగలరు అర్జున్ ని."
    'ఆఫ్ కోర్స్! ఆఫ్ కోర్స్!"
    "విష్ణూ!" పిలిచిందామే.
    "ఎస్ మేడమ్!" అంటూ తన చేతిలోని పైల్ టేబుల్ మీదుంచాడతను.
    "ఇలా వచ్చి ఇక్కడ కూర్చోండి సురేష్" పిలిచాడతను.
    అతను వెళ్ళి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగ్గా ఓ కాగితం మీద నల్లటి యింక్ తో సంతకం కనబడుతోంది. "కే,యస్. అర్జున్.'
    "ఈ సంతకాన్నే మీరు కాపీ చేయాలి. ఎంత అద్భుతంగా అంటే దానికీ, మీ సంతకానికి కొంచెం కూడా తేడా వుండకూడదు. బహుశా పర్ ఫెక్ట్ నెస్ రావాలంటే వారం రోజులు పూర్తీ ప్రాక్టీస్ కావాలనుకుంటాను.'
    సురేష్ తల వూపాడు.
    "ఇక ప్రారంభించండి సురేష్! టైం ఈజ్ స్టార్ట్" లేచి బయటకు నడుస్తూ అందామె.
    "టైం ఈజ్ షార్ట్?" అంది చిలుక కూడా!
    వెనుకే విష్ణు కూడా వెళ్ళిపోయాడు.
    సురేష్ పక్కనే వున్న పెన్ తీసుకుని ఎదురుగా వున్న సంతకం చూస్తూ కాపీ చేశాడు. చెయ్యి వణకటం చేత చాలా తేడా వచ్చింది.
    కొద్ది గంటల్లోనే తెలిసి వచ్చింది అతనికి.
    సంతకాన్ని ఫోర్జరీ చేయటం అంత తేలిక కాదు.
    కానీ తప్పదు. వాళ్ళిస్తానన్న లక్ష రూపాయల కోసం కాదు. తను వినయ్ లాగా చంపబడకుండా వుండటానికి!
    మరి కొద్ది సేపట్లో చేయి నొప్పి పుట్టసాగిందతనికి. వెళ్ళు లొంగడం లేదు.దానికి తోడు లోపల భయం.
    విష్ణు లోపలి కొచ్చాడు.
    సురేష్ ప్రాక్టీస్ చేసి పడేస్తున్న కాగితాల గుట్ట వేపు చూసి నవ్వాడు.
    "వెరీ పాస్ట్ ప్రాక్టీస్, సురేష్....." మెచ్చుకుంటున్నట్టుగా చూశాడు.
    సురేష్ కి నమ్మకం తగ్గిపోతోంది.
    ఎంత ప్రయత్నించినా కాపీ చేయలేకపోతున్నాడు. ఒకవేళ తన సంతకం సాధించలేకపొతే ఏం జరుగుతుంది? తనను వదిలేస్తారా? లేక - ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు గాను.......తనూ కారు ప్రమాదంలో చనిపోతాడా?
    విష్ణు దగ్గరికొచ్చి అతను అప్పుడే చేసిన సంతకం చూశాడు.
    "ఫర్వాలేదు. కొద్ది గంటల్లో ఇంత ఇంప్రూవ్ మెంట్ వుందంటే దటీజ్ సమ్ థింగ్"
    కొంత దైర్యం వచ్చిందతనికి.
    "ఈ లెక్కలో నాలుగు రోజులు చాలను కుంటాను" సురేషు భుజం  తడుతూ అన్నాడు విష్ణు.
    "ఆ అమ్మాయి ఎవరు?" అడిగాడు సురేషు చనువు తీసుకుంటూ.
    "మేడమ్ ఎవరో తెలీదా?"
    "ఎవ్వరూ చెప్పలేదూ. అడుగుదామంటే - వెల్ - అడక్కూడదు."
    "ఆఫ్ కోర్స్! వివరాలన్నీ మీకనవసరం పేరు మాధురీ. మిసెస్ అర్జున్ - మీకు చేతివేళ్ళు నొప్పి పుడితే కాసేపు రిలాక్సవచ్చు."
    సురేష్ టేబుల్ ముందు నుంచి లేచి గదిలో కొద్ది సేపు పచార్లు చేశాడు. తరువాత బాత్ రూమ్ లోకెళ్ళి పంపుకింద చేయి వుంచి నీళ్ళు వదిలాడు కాసేపు.
    నొప్పులు చాలా వరకు తగ్గిపోయినాయ్.
    "ఇవాళ మనిద్దరం కలిసి భోజనం చేద్దాం సురేష్! మన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకుందాం!"
    విష్ణు మాటలు చాలా ఉదారంగా వున్నాయ్.
    అతనిని నమ్మవచ్చో , నమ్మకూడదో తెలీటం లేదు.
    భోజనాలు ముగిశాక మళ్ళీ సంతకం ఫైల్ తెచ్చి అతని ముందుంచాడు విష్ణు.
    "టైం ఈజ్ షార్ట్ సురేష్! ఇంకాసేపట్లో సహదేవ్ వస్తున్నాడు ఎంత వరకూ ప్రావీణ్యం సంపాదించావో చూడ్డానికి.
    మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు సురేష్.
    కొద్ది సేపు గడిచాక విష్ణు లోపలి కొచ్చి డోర్ తెరచి పట్టుకున్నాడు. సహదేవ్ లోపలికొచ్చాడు. అతని ముఖం అలాగే వుంది. ఏ ఎక్స్ ప్రేషనూ లేకుండా - భయంకరంగా.
    "హలో సురేష్! చాలా ఫాస్ట్ గా అన్నీ విషయాలూ పికప్ చేసుకుంటూన్నవని విష్ణు చెప్పాడు. ఐయాం వెరీ హేపీ!" అంటూ దగ్గర కొచ్చి అతను ప్రాక్టీస్ చేస్తున్న సంతకం చేశాడు. కొద్ది క్షణాలు ఒరిజనల్ నీ, సురేష్ చేసిన సంతకాన్ని పరీక్షించాక "గుడ్" అన్నాడు సంతృప్తిగా.
    మరో నాలుగు రోజులు అర్జున్ ని వీడియో క్యాసెట్లో చూడటం అతని కదలికల్ని గొంతుతో సహా ప్రాక్టీస్ చేయటం, సంతకం నేర్చుకోవటం తో చాలా బిజీగా గడిచిపోయింది. ఆ రెండు రోజుల్లోనూ విష్ణు తో కొంత చను వేర్పడింది సురేష్ కి.
    అతనితో మంచి స్నేహం చేసుకుంటే తనకేమైనా ఉపయోగపడతాడెమో అనిపిస్తోంది.
    "ఒకసారి వెళ్ళి మా తులసిని చూసి రావాలనుంది విష్ణూ. ఆమె ఒక్కర్తి ఎలా వుందో ఏమో?" అన్నాడతను ఒకరోజు.
    "ఈ వుద్యోగం ముగిసేవరకూ ఆమెను మర్చిపోవాలి. సహదేవ్ ఈ విషయంలో చాలా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు. అంచేత అసలా ఆలోచనలే మనసులోకి రానీకు!" అన్నాడు విష్ణు నవ్వుతూ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra