Home » Dr c. ananda ramam » రేపటి మహిళ

   
    డ్రాగన్ ముఖాలు- భేతాళుడి ముఖాలు- నరసింహమూర్తి ముఖాలు- ఎలుగుబంటి ముఖాలు- ఇలా ఇంచుమించు అన్ని ముఖాలు భయంకరంగానే ఉన్నాయి. ఆ ముఖాలతో తలలు అటూ యిటూ కదిలిస్తూ మాట్లాడుతూ మిగిలినవాళ్ళని నవ్విస్తున్నారు. వాళ్ళలో చాలామంది గొంతును కూడా మార్చి మాట్లాడుతున్నారు. అతిధుల్లో కొందరు ప్లాస్టిక్ ముఖాలు తొలగించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకుపోతున్నారు. భాగవతార్ కి మృదుల ప్రయివేట్ రూమ్ లో స్టాండ్సుకి తగిలించివున్న ప్లాస్టిక్ ముఖాలు గుర్తొచ్చాయి. అవీ యివీ ఒకటేనా? ఇలాంటి ప్లాస్టిక్ ముఖాలు ఇంకా ఎందరో వాడుతారా? ఇంట్లో సరదాకి తొడుక్కోవడమేకాక బయట పార్టీలకి కూడా తొడుకొస్తారా? ఎంత ప్రయత్నించినా వాళ్ళనుంచి దృష్టి మరల్చుకోలేకపోతున్నాడు. ప్లాస్టిక్ ముఖాల వెనక అసలు ముఖాలు ఊహించుకోలేక సతమతమైపోతున్నాడు. డ్రాగన్ ముఖం తొడుక్కున్న వ్యక్తి భాగవతార్ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలోవచ్చి కూర్చున్నాడు. ఆ రావటంలో అతడు కుంటుతూ నడుస్తూన్నట్లు కనిపించింది. అలర్టు అయ్యాడు భాగవతార్. ఇతడు కుంటుతున్నాడు. వీడియోలో మృదుల గడిపిన వ్యక్తి కూడా కుంటుతూనే నడిచాడు. అతడూ, ఇతడూ ఒకడేనా? అతడ్ని వెనకనుంచి చూసాడు. ఇతడ్నీ వెనకనుంచి చూస్తే అయిడెంటిపై చెయ్యగలడేమో? మృదులదగ్గిర వున్న డ్రాగన్ ముఖం - ఈ డ్రాగన్ ముఖం ఒకటేనా? ఏమిటో ఏదీ గుర్తురావడం లేదు. నెమ్మదిగా పక్కన కూర్చున్న ఆసామీవైపు జరిగి, "సార్! మీ పరిచయ భాగ్యం కలిగిస్తారా?" అడిగాడు అతి మర్యాదగా. "ఐయామ్ ది డ్రాగన్, హహ్వ-హ్వ" అన్నాడు ఆ పెద్దమనిషి. గొంతుకూడా కర్ణ కఠోరంగా వుండి అప్రయత్నంగా చెవులు మూసుకున్నాడు భాగవతార్. మరోసారి పలకరించడానికి భయం వేసింది. కొంచెం దూరంలో ఏండెటో ఉక్కబోయడం వల్ల కాబోలు బూట్లు తీసేసి మేజోళ్ళతో కాళ్ళు ముందుకి జాపుకున్నాడు. మడమకింద సొట్ట వున్నట్టు అనుమానం తోచింది. అతడి పాదాలనే పరీక్షగా చూస్తూన్న భాగవతార్ కి. అయితే అది మేజోడుముడతో-కాలిసొట్టో ఎలా తెలుసుకోవడం? డ్రింక్ సిప్ చేస్తూ ఏండెటో పక్కగావచ్చి రుమాలు సరిగ్గా అతడి కాళ్ళ దగ్గరపడేలా కిందకి జార్చాడు. ఏండెటో చూడకుండా తరువాత రుమాలు తీసుకోవడానికా అన్నట్టు కిందకు ఒంగి ఏండెటో మడమదగ్గర మేజోడు మీదచేత్తో తడిమాడు. ఓవర్ డోస్ లో డ్రింకు తీసుకుని ఒంటిమీద తెలివిలేకుండా ఉన్న ఏండెటో కాలిని ఏదో పట్టుకున్నట్టు అయి ఈడ్చితన్నాడు. "అబ్బా!" అని అరుస్తూ అల్లంత దూరానికి ఎగిరిపడ్డాడు భాగవతార్. కంటిమీద మోపైన దెబ్బతగిలి కన్ను బాగావుబ్బి- కళ్ళల్లోంచి నీళ్ళు కారాయి. కన్ను తెరచి చూడలేకపోయాడు. ఏండెటో భాగవతార్ దగ్గిరగా వచ్చి, "సారీ! మీరనుకోలేదు. పిల్లో, ఎలకో అనుకున్నాను. కన్ను బాగా ఉబ్బింది. మీ మొహం చూడ్డానికి ఏం బాగలేదు. అందాక ఇది తొడుక్కోండి," అని ప్లాస్టిక్ పందిమొహం అందిచ్చాడు.

    పర్సులోంచి ఎడ్రస్ స్లిప్ తీసి ఇంటి నెంబరు సరి చూసుకుంది మృదుల. సిటికి బాగా దూరంగా కుసాయిగుడాలో విసిరేసినట్లుంది. ఆ డాబా యిల్లు. ఇల్లు కట్టుకొన్నవాళ్ళెవరో గోడలకి ప్లాస్టింగ్ చేసేసాక వెల్ల వేయడానికి డబ్బులేక అలా వదిలేసినట్లున్నారు. ఊరికి దూరంగా వుండటం వల్ల చుట్టుప్రక్కల ఇళ్ళు లేకపోవడంవల్ల అల్లరి పిల్లలెవరో గోడలమీద రకరకాల బొమ్మలేసి చేతికొచ్చిన పిచ్చిరాతలేవో రాసారు. చూసిచూడగానే మతి స్థిమితం తప్పిన మనిషి నోటి కొచ్చినట్లు పేలుతున్న భావన కలిగిస్తూంది ఆ ఇల్లు. ఇంటికి కాలింగ్ బెల్ లేదు. తలుపుమీద తట్టింది మృదుల. చిన్నగా కొడితే రెస్పాన్స్ రాలేదు. దబదబ బాదింది.

    "ఎవరూ?" లోపల్నించి ఆడగొంతుకు వినిపించింది.

    "నేను మృదులని, దేవకిగారి కోసం వచ్చాను" తలుపు సందు మధ్య నోరుపెట్టి గట్టిగా అరిచింది. తలుపులు తెరుచుకున్నాయి. నడి వయసు ఆడమనిషి మృదులని నఖశిఖ పర్యంతం పరీక్ష చూస్తూ, 'కోర్చోండి' అంది. ఆ హాల్లో పేము అల్లిక ఊడిపోయిన పేము కుర్చీలు, ఇనుము తుప్పుపట్టిపోయిన గాడ్రెజ్ కుర్చీలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. పైన అల్లిక ఊడిపోయిన కేన్ కుర్చీలో కూర్చుంది. లోపల మనుష్యులు తిరుగుతున్నట్లు సందడి వినిపిస్తోంది. నడివయసు మనిషి మృదులని చూస్తూ, "డాన్స్ నేర్చుకోడానికి వచ్చారా?" అడిగింది.

    "కాదు."

    "డాక్టరుగారితో పరీక్షచేయించుకోడానికా?"

    "డాక్టరుగారెవరు?"

    "దేవకిగారిని ఇంటర్వ్యూ చెయ్యడానికొచ్చారా?"

    "దేవకిగారితో మృదుల వచ్చిందని చెప్పండి. నేనెందుకొచ్చానో వారికే తెలుస్తుంది" ఆవిడ లోపలి గదిలోకి వెళ్ళింది. మరు నిముషం దేవకి వచ్చింది ముందు గదిలోకి. నాగార్జునా హోటల్ లో కేబరే డాన్స్ చేసిన దేవకికి, ఈ దేవకికి పోలికేలేదు. మామూలుగా వెంకటగిరి చీర కట్టుకుని ఒదులుగా జడ వేసుకుంది. మొహాన చిన్న బొట్టు తప్ప. ఏ అలంకరణ లేదు. రెండు చేతులూ చాపి ఆప్యాయంగా మృదులని కౌగలించుకొని, "ఎంతదృష్టం? నువ్వు వస్తావని అనుకోలేదు. అంతకు ముందు నాతో పరిచయం ఉన్నవాళ్ళంతా నన్ను చూసి తెలియని వాళ్ళలా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వొక్కదానివి స్నేహానికి అచ్చమైన నిర్వచనంలా నన్ను వెతుక్కుంటూ వచ్చావు" అంది.

    మృదుల నవ్వింది. తను దేవకిని వెతుక్కుంటూ రావడానికి అసలు కారణం లాయర్ యశోధరాదేవి అని చెప్పలేదు పైకి. దేవకి ఏదో ట్రాప్ లో ఇరుక్కునట్లు యశోధరాదేవి అనుమానించినట్టు గూడా చెప్పలేదు.

    "ఏవిటి విశేషాలు చెప్పు. ఈ ప్లెమింగ్ గారెవరు? ఈయనేనా నువ్వు పెళ్ళి చేసుకున్న ఫారిర్ సైంటిఫిక్ రిసెర్చి స్కాలర్. నువ్వు వస్తున్నట్లు తెలిసి నిన్ను రిసీవ్ చేసుకుందామని బొంబాయి ఎయిర్ పోర్టుకొచ్చాను. నువ్వు కనపడలేదు. ఆ తరువాత ఎప్పుడేనా వచ్చావా? హైదరాబాదు ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళుంటావు? ఇక్కడికి కేవలం రెండు మూడు డాన్స్ ప్రోగ్రాంలు యివ్వడానికి కొచ్చావా? లేక ఏదేనా ప్రణాళిక వేసుకున్నావా?"

    నర్వెస్ గా అటూయిటూ కదిలింది దేవకి. "ఉండుండు. అన్ని ప్రశ్నలూ ఒక్కసారి వెయ్యకు. ప్రస్తుతం ఒక్కదానికే సమాధానం చెప్తాను. నేను కొన్నాళ్ళుంటాను ఇక్కడ. కనీసం కొన్ని నెలలు...."

    కేబరే డాన్సులు చేస్తూనే ఉంటావా?"

    నిట్టూర్చింది దేవకి. "చెయ్యాలి తప్పదు. ప్లెమింగ్ కి డబ్బుకావాలి. అతడి రీసెర్చి వర్క్ కి."

    "అతడి రీసెర్చివర్క్ స్టేట్స్ లో సాగుతుందన్నావు కదా!"

    స్టేట్స్ లోనే సాగింది మొన్నటివరకూ. కాని నాకే కొన్నాళ్ళు ఇండియాలో ఉండాలనిపించింది. ప్లెమింగ్ ని ఒప్పించి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను రిసెర్చివర్క్ ఇక్కడ కూడా కొనసాగించుకోవచ్చు. చాలావరకు ఎక్విప్ మెంట్ ప్లెమింగ్ దగ్గిర ఉంది. అయినా ఇంకా ఫండ్స్ కావాలి." తడబడిపోతూనట్టుకుంటూ చెప్పింది. నమ్మినట్లు నటించినా ఒక్క అక్షరం కూడా నమ్మలేదు మృదుల. స్టేట్స్ లో స్కాలర్ షిప్ తో రీసెర్చి కంటిన్యూ చెయ్యడానికి ఎలాంటి మూర్ఖుడూ ముందుకు రాడు. ఇక్కడే ఏదో మెలిక ఉంది. ఎదుటి వాళ్ళని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వెయ్యడం మృదులకి ఎప్పుడూ అలవాటులేదు. ఇంతలో లోపలిగదిలోంచి ఎలక్ట్రిక్ బెల్ వినిపించింది, దేవకి గభాల్న లేచి, "ఇప్పుడే వస్తాను" అని వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ లోపల్నించి తలుపులు బోల్టు పెట్టుకుంది. సరిగ్గా అదే మృదుల అనుమానానికి దారితీసింది. ముందు గదిలో తను కూర్చుని ఉండగా లోపలిగదిలోకి వెళుతూ దేవకి తలుపు బోల్డు పెట్టుకోవడంలో అర్ధం లేదు. అది దేవకి స్వభావం కాదు. దేవకి తడబాటు ఖంగారు, తలుపు బోల్టు పెట్టుకోవడం అన్నీ అంతకు ముందే మృదుల మనసులో వున్న అనుమానాన్ని మరింత ఎక్కువ చేసాయి. కూర్చున్న చోటునుంచి లేచి తలుపు సందు దగ్గిర కన్ను పెట్టి చూసింది. ఏమీ కనపడలేదు. చెవి ఆనించి వినడానికి ప్రయత్నించింది. అతి నెమ్మదిగా- అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. రెండుమూడు గొంతులు మాట్లాడుతున్నాయి.

    "కొత్తవాళ్ళని ఇక్కడికి ఆహ్వానించొద్దని చెప్పానా?"   

    "మృదుల చాలామంచిపిల్ల. నాకు బాగాతెల్సు. చేతనైతే మనకి ఉపకారం చేస్తుందికాని అపకారం చెయ్యదు."

    "అవన్నీ ముందే ఎలా ఊహించగలవు? తీరా అసలు విషయం తెలిసిన తరువాత ఎదురుతిరిగితే నువ్వేం చేస్తావు?"

    "అసలు విషయం తెలియనివ్వను. భాగవతార్ కి సమాజంలోని అన్ని రంగాలలోనూ మంచి పలుకుబడి ఉంది. అది ఉపయోగించుకొని నాకు మరి కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించుకుందామని ప్రయత్నం. అంతే?"

    "మళ్ళీ నీ మనసు ఆ భాగవతార్ గాడి మీద పోతోందా? పిచ్చిపిచ్చి వేషాలు వేసావంటే నేను...."

    "నువ్వు నన్నేం చెయ్యక్కరలేదు. నేను నీ దగ్గర్నుంచి ఎక్కడికీ పోను, నరకానికి తప్ప, పోలేను కూడా."

    "డాక్టర్ ఏది ఏమైనా కొత్తవాళ్ళు ఇక్కడికి రావడం నాకిష్టం లేదు."

    "ఏదో డాన్స్ ప్రోగ్రామ్స్, సంపాదిస్తానంటోంది కదా! సంపాదించనీ. మనకి డబ్బు కావాలి. అంతగా ఆ అమ్మాయివల్ల ఏదేనా ప్రమాదం వస్తుందనిపిస్తే, మన దొరగారున్నారుగా. ఆయనకి చెపితే ఆయనే చూసుకుంటారు."

    "ఒద్దు- ఒద్దు. మృదులని ఆ ఊబిలోకి ఈడవడానికి ఒప్పుకోను. కావాలంటే ఇహముందు రావొద్దని చెప్తాను."

    "రావడం జరిగిపోయింది కదా! ముందు ముందు ఏం చెయ్యాలో మేమాలోచించుకుంటాం- నువ్వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ విషయం చూసుకో. అడుగుల చప్పుడు విని ఏమీ ఎరగనిదాన్లా తనకుర్చీలో కూర్చుంది మృదుల. తలుపు తీసుకుని బయటికొచ్చింది దేవకి. వెంటనే లోపల్నించి బోల్డు పెట్టేసుకున్నారెవరో, బయటికొచ్చి కూర్చున్న దేవకి ఒంటినిండా చెమటలు. కళ్ళు పులిని చూసిన లేడి కళ్ళలా బెదురుతున్నాయి నెర్వస్ గా నవ్వుతూ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra