Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    వీరన్న ముఖం వికసించింది.
    "అదేనమ్మా! నేను అనటం .......లతగారు అమాయకురాలు ......." ఉలిక్కిపడింది వారిజ.
    "ఆవిడ పేరేమిటి?"
    "లత"
    "ఏ వూరు?"
    "బెజవాడ"
    "ఎవరమ్మాయి?"
    "ప్లీడర్ సత్యనారాయణ గారి అమ్మాయి." వారిజ తల గిరగిర తిరగసాగింది. ఆనాడు లత పెళ్ళి చూడాలని గంపెడు ఆశతో వచ్చి అవమానం పొంది వెళ్ళిపోయాక లత పెళ్ళి గురించి వివరాలే తెలుసుకోలేదు. రామచంద్ర పెళ్ళి చేసుకున్నది లతనా?
    "మీకు తెలుసా అమ్మా!" కలవర పడిపోయింది ఆమె.
    'ఆహా తెలీదు......నాకేం తెలీదు."
    "నన్ను క్షమించమ్మా ఒక్క విషయం చెపుతున్నాను. బాబుగారికి మనసులో మీ మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. ఆ కారణం చేత లతగారి దోషాలు ఒకటికి పదింతలుగా కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో......"ఆగాడు వీరన్న. ఆమె గుండెలు పగిలిపోతున్నాయి.
    తన బ్రతుకు ఇలా మండిపోయినా కనీసం తన చెల్లెలయినా సుఖ పడుతోందని సంతృప్తిగా ఉండేది మనసులో! చివరకు చెల్లెలు జీవితంలోనూ సుఖం లేదా? అయ్యో? ఏం మనుష్యులు? తమకు లభించిన అపూర్వ సంపద విలువ తెలిసికోలేక చేజేతులా జీవితాన్ని దుఃఖమాయం చేసుకునే వాళ్ళని ఏమనాలి?
    వారిజ కళ్ళల్లో నీళ్ళు చూసి బాధపడడ్డాడు వీరన్న. "అమ్మా! మీరలా కన్నీళ్లు పెట్టుకుంటే నేనేం చెప్పలేను. "ఆమె పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది.
    "చెప్పు"
    "మీరు బాధపడకూడదు. ఈ స్థితిలో బాబుగారి మనసులో మీ పట్ల ఆకర్షణ పెరిగిందంటే , అయన సంసార జీవితం మరింత నరకంగా తయారవుతుంది. బాబుగారు మొదటి నుంచి నియమ నిబంధనలతో పెరిగిన వ్యక్తీ జీవితంలో భోగాలకు కంటే విలువలకు ప్రాధ్యాన్యం యిస్తారు. ఒక్కసారి ఆ విలువలు పడిపోతే , ఆ నియమాలు సదలిపోతే ఎక్కడకు కొట్టుకుపోతారో ఎవరు చెప్పగలరు?"
    తెల్లగా పాలిపోయిన ముఖంతో వీరన్న ముఖంలోకి చూసింది వారిజ. "ఏమిటో వీరన్నా! నువ్వు మాట్లాడేది?"
    "మిమ్మల్ని బాధ పెడుతున్నానమ్మా! మీరు బాబుగారిని ఎంతగా గాడంగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. ఉజ్జలమైన భవిష్యత్తునంతా వదిలి ఈ మారు మూల గ్రామంలో మాములు పంతులమ్మలా ఎందుకు జీవితం గడుపుతున్నారో కూడా తెలుసు"
    చేతులతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది వారిజ.
    "మీ రెంత బాధపడినా చెప్పక తప్పదమ్మా ఇప్పుడు గనుక మీరు బాబుగారిని దూరంగా ఉంచకపోతే ఒక అమాయకురాలి జీవితం నాశనమయి పోతుందమ్మా?"
    "అపు వీరన్నా నేనిక్కడికి మీ బాబుగారితో సుఖాలు అనుభవించడానికి రాలేదు. కనీసం ఆయనను చూసుకోవచ్చు గదా అని ఆశ పడ్డాను. సినిమా జీవితం మీ బాబు గారి కోసం వదిలిపెట్టలేదు. నాకే విరక్తి కలిగి వదిలిపెట్టాను. నువన్నట్లు ఆయనను గాడంగా ప్రేమించిన మాట నిజమే! కానీ, ఆయనలో పాశవిక శక్తులు రెచ్చగొట్టి నాకు బానిసను చేసుకోవాలనే ఉద్దేశ్యం నాకెన్నడూ లేదు వీరన్నా! నన్ను నమ్ము. " కుమిలి కుమిలి ఏడ్చింది ఆమె.
    వీరన్న బాగా కదిలిపోయాడు.
    "నాకు తెలుసమ్మా! మీలో ఆ నమ్మకమే లేకపోతే నేనిప్పుడు మీ దగ్గరకు వచ్చేవాడినే కాదు. నమ్మకం పోతున్నది మీలో కాదు, బాబుగారిలో , ఆ లతమ్మ ఒట్టి తెలివి తక్కువది . అసలే విరక్తిలో ఉన్న బాబుగారు మీ మీద మోజు పెంచుకుని ఆవిడ మీద మరింత విరక్తి పెంచుకుంటారని భయపడి వచ్చాను. నాకెందుకో బాబుగారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారని వుంది. బాబుగారి మనసు లతమ్మ గారి మీదకు మళ్ళించగల సామర్ధ్యం మీకే వుంది. చూడండి , ఎంత కసాయివాన్నో? మిమ్మల్ని కోరుతున్నాను ఈ సహాయం!" ఆమె కళ్ళు తుడుచుకుని ప్రశాంతంగా నవింది.
    "లతా, మీ బాబుగారూ అన్యోన్యంగా ఉండి సుఖపడాలని నువెంత కొరుకునుంటావో , అంత కంటే ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. అందుకోసం నేను చెయ్యగలిగిందంతా చేస్తాను .ఈ విషయంలో నువు నన్ను ప్రాధేయపడవలసిందేమీ లేదు"
    "మీరింత మంచివారని నాకు తెలుసమ్మా! వస్తాను. "నమస్కారం చేసి సంతృప్తిగా వెళ్ళిపోయాడు వీరన్న. ఉంటున్నది అద్దె ఇల్లయినా, ఇంటిముందు చిన్న పూలతోట పెంచింది వారిజ. స్కూల్ పని అయిపోగానే సాయంత్రం పూల మొక్కలకు గొప్పులు తవటంలో, నీళ్ళు పెట్టడంలో రకరకాల దోహదాలు చెయ్యటంలో లీనమయి పోతుంది. మొదట్లో ఒంటరితనం భయంకరంగా అనిపించేది. కాని ఈ పూల తోట ప్రారంభించిన దగ్గరనుండి మొక్కలే ఆమెకు ఆత్మ బంధువులయి పోయాయి.
    ఈ మొక్క వడలి పోతోంది - బెంగ- ఆ మొక్క చిగురేసింది - ఉత్సాహం - మరో మొగ్గ మొగ్గ తొడిగింది - అంతులేని అనందం విరిసిన ఆ పూల వంక చూసుకుంటూ తనను తను మరచి పోతోంది. సుకుమారమయిన ఆ పూవులను తన చెక్కిళ్ళ కానిమ్చుకుని పరవసించి పోతుంది. రంగురంగుల సౌందర్యంతో వింత సౌరభాలతో ఊగిపోయే ఆ పూల మధ్య నిలిచి విశ్వ శిల్పి కళా చాతుర్యానికి ఆశ్చర్యపోతుంది.
    గులాబి మొక్కాల చుట్టూ గొప్పలు తవ్వి రోజ్ మిక్చర్ కలుపుతున్న వారిజ "వారిజా?" అన్న పిలుపుకు ఉలిక్కిపడి తలెత్తింది. నవుతూ నించున్నాడు రవి.
    రవిని చూడగానే ముఖం ముడుచుకు పోయింది వారిజకు.
    పవిత్రమయిన మునిపెల్లెలోకి ఎవరో కిరాతకుడు అడుగు పెట్టినలాటి భావన కలిగింది.
    "కూర్చో ఎప్పుడొచ్చావ్?" అంది పొడిగా.
    "నిన్ననే వచ్చాను. లత యింట్లో దిగాను. లత ఇక్కడే ఉంటోంది. నీకు తెలుసుగా! నువు ఇక్కడి కెందుకొచ్చావ్? వస్తున్నట్లు నాకు చెప్పలేదేం/ నీ ఎడ్రస్ తెలీక నానా అవస్థా పడ్డాను."
    ఇప్పుడెలా తెల్సుకున్నావ్?"
    "దైవికం. ఏం తోచక ఊరంతా తిరుగుతూ ఇలా వచ్చాను. నువు కనిపించావు. లతను చూశావా?"
    "ఎలా చూస్తాను? లత ఇక్కడున్నట్లు నాకెవరూ చెప్పారు? అసలు లత పెళ్ళి ఎవరితో నిశ్చయమయిందో కనీసం ఆ విషయమన్నా నా చెవిన వెయ్యాలని ఎవరనుకున్నారు ? అవునులే? మీ కందరికీ నేను చచ్చి'పోయిన దాన్నిగా!"
    "అలా నిష్టురం'గా మాట్లాడకు వారిజా! నీకు మాత్రం తెలియని దేముంది?"
    "నిష్టూరం ఎవరి మీద వేస్తాను? ఏ అధికారంతో వేస్తాను! అవును......అన్నీ తెలుసు. అందుకే భరిస్తున్నాను అంతా! ఇదంతా సరేలే! లత కులాసాగా వుందా?"
    "ఏం కులాసాలే! ఎద్దు మొద్దు లాంటి మొగుడు దొరికాడు" అదిరిపడింది వారిజ.
    "ఏమన్నావ్?" అంది తీక్షణంగా. ఆ తిక్షాణ్యానికి ఆశ్చర్యమూ, భయమూ కలిగింది రవికి. "లత మొగుడి సంగతి" అన్నాడు వివరిస్తున్నట్లు. తనను తను నిగ్రహించుకుని గంభీరంగా అంది వారిజ.
    'అదే! ఎద్దు మొద్దుతనం ఏం చూశావని అడుగు తున్నాను."
    "నువోకసారి చూస్తే నీకే అర్ధమవుతుంది. బి.యస్. సి పాసయ్యాడు. పల్లెటూరి రైతులా పంచె చొక్కా, అదీ అవతారం! హాయిగా ఉద్యోగం చేసుకోరాదూ? స్వంత వ్యవసాయం అంటూ ఆ పల్లెటూళ్ళో పడి వుండకపోతే ? నాలుగెకరాలతో వ్యవసాయం చేస్తే మాత్రం ఏం వస్తుంది? అయినా అటు ఉద్యోగమూ, ఇటు వ్యవసాయం కూడా చేసుకోవచ్చుగా? ఏమిటో అదోక్కలా ఏడుస్తుంది."
    "లత ఏడుస్తోందా?"
    "కుమిలి పోతుంది. అక్కడికీ ఏదయినా ఉద్యోగం చూసుకుని ఈ కాస్త పొలమూ అమ్మేసి ఇల్లు కొనుక్కుందామని చెప్పిందట. అయన వినలేదు."
    "పచ్చని పొలాలు చూసుకోవటంలో , పొలాల మధ్య తిరుగుతూ పని చేసుకోవటంలో ఆయనకు అనందం ఉందేమో? అదెందుకు అర్ధం చేసుకోరు? అందరికీ డబ్బే ప్రధానం కాదు -"
    "ఆనందమూ! మట్టిలో బురదలో అనందం ఎక్కడ్నించి వస్తుంది. అవునులే , నువూ ......"
    "అలాంటి ఎద్దు మోద్దునే..." వాక్యం పూర్తీ చేసింది వారిజ.
    'చ! నేనలా అన్నానా?"
    "అనవులే నా దగ్గర్నుంచి నీకు డబ్బు కావాలి కనుక -"
    "నీకెలా తెలుసు?"
    "అందుకు కాక నువు నా దగ్గర కెందుకొస్తావ్? అది సరే! లత విషయం చెప్పు. లతేడుస్తే నువెం అన్నావ్?'
    "ఏడవకు బావగారికి చెపుతానని ఒదార్చాను . బావగారికి చెప్పాను. అయన నా మాటలు కసలు వొప్పుకోలేదు. నువన్నట్లే అన్నాడు. నాకిందులో అనండ ముంది అని. లత నాకీ పల్లెటూరు నరకంలా వుంది అంటూ ఏడ్చింది. అప్పటికీ అయన మనసు కరగలేదు. పైగా నీక్కావల్సిన స్వర్గంలోకి నువేళ్ళు అంటూ విసుక్కుని వెళ్ళిపోయారు. చూడు ఎంత ముర్జ్హమే!" ఉద్రేకాన్ని నిగ్రహించుకుంటూ అంది.
    "తరువాత......"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra