Home » Yerramsetti sai » Mogudu Inko Pellam Varjalu


    భవానీశంకర్ గదిలోకి కాఫీ తీసుకొచ్చాడు భజన్ రావ్.
    "హల్లో మైడియర్ భజన్ రావ్! ఇంతకుముందే కదా కాఫీ తాగింది_ మళ్ళీ తెచ్చావేమిటి?"
    "ఇందాక తాగింది పది గంటల కాఫీ సార్_ అది కొంచెం లేటవటం వల్ల పదకొండు గంటలకిచ్చాను. ఇదేమో పన్నెండు గంటల కాఫీ ఓ అరగంట ముందుగా ఇస్తున్నానన్నమాట"
    "టైమింగ్స్ విషయంలో నువ్వు బ్రిటిష్ తాతలాగున్నావ్ భజన్ రావ్"
    "ఏదో_ అలా అలవాటైపోయింది సార్."
    భవానీశంకర్ కాఫీ చప్పరించాడు.
    "ఆహా! సూపర్బ్ టేస్ట్. డైరక్ట్ గా నీలగిరి నుంచి వచ్చినట్లుంది."
    "మీరేదో రాస్తున్నట్లున్నారు సార్?"
    "తప్పదు భజన్ రావ్! నిరంతర పరిశ్రమ! రచయిత జీవితం అంటే చాలా ఎగ్జయిటింగ్ లగ్జరియస్ గా వుంటుందనుకుంటారు మీరు. కానీ నో_ ఏరోజుకారోజు మేటర్_ అయ్ మీన్ సీరియల్ తాలూకూ మేటర్ ఆ ఛానెల్ కి స్పీడ్ పోస్ట్ లో పంపుతూండాలి. అభిమానుల నుంచి వచ్చే లక్షలాది ఉత్తరాలు చదివి వారిలో కొంతమందికి మెయిల్స్ ఇస్తుండాలి. రాయబోయే కొత్త సీరియల్స్ గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ కథ తయారు చేస్తుండాలి. మరోపక్క మన కథ సినిమా వాళ్ళెవరయినా తీసుకుంటే వాళ్ళతో రోజుల తరబడి డిష్కన్స్ చేస్తుండాలి_ ఇంకోపక్క అనేక సభలకు సన్మానాలకూ హాజరవుతుండాలి"
    "అవున్సార్! పాపం చాలా కష్టమయిన పని"
    "నిజం చెపుతున్నాను భజన్ రావ్! ఒకోసారి రచయిత జీవితం వదిలేసి నటన వృత్తిగా స్వీకరిద్దామా అనిపిస్తుంటుంది."
    "ప్రతి మనిషిలోనూ నటుడున్నాడని మా ధన్ రాజ్ అంటుండేవాడు సార్"
    "చాలా గొప్పగా చెప్పాడు ఆ ధన్ రాజ్ ఎవరోగాని"
    "మా కజిన్ సార్! వాడి సంగతలా వదిలేద్దాం సార్ కాసేపు_"
    "ఓ.కే. వదిలేద్దాం_ ఇంకేదయినా విషయం మాట్లాడాలా భజన్ రావ్?" అనుమానంగా అడిగాడు భవానీశంకర్.
    "అవున్సార్"
    "కమాన్ భజన్ రావ్! మాట్లాడాలని పిలిచినప్పుడు ఆలస్యం లేకుండా మాట్లాడేయటం ఆరోగ్యం లక్షణం. హరియప్! ఇప్పుడు మాట్లాడలేకపోతే_ తీరా అన్ని ద్వారలూ మూసుకుపోయాక మాట్లాడినా ప్రయోజనం వుండదని_ అమెరికన్ రచయిత్రి ఒకావిడ తన ఆత్మకథలో రాసింది."
    "ఎంత గొప్పగా రాసింది సార్! సంగతేమిటి సార్. ఆ మధ్యనోసారి_ అంటే చాలాకాలం క్రితం లెండి_ చంద్రకాంత్ అనే ఆ రచయిత ఫోటో నేను పత్రికలో చూశానండీ!"
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు. అయితే తన ఉలికిపాటు భజన్ రావ్ గమనించనీయకుండా ఉలిక్కిపడటం తన సహజసిద్ధమైన గుణం అన్నట్లు నటించాడు.
    "ఎంతోమంది రచయితల ఫోటోలు పత్రికల్లో వేస్తుంటారు భజన్ రావ్! ఆ ఫోటోలు చూసే హాబీ నీకు వుందని నాకు తెలీదు. చాలా మంచి హాబీ అది భజన్ రావ్. కీపిటప్_ నన్నడిగితే నువ్వు స్టాంపులు సేకరించే హాబీలాగా ఫోటోలు సేకరించే హాబీ ఏర్పాటు చేసుకుంటే థ్రిల్లింగ్ గా వుంటుంది. రచయితలని, సినిమా స్టార్స్ వీ, రాజకీయ నాయకులవీ, గూండాలవీ, దొంగలవీ, టెర్రరిస్ట్ లవీ..."
    "నేను చెప్పేదది కాద్సార్!"
    "మరేమిటి భజన్ రావ్?"
    "నేను రచయిత చంద్రకాంత్ ఫోటో ఆ మధ్య అదేదో పత్రికలో చూశాన్సార్!" స్ట్రెస్ చేస్తూ అన్నాడు.
    భవానీశంకర్ కి చెమటలు పట్టినయ్.
    "అంటే నా ఫోటో ఇంతకు ముందే చూశావన్నమాట_ వెరీగుడ్ భజన్ రావ్! నా సీరియల్స్ కూడా ఏమయినా చూస్తుంటావా?"
    "నేను ఫోటోల సంగతి మాట్లాడుతున్నానండీ ప్రస్తుతం_ టీవీ సీరియల్స్ టాపిక్ తర్వాత చూద్దాం"
    "ఓహో ఒకే సమయంలో ఒకే టాపిక్ మాట్లాడాలనే పాలసీ అన్నమాట నీది. బైదిబై మీ పూర్వికులెవరయినా వన్ వే ట్రాఫిక్ రోడ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా వుండేవారా?"
    "లేద్సార్! ఇంతకూ నేను చెప్పదల్చుకుంది_ రచయిత చంద్రకాంత్ ఫోటోకి, మీకూ బొత్తిగా పోలికలు కనిపించటం లేదు"
    "అహ్హహ్హహ్హ" అంటూ విరగబడి నవ్వాడు భవానీశంకర్.
    "అదా నీ అనుమానం. భలే వాడివే! అది మరీ పాతకాలంనాటి ఫోటో_ అయిదేళ్ళ కిందటి ఫోటోకీ ఇప్పటి రూపానికీ చాలా తేడాలు వస్తాయ్ కదా?"
    "రావచ్చుగానండీ... అసలు మనిషే మారిపోయేంత తేడాలొస్తే కొంచెం అనుమానించాల్సి వస్తుందండీ"
    "అనుమానం పెనుభూతం అని వూరికే అనలేదు భజన్ రావ్! అంచేత దానిని వెంటనే చీల్చిచండాడి మనసులో నుంచి చెరిపేయటం మంచిది."
    "ఇంతకూ తమరెవరు సార్? చంద్రకాంత్ రచయిత పేరుతో వచ్చారు?"
    భవానీశంకర్ కి కొద్దిక్షణాలు మాట రాలేదు.
    "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్ భజన్ రావ్! నేనే రచయిత చంద్రకాంత్ ని. మన గోపాల్రావ్, నేనూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్_ చిన్నప్పటి నుంచీ నేను కథలు రాయటం చూసి పువ్వు పుట్టగానే పరిమళిస్తోందని గోపాల్రావ్ అంటూండేవాడు."
    "ఇంతకూ తమరెవరో నిజం చెప్పలేదండి యింకా_ చెప్తే మా కల్నల్ బాబుగారికీ, మా సీతా మేడమ్ గారికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నా డిటెక్టివ్ బ్రెయిన్ ని అభినందించకుండా వుండలేరండి. మా మేడమ్ సంగతి మీకు తెలీదనుకుంటానండీ. ఇలాంటి కీలకమయిన విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు నాకు కనీసం రెండు వందలు క్యాష్ బహుమతిగా యిస్తారండీ"
    వాడు తను చంద్రకాంత్ కాదన్న విషయం తెలుసుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అర్థమైందతనికి.
    "నన్నడిగితే నువ్వు చేసే అద్భుతమయిన సేవకి వాళ్ళు అయిదు వందలిచ్చినా పాపం లేదు భజన్ రావ్."
    "లేదనుకోండి_ కానీ మేడమ్ అంతకంటే ఒక్కపైసా ఇవ్వరండీ మహా కంజూస్ ఆ విషయంలో"
    "ఆమె ఇవ్వకపోయినంత మాత్రాన దేశమంతా గొడ్డుపోయిందనుకోకు భజన్ రావ్. నాలాంటి మహానుభావులు నీలాంటి క్రియాశీలక వీరులకు తప్పకుండా అయిదు వందలు యిస్తారు."
    "మీరిలా ఫలానా రచయిత చంద్రకాంత్ గారు కాదనీ, ఆ పేరుతో దిగి నాటకమాడుతోన్న మరో మోసగాళ్ళని ఎవడికీ తెలీని రహస్యం... నేను బయటకు పొక్కనీకుండా దాచినందుకు అయిదువందలిస్తారా? చాలా దారుణం సార్. కొంచెం హృదయ వైశాల్యం పెంచండి సార్. ఇరుకు హృదయం దేశానికే వినాశకరం సార్."
    "ఎంత పెంచాలి?"
    "కనీసం ఒక్క సున్నా అయినా పెంచాలి సార్. ఆ తర్వాత దానిని రెండుతో గుణించాలి. అంతే!"
    భవానీశంకర్ అదిరిపడ్డాడు.
    "వాట్_ పదివేలా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra