Home » Yerramsetti sai » 420 Mega City


    అక్కడ బ్యాంకుల మోసం ప్రారంభమౌతుంది. రెండు నెలలయినా అది తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా 'ప్రెజెంట్ ఎగెయిన్' అని వస్తుంది. అంటే అది ఆ చెక్కు ఇచ్చినవాడూ, బ్యాంకు వాడు కలసి లాలూచీపడి చేసే వెధవపని అని మీకర్థమౌతుంది.
    మరో రెండు నెలల తర్వాత మీ వారసులకు ఆ చెక్కు అందుతుంది (వాళ్ళూ బ్రతికి ఉంటే) అంటే ఆ సంవత్సరంపాటు మీకివ్వాల్సిన పద్దెనిమిది వందలూ ఇవ్వకుండా ఆ పెద్ద సంస్థ వాడుకుని దానిమీద కొన్ని కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి అప్పుడు మీ అసలు మీకు పారేస్తుంది.
    ఒకవేళ ఆ అన్యాయాలన్నీ మీరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారనుకోండి! ప్రభుత్వం వినపడనట్టు ఇంకోవేపుకి చూస్తుంటుంది.
    ఎందుకంటే - ప్రభుత్వం చేసే మోసాలు ప్రభుత్వం చేస్తుంటుంది కనుక. ఈ బ్యాంకులన్నీ మీ సేవకే!
    "నిజంగా! మన బ్యాంకులు ప్రపంచంలోనే గొప్పవి! జనార్ధన్ పూజారి స్కీమ్ లో మనం తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకుండా లక్షలమందికి ఐదువేలరూపాయల చొప్పున పంచిపెట్టేసి వరల్డ్ రికార్డు సృష్టించినాయ్" అన్నాడు రంగారెడ్డి చాలా గర్వంగా ఫీలవుతూ.
    "ఇంకో అద్భుతం ఏమిటంటే హర్షద్ మెహతా లాంటి సామాన్యుడిని కొద్దిరోజులలో కోటీశ్వరుడిని చేసినయ్" అన్నాను నేను.
    "అంతేకాదు! ప్రధానమంత్రుల ఖర్చులు మరీ పెరిగిపోయినప్పుడు నగర్ వాలా లాంటివాళ్ళు కోట్లకి కోట్లు కనీసం ఎకౌంటు పుస్తకాల్లో కూడా రాసుకోకుండా తీసుకెళ్ళి వూరిబయట రహస్యంగా అందించడానికి సిద్ధపడ్డారు. నిజంగా అంత జాలిగుండె గల బ్యాంకులు ప్రపంచంలో ఎక్కడుంటాయ్?" మరింత పొంగిపోతూ దేశభక్తి ఉట్టిపడే ముఖంతో అన్నాడు సాయిరామ్.
    దాంతో మా కాలనీలో అందరూ బ్యాంకుల విశిష్ట సేవల గురించి మరిన్ని 'నమ్మండి నమ్మకపోండి' లాంటి కథలు చెప్పుకోసాగారు.
    మధ్యలో చంద్రకాంత్ లేచి నిలబడ్డాడు. "గురూ! బ్యాంకులు ఇంతమందికి ఉచితంగా డబ్బు ఇస్తున్నాయ్ - మరింతమందికి తమ బ్యాంకు రిసీట్లు కూడా తెగనమ్మి సహాయం చేస్తున్నాయ్. వ్యాపారులు యిస్తున్నవి దొంగ చెక్కులని తెలిసికూడా కేవలం వారికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో డిస్కౌంటు చేసి క్యాష్ యిచ్చేస్తున్నాయ్! అలాంటప్పుడు నాలాంటి రచయితకి ఓ పదివేలు లోన్ ఇవ్వలేరంటావా?" అడిగాడు ఆశగా.
    "పదివేలు ఎందుకు నీకు?"
    "నా నవల ఎవరూ ప్రచురించడం లేదు కదా! అందుకని పబ్లిష్ చేసుకుందామని"
    "పిచ్చివాడిలాగున్నావే? మన బ్యాంకుల చరిత్ర ఎంత ఉజ్వలమయినదో మేము మాట్లాడుకుంటూంటే విని కూడా ఇంకా సందేహాలు ఏమిటి? అవకాశం లభిస్తే బ్యాంకులు సాహిత్యానికి కూడా ప్రాణం పోస్తాయ్" అన్నాడు రంగారెడ్డి.
    ఆ మర్నాడే అందరూ కలసి మా కాలనీ దగ్గరగా వున్న బ్యాంకుకి వెళ్ళాం.
    "మీరేం చేస్తుంటారు?" అడిగాడు బ్యాంకు మేనేజర్.
    "పత్రికలకు కథలూ, వ్యాసాలూ వ్రాస్తుంటాను. నవలలు కూడా ఇప్పుడే వ్రాయడం మొదలుపెట్టాను."
    "నేనడిగేదదికాదు - మీ బ్రతుకు తెరువుకి మీరేం చేస్తుంటారు అని!"
    "ఇవే పత్రికలకూ, దూరదర్శన్ కీ, రేడియోకీ వ్రాస్తుంటాను. వాళ్ళిచ్చే డబ్బే ఆధారం."
    "ఎంత ఇన్ కమ్ ఉంటుంది సంవత్సరానికి?"
    "చెప్పలేం? ఒక్కోసారి యాభైవేల వరకూ ఉంటుంది. ఒక్కో సంవత్సరం అసలుండదు"
    "అసలుండదా?"
    "ఒక్క పైసా కూడా వుండదు."
    "అసలు నీకు లోన్ ఎందుకిప్పుడు?"
    "నవల పబ్లిష్ చేసి అమ్ముకుంటాను"
    "ఎందుకు?"
    "ఎందుకేముంది? బ్రతుకు తెరువుకి."
    "ఒకవేళ అది అమ్ముకోలేకపోతే? ఐమీన్ అది పూర్తిగా ప్లాప్ అయితే?"
    "రేడియోకిగానీ, టీ.వి.కిగానీ దానిని మార్చి వ్రాసేస్తాను. ఎంతోకొంత వస్తుంది."
    "వెయ్యో, రెండువేలో వస్తుంది. అది మీకిచ్చేస్తాను"
    "మరి మాకు మిగతా డబ్బెవరిస్తారు?"
    "మిగతా డబ్బుకి బదులుగా ఆ నవల కాపీలన్నీ మీ బ్యాంకుకిచ్చేస్తాను" మేనేజర్ కమ్ ఫ్యూజ్ అయిపోయాడు.
    "ఇప్పుడే మా రీజినల్ మేనేజర్ తో మాట్లాడి చెప్తాను" అంటూ అవతల గదిలోకెళ్ళి అరగంటసేపు రీజినల్ మేనేజర్ తో మాట్లాడాడు. తర్వాత మళ్ళీ గదిలోకొచ్చి "మా ఆర్.ఎమ్. మా హెడ్డాఫీస్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ తో మాట్లాడమంటున్నాడు- ఒక్క నిమిషం" అని హెడ్డాఫీస్ కి కాల్ డయల్ చేశాడు.
    వాళ్ళ డిప్యూటి జి.యమ్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ తో మాట్లాడమన్నాడు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ అంతా విని ఆశ్చర్యపోయాడట.
    "నవలలకు లోన్ లివ్వడం మనకు ఆనవాయితీ లేదు- ఎందుకయినా మంచిది ఫైనాన్స్ సెక్రటరీనడగండి" అన్నాడు.
    ఫైనాన్స్ సెక్రటరీ ఆ ప్రపోజల్ వింటూనే కంగారుపడ్డాడట. "ఆ నవల విదేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతుందా?"
    "మౌత్ పీస్ కి చేయి అడ్డం పెట్టి "మీ నవలలు విదేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతుందా? అనడిగాడు మేనేజర్.
    "లేద్సార్! మనరాష్ట్రంలోనే ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళదు- ఇంక విదేశాలకెలా వెడుతుంది?" అన్నాను నేను.
    "పోనీ విదేశీ కొలాబరేషన్ ఏమయినా ఉందా?"
    "లేదండి!"
    "పోనీ ఆస్తులేమయినా మాకు మార్ట్ గేజ్ చేయగలరా?"
    "ఆస్తులుంటే ఇంకా మీ దగ్గర లోన్ ఎందుకండీ అడగడం?" అతను తల గోక్కున్నాడు. "అలాగయితే లోన్ ఇవ్వడం కష్టమేనే-"
    "పోనీ ఇంకో పనిచేద్దాం! నా నవలలో హీరో చాలా బాధలుపడుతూంటే హఠాత్తుగా మీ బ్యాంకు అతనిని ప్రేమించి అతను పెద్ద ఇండస్ట్రీ పెట్టుకోడానికి లోన్ ఇచ్చినట్టూ, దానివల్ల అతను కోటీశ్వరుడయినట్టూ, ఆఖరలో అతనూ అతని భార్య మీ బ్యాంకు భవనంలో వున్న ఫోటోకి దండలు వేసి, హారతి ఇచ్చి, ప్రేయర్ చేస్తున్నట్టూ రాస్తాను"
    "దానివల్ల ఏమిటి ఉపయోగం?"
    "ఆ నవలను మీ బ్యాంకు పబ్లిసిటీ ఖర్చుకింద ప్రింట్ చేయించి, అది వ్రాసినందుకు నాకు ఎంతో కొంత డబ్బిస్తే సరిపోతుంది"
    "మా పబ్లిసిటీ కాకుండా నవల వల్ల సమాజానికి ఏమయినా ఉపయోగం ఉంటుందా?"
    "సాహిత్యం వల్ల సమాజానికి తెగ ఉపయోగం ఉంటుందని చరిత్ర చెబుతోందండీ!"
    "నేను బి. కామ్ లో చదివిన హిస్టరీలో ఆ ముక్క కనిపించలేదే."
    "అలాంటివి పాఠ్య పుస్తకాలలో వ్రాయరండీ!" సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ వచ్చిందాయనకు. "ఏమిటి? అయిదు లక్షలు ఓవర్ డ్రాప్ట్ కావాలా? సేవింగ్స్ బ్యాంకు ఎకౌంట్ కి అంత ఓ.డి. ఎలా ఇస్తాం? ఏమిటి? మన డిప్యూటీ జనరల్ మేనేజర్ గారి తాలూకానా?"
    "ఓ.కే. అయితే సరే-" ఫోన్ పెట్టేసి నావేపు చూశాడతను.
    "సారీ రచయితగారూ! హర్షద్ మెహతా గొడవ అయిన దగ్గర్నుంచీ ఎవరికీ లోన్ లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా బ్యాంకు తాలూకు కోట్ల రూపాయలు అతని దగ్గరే బ్లాక్ అయిపోయాయి."
    చంద్రకాంత్ ఉత్సాహంగా లేచాడు. "అయితే మనం హర్షద్ మెహతాకే అప్లికేషన్ పెట్టుకుందాం గురూ! పదండి!"
                                                     *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra