Home » Yandamuri veerendranath » Anaithikam


    కానీ పొద్దున్నే నా భర్తకీ, నా ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసిపోయినట్టుంది. అందరూ సంతోషంగా, వింతగా నన్ను చూస్తూంటే నాకు సిగ్గు కలిగింది. నా బావగారు కూడా నన్నభిమానంగా చూసినట్టు తోచింది. నా భర్త ఈ విషయం నాతో మాట్లాడలేదు. అయినా ఆ విషయం పూర్తిగా రూఢీ అయ్యేవరకూ నేనూ బయట పెట్టదలచుకోలేదు.

 

    "ఏమండీ! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దామా?" అన్నాను. అంతవరకూ సంతోషంగా కనిపించిన అతను వెంటనే ఆలోచనలోపడి "ఈ రోజు కుదరదేమోనోయ్, ఆఫీసులో మీటింగుంది" అన్నాడు.

 

    నేను నిరుత్సాహాన్ని దాచుకుంటూ "సరేలెండి, తర్వాత వెళ్దాం" అన్నాను. నా ఫీలింగ్స్ ని అణుచుకోవడం, వాటికి పెద్ద ప్రాముఖ్యాన్నివ్వకపోవడం అనేది రెండు రోజుల క్రితం నుండే నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. అతని ధోరణి కొత్త కాకపోయినా "ఇతనింత ఏంగ్జయిటీ, ఫీలింగులు లేని మనిషేమిటా?" అనుకున్నాను. నేను మామూలుగానే కాలేజీకి వెళ్ళాను. కాలేజీలో కూడా తలతిప్పడం, వికారంగా వుండడం తగ్గలేదు. నీరసంగా స్టాఫ్ రూమ్ లో తలవాల్చుకుని పడుకుని వుంటే నా బావగారు వచ్చారని కబురొచ్చింది.

 

    విజిటర్స్ రూమ్ లోకి అడుగుపెట్టాను. అతను నా వంక ఆప్యాయంగా చూస్తూ "వెళ్దామా ఇక?" అని అడిగాడు. "అదేమిటి తొందరగా వచ్చేశారూ?" అనడిగాను. అతను నవ్వి "లేకపోతే నువ్వు నిన్నట్లా తొందరగా ఇంటికెళ్ళి పోతావేమోనని" అన్నాడు. అప్పుడుకానీ నాకు గుర్తు రాలేదు. నేనూ నవ్వేసి అతనితోపాటే ముందుకి నడిచాను. అతను వేరే రూట్లో వెళ్తూంటే "ఎటు వెళుతున్నాం?" అని అడిగాను. నకు క్రితం రోజు వరకూ వున్న ఉదాసీనత లేదు. ఆ రోజు సంఘటన కంటే - నేను తల్లిని కాబోతున్నానన్న థ్రిల్లింగ్ న్యూస్ ఇప్పుడు దొరకడం వల్ల ననుకుంటాను. అతను ఓ క్షణం ఆగి "డాక్టరు దగ్గరికి" అన్నాడు. నేను విచలితురాలిపై అతడి వైపు చూశాను. ఆ సంభ్రమం నుంచి తేరుకోకముందే మేము డాక్టరు ముందు వున్నాం. డాక్టరు టెస్ట్ కి పంపింది. రిపోర్ట్స్ రావడానికి పావుగంట పట్టింది. ఆ కాస్సేపూ నేను టెన్స్ గా వుంటే అతను తన అరచేతిని నా అరచేతిమీద వుంచి నన్ను రిలాక్స్ చేయడానికి ప్రయత్నించాడు.

 

    రిపోర్ట్స్ లో 'పాజిటివ్' అని వచ్చింది. నా గుండె అంతా క్రమంగా ఆనందం నిండిపోయిన ప్రశాంతమైన భావన! నా చుట్టూ వాతావరణమంతా ఆహ్లాదంగా, ఉల్లాసంగా తోచింది. ఎవరూ చేయలేనిది నేనేదో సాధించినట్టూ, అందరూ నన్ను అపురూపంగా చూసుకోవలసిన ఘనకార్యం నేనేదో చేసినట్టూ అనిపించింది.

 

    నా మొహమంతా కొత్త వెలుగు! నా బావగారు నన్ను అభినందనగా చూడడం తప్ప మరేం మాట్లాడలేదు. నా ఆనందంలో పాలుపంచుకుంటున్నట్లూ, నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేనట్లూ మౌనంగా వుంటే నా మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. ఎంతో గొప్ప మానసికవేత్తకిగానీ ఆ స్థితప్రజ్ఞత సాధ్యంకాదు. కారులోని ఏ.సి. - మనస్సులోని అనందంతో కలిసి ఒళ్ళు పులకరింపజేస్తోంది, టేప్ లో మంద్రమైన సంగీతం గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగిస్తుంటే, ఆ భావం అతని సమక్షంలో ఎంతో హాయిని కలిగించింది.

 

    నా భావాలను వెల్లడి చేయాలన్న తపన అధికమవుతుంటే- నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తూన్న అతనికి దగ్గరగా మెల్లగా జరిగి, అతనికి చేరువై, అతనికి అర్థమయ్యేలోపలే గాఢంగా అతని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నాకే సిగ్గువేసింది. పట్టలేని ఆనందంలో అతను "థాంక్యూ... థాంక్యూ" అన్నాడు. ఇంటికి చేరాక అతనే ఈ న్యూస్ అందరికీ చెప్పాడు. అతనితో కలిసి వెళ్ళానంటే ఏమనుకుంటారోనని నేను కాస్త బెరుకుగా ఫీల్ అయ్యాను. కానీ అలాంటిదేం లేదు. ఎవరూ అసలా విషయమే పట్టించుకున్నట్లు లేదు. నా అత్తగారు సంతోషంలో స్వీట్ చేసేసింది. నా తోడికోడలు కూడా హృదయపూర్వకంగా ఆనందించడం నేను గమనించాను. 'పాపం, అలాంటావిడకే ఎందుకో పిల్లలు కలగలేదు' అని నిట్టూర్చాను.  

 

    ఆ రోజు కూడా నా భర్త ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది. అతనొచ్చేసరికి దాదాపు అందరూ నిద్రలోకి జారుకోబోతున్నారు. నేనే మేలుకొని వడ్డించాను. క్రితం రోజులాగే అతనితో ఏం చెప్పలేదు. అతనూ నన్నేం అడగలేదు. అసలతనికి ఆ విషయం గుర్తుందని కూడా అనుకోను. ఎప్పట్లాగే ఎవరికి వారు నిద్రలోకి జారుకున్నాము.

 

    మరుసటి రోజు అతను కాఫీ తాగుతుండగా నా అత్తగారు అతనికీ విషయం చెప్తుండడం విన్నాను. "ఓ, అయితే వెళ్ళి కనుక్కునే వచ్చిందన్నమాట" అన్నాడు. అతని గొంతులో 'అమ్మయ్య, నాకో పని తప్పిపోయిందిలే' అనే ఆనందం ధ్వనించింది. అయితే అతను మాత్రం తండ్రి కాబోతున్నందుకు బాగా సంతోషించినట్లుగానే కనిపించాడు.

 

    భార్యాభర్తలిద్దరూ అతి అపురూపంగా పంచుకోవలసిన ఆ క్షణాలని అంత పేలవంగా మేము అనుభవించేయడం నన్నేం బాధించలేదు. ఆ క్షణాలేవో అంతక్రితం రోజే నా బావగారితో పంచేసుకోవడం వల్లేమో! నా బావగారితో 'ఆత్మవంచన' లేని సంబంధం నాకలా ప్రారంభమయింది.

 

                                                            *    *    *

 

    నా బావగారితో సంబంధంపట్ల గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం నాకేం కనిపించలేదు. ఎవరి ధోరణిలో వాళ్ళు ఆనందంగా వుంటే నాకు ఆనందం దొరికే దారిని నేను వెతికి పట్టుకున్నానని సమర్ధించుకున్నాను. జీవితానికి పునాది సమర్థనే కదా! నాకు వేవిళ్ళబాధ ఎక్కువగా వుంది. వంటింట్లోంచి ఏ వాసనొచ్చినా విపరీతమైన వికారం కలిగేది. దాంతో తిండి తినలేక నీరసంగా వుంటే నా అత్తగారు అయిష్టంగానే నన్ను మా అమ్మా వాళ్ళింటికి పంపింది.

 

    చిత్రంగా అక్కడ ఎక్కువకాలం వుండడానికి నాకు మనస్కరించలేదు. నా వదినకు ఇంకా ఏ విశేషమూ లేదేమని మా అమ్మ గోల పెడుతోంది. ఒకరోజు వదిన నాతో తనూ, మా అన్నయ్యా కలిసి స్టేట్స్ వెళ్దామని ప్రయత్నిస్తున్నామనీ అక్కడికి వెళితే పిల్లలతో కష్టమని ప్రస్తుతానికి పిల్లల్ని వాయిదా వేసుకుంటున్నామనీ, ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరనీ చెప్పింది.

 

    వాళ్ళు జీవితాన్ని ఎంత ప్లాన్డ్ గా గడుపుతారో అర్థమై నాకు మనస్సు మూలల్లో ఎక్కడో చివుక్కుమంది.

 

    ఏవేవో కారణాలు చూపించి అత్తగారింటికి బయల్దేరాను. నేనింటికి వెళ్ళేసరికి అక్కడేవో మార్పులు కనిపించాయి.

 

    నేనక్కడ లేనప్పుడు నా తోడికోడలు తండ్రి పోయాడట. వెనకా ముందూ ఎవరూ లేకపోవడంతో ఆవిడ చెల్లెల్ని ఎక్కడుంచాలో తెలీక మా ఇంటికి తెచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి తండ్రిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని ఈ లోకంలో పడుతోంది. నా అత్తగారు ఆ అమ్మాయికి చిన్న చిన్న పనులు అతి నేర్పుగా అంటగట్టేయడం గమనించి నేను నవ్వుకున్నాను.

 

    కాలేజికి వెళ్ళే దారిలో నా బావగారు చెప్పారు- 'తల్లీ తండ్రీలేని ఆ ఒంటరిపిల్లని ఎక్కడుంచాలి?' అని. తను మదనపడినంత కూడా తన భార్యకు పట్టలేదని, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చే నిర్ణయం కూడా తనదేనని చెప్పాడు. కానీ నా ఆలోచనలు వేరే విధంగా వున్నాయి.

 

    ఆ పిల్ల పరిస్థితి మా ఇంట్లో 'పనిమనిషి' కంటే మెరుగ్గా వుండబోదన్న విషయం నేను ఆలోచిస్తున్నాను. ఇంటి కోడలికే ఆ పట్టం కట్టగలరు వాళ్ళు. నా ఆలోచనలకి సమాధానం అన్నట్లుగా నా బావగారు "... మన ఇంట్లో ఆ అమ్మాయి బరువు అనుకునేలోపే పెళ్ళి చేసేయాలి. అంతవరకూ చదువు, కుట్టుపని నేర్చుకోమన్నాను. నా భార్యలా కాకుండా కాస్తంత మెతక మనిషిలా వుంది" అన్నాడు. అప్పుడు కానీ నా హృదయం తేలికపడలేదు.

 

    నాకు నా బావగారిమీద గౌరవం ఇనుమడించింది. అతనేం చేసినా నాకు సమంజసంగానూ, సమర్థనీయంగానూ కన్పిస్తోంది. అతనిమీద క్రమంగా ఏర్పడిన విశ్వాసం దానికి కరణం కావచ్చు. అందరితోపాటు, నా తోడికోడలు కూడా ఆ అమ్మాయితో పనులు చేయించుకోవడం నాకేమీ వింతగా అనిపించలేదు. ఆవిడది అంతకంటే గొప్ప మనస్తత్వమని నేనూ అనుకోలేదు. ఆ అమ్మాయి జీవితం ఎంత త్వరగా ఓ ఒడ్డుకి చేరితే అంత మంచిది అని మాత్రం అనుకున్నాను.

 

    నా అన్నయ్య, వదినకి అమెరికా వీసా దొరికింది. మా అమ్మ, నాన్న మొదట్లో గోల పెట్టారు. "మూడేళ్ళు ఇంతలో తిరిగొస్తాయి?" అని మా వదినా, నేనూ, అన్నయ్యా చాలా రకాలుగా నచ్చజెప్పాం. ఆ లోపల వాళ్లు అన్ని తీర్థ స్థలాలూ దర్శించుకోవాలనే ఒప్పందం మీద మొత్తం వ్యవహారం చక్కబడింది. నాకు మా అన్నా, వదినలని చూస్తే ముచ్చటేసింది. పెళ్ళయిన మొదట్లో ఎంత అన్యోన్యంగా వున్నారో ఇప్పటికీ అదే అన్యోన్యత- మరింత మంచి అవగాహనతో! ఆ తర్వాత నా అన్నా, వదినా వెళ్ళిపోవడానికి ఎక్కువకాలం పట్టలేదు. వెళ్తున్నప్పుడు నా వదిన నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తోచింది నాకు. "ఏంటి వదినా! సంశయిస్తున్నావ్" అని అడిగాను.

 

    వెంటనే తాను చెప్పదలచుకున్నది చెప్పేసింది. "నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నాకు తెలీదు. కానీ నేను ఒకరిద్దరి నుంచి విన్నదాన్ని బట్టి నువ్వు నడుస్తున్న మార్గం మంచిది కాదేమో ననిపించింది. అయినా నువ్వే నలుగురికి పాఠాలు చెప్తున్నావు. నీకు చెప్పే స్థితిలో లేను నేను. జీవిత మన్నాక కొంత నిరాశ నిస్పృహలుంటాయి. ఒప్పుకుంటాను. అవి నీ ప్రగతికి దోహదపడేలా చూసుకో. నీ కోరికలని నీ బిడ్డద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించు. ఇంతకంటె నేను చెప్పాల్సిందేమీ లేదు" అని తను చెప్తుంటే మా అఫైర్ గురించి నలుగురికీ తెలిసిందేమోనని మొదట్లో కంగారుపడ్డాను- కానీ తను మాట్లాడేది నాకూ, నా భర్తకీ మధ్య ఏర్పడిన అగాధం గురించి అని గుర్తించి నిర్వేదంగా నవ్వాను. "నీ జీవితం వడ్డించిన విస్తరిలాంటిది వదినా! ఒడ్డున కూర్చుని నువ్వు ఎన్నైనా చెప్పగలవు. క్షణంక్షణం పరిస్థితులు నీ ఆలోచనలకీ, లక్ష్యాలకీ అడ్డు తగులుతుంటే కూడా నువ్విలాగే మాట్లాడగలవేమో ఆలోచించు. అయినా నా మంచి కోరి నువ్వేదో సలహా ఇచ్చావు కాబట్టి నీ గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను". వదిన మరేం మాట్లాడలేదు. ఇక అంతకన్నా మాట్లాడడం అనవసరం అనుకుందేమో, ఆ తర్వాత సానుభూతిగా వినేసి వూరుకుంది.

 

    అన్నయ్యా, వదిన విదేశాలకి వెళ్ళిపోయినా నన్ను అ మాటలు చాలా కాలం వెంటాడాయి. హఠాత్తుగా నేను చేస్తున్న పనులపట్ల నాకు భయం ఏర్పడింది. వదిన దగ్గర నన్ను నేను సమర్ధించుకున్నా ఆవిడ నన్ను వేలెత్తి చూపిన వెంటనే నా మొహంలో రక్తం ఇంకిపోవడం, ఛెళ్ళున చన్నీళ్ళతో కొట్టినట్టు ఫీలవడం నాకు బాగా గుర్తుంది. నా సమర్థింపు వదినకే కాదు, నాకే సంతృప్తిగా లేదు. తెలిసో, తెలియకో నిప్పుని ముట్టుకుంటున్నానేమో ననే బెంగ మొదలయింది. ఆ బెంగ తాలూకు అభద్రతాభావం నుంచి తప్పించుకోవడానికన్నట్లు నేను కొంతకాలం నా తల్లిదండ్రుల నీడలోనే గడిపేశాను. వారి సమక్షం నాకు గొప్ప నిశ్చింతని కలిగించింది.

 

    అక్కడే కొన్ని రోజులు వుండి, నా మీద నాకు నమ్మకం ఏర్పడ్డాక అత్తగారింటికి బయలుదేరాను. నాకు తెలుసు. నేను అక్కడ అందరితోనే కాదు. నన్ను నేను గెలుచుకోవడానికి కూడా యుద్ధం చెయవలసొస్తుందని, అన్నిటినీ ఎదుర్కొని వ్యక్తిత్వంతో బ్రతకాలనే దృఢ సంకల్పంతో బయలుదేరాను.

 

    అన్నిటికన్నా మొదటి మెట్టుగా నేను భర్తని చులకనగా చూడడం మానేయదల్చుకున్నాను. ఇది ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, నన్ను నేను సుఖంగా వుంచుకోవడం కోసం!

 

    అంతేకాదు, నా బావగారితో యిక శారీరక సంబంధం కూడా మానివేయదల్చుకున్నాను.

 

    అయితే ఒకటి మాత్రం నిజం! నేను నా బావగారిని ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అయితే నాకది సేఫ్ గా, 'ప్లెటోనిక్ లవ్'గా మిగిలిపోతే బాగుంటుంది అనిపించేది. ప్రతి స్త్రీ బహుశా నాలాగే అనుకుంటుంది అనుకుంటాను. తన సెక్యూరిటీకి భంగం కలిగించకుండా ఒక నిజమైన (!) స్నేహితుడు కావాలని ! ఆ కళంకమైన ప్రేమ అన్న పేరుతో జరిగే ఆత్మవంచనకి ఉదాహరణగా నా జీవితం ఆ విధంగా మరో మలుపు తిరిగింది.

 

    ఏ 'ఆంధీ' సినిమాలోనో చూపించినట్లుగా "తేరే బినా జిందగీ సే కొయీ షిక్వాతో నహీ... దిల్ మే ఆషా హై తేరే దామన్ మే సల్ ఝుకాకే హమ్ రోత్ రహేఁ... రోతే రహేఁ ..." లాంటి బరువు పాటలు పాడుకుంటున్నట్లుగా రాళ్ళు, రప్పల బ్యాగ్రౌండ్ లో దృశ్యాలు నా కళ్ళముందు మెదిలేవి.

 

                                    *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra