Home » Yerramsetti sai » 8 down

    సీరియల్ పూర్తయేసరికి తెలుంగు రొంబ నేర్చుకుంటుంది లెండి! నేను మరిచిపోతునా?"    
    అమానుల్లాఖాన్ తలూపాడు.   
    రామచంద్రన్ లేచి తలుపుదగ్గరకు నడిచాడు. "దీని పేరు విజయ సార్! నా రెండో పెండ్లాం-" అన్నాడు పెద్ద పెద్ద పళ్ళుకనిపించేలా నవ్వుతూ.    
    "అయ్ సీ-అయ్ సీ" అన్నాడు దూరదర్సన్ డైరెక్టర్.    
    "మీ సొంత భార్య అనుకోండి సార్! మొహమాటమే వండా!"    
    అమానుల్లా ఆ మాటవింటూనే ఒక్కసారిగా పళ్ళు విదిలించుకున్నాడు "నా సొంత భార్యంటే ఎలర్జీనయ్యా. ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తాదిఎందుకు గుర్తు చేస్తాది నువ్వు?" అన్నాడు చిరాకుగా.    
    "సారీ సార్! కాండ్లు పట్టుకుందునా?"    
    "వద్దప్పా!"    
    "అయితే నా పాత సీరియల్సన్నీ ఎక్స్ టెన్షన్ ఇస్తారు కదు స్వామీ?"    
    "ఇస్తానని నిన్న నేనే చెప్పిందిగా-మళ్ళీ మళ్ళీ అడుగుతావెందుకు?"  
    "సారీ సార్! రొంబసారీ!"    
    "దట్సాల్ రైట్-"   
    "బాత్ రూమ్ దగ్గర న్యూస్ పేపర్ వేసి తొంగుంటను సార్! మీరు వెళ్ళేటప్పుడునన్ను నిద్ర లేపండి!"    
    "సరే-"    
    అతను వెళ్ళిపోయాడు. అమానుల్లాఖాన్ తలుపు మూసేశాడు. విజయ బాటిల్లో మందు రెండు గ్లాసుల్లో సర్దుతోంది.    
    "నువ్ చాలా అందంగా వుంది!" అన్నాడు అమానుల్లాఖాన్ మళ్ళీ దూరదర్సన్ తెలుగుప్రసారం చేస్తూ.    
    "తెలుంగు తెరీమల్లె" అందామె.    
    అమానుల్లాఖాన్ నిరాశ పడ్డాడు.    
    "యూ ఆర్ మోస్ట్ బ్యూటీఫుల్ లుకింగ్" అన్నాడు సొంత ఇంగ్లీష్ ప్రసారం చేస్తూ.    
    "ఇంగ్లీష్ తెరీమల్లె" అందామె చిరునవ్వుతో.    
    "తుమ్ ఖూబ్ సూరత్ లకడీ హై" అన్నాడు.    
    "హిందీ తెరీమల్లె" అందామె మందు గ్లాస్ అతని చేతికిస్తూ.    
    అతను మందు కొంచెంతాగాడు. రాత్రి పన్నెండింటికి జరిగిన గొడవ అతనికి గుర్తు కొచ్చింది.    
    తన పక్క కోచ్ లో వున్న కొంతమంది స్టూడెంట్స్ తాగి తమ కోచ్ లో నుంచి వెళ్తూ తనను చూసి ఆగిపోయారు.    
    ఎందుకాగారా అన్న విషయం ఓ పట్టాన తనకు అర్ధం కాలేదు. దూరదర్సన్ డైరెక్టర్ ని రాష్ట్రమంతటా గుర్తుపడతారు అన్న గర్వంతో భార్య వేపు చూశాడు. మెల్లగా అందరూ తనదగ్గరకొచ్చారు.    
    "ఒరేయ్ వీడే!" అన్నాడొకడు.    
    "అవును వీడే!" అన్నాడు ఇంకొకడు.   
    "అవును! ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రాసిన ఆర్టికల్లో వీడి ఫోటో కూడా వుంది" అన్నాడు ఇంకొకడు.  
    "వాటీజ్ యూ ఆర్ స్పీకింగ్?" కోపంగా అడిగాడు తను.    
    "ఆ చెత్త సీరియల్సన్నీ శాంక్షన్ చేసినందుకు ఎంత తిన్నావ్ నాన్నా?" ఒకడు అమానుల్లాఖాన్ తల నిమురుతూ అడిగాడు.    
    "ఇండియన్ ఎక్స్ ప్రెస్ లెక్క ప్రకారం- సంవత్సరం లో కనీసం యాభయ్ లక్షలు తిన్నాడు."    
    "మద్రాస్ సీరియల్ ప్రొడ్యూసర్ గిఫ్ట్ గా ఇచ్చిన కారుకాక!" అన్నాడు ఒకడు నెత్తిమీద లాగికొడుతూ.    
    తను కోపంతో లేవబోయాడు. ఇంకో యిద్దరు తననునొక్కి పట్టారు.    
    "బెంగుళూరు ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫ్లాట్ కాక" అంటూ ఇంకొకడు ఇంకో దెబ్బకొట్టాడు. అతని భార్య ఆ గొడవంతా చూసి బిగ్గరగా కేకలు వేయసాగింది. క్షణాల్లో జనంపోగయి పోయారక్కడ. అంతా కోలాహలం.            
    "ఏం జరిగింది?" ఎవరో అడిగాడు.    
    "వీళ్ళెవరో తాగివచ్చికొడుతున్నారు"    
    "ఎందుకు?"    
    "ఎందుకేమిటి? మనతెలుగు వారందరినీ ఒక్క దూరదర్సన్ డైరెక్టర్ అనే పిచ్చి వెధవనరకయతఃన పెడుతూంటే ఎంతకాలం చూస్తూ ఊరుకోవటం?"    
    "వీడా దూరదర్సన్ డైరెక్టర్?" ఎవరో అడిగారు.    
    "అవును!"    
    "అయితే మీరు తప్పుకోండి! మేం కూడా తన్నాలి!"    
    మళ్ళీ గుద్దులు- తన్నులు -
    అరగంట తర్వాత టి.టి.యివచ్చి రక్షించాడు.    
                                                                 * * *    
    విజయవాడ స్టేషన్ నెంబర్ సిక్స్ ఫ్లాట్ ఫారం ప్రయాణీకులతో కిటకిటలాడి పోతోంది.    
    8 డౌన్ ఆరు గంటలు లేటుకావడంతో ఆ సమయంలో ఇతర రైళ్ళలో వైజాగ్ సైడ్ వెళ్ళదల్చుకున్న వారుకూడా గోదావరి ఎక్స్ ప్రెస్ కోసం వేచి వున్నారు.    
    హఠాత్తుగా స్టేషన్ సూపరింటెంట్ రూమ్ లోకి డి.ఆర్.ఎమ్ రంగనాథన్ మరికొంతమంది అధికారులతో సహాచొరబడ్డారు.    
    స్టేషన్ సూపరింటెండెంట్ శైలేంద్ర ఒక్క ఉదుటునలేచి నిలబడి విష్ చేశాడు. "ఏమయింది శైలేంద్రా! ఏమేం ఎరేంజ్ మెంట్స్ చేశారు?" అడిగాడతను కుర్చీలో కూర్చుంట    
    "ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేశాన్సార్! వాళ్ళీ పాటికి వస్తూండి వుంటారు. రైల్వే డాక్టర్స్ టీమ్ ఇంతకు ముందే వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఎలర్ట్ చేశాను. అంబులెన్స్ లు కొన్ని ఇప్పుడే స్టేషన్ చేరుకున్నాయ్. అమెరికన్ హాస్పిటల్ వాళ్ళు కాసేపటిలో నర్సులతోసహా వచ్చి సహాయం చేస్తామని చెప్పారు."    
    రంగనాథన్ అతను చెప్పే మాటలేమీ వినడం లేదు.    
    "వేరీజ్ 8 డౌన్ నౌ?" అనడిగాడు టైమ్ చూసుకుంటూ.    
    "రాయనపాడు ఇప్పుడే వదిలిందటసార్"    
    "వాటె బౌట్ ధీ పోలీస్? పోలీస్ అఫీషియల్స్ ఎవరయినా వచ్చారా?"    
    "యస్! అయ్ హావ్ కమ్!" అంటూ లోపలికొచ్చాడు ప్రకాష్.    
    "థాంక్ గాడ్! రండి! కూర్చోండి!" అన్నాడు రంగనాథన్.    
    ప్రకాష్ అతని పక్కన కూర్చున్నాడు.    
    "చెప్పండి! మన పోలీస్ ఫోర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా మీ రిక్వయిర్ మెంట్సు ఏమిటో చెప్పండి! ఇప్పుడు 8 డౌన్ ఎక్కడపడిపోతుంది?"    
    రంగనాథన్ ఆశ్చర్యంగా చూశాడు "8 డౌన్ పడిపోతుందని ఎవరన్నారు?"    
    "ఎవరో మీ కంట్రోల్ ఆఫీస్ నుంచి ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు."    
    "నో ఇటీజ్ నాట్ లైక్ దట్! బ్రేక్స్ ఫెయిల్యూర్ వల్ల 8 డౌన్ కొంచెం ఎక్కువ వేగంతో స్టేషన్ లోకొస్తోంది. ఇక్కడ టర్న్ అవుట్ వల్ల డిరెయిల్ అయి పడిపోయే అవకాశం వుంది."    
    "ఎక్కడ?"    
    "అది మనం చెప్పలేం! ఎక్కడయినా డిరెయిల్ అవవచ్చు లేదా డిరెయిల్  అవకుండానే వెళ్ళిపోవచ్చుకూడా!"    
    "అంటే యాక్సిడెంట్ అవబోయేముందే తెలుసుకునేంత అభివృద్ధి చెందిందన్నమాట మీ రైల్వేస్!" హేళనగా అన్నాడు కమీషనర్.    
    రంగరాజన్ మొఖం ఎర్రబడింది "పడబోయే విషయం ముందే తెలుసుకునేంత అభివృద్ధి చెందిందిగానీ ఏ స్పాట్ లో పడబోతోందోమాత్రం తెలీదన్నమాట!" మళ్ళీ అన్నాడతను.    
    "మీరు చేయాల్సిందేమిటంటే మీ వాళ్ళను ఏ క్షణంలో నయినా ఎక్కడికయినా వెళ్ళేందుకు సంసిద్ధంగా వుంచాలి! అంతే!" అతని డైలాగ్స్ కట్ చేసేస్తూ అన్నాడు రంగనాథన్.    
    "అంటే ఆ ట్రెయిన్ ఎక్కడ పడుతుందా అని వెనుకే మనం ఫాలో అవుతూండడమన్నమాట?".    
    "యస్!" అని అక్కడినుంచి లేచి ఫ్లాట్ ఫారం మీదకు నడిచాడతను. వెనుకే స్టేషన్ సూపరింటెండెంట్ పరుగుతో వచ్చాడు "సార్!"    
    "8 డౌన్ బ్రేక్స్ ఫెయిలయాయనీ-ప్రయాణీకులందరూ ఫ్లాట్ ఫారం మీద వెనక్కు నిలబడటంమంచిదనీ ఎనౌన్స్ మెంట్ ఒకటి ఇద్దామా?    
    రంగనాథన్ ఓ క్షణం ఆలోచించాడు. ఆ విషయమే తను చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఎనౌన్స్ మెంట్ ఇస్తే ప్రయాణీకులు పానిక్ అయిపోయే అవకాశం వుంది. ముఖ్యంగా లేడీస్!    
    అతనికి చిరాకు పుట్టుకొచ్చింది. ఈ స్త్రీలవల్లే మన దేశంలో సమస్యలన్నీ పెరిగిపోతున్నాయ్.    
    వీళ్ళకు చదువుఎక్కువయిపోవడం వల్ల మగాడితో సమానమన్న అభిప్రాయం ప్రబలిపోయితెగించిపోతున్నారు.    
    "ఆల్ రైట్! ఇవ్వండి. లేకపోతే 8 డౌన్ ఫ్లాట్ ఫారం మీద ఏమైనా జరిగితే- ఎవరికైనా దెబ్బలు తగిల్తే మనమీద కొస్తుంది" అన్నాడతను.    
    క్షణంలో ఫ్లాట్ ఫారంమీద ఎనౌన్స్ మెంట్స్ మొదలయ్యాయి.    
    ప్రయాణీకులకు గమనిక! 8 డౌన్ గోదావరి ఎక్స్ ప్రెస్ బ్రేక్స్ ఫెయిలయిన కారణంగా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం వుంది కనుక ప్రయాణీకులందరూ ఆరవ నంబర్ ఫ్లాట్ ఫారం నుంచి వెనక్కు జరగవలసిందిగా కోరుతున్నాం"   
    అందరూ సామాన్లతో అయిదో నెంబర్ ఫ్లాట్ ఫారం వేపు పరుగెత్తసాగారు ముంచుకొచ్చినట్లు-    
    సరిగ్గా ఆ సమయంలో దూసుకొచ్చింది 8 డౌన్.    
    డ్రయివర్ గురుమూర్తి రావ్ ముఖంలో నెత్తురు చుక్క లేదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra