Home » Suryadevara rammohan rao » Phaalakshudu


    రెండవ ప్రపంచ యుద్ధం జరిగాక, హిట్లర్ సామ్రాజ్యం అంతమయ్యాక, హిట్లర్, అతని ఆప్తుడు పబ్లిసిటీ ఆఫీసర్ గోబల్స్ బంకర్ లో ప్రాణాలొదిలాక, ఇజ్రాయిల్ డిటెక్టివ్ అధికారి ఫ్రీడ్ మెన్ మొత్తం నాజీ జనరల్స్ అందర్నీ అరెస్ట్ చేసి ఉరి తీయించాడు. ఒక్క ఐచ్ మన్ ని తప్ప. ఎవరూ అతన్ని చూసి ఎరుగరు. ఎలా వుంటాడో తెలీదు. ఐచ్ మన్ రహస్యంగా ప్రాణాలు తీసుకున్నాడని కొంతమంది డిటెక్టివ్ అధికారి ఫ్రీడ్ మన్ తో చెప్పారు. కానీ ఫ్రీడ్ మన్ ఆ మాటల్ని నమ్మలేదు.

 

    యుద్ధానంతరం ఇజ్రాయిల్ దేశం మళ్ళీ మామూలుగా తయారైంది. లక్షలాది యూదుల ఘోర హత్యలకు కారణభూతమైన ఐచ్ మన్ ని పట్టుకునే బాధ్యతను ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ప్రీడ్ మన్ కి అప్పగించాడు. ఫ్రీడ్ మన్... ఐచ్ మన్. పట్టుకునే కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా స్వీకరించాడు. నాజీ జనరల్స్ చేతిలో ఒకప్పుడు బాగా అవమానం పాలైన వాళ్ళలో ఫ్రీడ్ మన్ కూడా ఒకడు. ఆ కక్ష అతనిలో రగులుతూనే వుంది.

 

    క్రూరహంతకుడు, ఐచ్ మన్ ఫోటో లేకపోయినప్పటికీ వివరాలు తెలియకపోయినప్పటికీ డిటెక్టివ్ ఆఫీసర్ ఫ్రీడ్ మన్ రంగంలోకి దూకాడు. తన ప్రయత్నంలో ప్రారంభంగా ఫ్రీడ్ మన్ మొదట యూదుల శరణాలయాల్ని వెదికాడు... ఆ తర్వాత నాజీల చేతుల్లో ఘోర హింసలకు లనయి బ్రతుకీడుస్తున్న యూదుల్ని కలిసాడు. వారిలో ఏ ఒక్కరూ అడోల్ఫ్ ఐచ్ మన్ ని చూసిన వాళ్ళు లేరు. అందరూ ఆ హంతకుడి పేరు చెప్పగానే వణికిపోయేవారే.

 

    తన వేటలో భాగంగా ఫ్రీడ్ మన్, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా గూఢచారి శాఖల్ని సంప్రదించాడు. ఎంతోమంది ప్రజల్నీ, పోలీసు అధికారుల్నీ, సంస్థల్ని కలిశాడు, సంప్రదించాడు. ఎక్కడా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు.

 

    ఆఖరికి ఫ్రీడ్ మన్ అమెరికా సి.పి.ఎ. సంస్థ ద్వారా ఒకే ఒక ఇన్ఫర్మేషన్ సంపాదించగలిగాడు. అది 1946లో యుద్ధఖైదీలు ఒకసారి తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్నవాళ్ళలో ఐచ్ మన్ కూడా వుండొచ్చని. ప్రస్తుతం పేరు మార్చుకుని, ఊరు మారి, జర్మన్ వార్ క్రిమినల్ కేంప్ లో జాయిన్ అయి వుండొచ్చని తెలుసుకున్న ఫ్రీడ్ మన్ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా సంపాదించాడు. అడోల్ఫ్ ఐచ్ మన్ భార్య ఆస్ట్రియాకు అప్పుడప్పుడు వస్తుంటుందని.

 

    వెంటనే-

 

    ఫ్రీడ్ మన్ ఆస్ట్రియాలోని ఇజ్రాయిల్ గూడచార వర్గాల్ని సంప్రదించాడు. ఐచ్ మన్ భార్య ఎవరింటికి వెళ్తుందో... ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఐచ్ మన్ కాదు. ఒక నాజీ.

 

    ఆఖరికి ఐచ్ మన్ ఆచూకీ కనుక్కోడానికి ఫ్రీడ్ మన్ కి దొరికిన ఒకే ఒక ఆధారం గవర్నమెంట్ ఫైల్స్. ఆ ఫైల్స్ ని వెతకడం ప్రారంభించాడు. ఆ ఫైల్స్ ద్వారా ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. ఫ్రీడ్ మన్ కి ఐచ్ మన్ లిచెల్ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి పెట్టుకున్న అప్లికేషన్ మాత్రం దొరికింది. ఆ అప్లికేషన్ 1934 అక్టోబర్ 30 నాటిది. ఐచ్ మన్, లిచెల్ ల పెళ్ళి 1935 మే 17వ జరిగింది. కానీ లిచెల్ అడ్రస్ మాత్రం ఫ్రీడ్ మన్ కి దొరకలేదు.

 

    ఈ మధ్యకాలంలో చెకొస్లోవేకియన్ పోలీసులు అడోల్ఫ్ పాత స్నేహితుడ్ని పటుకున్నారు. అతని ద్వారా తెల్సిన విషయం అడోల్ఫ్ కి సన్నిహితంగా తిరిగిన ఒక మహిళ దోపాల్ అనే పట్టణంలో వుందని. ఆమెకు భర్త కూడా లేడనీ, ప్రీడ్ మన్, మానోస్ అనే యూద స్నేహితుడ్ని దోపాల్ కు పంపించాడు. మానోస్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మహిళా బాధౌజ్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మానోస్ వెంటనే అక్కడ నుంచి బాధౌజ్ వెళ్ళి మారు పేరుతో ఓ హోటల్లో కొన్నాళ్ళున్నాడు. ఎట్టకేలకు మానోస్ అడోల్ఫ్ ఐచ్ మన్ భార్య లిచెల్ ఎడ్రసును పట్టుకుని, ఆమెను కలిసాడు. రకరకాలుగా ఆమెను భయపెట్టినా లిచెల్ కు అడోల్ఫ్ విషయం ఏ మాత్రం తెలియదన్న విషయం మానోస్ కి తెలిసింది. ఫలితంగా వెంటనే తిరుగుముఖం పట్టాడు మానోస్.

 

    దారిలో దోపాల్ పట్టణానికి వచ్చిన మానోస్, అడోల్ఫ్ ఐచ్ మన్ కు సన్నిహితంగా మెలిగిన మహిళా మిసెస్ మిస్తల్ బెక్ ను కలిసి తను అడో ల్ఫ్ కు స్నేహితుడ్నని, అతనికి కొన్ని వస్తువులు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అడోల్ఫ్ ఐచ్ మన్ గురించి మిస్తల్ బెక్ ఏం చెప్పకపోయినా అడోల్ఫ్ తండ్రి ఎక్కడుంటాడో ఆ ఎడ్రస్ ను ఇచ్చిందామె.

 

    అడోల్ఫ్ తండ్రి ఆస్ట్రియాలో నివసిస్తాడు. ఆస్ట్రియా వెళ్ళిన మానోస్ కి ఏ విషయమూ చెప్పకుండా అడోల్ఫ్ తండ్రి తనకేమీ తెలియదని కసిరేసి పొమ్మనడంతో మానోస్ మళ్ళీ దోపాల్ వచ్చేశాడు.

 

    ఒకరోజు మానోస్ కి మిసెస్ మిస్తల్ బెక్ అనుకోకుండా ఒక ఫామిలీ ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ లో అడోల్ఫ్ ఐచ్ మన్ పాతఫోటో వుంది. ఎట్టకేలకు ఆ ఫోటోని సంపాదించడంతో మానోస్ కి సగం విజయం లభించింది.

 

    మానోస్ కి తెలియని విషయం ఆ ఫోటోద్వారా ఐచ్ మన్ ని గుర్తుపట్టలేమని. అడోల్ఫ్ ఐచ్ మన్ అప్పటికీ తన రూపురేఖల్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. జర్మనీలోని ఒక మారుమూల ఒక కర్రల దుకాణం పెట్టుకున్నాడు. రిచర్డ్ క్లెమెంట్ అన్న పేరుతో చలామణీ అవుతున్నాడు. ఆ కర్రల దుకాణంలో నష్టాలు రావడంతో ఆ దుకాణాన్ని మూసేసి ఇద్దరు స్నేహితులతో కలిసి ముందు ఇటలీ వెళ్ళాడు. ఆ తర్వాత జనీవా అక్కడ కొన్నాళ్ళు, క్రిస్టియన్ సొసైటీలో పనిచేశాడు. అక్కడనుంచి సిరియా వచ్చి అక్కడ బ్రతుకుతున్నాడు గుట్టుగా.

 

    1950లో ప్రపంచ మొత్తంమీద పెద్ద మార్పులొచ్చాయి. ఇజ్రాయిల్ ఒక దేశంగా గుర్తింపు పొందింది. చేతిలోని పని పోవడంతో అడోల్ఫ్ మళ్లీ నిరుద్యోగి అయ్యాడు. అదే సమయంలో... అడోల్ఫ్ భార్య లిచెల్ తన భర్త ఏనాడో చెకోస్లోవ్ కియన్ సైనికుల చేతిలో చనిపోయాడని ప్రకటించేసింది. దీంతో అడోల్ఫ్ కోసం సాగించిన అన్వేషణ ఆగిపోయింది. ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్ చీఫ్... ఫ్రీడ్ మన్ ని మానోస్ ని వెనక్కి వచ్చేయమని ఆదేశించాడు. కానీ లిచెల్ చేసిన ప్రకటనను ఫ్రీడ్ మన్ నమ్మలేదు. అడోల్ఫ్ బ్రతికే వున్నాడని... అతని నమ్మకము.

 

    ఎప్పుడయితే లిచెల్ తన భర్త పోయాడని ప్రకటించిందో అప్పుడే అడోల్ఫ్ లో తిరిగి భార్య జీవితంపట్ల ఆశలు చిగురించాయి. అదే అడోల్ఫ్ జీవితాన్ని బలికోరిన సంఘటనయ్యింది.

 

    అర్జంటైనాలో ఉన్న అడోల్ఫ్ మళ్ళీ పిలవడంతో లిచెల్... తన ముగ్గురు పిల్లలతో అక్కడకు చేరింది. కొన్నాళ్ళు వాళ్ళ జీవితం ఆనందంగా గడిచింది. 1956 వరకూ బ్రెజిల్ లో గడిపారు... మధ్య సమయములో ఆస్ట్రియాకొచ్చిన లిచెన్ తన పాస్ పోర్ట్ ను రెన్యువల్ చేయించాలనుకుంది. అదే లిచెల్ చేసిన పొరపాటు. పాస్ పోర్ట్ క్లర్క్ లిచెల్ ను గుర్తించి ఇజ్రాయిల్ గూఢచార వర్గాలకు ఆ విషయం తెలిపాడు. లిచెల్ మీద అప్పటివరకూ కన్నేసి వుంచాడు ఫ్రీడ్ మన్.

 

    కాకతాళీయంగా అర్జంటైనా 150వ అవతరణ సందర్భంగా... ఇజ్రాయిల్ నుంచి ఒక బృందం అర్జంటైనా వెళ్ళి రెండు దేశాల మధ్య మళ్ళీ ఆకాశయానాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో వుండగా ఫ్రీడ్ మన్ అడోల్ఫ్ ను అరెస్ట్ చేయాలనుకున్నాడు. అనుకున్నంతా అయ్యింది. ఎట్టకేలకు దొరికిపోయాడు. అడోల్ఫ్ ను ఇజ్రాయిల్ ప్రధానమంత్రి దగ్గరకు తీసికెళ్ళారు. చరిత్రలో దారుణ హంతకుడయిన అడోల్ఫ్ కు, ఇజ్రాయిల్ ప్రభుతం ఉరిశిక్ష వేసింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra