Home » Yandamuri veerendranath » ధ్యేయం


    ఇంటిలో ఆ రాత్రి తనకోసం మరో సమస్య ఎదురు చూస్తోందని ఆమెకి తెలియదు.


                          *    *    *

    సమయం రాత్రి పదకొండు గంటలవుతోంది. తల్లిదండ్రులకి ఇవ్వవల్సిన మందులిచ్చేసి వాళ్ళు నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత బయట వరండాలో కొచ్చింది నిఖిత. రామూ చాలా సేపటినుంచీ ఆమెకోసం ఎదురుచూస్తూ అక్కడ ఒంటరిగా కూర్చొని వున్నాడు. మరుసటిరోజే అతను మద్రాస్  వెళ్ళిపోవాలి.

    "అన్నయ్యా" పిలిచింది నిఖిత.

    "రా. నీ కోసమే చూస్తున్నాను".

    "రెండ్రోజులుగా గమనిస్తున్నాను. ఏదో చెప్పాలనుకుంటున్నావ్. చెప్పలేకపోతున్నావు- ఏమిటి, ప్రేమలో పడ్డావా?" నవ్వుతూ ఆడిగింది.

    "ప్రేమా దోమా ఏమీలేదు. ఉద్యోగంలో స్థిరపడేదాకా నాకా ఆలోచనలు రావని నీ తెలుసుకదా?"

    "మరేమిటి విషయం?"

    "నాకు స్టేట్స్ కి వెళ్ళే అవకాశం వచ్చింది నిక్కీ. వెళ్ళేట్టయితే మరో పదిహేను రోజుల్లోనే వెళ్ళాలి".

    నిఖిత చప్పున వంగి రామూ చేతులు పట్టుకుంటూ "అబ్బ!ఎంత గుడ్ న్యూస్. రెండ్రోజులపాటు ఈ విషయం చెప్పకుండా ఎలా వుండగాలిగావ్?" అంటూ దాదాపు కేక పెట్టింది.

    "ష్! గట్టిగా  అనకు. వివరాలన్నీ విన్నాక ఏం చేయాలో చెప్పు".

    నిఖిత మొహంలో నవ్వు కాస్త తగ్గింది.  "చెప్పు."

    "నేను పనిచేస్తున్న కంపెనీ జనరల్  మేనేజర్ కి నేనంటే చాలా ఇష్టం. నన్ను స్పాన్సర్ చేయటానికి వాళ్ళ కంపెనీని వప్పించాడు. ఇలావిదేశాలకి వెళ్ళటం చాలా ఉపయోగపడుతుంది. అదీగాక మిచ్ గావ్ యూనివర్సిటీ లో నాకు యం.బి.ఏ. సీటుకూడా వచ్చింది".

    "ఎంత శుభవార్త అన్నయ్యా. ఇంత సంతోషాన్నిచ్చే వార్తా అమ్మా, నాన్నలకి చెప్పకుండా ఎలా వుందగాలిగావు?" అంది నిఖిత ఎగ్జయింటింగ్ గా.

    రామూ పోసివ్ గా "ఏమో నిక్కీ మూడేళ్ళుగా కుటుంబ భారాన్నంతా నువ్వే  మోస్తున్నావు. అమ్మా నాన్నల పరిస్థితి చూస్తుంటే బయటికి ఎంత  బావున్నట్టు కనపడ్డా పూర్తిగా ఆరోగ్యవంతులైనట్లు అనిపించటంలేదు. ఇంకో రెండేళ్ళపాటు మిమ్మల్నందర్నీ వదిలి ఎలా వెళ్ళమంటావ్?"

    "నువ్వు అనవసరంగా భయపడుతున్నావన్నయ్యా. వాళ్ళు వేసుకుంటున్న మందులూ అవీ చూసి కంగారుపడుతున్నట్టున్నావు.  అదంతా రొటీన్ గా ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్" అంది నిఖిత తేలిగ్గా మాట్లాడుతున్నట్టు కనపడటానికి ప్రయత్నం చేస్తూ.

    "నిజంగా కంగారు పడవలసిందేం లేదంటావా?"

    "ఏమీలేదు. కావాలంటే రేపే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసికెళతాను. నువ్వే ఆయనతో మాట్లాడు".

    "నువ్వంత ధైర్యం చెప్తే ఇక నేను ఆలోచించవలసిందేముంది. కానీ అసలు విషయం ఏమిటంటే....." అతడు ఆగి నెమ్మదిగా అన్నాడు, "అక్కడి కెళ్ళాక స్కాలర్ షిప్ తప్పకుండా వస్తుందనుకో. కానీ మొదటి సెమిస్టర్ కి మాత్రం మనం సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వుంటుంది".

    నిఖిత తన మొహంలో భావాలు వెల్లడి కాకుండా "ఎంత కావాల్సి వుంటుంది?" అని అడిగింది.

    "ఒక లక్ష రూపాయలు" అన్నాడు రాము. "దానికి బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారనుకో. అది పెద్ద  కష్టంకాదు. కాకపోతే మనకి ఆస్థి వున్నట్టు ఒక  సాల్వెంట్ సర్టిఫికెట్ చూపించాల్సి వుంటుంది. మన ఇల్లు సెక్యూరిటీ గా చూపించి ఆ సర్టిఫికెట్ చూపించాల్సి వుంటుంది. మన ఇల్లు సెక్యూరిటీగా చూపించి ఆ సర్టిఫికెట్ సంపాయించవచ్చు. కానీ అమ్మా, నాన్నా బాధపడతారేమోనని భయంగా వుంది. అప్పు ఒకటి రెండేళ్ళలో నేనే తీర్చేస్తాను. కానీ ఇవన్నీ  నాన్నగారితో ఈ పరిస్థితిలో ఎలా చెప్పగలను?"

    "నువ్వేం చెప్పకు. అన్నీ నేను చూసుకుంటాను. ఇంటికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గిరే వున్నాయి. నేను మిగతా పనులన్నీ చేస్తాను. నువ్వు మద్రాసు వెళ్ళి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో" అంది.

    రాము మొహం విప్పారింది. సంతోషంగా కుర్చీలోంచి లేస్తూ, చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "థ్యాంక్యూ.....థ్యాంక్యూ వెరీమచ్ నిఖితా, నాన్నగారికి ఈ విషయాలన్నీ ఎలా చెప్పాలా అని చాలా  సతమతమైపోయాననుకో" అన్నాడు. ఎంత నొక్కి పెట్టినా అతని మొహంలో ఎగ్జయిట్ మెంట్ కనపడుతూనే వుంది. "అన్నయ్యా! నువ్వీ చదువులన్నీ చదవాలని ఎంత వుబలాటపడ్డావో నాకు తెలియనిది కాదు. ఇప్పటికైనా నీ కోరిక నెరవేరుతున్నందుకు నాతోపాటు అమ్మా నాన్నా కూడా సంతోషిస్తారు. రెండేళ్ళు ఎంతలో గడిచిపోతాయి? ఇక్కడి సమస్యలేవీ నువ్వు పట్టించుకోకు. సంతోషంగా చదువు పూర్తిచేసుకొనిరా. ఒక్కసారి నువ్వొచ్చాక ఇక  మనకి సమస్య అనేదే వుండదు". బయటినుంచి పడుతున్న వెలుతురులో రాము కంఠం మంద్రంగా వినబడింది. "నిక్కీ. ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఇలాంటి తల్లిదండ్రులకి బిడ్డలుగా పుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులమని. కానీ, ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా? నిన్ను బిడ్డగా  పొందినందుకు ఆ తల్లి దండ్రులూ, నీకు అన్నగా పట్టునందుకు నేనూ అసలైన అదృష్టవంతులమని".

    "ఇదిగో అలాంటి సినిమా డైలాగులే కొట్టకు. నేనుకూడా సినిమా చెల్లాయిలా మాట్లాడవలసి వస్తుంది" అంది నిఖిత తేలిగ్గా నవ్వేస్తూ, రామూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇలాగే వరండాలో కూర్చొని నిఖిత చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయింది.

    "మనుషులకన్నా కష్టాల్లోనే ఐక్యత ఎక్కువ వుందనుకుంటాను. అందుకే అవెప్పుడూ ఒంటరిగా రావు. కలిసి కట్టకట్టుకునే వస్తాయి" అనుకుంది.


                         *    *    *

    "ఏమిటమ్మా నువ్వు చెప్పేది! డెబ్బయ్ అయిదువేల అప్పు మీకిచ్చి తీసుకున్న డాక్యుమెంట్లు మళ్ళీ మీకు తిరిగివ్వాలా?" అన్నాడు రామరతన్, ఆశ్చర్యంగా.

    నిఖిత అభ్యర్థిస్తున్నట్లు "వారం పదిరోజులకోసమే శేఠ్ జీ, వాటిని బ్యాంకులో చూపించి సాల్వెన్సీ సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ మీకే తెచ్చిస్తాను. నన్ను నమ్మండి" అంది.

    "ఎలా నమ్మను? బ్యాంకులో తీసుకున్న అప్పంతా పదిరోజుల్లో వాళ్ళకి ఎలా తీరుస్తావు?" అడిగాడు రతన్.

    "చాలా సింపుల్ . మీ దగ్గిర మరో లక్ష తీసుకుని బ్యాంకు అప్పుతీర్చేసి కాగితాలు తెచ్చి మళ్ళీ మీకే ఇచ్చేస్తానుగా" అంది.

    "అంటే..... ఇంటిమీద మరో లక్ష రూపాయలు నేను యిస్తానని ఎలా అనుకున్నావ్?"

    ఇస్తారు శేఠ్ జీ ఎందుకంటే నేనా ఇల్లు మీకు ఆమ్మేస్తాను కాబట్టి" అంది.

    శేఠ్ జీ విస్తుపోయి చూశాడు. అతడకా క్షణం తన కొడుకు గుర్తొచ్చాడు. తండ్రి సంపాదిస్తుంటే స్నేహితుల్ని తీసుకొని మోటార్ సైకిల్ మీద సినిమాలకీ, దాబాలకీ, డిన్నర్లకీ వెళ్ళి డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టే కొడుకు గుర్తొచ్చాడు. 'ఇలాంటి కూతురు నాకుంటే ఎంత బావుణ్ను' అనుకున్నాడు మనస్ఫూర్తిగా.


                                 4

    సునీతతో పరిచయమైన తరువాత కృష్ణమూర్తికి జీవితమెంతో ఆహ్లాదకరంగా అనిపించసాగింది. నలభై ఏళ్ళు దాటిన పురుషుడికి పాతికేళ్ళ స్త్రీతో పరిచయం- అతడి అహాన్ని బాగా సంతృప్తి పరుస్తుంది.

    అతడి సంసారం, పిల్లలు యాధావిధిగా వుంటారు. భార్య దగ్గర చెయ్యలేనివీ, చిన్నవయసులో వివాహం జరిగటంవల్ల భార్య దగ్గర తీర్చుకోలేని కొన్ని కోరికలు.....పురుషుడు ఇలాంటి వ్యవహారాల ద్వారా తీర్చుకుంటూ వుంటాడు. అదీగాక వివాహం  జరిగిన కొత్తలోనే మగవాడి దృష్టి 'కెరియర్' వైపు మళ్ళుతుంది కాబట్టి, నలభై ఏళ్ళు దాటి జీవితంలో స్థిరపడ్డాక తను కోల్పోయిందేమిటో తెలుసుకొని-అప్పుడు తిరిగి ఆనందాన్ని అనుభవించటానికి ప్రయత్నం చేస్తాడు.

    కృష్ణమూర్తి, సునీతల వ్యవహారం మొదట్లో అతడి కొడుకు 'ప్రీతమ్' ద్వారానే ప్రారంభమైంది. ప్రీతమ్ గురించి సునీత భర్త వచ్చి అతని తండ్రితో కంప్లయింట్ చేసినప్పుడు, కృష్ణమూర్తికి ఈ వ్యవహారంలో వున్న తిరకాసు అర్థమై సునీతని పరిచయం చేసినప్పుడు, కృష్ణమూర్తికి ఈ వ్యవహారంలో వున్న తిరకాసు అర్థమై సునీతని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ రహస్యంగా బాగానే ఎంజాయ్ చేయసాగారు.

    సునీతకి పెద్ద పట్టింపులేదు. ఆమెకి కావలసింది కాసింత వెరైటీ. భర్త మంచి జీతం సంపాదిస్తున్నాడు. తరచూ టూర్ల మీద తిరుగుతూ వుంటాడు. ఆ విధంగా ఆమెకి అది లాభించింది. ప్రీతమ్ లాంటి కుర్రవాళ్ళు, కృష్ణమూర్తిలాంటి నడివయసు దాటినా వాళ్ళు..... ఇలా రకరకాల వ్యక్తులతో రకరకాల థ్రిల్స్ అనుభవిస్తూ వుంటుంది. ఒక్కసారి వెరైటీకి అలవాటు పడిన తరువాత ఏ అనుభవమూ పూర్తి తృప్తి నివ్వదు. ఆ విధంగా ఆమె తన రహస్య జీవితాన్ని కొనసాగిస్తూ వుంది.

    14-17 మధ్య వయస్సున్న పిల్లలతో ఆమె చాలా థ్రిల్ అనుభవిస్తూ వుంటుంది. ఏమీ తెలియని నూనూగు మీసాల కుర్రవాళ్ళని నెమ్మదిగా ఈ వ్యవహారంలోకి దింపి, వాళ్ళకన్నీ నేర్పి తనొక గురువులాగా ఫీలవటంతో ఆమెకి గొప్ప ఆనందమూ, సంతృప్తీ లభిస్తుంటాయి. అందీ అందనట్టు వుండటం ద్వారా ఆ కుర్రవాడు నీటి బయటపడ్డ చేపలా కొట్టుకుంటూ వుంటే అది మరొక శాడిస్టిక్ సంతృప్తి.

    దురదృష్టకరమైన విషయమేమిటంటే, ఆమె ఎవరితో గడిపినా కొన్నాళ్ళయ్యేసరికి వారిమీద ఇంట్రస్ట్ పోతుంది. కాస్త వయసు దాటిన మగవాళ్ళయితే ఫరవాలేదు కానీ కుర్రవాళ్ళు మాత్రం ఆ తాకిడికి తట్టుకోలేక దాదాపు పిచ్చివాళ్ళయిపోతూ వుంటారు. అప్పటిదాకా తనతో నవ్వుతూ మాట్లాడుతూ విశృంఖలంగా గడిపిన 'ఆంటీ' క్రమంగా తనంటే నిర్లక్ష్యం చూపటం గమనించి ఆ చిన్న కుర్రవాళ్ళు  తట్టుకోలేక డ్రగ్స్ కో వ్యభిచారానికో అలవాటు పడినా అందులో ఆశ్చర్యం ఏమీలేదు.

    కృష్ణమూర్తితో సునీత వ్యవహారం మామూలుకన్నా ఎక్కువ కాలమే సాగింది. కృష్ణమూర్తి యిచ్చే రకరకాల ప్రజెంటేషన్స్ ఆమెని బాగా సంతృప్తిపరచి, అతన్ని విడిచిపెట్టకుండా ఆపుచేయగలిగాయి.

    కృష్ణమూర్తి భార్యనుంచి పెద్దగా శారీరక సంతృప్తీ ఎప్పుడూ పొందలేదు. ప్రీతమ్ పుట్టాక వాళ్ళిద్దరూ విడివిడిగానే పడుకునేవారు. వరూధిని పుట్టినప్పుడు ఆమెకు పెద్ద ఆపరేషన్  జరిగి ఆ తరువాత సెక్స్ అన్నా, రోమాన్స్ అన్నా విరక్తి  కలిగేటంత ( చాలామంది స్త్రీలలాగే) నీరసపడిపోయింది.

    పదిహేను రోజులకో, ఇరవైరోజులకో కృష్ణమూర్తి సునీత కలుసుకుంటూ వుంటారు. రాత్రి తొమ్మిది దాటిన తర్వాత సునీత భర్త క్యాంపు వెళ్ళాడని తెలిస్తే, కృష్ణమూర్తి ఆ ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి స్నానం చేయటం, నగ్నంగా భోజనం చేయటం, అతడు సోఫాలో కూర్చొని ఆమెచేత నగ్నంగా డాన్స్ చేయించటం- లాంటి యుక్తవయసు పిల్లల పిచ్చితనపు వ్యవహారాలన్నీ వాళ్ళిద్దరూ ఆ వయసులో చేస్తూ వుంటారు.

    ఆ రోజు అతను మామూలుగానే సునీత దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ భోజనం చేస్తుండగా "ఈ మధ్య రాలేదు" అని అడిగింది సునీత.

    "చూశావు కదా! పేపర్లో చదివే వుంటావు మా కూతురి గొడవ" అన్నాడు కృష్ణమూర్తి. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra