Home » Vasireddy seeta devi novels » Pranaya Veechikalu

ఒక పెద్ద ఇనుప కడ్డీని గడియగా వేసినట్టు సీతకు అర్థం అయింది. సీత ముఖానికి పట్టిన స్వేదబిందువులను తుడుచుకోవడానికి చేతులు ముఖం మీద పెట్టుకొన్నది.
చేతులేమిటి? తను నిలువెల్లా వొణికిపోతూనే వుంది. అవును ఇంగ్లీషువాళ్ళ భావాలను తాను అర్థం చేసుకోగలదు. పాలకులమనే అహంకారం వారిలో వున్నది. వాళ్ళ గౌరవానికి భంగం కలిగితే, చట్టాన్ని అది న్యాయం, నమ్మకమైన సరే వాళ్ళు చస్తే అంగీకరించరు. తన బాబాయి కూడా ఆ బిల్లును వ్యతిరేకిస్తూనే వున్నాడు. ఆ సంగతి మాత్రమే తెలుసు. తనను ఎవరు రక్షిస్తారు? తనను ఇక్కడ బంధించినట్టుగా ఎవరికి తెలుస్తుంది? తను ఇక్కడ ఆకలి దప్పులతో మాడి మాడి దారుణంగా చావాల్సిందేనా? అతను చెప్పిన "కర్మ" అంటే ఇదేనా? తను పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాన్ని తాను అనుభవిస్తోందా? తనను రక్షించేవారెవరూ లేరా? వున్నాడు. ఇక్కడే వున్నాడు. అతను తన అజ్ఞాత మిత్రుడు.
"మిత్రమా! రా! నీ సహాయం నాకు కావాలి! నా కంఠం నువ్వు ఎక్కడ వున్నా వినగలవనే నమ్మకం వుంది నాకు. ఆ ఆక్రోశం నీకు అందుతుంది. నువ్వే నన్ను రక్షించాలి. త్వరగా వస్తావు గదూ? రావాలి. తప్పక రావాలి. నా కంఠం నీకు విన్పించాలి. నా ఆలోచనలు నీ బుర్రలో చలనం కదిలించాలి. ఎక్కడున్నా వెంటనే రా నేస్తం! ప్లీజ్! కమ్! సీత బొంగురు పోయిన కంఠంతో అతన్ని పిలవసాగింది.
తను బంధించబడిన గదిని పరిశీలించి చూసింది. గోల్కొండ పోర్టుకు సంబంధించిన సెల్ అయివుండాలనుకొన్నది. ఆ సమయంలో దీన్ని ఖైదుగా ఉపయోగించి వుంటారని కూడా అన్పించింది. సీత తప్పించుకోవడానికి అవకాశం వుందేమోనని సెల్ పరికించి చూసింది, లాభం లేదనిపించింది. గదిలో ఆమెను చుట్టి తెచ్చిన దుప్పటి తప్ప మరే వస్తువూ లేదు.
గోడలు తాకి చూసింది. చల్లగా వున్నాయి. తను ఎంత ప్రాధేయపడినా తనను బంధించిన వాళ్ళ మనసులు కరగని వాళ్ళ ప్రవర్తన వల్ల ఆమె అర్థం చేసుకొన్నది. తనను అతనే - తన అజ్ఞాత మిత్రుడే రక్షించాలి. అతనికి తన మెసేజ్ అందిందోలేదో? ఒకవేళ అందినా ఎక్కడ ఉందీ అతనికి ఎలా తెలుస్తుంది? తెలిసినా ఎలా రాగలడు? బయట భటుల్ని కాపలాపెట్టే వుంటారు. తను కన్పించడం లేదనే విషయం ఈపాటికి రెసిడెన్సీలో తెలిసిపోయి వుండాలి! తనతో వచ్చిన సిపాయిలు రెసిడెన్సీకి వెళ్ళి టూంబ్స్ లోకి వెళ్ళిన తను మళ్ళీ తిరిగి రాలేదనీ, ఆ దరిదాపుల్లో ఎక్కడా కన్పించలేదనే చెబుతారు.
కనీసం ఆ వార్త అయినా తన స్నేహితుడికి అంది తీరుతుంది. అతను వస్తాడు!
తప్పక వస్తాడు! తన బాబాయి తనను వెదికిస్తాడా? లేక పీడ విరగడయింది అనుకుంటాడా?
ఆమెకు బుర్రలో ఏదో మెసేజ్ కదిలినట్టుగా అన్పించింది.
"నువ్వు ధైర్యంగా వుండాలి. నీ పేరును సార్థకం చేసుకో" అతను చెబుతున్నాడు.
"ఎలా? ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఎలా వుండగలను"
ఎదుట నిల్చుని వున్న వ్యక్తి ప్రశ్నించినట్టే పైకి అన్నది సీత...అదే సమయంలో బయటనుంచి గొంతులు విన్పించాయి. మరికొద్ది క్షణాల్లో తలుపు తెరుచుకొన్నది.
కళ్ళకింద భాగాన్ని చేతి రుమాళ్ళతో మూసి కట్టుకొన్న వాళ్ళ మొత్తం ఎనిమిదిమంది వచ్చారు. అందులో ఒకడి జుట్టు పూర్తిగా ఊడిపోయింది. మరో ఇద్దరివి బట్టతలలు, మిగతావాళ్ళు కుర్రవాళ్ళుగా గుర్తించింది. వాళ్ళందరూ 23 సంవత్సరాలలోపు వాళ్ళుగా భావించింది. అందరూ మౌనంగా నిల్చుని ఆమెను చూస్తున్నారు.
"ఎవరు మీరు? ఎందుకు నన్నలా గుడ్లు మిటకరించుకొని చూస్తున్నారు?" సీత ధైర్యాన్ని కూడదీసుకొంటూ అన్నది.
"నువ్వు ఎలా వుంటావో చూడాలని కుతూహలంకొద్దీ వచ్చాం. చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన ఆడపిల్లకు నేనే బాబాయినయితే ఇలా పట్టించుకోకుండా వుండను" ఒకడు నవ్వుతూ అన్నాడు.
"అసలు విషయం మర్చిపోకు! ఆమె అందాన్ని కాదు ఇప్పుడు మనం చూడాల్సింది" మరొకడు అన్నాడు.
"అది నిజమేలే! అయినా నా కళ్ళకు ఇంకా అందాన్ని చూడగల శక్తి వుంది. మనసు ఇంకా స్పందించే గుణాన్ని పోగొట్టుకోలేదు" అన్నాడు అర్కీ.
"చూడు మిస్ అరాన్! నిన్ను మేము బంధించినట్టు మీ బాబాయికి వార్త అందింది. రెండురోజుల్లో అతను మనసు మార్చుకోవాలి. అందుకు నువ్వు భగవంతుడ్ని ప్రార్థించు" అన్నాడు పొడవాటి యువకుడు ముందుకువచ్చి.
"మీరు చేస్తున్నదేమిటో ఆలోచించండి. ఒక ఆడపిల్లను కిడ్నాప్ చెయ్యడం చట్టరీత్యా పెద్ద అపరాధం. దానికి మీరు శిక్ష అనుభవించి తీరాలి" సీత ధైర్యానికి వాళ్ళంతా నివ్వెరపోయి చూశారు కొద్దిక్షణాలు.
"సుందరీ! నీ ధైర్యానికి మెచ్చాను. ప్రస్తుతానికి నేను కూడా ఏమీ చెయ్యలేను" అర్కీ నవ్వుతూ అన్నాడు. అధిక ప్రసంగం చాలించి అందరూ బయటకు పదండి. ఇద్దరిద్దరి చొప్పున బయట కాపలా కాయండి. ప్రతి అయిదు గంటలకు మారండి" వాళ్ళల్లో పెద్దవాడు విసుగ్గా అన్నాడు.
"నేను పగలే కాపలా వుంటాను. రాత్రిళ్ళు నిద్ర నుంచి లేవడం నావల్ల కాదు" అన్నాడు అర్కీ. అతని మాటలకు అందరూ నవ్వారు. బయటకు వెళుతూ వాకిలి దగ్గర అర్కీ వెనక్కు తిరిగి సీతను చూశాడు. ఆమె నిర్లక్ష్యంగా చూసింది. ధైర్యంగా చూసింది. తను పిరికివాడు అన్నట్టుగా చూసింది. తన ఇండియన్ ఫ్రెండు తన ధైర్యానికి మెచ్చుకుంటాడనే తలపు ఆమె బుర్రలో మెదిలింది.
ఆమెకు ఆకలివేసింది. తినడానికి ఏదయినా పెట్టమని అడగాలనుకొన్నది, కాని వెంటనే "నో" అనే సమాధానం ఇవ్వడానికి శతృవులకు అవకాశం ఇవ్వకూడదని భావించి మౌనంగా వుండిపోయింది.
ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఆమెకు ఎంత ఆలోచించినా ఒకే మార్గం కన్పిస్తోంది. తన ఇండియన్ ఫ్రెండు మాత్రమే రక్షించగలడు. అతనికి తన పిలుపును ఎక్కడున్నా వినే అతీతశక్తి వుంది. నేస్తం! నా పిలుపు నీకు అందలేదా? నేను ఎంత దారుణమైన పరిస్థితుల్లో వున్నానో గ్రహించలేవా? నువ్వు వెంటనే రా! నన్ను ఈ కిరాతకుల బారినుంచి రక్షించు. కళ్ళు మూసుకొని అతని రూపాన్ని గుర్తుచేసుకొంటూ పైమాటలు పదేపదే అనసాగింది.
అకస్మాత్తుగా ఆమెకు అతని కంఠం విన్పించింది.
"సీతా! భయపడకు! నీ కంఠం నాకు విన్పిస్తూనే వుంది. నీ మెసేజ్ నాకు అందుతూనే వుంది. నేను వస్తాను. తప్పక వస్తాను. ధైర్యం కోల్పోవద్దు. నేను నిన్ను రక్షిస్తాను" సీత కళ్ళు తెరిచింది.
నిజంగా తనకు అతని కంఠం విన్పించిందా? లేక తన భ్రమా? భ్రమ కాదు! కాకూడదు! టెలిపతీ ద్వారా కొన్ని వేల మైళ్ళ దూరం మెసేజ్ పంపించవచ్చునని తనకు అతను చెప్పాడు. ఇప్పుడు అది నిజం అని నిరూపించాడు. అతని కంఠమే తను విన్నది. అతను తప్పకవస్తాడు. తనను రక్షిస్తాడు. సీతకు నిద్ర ముంచుకొస్తున్నది. బాగా చీకటి పడింది. ఆమెకు భోజనం పంపించలేదు.
వాళ్ళు నిజంగానే అన్నం పెట్టకుండా తనను బాధించాలని చూస్తున్నారు. తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం అయింది. ఆమె తృళ్ళిపడి చూసింది. వచ్చాడు! ఉత్సాహంగా లేవబోయిన సీత అర్కీ కంఠం విన్పించి నీరసంగా కూలబడింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra