Home » Suryadevara rammohan rao » Anitara Sadhyudu


    "ఆశగా ఎస్... అంటేను"

 

    "అసలింతకు నీ పేరేమిటి?"

 

    "స్వప్న... స్వప్నం... కల...ఒక అల..."

 

    "అయ్యాబాబోయ్ ఒక్క మనిషికి ఇన్ని పేర్లా?" సత్యం ఆశ్చర్యపోతూ అన్నాడు.

 

    "నీ కిడ్నీస్ పనిచేస్తున్నాయా?"

 

    ఆమె ఆ ప్రశ్న వేయడంతో ఉలిక్కిపడ్డాడు సత్యం.

 

    "ఏం అలా అన్నావ్?"

 

    "ఒక్కపేరే... నా పేరులో ఇమిడివున్న భావానికి పర్యాయ పదాలు చెప్పాను."

 

    "ఆహా... అలాగా? సరే... దానికి, నా కిడ్నీస్ పనిచేయడానికి సంబంధం ఏమిటి?"

 

    "పోలీసులకి బ్రెయిన్ పనిచెయ్యదు. అసలు వాళ్ళు తలతో ఆలోచించరు. కనీసం కిడ్నీస్ అయినా పనిచేస్తాయని నా ఆశ. అందుకని..."

 

    "ఓహో... అలాగా? సరే ఎన్ అంటే ఇంకెవరు?"

 

    "ఇంకొన్ని పేర్లు చెప్పు చూద్దాం" ఆమె సవాల్ చేస్తున్నట్లుగా అంది.

 

    "నరహరి"

 

    "కాదు"

 

    "నాగభైరవ"

 

    "కాదు"

 

    "నాగాభరణ"

 

    "నేను అడిగేది తెలుగు వ్యక్తి గురించి, కన్నడం మనిషి గురించి కాదు"

 

    "నాగేశ్వరరావు"

 

    "ఛీ... వూరుకో"

 

    "మరి?"

 

    "అందరి గురించి చెప్పావ్... మరి మీ బాస్ గురించి చెప్పలేదేం?

 

    "మా బాసా? అంటే మా ఎస్.ఐ?"

 

    "ఇప్పుడు దారిలోకి వచ్చావు"

 

    "అయ్యబాబోయ్ వాడు రాక్షసుడు"

 

    "ఏమన్నావ్... మరోసారి చెప్పు" ఫోన్ కి ఆవేపునుంచి ఆమె ప్రశ్నించింది.

 

    "రాక్షసుడు" సత్యం చిన్నగా అన్నాడు ఫోన్ లో.

 

    ఎస్.ఐ. నరసింహం ఇంకా తలెత్తలేదు. ఏదో రాసుకుంటూనే వున్నాడు.

 

    "మిగతా విషయాల్లో మగాడు, మానవత్వమున్నవాడు కావాలి. సెక్స్ విషయంలో మగాడు రాక్షసుడయితేనే నాలాంటి కొందరు ఆడవాళ్ళకు తృప్తిగా వుంటుంది"

 

    "అమ్మ..." చప్పున అని పూర్తి చేయకుండా ఆగిపోయాడు సత్యం.

 

    "సరీగ్గా అన్నావు. మీ ఎస్.ఐ. నీకు అయ్య అయితే, నేను అమ్మనేగదా? ఓసారి ఇస్తావా?" అంది కంఠంలో లాలసను పలికిస్తూ.

 

    సత్యం ఆయాసపడుతూ "అయ్యా... తమరికి ఫోన్" అన్నాడు ఎస్.ఐ. నరసింహాన్ని ఉద్దేశించి. వినిపించినట్టు లేదు నరసింహానికి.

 

    "అయ్యా... మీకు పర్సనల్ ఫోన్..." మరలా అన్నాడు పెద్దగా.

 

    నరసింహం రాయటం ఆపి తలెత్తి ఏమిటన్నట్లు చిరాగ్గా చూశాడు సత్యం వేపు.

 

    సత్యం మౌనంగా తన చేతిలో వున్న ఫోన్ కేసి చూశాడు.

 

    నరసింహం నిర్లక్ష్యంగా ఫోనందుకుంటూ "ఎవరట?" అంటూ సత్యాన్ని ప్రశ్నించాడు.

 

    సత్యం చెప్పటానికి సిగ్గుపడ్డాడు.

 

    "హలో... ఎవరు...? ఎస్.ఐ. నరసింహం హియర్" అన్నాడు పొగరుగా.

 

    "ఓ అందమయిన ఆడపిల్లను..." ఆవేపు నుంచి వినిపించింది. ఒకింత ఆశ్చర్యంతో నరసింహం కనుబొమలు వంపు తిరిగాయి.

 

    అతని ముఖంలో వచ్చిన మార్పును సత్యం పసిగట్టాడు.

 

    నల్లగా, తుమ్మ మొద్దులా, మొఖమంతా మచ్చలతో చిన్నపిల్లలు చూస్తే భయపడి చచ్చేలా వుండే వీడికి ఓ అమ్మాయి ఫోన్ చేయడం కలా? నిజమా?

 

    అసలే కోణం నుంచి పరిశీలించినా వీసమెత్తు మంచితనం లేదు. ఒక్క మంచి గుణం లేదు. భౌతికంగా చూసినా అచ్చోసిన ఆంబోతులా ఉంటాడే వీడిని చూసి ఓ అమ్మాయి ముచ్చటపడటం అంటే నమ్మశక్యంగా లేదు. కాని, తనే స్వయంగా ఆ అమ్మాయితో మాట్లాడాడు.

 

    ఏమిటి దీనర్థం?

 

    కానిస్టేబుల్ సత్యం ఇలా ఆలోచిస్తుండగానే నరసింహం "ఏమిటి పని?" అంటూ చిన్నగా ప్రశ్నించాడు ఫోన్ లో.

 

    "ఓ మగాడితో ఆడదానికి ఏం పనుంటుంది?" సవాల్ చేస్తున్నట్లుగా ప్రశ్నించింది ఆ వేపునుంచి.

 

    నరసింహం ఒకింత ఉలిక్కిపడ్డాడు.

 

    ఆమెవరయిందీ తెలీక తికమక పడ్డాడు.

 

    "మీరంటే ఇష్టం నాకు. మీ రాక్షసత్వమంటే మరీ ఇష్టం" ఆమె కంఠంలో కాంక్ష తొంగి చూసింది.

 

    "థాంక్యూ... మనమెప్పుడయినా కలిసామా?" నరసింహం కంఠంలో వచ్చిన మార్పును అటు ఆ యువతి, ఇటు సత్యం ఇద్దరూ పసిగట్టారు.

 

    "కలిసుంటే మీరింత తాపీగా స్టేషన్ లో వుండేవారా? నా తలపులతో వేగిపోయి వుండేవారు కాదా?" నరసింహం వేళ్ళు ఫోన్ పై బిగుసుకున్నాయి.

 

    "ఏం మాట్లాడరేం?" ఆవేపు నుంచి ఆమె ప్రశ్నించింది.

 

    "నేనయితే మిమ్మల్ని చూడలేదు" నరసింహం థ్రిల్లింగ్ గా ఫీలవుతూ అన్నాడు.

 

    "నన్ను చూసుంటే మీరసలు నిద్రపోయేవారా? నిద్రపోనిచ్చేదాన్నా?" రెచ్చగొడుతున్నట్లుగా అందామె.

 

    "మీరెలా వుంటారు?" తనలోని ఆసక్తి రెట్టింపుకాగా ప్రశ్నించాడు నరసింహం.

 

    "నేను మూన్ మూన్ సేన్ లా వుంటానని నా ఫ్రెండ్స్ అంటూంటారు. నన్ను ఇష్టపడే చాలామంది స్మితాపాటిల్ లా వుంటానని అంటారు. నాకయితే నేను నేనులాగే వుంటాననిపిస్తోంది"

 

    ఆమె కంఠంలోని లాలస, మధురిమ చిత్రంగా అనిపించింది నరసింహానికి.

 

    మగాడి గొంతులోని ఆడతనం -

 

    స్త్రీ గొంతులోని మగతనం ఎవరినయినా ఇట్టే ఆకర్షిస్తాయని మైకేల్ జాక్సన్, ఉషాఉతప్ గొప్ప ఉదాహరణ.

 

    ఆమె కంఠంలోని మగతనం నరసింహంలోని అహాన్ని, మగతనాన్ని తట్టి నిద్ర లేపాయి.

 

    నరసింహం తన రొట్టె విరిగి చేతిలో పడిందని ఎగ్జయిట్ అవుతున్నాడు.

 

    "నేనసలు ఎలా వుంటాననేది మీరు పర్సనల్ గా చూసి చెబితే బావుంటుంది. నాకది చాలా ఇష్టం. చెబుతారా?" గోముగా అడిగింది.

 

    నరసింహం ఒకింత తత్తరపాటుకి గురయి...

 

    "ఆ... ఆ.... అలాగే- ఇంతకీ నీ పేరు-?" అడిగాడు తనను తాను కంట్రోల్ చేసుకుంటూ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra