Home » Dr jandhyala papayya sastry » Karunasree Saahithyam - 1


    కవిత్వానికి వేయిపడగలెత్తిన కవిసమ్రాట్టువట!
    కమలగర్భుని రాణి నెన్నుదుటి కమ్మకస్తురి బొట్టువట!
    అవనీసుర ప్రవరుడైన మీ ప్రవరుని వలె
    అంతెత్తు హిమాలయానికి అమాంతం ఎగరాలని
    అక్కడి అంబరచుంబి శిఖరాలు అవలోకించాలని
    అంతలేసి పింఛాల అందమైన నెమిళ్ళతో ఆడాలని
    ఇంతలేసి వాల్గన్నుల వరూధిని
    గొంతులో గొంతు కలిపి పాడాలని
    అనుకుంటారు అధునాతనులు ఆంధ్రయువకులు
    
    పాదాలకు పసరు పూయించుకోటానికి
    పంచెలు బాగా పైకి దోపుకొని ప్రయాణానికి
    సిద్దమవుతున్నారు ప్రతిదినం ఇప్పటికీ
    సిద్దుడు మాత్రం రావటంలేదు ఎప్పటికీ.
    
    వందనాలు వందనాలు నందితిమ్మన కవీంద్రులకు
    చిక్కని సుధలు  చిందే చక్కని  శరచ్చంద్రులకు
    "నాకధునీ శీకరముల చెమ్మ"లటే మీ పలుకులు
    సౌకుమార్యానికి పట్టుకొమ్మలటే మీ కవిత్వం కులుకులు.
    
    మీ సత్యభామ లావణ్యసీమ
    మీ సాత్రాజితి మహనీయ సౌభాగ్యవతి
    మీ పారిజాతం సుషమామయ సువర్ణ సుప్రభాతం
    పరువం తప్పదు - వసివాడదు - పరిమళం వీడదు -
    
    నవదంపతులను నందనవనంలోకి పంపించి
    దివిలోపలి పారిజాతాన్ని భువికి దింపించి
    మహీతలాన్ని మార్చివేసింది మరియొక స్వర్గంగ
    మానవుణ్ణి దేవత చేసింది మీ కవితాస్వర్గంగ
    
    సున్నితమైన నడకలు మీకు "వెన్నతో బెట్టినవి"
    సుకుమారమైన భావాలు మీరు "పుట్టగా పుట్టినవి"
    వెన్నెలవంటి కన్నెల చిన్నిపదాల విన్నాణాలు మీ సొత్తు
    అన్నట్లు తిమ్మనార్యా! విన్నారా ఈ చిన్నగమ్మత్తు !!
    
    పారిజాత పరీమళాలు పసికట్టిన నవయువతులు
    పడకటిండ్లలో సత్యభామ లౌతున్నారట !
    అలుక తీర్పవచ్చిన అభినవకృష్ణులు
    తలగడవైపే నిలబడుతున్నారట !
    
    క్షేమమా శ్లేషకవితాచక్రవర్తి !!
    ఎన్నాళ్ళకు కన్నారా కనుగొన్నాను మీ మూర్తి !
    సరికాని గిరికాకుమారి బాగుందా ?
    కాంభోజీ రాగాలాపం అలాగే సాగిందా! ఆగిందా!
    
    నరేంద్రుని పదన్యాసాలు - సురేంద్రుని ఉపన్యాసాలు
    నర్మసచివుడు నటించిన దొంగ సన్యాసాలు
    మంజువాణి మంజువాణీ విలాస విన్యాసాలు    
    నీ పాత్రలు "సానలు పట్టిన జాతిరత్నాలు."
    
    నీ శ్లేష సౌభాగ్యం నేర్చుకొన్నది కావ్యజగతి
    ఆశ్లేషభాగ్యం  దిద్దితీర్చుకొన్నది కళాప్రగతి
    కోలాహలుని కోలాహలానికేమిలే మందమతి
    కవిత్వంవంటి కన్నెను కన్నది శుక్తిమతి.
    
    బళిరా! పింగళి సూరనార్యా! కళాప్రపూర్ణ సౌందర్యా!
    కలిత లలిత కావ్యకల్పనాధుర్యా!
    నీవాక్కు బ్రహ్మవాక్కు! నీ రచన రసాలస!
    నీ కవిత్వమంటే అందరికీ అదేదో ఒక "మధురలాలస!"
    
    నాకంలోని రాకాచంద్రముఖుల
    నాజూకైన ముచ్చటముళ్ళు
    తాకి వచ్చినవి ఉయ్యాల ఊపులో    
    నీ కవితాసుందరి డాకాలివ్రేళ్ళు !!
    
    కాటుక కళ్ళ కలభాషిణిని కూడా
    కలుపుకొని రాలేకపోయినారా మీవెంట
    కాసేపు వాయించేదిగా వీణ
    కమ్మకమ్మగా చూస్తూ కడకంట.
    
    నీ సూక్తి "శుచిముఖి"! నీ ప్రతిభ "ప్రభావతి"!
    నీ సృష్టి "కలభాషిణి"! నీ దృష్టి "అభినవకౌముది"!
    నీ కృతులు శుభాకృతులు! నింపుకొన్నవి చమత్కృతులు!
    తెనుగుసాహితీలక్ష్మి కవి తీయని అలంకృతులు!
    
    ఎవరండీ మీరు పరమమాహేశ్వరులు!
    ఏమేమీ స్వామీ! ధూర్జటి కవీశ్వరులు!!
    అతులిత మాధురీ మహిమాన్వితులు!
    స్తుతమతులు! విమల విభూతి విభూషితులు!
    
    నిత్యనూతనమైన నీ కవితా కళా విశేషం
    నిమేషకాలం అనిమేషంగా చూట్టానికి
    కాళహస్తి మహాక్షేత్రంలో కడు చిత్రంగా
    కళ్ళు మొలిచాయిటే శివలింగానికి !!
    
    చెప్పు తొడుక్కున్న తిన్నప్ప కాలు
    శివలింగం ముఖాన పెట్టించావు
    సత్కావితా వీరుణ్ణి నత్కీరుణ్ణి
    "శంకరగిరి మన్యాలు" పట్టించావు!
    
    చెప్పండి స్వామీ ఇంతకూ అవునా కాదా సహజగంధం?
    "సింధుర రాజగమనా ధమ్మిల్ల బంధం"
    
    చేసీచేయని దధిభాండం లోపలినుంచి
    తీసీతీయని నవనీతం నీ శివానుభూతి !
    తోచీతోచని బాలభానురోచిస్సులలో
    పూచీపూయని జలజాతం నీ కవితారీతి !
    
    అయ్యలరాజు రామభద్రయ్యగారా !
    అభ్యుదయానికి మ్రోగించారు నగారా!
    "కానక కన్న సంతానం" వంటి
    కావ్యం పూచింది మీ కవితా హృదయం
    ఆంధ్రసాహిత్యమనే ఆరామాని కది
    అతికిపోయిన "అభ్యుదయం"
    
    తియ్యతియ్యగా తెరతియ్యగా
    అయ్యలరాజులై రంగంలో అడుగుపెట్టారు
    ఒయ్యారాల విజయవిలాసాలకు
    ఒజ్జబంతులై గజ్జెకట్టారు.
    
    కందుకూరి రుద్రకవిగారు !    
    అందుకోండి ఆనందంగా మా జోహారు !
    అందాలు చిందే "అష్టకం" సృష్టించిన
    "కందుకూరి జనార్ధనులు" గదా మీరు !!
    
    రంభా పరిరంభణ భావనా పరవశుడు
    సంభోగ సంరంభ విజృంభమాణ మానసుడు
    "శంభో! ఆగు! రంభ నిచ్చి సాగు!"
    గంభీరంగా అన్నాడు నీ నిరంకుశుడు
    
    పరమశివుని జూదానికి పిలిచాడు
    పాచికవైచి భక్తవశంకరుని గెలిచాడు
    పందెం కట్టి కదలుమని జందెం పట్టుకొన్నాడు
    నిరంకుశుడు తన "నిరంకుశత్వం" నిలబెట్టుకొన్నాడు
    
    తెనాలి రామకృష్ణ మహాకవీ !
    వినాలి మా మనవి కొంచెం తమచెవి;
    "తాపింఛచ్చదగుచ్చసచ్చవులు" నీకెంతో ప్రియం
    పదగుంఫనలకు నిలయం నీ "పాండురంగవిజయం"
    
    నీవు నిర్మించిన నిగమశర్మ అక్క
    "మచ్చ ఎరుగని చక్కదనాల చుక్క"
    అచ్చమైన ఆంధ్రుల తోటలో
    ముచ్చటగా పెరిగిన "అంటుమామిడి మొక్క!"
    
    "ఇంతలు నంతలు నగు తన
    సంతానాన్ని" వెంటబెట్టుకొని
    నీతోకూడా సభకు రాలేదు
    నిగమశర్మ అక్క ఇంకా నయం !
    
    కూర్చోటానికి చోటు లేదని కాదు నా భయం !
    "ప్ర్రారంభించిన వేదపాఠముల"కని బంగారుతల్లి
    ప్ర్రారంభిస్తుందేమో పాతపాఠం మళ్ళీమళ్ళి.
    
    నీవు సృష్టించిన నిగమశర్మలు
    "నేతిబీరకాయలు" "నీర్వట్టు మడుగులు"
    "దుర్విదగ్దులు" "విరహజ్వరార్తులు" "పరమధూర్తులు"
    "యువతి భుక్తనిర్ముక్త పరిధాన యుక్తులు"
    నేటికీ సంఘంలో
    నూటికి ఏబదిమంది
    దేవరవారికి తెలియనిదేముంది !
    
    జయము జయము శ్రీకృష్ణరాయ దేవేంద్రులకు !!
    జయము జయము భువనవిజయ పూర్ణచంద్రులకు !!
    జయము జయము దిగంత విశ్రాంత యశోభిరాములకు !!
    జయము జయము సాహితీ సమరాంగణ సార్వభౌములకు !!
    
    తులసితోటలో వెలసిన చిన్నారిసుకుమారి
    చిరునవ్వుల పువ్వులలో కలసిమెలసి
    కళకళలాడింది తమ కవితాకుమారి వాల్జడ
    తళతళ మెరసింది తమ కావ్యశ్రీ గజ్జెల పట్టెడ
    
    ఆముక్తమాల్యద సీమంతం మీది చేమంతులు ధరించి
    పులకించి పూలరంగడైనాడు శ్రీరంగశాయి
    మాలదాసరి మంగళకైశికీ మహత్త్వాలు
    బ్రహ్మరాక్షసులను సైతం పరమభక్తుల్ని చేశాయి.
    
    "ఆ నిష్ఠానిధి గేహసీమలో" అహోరాత్రాలు ప్రతిధ్వనించే
    నానావిధ "దివ్యప్రబంధానుసంధాన ధ్వానాలు"
    రంగపతి "శృంగార పల్యంకికా వాహనాలు"
    "వనమాలికా కరణాలు" "వాల్లభ్యలభ్యధ్వజ గ్రహణాలు"
    
    "శయపూజాంబుజాలు" "చెంగల్వ డిగ్గియలు" "జలాహరణాలు"
    "పసుపాడిన ద్రవిడాంగనల పాగడపు చరణాలు"
    తమ ప్రతిభా పాండిత్యాలకు తార్కాణాలు
    తమ వైష్ణవ విజ్ఞాన విశేషానికి అభిజ్ఞానాలు.
    
    అంచలు పంచెలుగా భావించి సమీపించి
    అందుకోబోవు ఆరెకుల అమాయికత్వానికి
    అంచెలంచెలుగా నవ్వుకుంటున్నారు
    మంచెలమీది "శాలిగోపికలు"
    
    ఒక్క గజాన్ని కాపాడటానికి ఉన్ముక్త ధమ్మిల్లంతో
    ఉక్కిరిబిక్కిరై పరువులెత్తాడు ఒకనాడు శ్రీకృష్ణదేవుడు
    అష్టదిగ్గజాలను ఆస్థానంలో అట్టిపెట్టుకొని
    ఆనందంగా పోషిస్తున్నాడు ఈనాడు ఈ కృష్ణదేవుడు
    
    ఆంధ్రభోజులు మహారాజులు ఆశ్రితజన కల్పభూజులు !
    అధిగత సర్వతంత్రస్వతంత్రులు అప్పాజీ మహామంత్రులు!
    సామ్రాజ్యం ప్రభువుల వంతు !! సాహిత్యం కవుల వంతు!!
    సౌభాగ్యం ప్రజలవంతు !! "సర్వేజనా స్సుఖినో భవంతు"!!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra