Home » Adivishnu » Udyogam

అతను నీరసంగా  ఇంటివేపు  నడిచాడు. అక్కడ ఫ్లాట్ ఫారం మిద నించుని చేతులూపుకుంటూ మాటాడిన పెద్ద మనుషులు ఆఫ్ ది సిటీ కారుల్లో శరీరాలు పారేసుకుని దూసుకుపోయేరు.
సుబ్బారావు తన దుర్విధిని తిట్టేసుకున్నాడు.
ఇంటికొచ్చేసరికి చంద్ర డ్రెస్తై రెడీగా వుంది నైట్ డ్యూటీకి వెళ్ళేందుకు. ఆమె నా దుస్తుల్లో చూచింతర్వాత సుబ్బారావు మనసు చివుక్కుమన్నది. రోగులకు సేవచేసే  నిమిత్తం వెళ్ళబోతున్నచంద్రం తన మనుసులోని రోగాన్ని అనుణక్షణం పెద్దదిగా చేస్తోంది. సుబ్బారావు తలొంమచుకు ఇంట్లో అడుగుపెట్టాడు.
ఇంట్లోకి వెడుతున్న సుబ్బారావుని చూచి చంద్ర అన్నది.
" బుజ్జి జాగ్రత్త, మిరు త్వరగా నిద్రపొండి. ప్లాస్కులో పాలుకాచిపోశాను."
" వెళ్ళిరా చంద్రా! నాపనులు నేను చూచుకుంటాను  ఇంకా నాకు ఏమవుతుంది . పోలేదు నువ్వెళ్ళిరా. బుజ్జీ, నువ్వే డవమాకొరేయ్. మి అమ్మ ఉద్యోగానికెళ్లొస్తుంది. నాప్రాణం తీయకు నాన్నా!"
" భగవంతుడా" అన్నది చంద్ర.
" నేనేం మాటాడను చంద్రా , ఏంమాటాడను నోరు మూసుక్కూర్చుంటాను వెళ్ళిరా"
చంద్ర వెళ్ళిపోయింది.

                                                      *    *    *    *

బాగా రాత్రివేళ బుజ్జిగాడు నిద్రలో కదలడం గమనించి బుర్రలోని ఆలోచనలని తాత్కాలికంగా తోలేశాడు సుబ్బారావు. గోడగడియారం తాలూకు  క్లిక్  క్లిక్ శబ్దం సుతిమెత్తగా   వినిపిస్తూన్న వేళ బుజ్డిగాడు కదిలి తన  ఏకాగ్రతనీ ఆలోచననీ.  ఖూనీచేసేశాడు. నిద్రలో బుజ్జిగాడు అందంగా వున్నాడు. అలనాడు మండిపోతున్న నొసటమీద చల్లటి చేతినుంచి " మికేం పర్లేదు మిరు బాగుపడతారు, నిజం.  మిరు ఆరోగ్యంగా వుంటారు. దేముడు మియందుంటాడు" అన్నప్పటి చంద్ర నిశ్ఛలమైన చూపూ నిర్మలమైన మొహాన్ని పుణికి పుచ్చుకున్నాడు బుజ్జి.
"బుజ్జీ! నీకు సుకంలేదురా తండ్రీ!" అనుకున్నాడు సుబ్బారావు.
వెంటనే అతనిమనసు హాస్పిటల్లో ఓ వార్డుపైన లగ్న మైంది. ఎవరో రోగి బాధలోమూలిగేడు, చంద్రావతి అటు వేపు వెళ్ళిపోయింది.అతని తమని మంచంపక్కన నించుని మెత్తగా నవ్వింది.
" మిరు బాగా నవ్వగలరు. అలాగేనవ్వండి. మిరు నవ్వకపోతే నాకేం తోచదసలు. నవ్వండి. ప్లీజు" రోగి  పిచ్చిగా అనేస్తున్నట్లున్నాడు.
చంద్రావతి  నవ్వుతున్నట్టేవుంది. రోగి  ఆవేశంతో మాటాడేస్తున్నట్టే వున్నాడు. ఆనాడు అలాగే మాటాడి చంద్రావతి హృదయంలో స్థానం సంపాయించుకున్నాడు సుబ్బారావు  ఈనాడు  నాలుగురోజుల్లో నే కన్నుమూసే  ఆ ఫలానాగాడు ఆశగా, వెర్రిగా మాటాడేస్తున్నాడు. చంద్రా వతిని  మరో మగడి మత్తులో తోసేయకు భగవంతుడా! చంద్రావతి నాభార్య. ఒక నిరుద్యోగికిభార్య. ఆమొగుడ్తో విసిగిపోయిన యిల్లాలు. ఈసముయాన ఆమెమనసు మరో మనిషిని, మరో రోగినీ కోరుకోవచ్చు. అలాచేయకు. నన్న న్యాయం చేయకు.
ఎవరో కుర్రడాక్టరు కళ్ళల్లో కోరికనింపుకుని చంద్రావతివేపు విసురుగా వొస్తున్నట్టూ. చంద్రావతి రోగిమంచం వొదిలి ఆకుర్రడాక్టరువేపు మెల్లిగా హంసలా నడిచినట్టూ మరొకొత్త  " ఊహాగానం" చేసి గుండెల్లో పోటుతెచ్చే సుకున్నాడు సుబ్బారావు. అలాగే ఆయాసంతో కళ్లు గట్టిగా మూసేసుకున్నాడు.
ఆ ఉదయం చంద్రవావతి పెందరాళే వొచ్చేసింది ఆ మెమొహంలో ఆర్నెల్లనుంచి లేని తృప్తీ వెల్తురూ నిండుకున్నాయి. సుబ్బారావు కి ఆమె మొహం చూడాగా నేదడకలిగింది.
" మంచి వార్త చెప్పేదా?"
" చెప్పు చంద్రా!  నీకైనా  "మంచి" జరగనివ్వు"
" ఇది నాగురించి కాదు."
" మరి?"
" మి గురించి."
" చంద్రా! ఉదయమే వేళాకోళం చెయ్యకు  నువ్వు. చచ్చిబతుకుతూనన్న మనిషి న్నే కనునాకింకామంచేమిటివల్లకాడు"
" మికు డాక్టర్ సుదర్శనరావు బాగా తెలుసుగా."
సుబ్బారావుకి డాక్టర్ సుదర్శనరావు  బాగా తెలుసు. తెల్లవారుతూండగా చంద్రావతి నైతిక పరిధుల్ని కించపరిచే నిమిత్తం చేసిన ఊహాగానంలోని కుర్రడాక్టరతనే! అంచేత తెలుసునన్నట్టు సిగ్గుగా, చెదురుగా తలూపేడు.
"ఆయనో, మాటాడేను."
మాటలే ఆడిందో లేక అతని మనసులోనే అడిందో!"చంద్రా  ఇక చెప్పకు"  అందామనుకుని నోరు తడిచేసుకు వూరుకున్నాడు.
"కాకినాడలో మికు ఉద్యోగం వేయిస్తాననన్నారాయన" అన్నది చంద్ర ఉత్సాహంగా.
సుబ్బారావు నెత్తిన పిడుగుపడినట్లయింది.
వొద్దు చంద్రా! నన్నింకా చేతకానివాడిగా తయారు చేయకు. నీ ప్రయెజకత్వంతో నన్నుద్ధరించకు. ఆ డాక్టరుకీ నీకు వెయ్యి నమస్కారాలు. నన్నిలా బతకనివ్వు. మరో మాట. నన్నుగురించీ , నా చేతగానితనం గురించీ నువ్వేవ్వ రికీ చెప్పనక్కరలేదు. నీకా  అధికారంలేదు. తెలిసిందా?అయినా చంద్రా! నువ్వు కరుణించి నాకు వేయంచబోయే ఉద్యోగం నేనెలా  చేస్తాననుకున్నావసలు, నీకు తెలీదేమో నువ్వంటే నాకుభయంగా వుందిప్పుడు. దైవసాక్షిగా నువ్వు నన్ను భయపెట్టేస్తున్నావ్.... "చివర్ని  మాటాడబోయేది ఆపికళ్ళు తుడుచుకున్నాడు పిరికి. వి. సుబ్బారావు.
"భగవంతుడా! మళ్ళా భగవంతుడ్ని తలిచింది చంద్రావతి.

                                                              - జయశ్రీ మాసపత్రికనుండి

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra