"దొరక్కపోయినా నాకు ఆకలేయదు."

 

    విస్మయంగా చూస్తూ "అదేం" అన్నాడు.

 

    "మరేమో ఆకలేయకుండా అమ్మ ఆకలిపాట నేర్పింది. అది పాడుకుంటే చాలు ఆకలి ఆగిపోతుందన్నమాట."

 

    కడుపు పేగుల్ని రోకలిపోట్లతో నులిమే ఆకలిబాధలో దశాబ్దాల అనుభవం గల ఆ వృద్ధుడు చీకటిలోకి చూస్తున్నాడు.

 

    దూరంనుంచే పడుతున్న ఆ వెలుగురేఖ ఆ వృద్ధుడి కంటి నీటిపొరల్లో పరావర్తనం చెందుతుందే "ఏడుస్తున్నావా తాతయ్యా" అడిగాడు నానీ. "అంటే నీకు నవ్వుపాట రాదన్నమాట."

 

    "అవునమ్మా... నేర్పటానికి నాకూ నీలాంటి అమ్మలేదుగా."

 

    "ఇప్పుడు నాకూ లేదు. కాని అమ్మ నేర్పిన పాటలన్నీ గుర్తున్నాయి."

 

    లేనిది వున్నట్లు భ్రమింపచేస్తూ ఈ మిధ్యా ప్రపంచంలో కొడుకనే భ్రాంతిలో బ్రతికించుకుంటూ లేకుండాపోయిన ఆ తల్లే గుర్తుకొచ్చిందో లేక ఇంకా నేర్వాల్సిన బ్రతుకు పాఠాలగురించి అవగాహన లేని పసికందును చూస్తూ జాలివేసిందో ఆప్యాయంగా తల నిమిరాడు. "పడుకో బాబూ..." మనసు ద్రవించిపోతుంటే ఒక మంచి అనుభూతిని మిగిల్చిన ఆ రాత్రికి మౌనంగా చేతులు జోడిస్తూ నానీ పక్కన చేరిపోయాడు.

 

                                   *    *    *  

 

    ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

 

    బండి వస్తున్న సూచనగా ప్లాట్ ఫాంపై బెల్ మోగిస్తుంటే నానికి మెలకువొచ్చేసింది.

 

    ఉలికిపాటుగా లేచి కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు.

 

    రాత్రి ఖాళీగావున్న ప్లాట్ ఫాం ఇప్పుడు ప్రయాణీకుల్తో కోలాహలంగా వుంది.

 

    ఇంకా నిద్రపోతూనే వున్న తాతయ్యపై దుప్పటి సర్ది ఉత్సుకతగా ముందుకు నడవబోతుంటే హటాత్తుగా రాజారావు గుర్తుకొచ్చాడు.

 

    భయంతో ఓ స్థంభంచాటున నిలబడిపోయి కనుచూపుమేరదాకా రెప్పవాల్చకుండా చూశాడు.

 

    రాజారావు కనిపించలేదు. కాని చాలా దగ్గరగా పైజమా లాల్చీ వేసుకున్న గెడ్డం యువకుడు నిలబడి వున్నాడు.

 

    తాతయ్య చెప్పిన గెడ్డం డాక్టర్ ఆయనే అయుంటాడన్న నమ్మకం ఏర్పడిపోవడంతో నెమ్మదిగా నడిచాడు ఆ యువకుడి దగ్గరకి.

 

    "నమస్తే అంకుల్."

 

    తలతిప్పిన ఆ యువకుడు తనను పలకరించిన నానీని తదేకంగా ఓ క్షణంపాటు చూసి "నమస్తే" అంటూ దగ్గరకి తీసుకుని "ఎవరు కావాలి బాబూ" అన్నాడు ఎందుకు పలకరించిందీ అర్థంకాక.

 

    "మీరే... ఎందుకంటే మీకు గెడ్డముందిగా. తాతయ్య చెప్పాడు."

 

    ఆ యువకుడు కళ్ళలో నిర్లప్తత చెరిగిపోయింది. మృదువుగా నవ్వుతూ "ఏమని చెప్పారు" అడిగాడు.

 

    "మిమ్మల్ని కలిస్తే మందిస్తారని."

 

    "ఏం మందు?"

 

    "బ్రతికించే మందు."

 

    మరింత విస్తుపోయిన ఆ యువకుడు నానీని బెంచీదాకా నడిపించి తీసుకెళ్ళాడు.

 

    "నిన్న రాత్రినుండీ నీకోసమే చూస్తున్నానంకుల్. రాత్రి మీర్రాలేదు" ఒడిలోకి తీసుకోగానే ఉత్సుకతతో కూర్చుని చెప్పాడు.

 

    ఒక పేరున్న రచయితగా ఎన్నో సంఘటనలు సృష్టించిన మన్మథరావనబడే ఆ యువకుడికిదో చిత్రమైన అనుభవం.

 

    "మీ తాతయ్యగారి పేరేమిటి?"

 

    "నా పేరు నాని. అయితే మా తాతగారి పేరు విశ్వేశ్వరశాస్త్రిగారు. మా వూళ్ళో అందరూ దేవుడంటారు. మరేమో నాకు వేదాలవీ నేర్పుతుంటారు. ఇప్పుడు పాపం ఆరోగ్యం బాగోలేదుగా. అందుకే మిమ్మల్ని కలిసి మందు పట్టుకురమ్మన్నారన్నమాట! అనకాపల్లికి ఏడోస్టేషనుగా ఇక్కడ మీరుంటారు అన్నాడు."

 

    అందరూ దేవుడనే ఆయన ఎవరో మన్మథరావుకే తెలీదు. తనగెడ్డం చూసి పొరపాటుపడ్డాడు ఆ పసికందనీ కూడా అనిపించలేదు.

 

    పేరూ, వూరూ తెలీని ఓ మనిషిని కేవలం గెడ్డంగుర్తుతో ఫలానా స్టేషనులో కలిసి మందు అదీ "బ్రతికించేమందు" గురించి అడగమన్నారూ అనడంతో అనౌచిత్యంకన్నా ఒక మహాపండితుడు ఎదుగుతున్న తన వారసుడికి అస్పష్టంగా ఇచ్చిన సమస్యాపూరణంలా తోచింది.

 

    "బ్రతికించేమందు" అన్న పదంలో ఒక ప్రపంచాన్ని నింపి ఏ వేదభూమిలో బ్రతకడానికి మందు అలవరచుకోవాలో స్పష్టంగా తెలుసుకునే "మందు" కోసం అన్వేషించమని పంపినట్లుగా అనిపించింది.

 

    మనోనాడుల తీగలపై సాగే నాదబ్రహ్మం గురించి తెలుసుకోమని ఒక ఆకారమంటూ లేకుండా నిద్రిస్తున్న సమస్యల వలయంలోకి నెట్టి మహా ప్రస్థానపు చివరి అంచుదాకా నడిచి వెళ్ళమని లోకానికి చేరువగా సాహసంతో సాగిపోయి తన తపస్సును ఆ పసికందు నిరసిస్తే చదివి ఆనందించాలని అలౌకికమైన జ్ఞానంకోసం ఒక మహర్షి ఒక మంత్రంలా ఆ పసికందును జపించే పంపాడని అర్థం కాగా మరిన్ని వివరాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా ట్రైను వచ్చి ఆగింది.

 

    నిశ్శబ్దం చెదిరింది.

 

    వచ్చీపోయేవాళ్ళ ఆరాటంతో ఎటుచూసినా పరుగులు.

 

    సరిగ్గా ప్రపంచానికి నిర్వచనంకూడా అదేనని తెలియని నానీ విభ్రమంగా చూస్తుంటే తన అడగాలనుకున్నది మరిచిన ఆ యువరచయిత తను నిరీక్షించే వ్యక్తికోసం పైకి లేచాడు ఆసక్తిగా.

 

    అప్పుడు దిగింది ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులోనుంచి ఓ అందమైన యువతి.

 

    ముగ్ధత్వాన్ని ఇప్పుడిప్పుడే దాటుతున్న ఆ యువతి అందమైన కనుదోయితో ఓ క్షణంపాటు మన్మథరావుని చూసి మరుక్షణం రాయంచలా ముందుకు సాగిపోయింది.

 

    ఆమెను చేరుకోవాలనుకున్న అతడి పాదాలను ఏ సంకెళ్ళో బంధించినట్టు ఆగిపోయాడు.

 

    "మందిస్తావా అంకుల్" గుర్తుచేశాడు నానీ మరోమారు.

 

    "నేను ఎదురుచూస్తున్నదీ ఆ మందుకోసమే" గొణిగాడు.

 

    లాభంలేదు ఆమె వెళ్ళిపోతూంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra