Home » Suryadevara rammohan rao » అశ్వభారతం


    అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు. లోనకు తొంగిచూసిన సర్కిల్ కి అక్కడేం మార్పు కనిపించకపోవటం, విశ్వదత్త క్షేమంగా నిద్రపోతున్నట్లు కనిపించటంతో మరలా తలుపుల్ని దగ్గరకు లాగివేశాడు.


                               *    *    *


    "సంవత్సరాలు తరబడి నా ఎస్టేట్ లో పడి తింటున్నారు. నా అవసరంలో చిన్న పని చేయలేక పోయారు బాస్టర్స్" నిప్పులు కక్కుతున్నాడు భూపతి. కొడుకు చావు అతన్ని పిచ్చివాణ్ణి చేసింది.

    "సారీసార్, విశ్వదత్తను చంపటం అంత తేలికైన పని కాదు. ఒక్క శశాంక మనుషుల్నే ఎదుర్కోవాల్సి ఉంటుందని వెళ్తే తీరా అక్కడ పోలీసులు వేట కుక్కల్లా కాపుకాస్తున్నారు. విశ్వదత్తను శశాంక తప్పించుకు తీసుకెళ్ళవచ్చనే సందేహంతో అబిడ్స్ సర్కిల్ హాస్పిటల్ చుట్టూ ఉచ్చులు బాగా బిగించాడు. ఎలాగోలా ఆ సూపర్నెంట్ ని భయపెట్టి మన వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ రూపంలో లోపలకు వెళ్ళారు.

    అయితే భరత్ వలన అనుకోని పరిణామం ఎదురైంది అక్కడ. ఆ కుర్రాడు సన్నగా కనిపిస్తున్నా మాడరన్ ఫైట్స్ లో ఆరితేరినవాడు కావటంతో అతని నంచి మనవాళ్ళు తీవ్ర ప్రతిఘటనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మనవాళ్ళు మొండిగా నిలబడి అతన్ని మట్టుబెట్టే ప్రయత్నంలో ఉండగా శశాంక మనిషి ఒక్కడు వెనుక నుంచి ఆధాటుగా వచ్చేసరికి ఆ అవకాశాన్ని, మనవాళ్ళ ఏమరుపాటు తనాన్ని సాకుగా తీసుకొని భరత్ చావు దెబ్బతీశాడు. మేం మాశక్తి మేర్న ప్రయత్నించాం సార్. అయితే ఒక్కటే అర్ధంకాలేదు. అంతకుముందు రోజువరకు మామూలుగా వున్న పోలీసు నిఘా ఆ సాయంత్రమే ఎందు ఎక్కువయింది. కమెండోలను పిలిపించేంత సీరియస్ నెస్ కి ఎందుకెళ్ళింది.

    అలా జరగటానికి రెండే కారణాలున్నాయి ఒకటి శశాంక కొడుకుని ఆ రాత్రి తప్పించబోతున్నాడని అనుమానించన్నా వుండాలి లేదా మనం అతన్ని చంపబోతున్నామనన్నా తెలుసుండాలి....? ఆగాడు భూపతి బాడీగార్డు.

    "శశాంక కొడుకుని తప్పించాలనుకుంటే ఆ పని చేయకుండా ఇప్పటిదాకా ఆగడు. అతను మరేదో ప్లాన్ లో వుండాలి. కనుక అది కారణం కాకపోవచ్చు. ఇకపోతే ఒక్కటే మిగిలింది.

    మనం విశ్వదత్తను చంపబోతున్నట్లు చూచాయగా తెలిసి అతన్ని రక్షించుకునేందుకుగాను తనే తప్పించబోతున్నట్లుగా పోలీసులకు ఇన్ ఫర్మేషన్ అందించి వుండాలి. దాంతో పోలీసులు అలర్టు అవుతారు. నిఘా పెంచుతారు. దీనివలన మన మనుష్యులు ముందు పోలీసుల్ని దాటుకెళ్ళాల్సి ఉంటుంది. లోన భరత్ అనే కుర్రాడు, మరో మనిషి గది వెనుకవేపు ఉన్నాడంటే, ఒకవేళ మనం పోలీసుల్ని దాటుకెళ్ళగలిగినా, వారు మనలని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటానికే అవన్నీ జరిగి ఉండాలి...." అన్నాడు వశిష్ట నుదుటి ముడతల్ని చూపుడు వేలితో రుద్దుకుంటూ.

    భూపతికి అంతా అయోమయంగా ఉంది. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో రహస్యంగా విశ్వదత్త మర్డర్ కి వేసుకున్న ప్లాన్ ఎలా అయితే లీక్ అయింది. ఒక పక్క కొడుకు పోయాడన్న బాధ మరోపక్క పగవాడి మీద కసి తీర్చుకోలేకపోయానన్న కసి ఉన్మతుణ్ణి చేసింది. పిచ్చిగా రంకెలు వేస్తూ విస్కీ బాటిల్ పైకెత్తాడు. వశిష్ట నెమ్మదిగా లేచాడు.

    మరుసటి రోజే విశ్వదత్త రూమ్ చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు చేయబడింది. అబిడ్స్ స్టేషన్ సర్కిల్ దగ్గరుండి అనుక్షణం సహరా వేర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.

    గత్యంతరం లేక భూపతి వశిష్ట సలహాపై విశ్వదత్తను హంపే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు.


                                *    *    *


    మరుసటిరోజే ఆ వారపు రేసెస్ అనగా ఆ రాత్రి ఒంటిగంటవుతుండగా ఠక్కున ఎవరో లేపినట్లుగా లేచాడు శుక్రాచార్య. నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. ఏ మాత్రం శబ్దం రాకుండా కాళ్ళ మునివేళ్ళపై నడవటం శుక్రాచార్యకు బాగా తెలుసు.

    అలా నడిస్తే తన భార్యకు, కూతురుకు అనుమానం రాకుండా ఉంటుందని అది వచ్చిన దగ్గర్నుంచి ఆందోళన చెందుతారని శుక్రాచార్య భయం. కాని ఆ మునివేళ్ళ నడక తాలూకూ శబ్దాన్ని సయితం చాలా కాలం నుంచి తన కూతురు త్రివేణి పసిగడుతుందని తెలియదు శుక్రాచార్యకు.

    శుక్రాచార్య వీధి తలుపు తీసి బయట అడుగుపెట్టేసరికి వాతావరణం భీభత్సంగా ఉంది. చిమ్మని చీకటి, ఉడుండి జల్లు, అప్పుడప్పుడు మెరుపులు, ఉరుములు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈదురు గాలులు శరీరాన్ని కోస్తున్నట్లుగా ఉన్నాయి.

    ఇవేమీ శుక్రాచార్య లక్ష్యాన్ని ఆపలేవు అన్నట్లుగా ఉంది ఆయన నడక. చీకట్లో కదిలిపోతున్న శివుడిలా ఉన్న శుక్రాచార్యను ఆ సమయంలో ఎవరైనా అధాటుగా చూస్తే గుండె ఆగిపోవటం ఖాయం. శుక్రాచార్యకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు జెయింట్సుని చావుదెబ్బ తీయబోతున్నందుకు. మెహిదీపట్నం కూడలి దాటాడు. అతని నడకలో వేగం పెరిగింది. రహస్యంగా నీడలా వెంటాడుతున్న త్రివేణికి తండ్రిని ఫాలో కావటం చాలా కష్టంగా ఉంది. అప్పటికే బాగా తడిసిపోయింది. చలికి వణుకు ఎక్కువయింది.

    కరక్టుగా పదినిమిషాలు నడిచాక ఓ ఇంటిముందాగాడు శుక్రాచార్య. అటూ ఇటూ ఓసారి చూసి తలుపుకొట్టాడు.

    కేజల్ హిల్స్ రెండవ వీధిలో రెండో ఇల్లు తలుపులు తెరుచుకున్నాయి. ఆ తలుపులకి అప్పుడప్పుడూ అర్దరాత్రి వచ్చే ఆ కురువృద్దుడుకోసం తెరుచుకోవటం అలవాటే. మరో రెండు నిమిషాలకే ఆ ప్రహరీ గోడ సమీపించింది త్రివేణి.

    ఆ ఇంటిలోని వారు నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నారు. శుక్రాచార్య అక్కడే ఉన్న ఫోన్ ఎత్తాడు. ఆ కురువృద్దుడు ఆ ఇంటికి అప్పుడప్పుడూ వచ్చి ఎప్పటిలాగే ఫోన్ చేసినట్లు ఆ కుటుంబ సభ్యులు ఫీలయ్యారేగాని కొత్త విషయమన్నట్లు ఏ మాత్రం భావించలేదు. కిటికీలో నుండి తొంగి చూస్తున్న త్రివేణికి అంతా అయోమయంగా ఉంది.

    "నేను...."

    ".... ...."

    "డిసైడ్ అయిందా?"

    ".... ...."

    "వెరీ గుడ్. స్కైవాకరేనన్నమాట"

    ".... ...."

    "విశ్వదత్త మర్డర్ ఏమైంది?"

    ".... ...."

    "వాయిదా పడిందన్నమాట. మరికొద్ది రోజులు అలానే వాయిదా పడాలి. అర్ధమైందా? పొరపాటు జరిగితే నువ్వు కూడా మిగలవు. నేనిప్పుడు శాంతి, క్షమ, ఔదార్యాలకు చాలా దూరంగా ఉన్నాను. మనకు జరిగిన ఘోరమైన ఆ అవమానాన్ని అప్పుడప్పుడూ నీవు మరిచినా నేను మరవలేదు. నాలో రగులుతున్న అగ్నిగుండం వారి నాశనంతోనే చల్లారాలి" ఠక్కున పెట్టేశాడు ఫోన్ శుక్రాచార్య. ఆ ఇంటి సభ్యులవేపు కృతజ్ఞతగా చూసాడు. వెంటనే బయటకు నడిచాడు.

    ఆ ఇంటిని గుర్తుపెట్టుకున్న త్రివేణి అప్పటికే అంబా థియేటర్ దాటింది.


                               *    *    *


    శారద పిల్లలకు స్నానం చేయించి బట్టలేస్తుండగా చక్రవర్తి ఆ గదిలోకి వచ్చాడు. ఓ క్షణంపాటు తను అడగాలనుకుంటున్నది అడగాలా లేదా అని సంశయించాడు, కాని చక్రవర్తి కళ్ళముందు జేబుల్లో సూట్ కేసుల్లో డబ్బుకట్టలతో తిరిగే పంటర్స్ గెలిచి మేడలు మిద్దెలుకొన్న జాక్ పాట్ విన్నర్స్ కథలు కదలాడుతున్నాయి.

    "శారదా...."

    శారద తలెత్తి ఏమిటన్నట్లు చూసింది.

    "నాకు అర్జంటుగా ముప్పైవేలు కావాలి" అంటూ తల వంచుకున్నాడు భార్య ముఖంలోకి చూడలేక.

    ఎందుకు అని అడగలేని శారద ఆశ్చర్యంగా భర్త వేపు చూసింది. తన భర్త ఎప్పుడూ తప్పు చేయలేదు కనుక తలవంచుకునే అవసరం రాలేదు. కాని ఈ రోజెందుకు తలవంచుకున్నాడు?!

    "ఇంట్లో 15వేలున్నాయి__"

    "నాకు తెలుసు. మిగతా పదిహేనువేలు కావాలి."

    "ఎక్కడి నుండి?!"

    "నీ ఎకౌంట్ లోంచి"

    శారదకు అనుమానంగా ఉంది. అడగాలనుంది. కాని అడగలేని దౌర్బల్యం__లోనికెళ్ళి 15 వేలు కేష్. మరో 15 వేలకి చెక్ రాసి తెచ్చింది.

    అవి తీసుకుని నీవెంత మంచిదానవన్నట్లు భార్యవేపు ప్రశంశాపూర్వకంగా చూస్తూ వడివడిగా బయటకు నడిచాడు.

    శారదకు దిగులుగా ఉంది. భర్తకు రేసెస్ అలవాటయ్యాయని ఇంకా తెలియదు కనుక దాని తాలూకు దిగులుకాదు. ఇదివరకులా ఫ్రీగా సరదాగా ప్రేమగా ఉండటంలేదు, శని_ ఆదివారాల సాయంత్రాలు మరీ చిత్రంగా ఉంటోంది భర్త పరిస్థితి. అందుకే దిగులు.

    చక్రవర్తిలాంటి వాళ్ళు వేలు, లక్షలూ వీళ్ళందరూ తమ ఇళ్ళు ఊడ్చి తెచ్చే లక్షలాది రూపాయలు__వాటితో ఆడుకునే సూపర్ రిచ్ మనీ పంటర్స్ ఆ రోజు రేసులకు ఇలాంటి వేలాదిమంది చక్రవర్తులు శలభాలు, డబ్బు పోగుచేసి రేస్ బుక్కులు ముందు పెట్టుకుని స్కిల్ పుల్ గేమ్ రేసులంటూ తెలివిగా కాంబినేషన్స్ కాస్తుండగా వీరికి తెలియని ఓ చిత్రమైన మాయా ప్రపంచంలో మరో డ్రామా పెద్ద ఎత్తున జరుగుతోంది.

    ఆ డిమ్ లైట్ ఎయిర్ కండిషన్డు హాల్లో ఆరుగురు వ్యక్తులు కూర్చున్నారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra