Home » Vempalli niranjan reddy » మౌనం

    ఒకసారిగా  సుబ్బరాజు  ముఖం  ఎర్రగా  అయిపోయింది.

    "సారీ ఏటండీ....సారీ....ఇప్పుడు నేనేటి  చెయ్యాలి? టిక్కెట్లు  అమ్మేశాం. ఏర్పాట్లన్నీ  అయిపోయాయి. ఖర్చు లక్షల్లో  అయింది. రేపు సాయంకాలం  అక్కడ  ప్రోగ్రాం  జరక్కపోతే  జనం  ఏటంటారో  తెలుసా?"

    "మా ప్రాణాలు తీసేయరేంటి?" సుబ్బరాజు  పక్కన  కూర్చున్న వ్యక్తి కూడా  వంతపాడారు.

    "అది నిజమే....అంతమందికి  సమాధానం  చెప్పుకోవటం  కష్టం. కానీ దయచేసి  అర్ధం చేసుకోండి. చాలా ముఖ్యమైన  సమస్య  వల్ల  ఈ వాయిదా  అడుగుతున్నాం."

    "అంత పెద్ద సమస్య  ఏటుంటదండి బాబూ! పనులు ,సమస్యలూ మాకూ వున్నాయి. నా కూతురికి  మూడు  రోజుల్నించి  జ్వరంగా వుంది. హాస్పిటల్లో  వుంది. మరి నేను  యిక్కడికి రాలేదేటి? ఈ పని  చాలా ముఖ్యం కాబట్టి  వచ్చాను. అలా పనులుంటే....సమస్యలుంటే  ఎడ్జెస్ట్  చేసుకోవాలి. ప్రోగ్రాం  పూర్తి చేయాలి. మీ పనులు కోసం  వేలల్లో వచ్చే జనాలని, లక్షల్లో  వచ్చే డబ్బుని  ఆపితే ఎలా? మీకు చాలా యిచ్చాము. ఇక్కడ స్టేజి ఏర్పాట్లకే  చాలా ఖర్చయింది. మళ్ళీ  స్టేడియం  బుక్ చేయటము....ఇదంతా  జరిగే పని కాదు" ఖచ్చితంగా  చెప్పాడు  సుబ్బరాజు.

    "మీకున్న  ఆ అర్జెంటు  పనులేమిటో  చెప్పండి  మేం చేసి పెడతాం. మీరు మాత్రం  ప్రోగ్రాం  వాయిదా  వెయ్యద్దు" రెండో వ్యక్తి  అన్నాడు.

    "అవి పనులు కావు. సమస్యలు" వాళ్ళని కన్వెన్స్ చేయటం చాలా కష్టమని  అర్ధమవుతోంది కౌశిక్ కి.

    "అదే ఏం సమస్యలు  అని?" రెట్టించాడు.

    "ఇట్స్ మై లైఫ్ ప్రాబ్లం....మై సర్వైవల్  ప్రాబ్లం_నా ప్రాణాల సమస్య" అంతవరకూ మౌనంగా  శ్రోతలా  వున్న సంజు  అంది ఒకింత  వుద్వేగంగా.      
 
    ఆమె మాటల్లోని  ఆంతర్యం అర్ధం కాలేదు  సుబ్బరాజుకి. కొన్ని క్షణాలు అయోమయంగా  చూశాడు.

    "సంజు! ప్లీజ్! మీరు సైలెంటుగా వుండండి. నేను మాట్లాడుతున్నాను కదా!" అతని మాటలో ఒక రకమైన  మందలింపు  వుంది.

    "మీరిద్దరూ  ఏం మాట్లాడుతున్నారో  మాకు అర్ధం కావటంలేదు" ఇద్దర్నీ  మార్చి మార్చి చూస్తూ  అన్నాడు  సుబ్బరాజు.

    "మీకు అర్ధం కాకపోవటమే  మంచిది" అనాలనుకుని చివరి క్షణములో  ఆపుకున్నాడు కౌశిక్.

    అసలు  సమస్యని వాళ్ళ  ముందుంచడం  మంచిది కాదు. ఆమె ప్రాణాలు  రిస్క్ లో వున్నాయన్న నిజాన్ని పదిమందికీ చెప్పి  సమస్యని మరింత  జటిలం  చేయటమే అవుతుంది.

    ఆమె మీద  హత్యాప్రయత్నాలు  జరుగుతున్నాయని  తెలిస్తే  అసలు ఆ ప్రోగ్రామ్ కే ఎవరూ  రాకపోవచ్చు. కారణం....ఆమె మీద  హత్యాప్రయత్నం  ఏ రూపంలో  జరుగుతుందో  ఎవరికీ  తెలీదు. అందులో ఒక భాగంగా  తమ ప్రాణాలకు  కూడా హాని  జరుగుతుందనే  భీతి  వుంటుంది.

    కొద్ది నిమిషాలు అందరి మధ్యా  నిశ్శబ్దం  అలుముకుంది.

    చివరికి  ఆ నిశ్శబ్దాన్ని  కౌశిక్  భంగపరిచాడు.

    "చూడండి. మీకు  కలిగిస్తున్న  ఇబ్బందిని  నేను అర్ధం  చేసుకోగలను. కానీ ప్రస్తుత  పరిస్థితిలో  ఈ నిర్ణయం  అనివార్యమవుతోంది. క్షమించండి. ఒక వారంపాటు  ప్రోగ్రాం  వాయిదా  వేయక  తప్పదు. దానివలన మీకయ్యే నష్టాన్ని  మేము కదతాము" ఇంకా  ఏదో అనబోతున్న  కౌశిక్ మాటలకి  అడ్డు వచ్చాడు  రెండో వ్యక్తి.

    "మీ మాటలు వినడానికి  ఏమీలేదు. మేము కోర్టుకెక్కుతాము. అప్పుడు మాకు చాలా  నష్టపరిహారం కట్టాల్సి  వుంటుంది" ఆవేశంగా  అన్నాడతను.

    అక్కడితో  కౌశిక్ లోని సహనం  చచ్చిపోయింది.

    "బెదిరిస్తున్నారా? కోర్టుకి  వెళతానంటే  మాకు అభ్యంతరంలేదు. వెళ్ళండి" చాలా  తాపీగా  అన్నాడు.

    "మీ ఆస్తులు  అమ్మి నష్టపరిహారం  కట్టాల్సి వస్తుంది" మరోసారి హెచ్చరికగా అన్నాడతను.

    జరిగే  తతంగాన్ని  భయం భయంగా  చూస్తోందామె. ఏం మాట్లాడటానికి  పాలుపోవటం లేదామెకు.

    "కోర్టుకి కావలసింది  సాక్ష్యం. అది సృష్టించటం  పెద్ద సమస్య కాదు. గొంతునొప్పి, దగ్గుతో  బాధపడుతున్నట్లుగా  ఒక సర్టిఫికెట్ తీసుకుంటాం. ఆమె సింగర్ కాబట్టి గొంతు నొప్పి వుండగా  ఆమె పాటలు పాడలేదు. ఆమెకు  నయమవటానికి  వారం పట్టవచ్చు....నెలయినా  పట్టవచ్చు....ఆ తర్వాతే  ప్రోగ్రాం. ఇదీ మేము చేయబోయే  పని. ఇక మీ యిష్టం....మీరు  వెళ్ళవచ్చు" కటువుగా  అన్నాడు.

    గతుక్కుమన్నారు   యిద్దరూ. ఇద్దరి మొహంలోనూ  నెత్తురు  చుక్కలేదు.

    "ఇప్పటివరకూ  మీరు పెట్టిన ఖర్చు, ఆమెకిచ్చిన  అడ్వాన్స్, కోర్టు ఖర్చులు అన్నీ కలిపి  చాలా  అవుతుంది మీకు. ఆ తర్వాత  నేను చెప్పేదేమీ లేదు."

    తెల్లముఖాలు  వేసి  చూస్తున్నారిద్దరూ.

    "మిమ్మల్ని  మళ్ళీ  రిక్వెస్ట్  చేస్తున్నాము. మాది  తీవ్రమయిన సమస్య. ఒకరికి చెప్పుకునేది కూడా కాదు. ఇది తప్పనిసరి నిర్ణయం. దీనివలన  మీకు వచ్చే నష్టం  ఎంతయినా  మేము భరిస్తాము" వీలయినంత మామూలుగా  చెప్పడానికి  ప్రయత్నించాడు.

    కామ్ గా  కూర్చున్నారిద్దరూ.

    ఐదు నిమిషాలు  వాళ్ళ మధ్యన  మవునంగా  దొర్లాయి.

    లేచి నిలబడ్డాడు  సుబ్బరాజు. ఆ వెనుకనే నిలబడ్డాడు  ఆ వ్యక్తి కూడా.

    "మా టైము  బాగోలేదు. అందుకే  ఇవన్నీ వస్తున్నాయి. ఇందులో  నష్టమొస్తే  తట్టుకోగల  స్థోమత  కాదు నాది. వీలయినంత  త్వరలో  మీరు మళ్ళీ  ఎప్పుడు  ప్రోగ్రామిస్తారో  చెప్పండి. మమ్మల్ని  నష్టాలపాలు  చేయవద్దు" అన్నాడు  చేతులు జోడించి.

    చాలా ఇబ్బందిగా  వుంది సంజుకి.

    "మేం వెళతాం" అంటూ మరో  మాటకి  ఆస్కారం  లేకుండా  వడివడిగా  అడుగులు వేస్తూ బయటికి  వెళ్ళిపోయారిద్దరూ.


                     *    *    *    *    *

    నవంబర్ 3.

    ఆ రోజు చాలా రిలాక్స్ గా వుంది  అర్చనకి.

    అంతకుముందు  వరసగా రెండు  రోజులపాటు ఫ్యాషన్  షోస్ జరిగాయి. వాటి రిహార్సల్.... ప్రాక్టీస్....అంటూ రోజూ  రాత్రిళ్ళు  ఇంటికి వచ్చేసరికి లేటవటం....నిద్రపోయే సరికి  అర్దరాత్రి దాటటం  జరుగుతోంది.

    ఆ రోజు ఏ పనీ  లేకపోవటంతో  చాలా రిలీఫ్ గా  వుందామెకు.

    బెడ్ మీద బోర్లా  పడుకుని  తీరికగా  హెరాల్డ్ రాబిన్స్  నవల  చదువుతోందామె.

    అదే సమయంలో  ఆ గదిలోకి వచ్చాడు  నౌఖరు.

    "అమ్మగారూ!" పిలిచాడు.

    తలెత్తి  చూసిందామె.

    "మీ కోసం  ఎవరో  వచ్చారు."

    "ఎవరు?"

    "ఎవరో....చంద్రకాంత్  ఆట"

    "చంద్రకాంత్?" ఆమె భృకుటి ముడిపడింది.

    "నా కోసమా? డాడీ కోసమా?"

    "మీ కోసమే"

    "వస్తున్నాను కూర్చోమను" అని బుక్ పక్కన  పడేసి డ్రస్ ఒకసారి  సరిచేసుకుని బయటికొచ్చిందామె.

    హాల్లో  కూర్చుని  వున్నాడు ఓ వ్యక్తి.

    సుమారు  30 ఏళ్ళు  వుండవచ్చు  ఐదడుగుల  ఏడు  అంగుళాలు  ఎత్తు  వుంటాడు. సాధారణమైన  రంగు....నీట్ గా  వున్న  హెయిర్ స్టయిల్. అంత అందంగా  లేకపోయినా  ఆకర్షణీయంగానే  వున్నాడు.

    ఒకింత  సంశయంగా  చూసిందతని  వైపు.

    "నైస్ టు మీట్ యు మిస్ అర్చన....అయామ్ చంద్రకాంత్. నేను ఒక వీడియోగ్రాఫర్ని" చెప్పాడతను.

    ఆమె చూపులో  యింకా  ప్రశ్నార్ధకం  పోలేదు.

    "నేను మిమ్మల్ని  పరిచయం  చేసుకోవాలని  వచ్చాను. మీరు ఒక మంచి మోడల్ అని నాకు తెలుసు. ఐమీన్....మొన్న  జరిగిన  ఫ్యాషన్ షో చూశాను. అంటే  వీడియో  గ్రాఫ్  చేశాను  కూడా! దట్ వజ్ ఫెంటాస్టిక్."

    అప్పటికి  అర్ధమైందామెకు.

    "ఓస్....అదా! థాంక్యూ!...." అంది  అతనెదురుగా వున్న  సోఫాలో కూర్చుంటూ. అలా  కూర్చోవడంలో  నుదుటి మీదకు, చెక్కిళ్ళ మీదకు పడిన  ఆమె కురులను  వెనక్కి  టాప్ చేసిందామె.

    అద్భుతమైన  ఆమె రూపాన్ని  లిప్తకాలంపాటు  తదేకంగా  చూసి దృష్టిని  మరల్చాడతను.

    ప్రక్కనున్న  నౌఖరు  వైపు  చూసి  త్రాగటానికి ఏదయినా  తీసుకురమ్మన్నట్లుగా  కనుసైగ చేసిందామె.

    "మీరు  నోటితోకంటే, కళ్ళతో  ఎక్కువ  మాట్లాడతారనుకుంటాను?"

    తొలి  పరిచయంలోనే  నిర్భయంగా అలా మాట్లాడటం....కాంప్లిమెంటు  చేయటం  ఆమెకు ఆశ్చర్యం  కలిగించాయి.

    తన అందాన్ని  ఎందరో  మెచ్చుకుంటారు....ఆరాధిస్తారు. ఆ విషయం ఆమెకూ  తెలుసు.

    కానీ....ఒకింత  ముభావంగా  వుండే  ఆమె  మనస్తత్వానికి  "మీరు చాలా అందంగా  వుంటారు" అనే  భావం వచ్చే మాటలు మాట్లాడాలంటే_సందేహిస్తారు. కొద్దిగా  భయపడతారు.

    ఇలా  డైరెక్ట్ గా ఇంటికొచ్చి  పరిచయం  చేసుకోవాలన్న  ప్రయత్నం చేసిన  తొలి వ్యక్తి యితనే.

    "యువర్ పెర్ఫార్మెన్స్  వజ్  ఫెంటాస్టిక్. మీ ఫ్యాషన్ షోని నేనూ వీడియోగ్రాఫ్ చేశాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra