Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

 

    "బాబూ! మీరిలా బాధ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. లతమ్మ గారు చిన్నపిల్ల, ఆవిడకు నచ్చజెప్పి ........."
    'ఆవిడ చిన్నపిల్ల .....నేను ముసలాడిని . కొన్ని కొన్ని విషయాలు చెపితే వింటే వచ్చేవి కావు. సహజంగా రావాలి."
    కోపంతో భగ్గుమన్నాడు రామచంద్ర.
    'మీరు ముందే చికాకుతో ఆవిడను సమీపిస్తారు. ఆవిడ ఏదీ అర్ధం చేసుకోలేని అమాయకురాలు ఎలా బాబు?"
    "అమాయకురాలు కాదు - మూర్ఖురాలు. అమాయకత్వం అందంగా ఉంటుంది. మూర్ఖత్వం చీదరేత్తిస్తుంది. నీకు తెలీదు వీరన్నా! నేను వారిజ దగ్గరికి వెళతానని తెలిసినా లత ఏం బాధపడదు. ఆమెకు కావలసినవి చీరలు, నగలూ - అంతే నేనే తెగించలేకపోతున్నాను - ఏ మాత్రమూ ఆర్ద్రత లేని అనుబంధాన్నుండి విముక్తి పొందడానికి నా సహజ సంస్కారమే అడ్డు వస్తుంది. కాని ఎంతో కాలం యిలా ఉండగలనని తోచదు. ఈ మోడు బతుకు నేను బతకలేను" విసురుగా వెళ్ళిపోయాడు రామచంద్ర. నిర్ఘాంతపోయాడు వీరన్న.
    లతా రామచంద్రల దాంపత్యం అన్యోన్యంగా లేదన్న సంగతి వీరన్నకు తెలుసు.
    ఈ పరిస్థితికి ఆవేదనతో అలమటిస్తున్నాడు రామచంద్ర. అలాంటి స్థితి వుందని కూడా తెలియని మూడురాలు లత. రామచంద్రకు వారిజ పై గల అనురాగం వీరన్నకు తెలుసు. వారిజను అతి గాడంగా ప్రేమించి, ఆమెను పొందలేక ఆర్తితో వేగిపోతున్న సున్నిత మనస్కుడు రామచంద్ర. అతని నర్దం చేసుకుని, మిగిలిన మమకారాలన్నీ అతడు మరిచి పోయేలా తన ప్రేమలో ముంచి వేయగల రాగమయి అతనికి లభించి వుంటే బాగుండేది . స్పందనే ఎరుగని పరమ లౌకికురాలు భార్య అయింది.
    ఈ చికాకులు తట్టుకోలేక రామచంద్ర మళ్ళీ వారిజను ఆశ్రయిస్తే అసలు! వారిజ మళ్ళీ యిక్కడ కెందుకొచ్చినట్లు? తనకూ వారిజ అంటే ఏదో ఆర్ద్ర భావమే కలుగుతుంది. వెకిలి మనిషిగా కనిపించదు. అయినా రామచంద్ర వారిజ వలలో పడి సంసారాన్ని దూరం చేసుకుంటే సహించలేడు. వారిజలో ఏవో కొన్ని ఉత్తమ గుణాలు వుంటే వుండవచ్చు గాక! ఐనా ఆవిడ జగత్తు ఇది కాదు. ఆ జగత్తులోకి రామచంద్ర ఆకర్షింపబడకూడదు. అధఃపతనం తప్ప మరి వ్యామోహాల నుండి విముక్తి వుండదు.
    రంగనాయికకి ఆ గొలుసు అందించాడు తెల్లబోతూ "ఇదేక్కడిది?" అంది.
    "వారిజ గారూ ఇచ్చారు"
    "ఆవిడెవరూ?"
    "ఒక సినిమా తార."
    "సినిమా తారా? నాకు చూపించవా మావా? మనకి కనిపిస్తారా? నీకెలా తెలుసు?" సంబరంగా అడిగింది రంగానాయికి. విస్తుపోయి చూశాడు వీరన్న . ఏమిటీ వెర్రి? సినిమా తార అయినంతలో ఏమిటుంది ఆవిడలో? ఎందుకు రంగానాయికి కింత ఉబలాటం ఆవిడను చూడటానికి?
    "ఎందుకు చూడటం?" విసుగ్గా అన్నాడు. వీరన్న విసుగు కనిపెట్టి బుంగమూతి పెట్టింది రంగానాయికి.
    "ఎందుకు మావా, అట్లా విసుక్కుంటావు? చూస్తే ఏం పోయింది? వాళ్ళ వేషాలన్నీ నేర్చుకుంటాననా? ఛీ! పాడు! సరదాకు చూస్తాను కాని. ఆ వేషాలన్నీ ఎవరికి కావాలి?"
    "నువూ ఓ తార వయిపో....!" వెక్కిరింపుగా అన్నాడు.
    "చాల్లే ఆ బతుకూ ఒక బతుకేనా?" మూతి తిప్పుకుంటూ అంది రంగనాయికి.
    "ఒక పక్క అసహ్యం, మరోపక్క ఆకర్షణ." తనలో తను నవ్వుకున్నాడు వీరన్న.
    "తీసి కేళతాలే? అని అవిడెక్కడున్నారో నాకు తెలీదు. తెలిశాక తీసి కేళతాను." అన్నాడు పొడిగా.
    "ఎక్కడున్నారో తెలీకుండా గొలుసేలా తెచ్చావు?"
    "నాకు తెలీదు. రామచంద్రబాబు తెచ్చారు. అయన కిచ్చారు , ఆవిడ."
    "ఓహో...... రామచంద్ర బాబుకీ, ఆవిడకీ స్నేహమన్నమాట!" కళ్ళు తమాషాగా తిప్పుతూ అదోరకంగా అంది.
    "ఛీ......నోరుమూసుకో." కసురుకున్నాడు వీరన్న. రంగానాయికీకి కష్టం తోచింది.
    "నేనేం తప్పు మాటన్నాను. ఎంత స్నేహం లేకపోతే బంగారు గొలుసిస్తారు? నువు చెప్పు స్నేహం లేదని లెంప లేసుకుంటాను."
    వీరన్న మాట్లాడలేదు. మూతి ముడుచుకుని కూర్చున్నాడు. రామచంద్ర పై వీరన్నకు గల అభిమానం తెలిసిన రంగానాయికి అతడి ఆవేదనను అర్ధం చేసుకుంది.
    అతడిని మురిపించడానికి మల్లె మొగ్గలున్న పళ్ళెం తీసుకుని దగ్గరగా వచ్చింది.
    "చూడు మావా! ఎంత బాగున్నాయో , ఈ మల్లె పూలు ....నే స్వయంగా పూయించాను."
    "కొంచెం పూలు లతగారి కిచ్చి రాకపోయావా?' చటుక్కున ముఖం ముడుచుకుంది రంగానాయికి.
    "ఆవిడకు వల్లమాలిన గర్వం బాబు? మర్యాద అక్కర్లేదు . పోనీ ఆదరంగా పలకరించనైనా పలకరించదు. ముఖమంతా ముటముటలాడించుకుని "ఎందుకొచ్చా" నన్నట్లు మాట్లాడుతుంది. నువేం చెప్పినా వింటాను కాని లత గారి దగ్గరకు మాత్రం వెళ్ళమనకు. "ఊసురుమని నిట్టూర్చి ఊరుకున్నాడు వీరన్న.

                                                       ----------


    చిన్న పల్లెటూరు, వారిజ ఎక్కడుంటుందో తెలుసు కోవటానికి ఎక్కువకాలం పట్టలేదు వీరన్నకి. వారిజ అక్కడే స్థిరపడి పోయి ఉద్యోగంలో జేరిందని కూడా విన్నాక గుండెల్లో రాయి పడ్డట్టే అయింది.
    సంజ వేళ వారిజ యింటికి బయలుదేరాడు వీరన్న. వీరన్నను చూడగానే సంభ్రమంతో వారిజ ముఖం వికసించింది.
    "రా.........రా.......వీరన్నా! ఎన్నాళ్ళకు కనిపించావు? పెళ్ళి చేసుకున్నావుటగా? మీ ఆవిడను కూడా తీసుకు రాకపోయావా? చూసేదాన్నిగా/ అయినా నా మీద నీకింత అభిమానం ముందని తెలీనే తెలీదు వీరన్నా! తెలిస్తే నేనే మీ ఇంటికి వచ్చేదాన్ని . మనుష్యులలో జాలి, సానుభూతి చాలామందిలోనే ఉన్నాయి వీరన్నా?"
    వీరన్న తల దించుకున్నాడు . వారిజ ముఖంలో తనను చూడగానే ప్రతిఫలించిన సంతోషం, ఆవిడ కంఠంలో ధ్వనించిన ఆప్యాయతా అతడ్ని లజ్జితుడ్ని చేశాయి. వారిజ పట్ల దయతోనూ, సానుభూతితో వచ్చాడా తానిక్కడికి?
    తల వంచుకుని నిలబడ్డ వీరన్నకు కుర్చీ తెచ్చి వేసింది ఆమె.
    "కూర్చో వీరన్నా!" ఆ మర్యాదకు తలక్రిందులయి పోయాడు వీరన్న.
    "ఫరవాలేదమ్మా! ఇలా కూర్చుంటా లెండి. "కింద కూర్చోబోయాడు.
    'ఆహా! అలా వీల్లేదు వీరన్న కుర్చీలో కూర్చో. మీ అయ్యగారి దగ్గర నీకీ మర్యాదలన్నీ , నా దగ్గిర దేనికి?నీకన్నా నిర్భాగ్యురాలిని నేను." వారిజ కంఠం గద్గదమయింది. కన్నీటి బిందువులతో మిలమిల లాడుతూ దైన్యంగా చూస్తోన్న వారిజ కళ్ళల్లోకి చూసి తల దించుకున్నాడు వీరన్న.
    అంతలో కళ్ళు తుడుచుకుని లోపలి కెళ్ళి కాఫీ కప్పు తీసుకొచ్చి వీరన్న కందించింది ఆమె. వణికే చేతులతో అందుకున్నాడు వీరన్న. తాను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పటం? చటుక్కున స్పురించింది వీరన్నకు........తనే ఇలా అయిపోతుంటే రామచంద్ర ఈ యువతి ముందు కరిగిపోవటంలో ఆశ్చర్య మేముంది. అని,
    కాఫీ తాగి కప్పు కడగబోతుంటే చటుక్కున అందుకుంది వారిజ.
    "నువెందుకు కడగటం? పని మనిషి వస్తుంది." కప్పు లోపల పెట్టి వచ్చి అతనికి ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది.
    "మీ బాబుగారు బాగున్నారా?" వీరన్నకు సందు దొరికింది.
    "ఏం బాగులేమ్మా! అన్నీ వున్నాయి. సుఖం తప్ప అన్నట్లుంది. మనమంతా కలిసి ఎలాగయినా అయన సుఖపడేలా చూడాలి."
    "అదేం వీరన్నా?" ఆందోళనగా అడిగింది.
    "బాబు గారు నిన్న రాత్రి యిక్కడికి వచ్చారుట కదమ్మా. ఆయనేం చెప్పలేదా?"
    "ఊహు.....ఏం చెప్పలేదే? సంగతేమిటి వీరన్నా!"
    "అనడానికి మాములు విషయమే అమ్మా? కాని బాబుగారు గోరంతను కొండంత గా చేసుకుని బాధపడుతున్నారు."
    "విషయం చెప్పు?"
    "బాబుగారి భార్య అదొక రకం మనిషి. మంచిదే కాని చీరల  మీదా, నగలు మీదా మోజు. బాబుగారి మనసు అర్ధం చేసుకోదు. నోటికేం వస్తే అది మాట్లాడుతుంది. బాబుగారు లోలోపల విరక్తి పెంచుకుంటున్నారు."
    దీర్ఘంగా నిట్టూర్చింది వారిజ. " ఇందులో అంత విరక్తి పెంచుకోవలసిందేముంది? చీరల మీదా? నగల మీదా మోజు మూడు వంతులు ఆడవాళ్ళ కందరికీ వుంటుంది. ఇంక ఒకరి నొకరు అర్ధం చేసుకోవటానికి కొంత కాలం పడుతుంది. ముందు బాబుగారే ఆవిడను అర్ధం చేసుకుని ఆవిడకు సంతృప్తి కలిగేలా ప్రవర్తిస్తే ఆవిడ కూడా నెమ్మది మీద ఆయనను అర్ధం చేసుకుంటుంది. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కాని, ఇలా విరక్తి పెంచుకుంటే ఎలా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra