Home » Mallik » నవ్వితే నవరత్నాలు - 2

    "ఇందాకేవన్నారూ?... నా ప్రాబ్లెమేంటని కదూ?... ఏంటంటే..." చెప్పబోయాడు తింగరయ్య.
    "అక్కర్లేదు.. చాలా చక్కగా అర్ధం అయింది... లోపల కూర్చుందాం రండి..." అన్నాడు డాక్టరు.
    ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు.
    "ఊ... ఇప్పుడు చెప్పండి... మీకు భరించలేనంత దురదగా ఉంది... అవునా?" అడిగాడు డాక్టరు.
    "అవునండి." బుర్రకాయ ఊపుతూ అన్నాడు.
    "ఎప్పటి నుండి?"
    "నాలుగు రోజుల్నుండండి..."
    "ఏదీ... చొక్కా పైకెత్తండి..." తింగరయ్య చొక్కా పైకెత్తాడు. డాక్టరు అతని ఛాతీ పొట్టా వీపు పరీక్షగా చూశాడు.
    "అబ్బే... ఒంటి మీద దద్దుర్లేమీ లేవు, గజ్జి, తామర లాంటివి అంతకన్నా లేవు... ఏదైనా ఎలర్జీ అయి ఉంటుంది. పై పూతకి ఆయింట్ మెంట్ రాసిస్తాను... రెండ్రోజులు వాడి చెప్పండి..." అని ఆయింట్ మెంట్ రాసిచ్చాడు డాక్టరు.
    తింగరయ్య డాక్టరు రాసిన ఆయింట్ మెంట్ రెండ్రోజులు వాడాడు గానీ ఫలితం ఏమీ కనిపించలేదు. మళ్ళీ డాక్టరు దగ్గరికి వెళ్ళాడు. ఈ సారి డాక్టరు ఏవో మాత్రలు రాసిచ్చాడు. అవి వాడినా ఫలితం కనిపించలేదు.
    "మీ దురదేంటో గమ్మత్తుగా ఉందండి...ఎందుకు వస్తుందో ఏమీ తెలీడం లేదు..." అని ఆలోచనలో పడ్డాడు డాక్టరు.
    హఠాత్తుగా ఆయనకి ఏదో అనుమానం వచ్చింది.
    "మీకీ మధ్య కొత్తగా ఆలోచనలు ఏమైనా వచ్చాయా?" తింగరయ్యని అడిగాడు.
    తింగరయ్య సిగ్గుపడ్డాడు.
    "పర్లేదు చెప్పండి... సిగ్గు పడకండి.మీరేమైనా కొత్తగా పనేదైనా చేపట్టాలని అనుకుంటున్నారా?..."
    "హి..." బరబరా గోక్కుంటూ నవ్వాడు.
    "చెప్పండి..."
    "అవునండీ... కొత్తగా రాజకీయ పార్టీ ఏదైనా పెట్టాలని అనుకుంటున్నా..." తలొంచుకుని చెప్పాడు.
    అదోమాదిరిగా తింగరయ్య వైపు చూశాడు డాక్టరు.'ఒహో...అలాగా" అన్నాడు నీ బతుకు ఇలాంటిదా అని ధ్వనించేలా.
    ఆ ఆలోచన వచ్చినప్పట్నుండి ఒకటే దురదగా ఉందండీ..."మెలికలు తిరిగిపోతూ అన్నాడు తింగరయ్య.
    "చాలా ఎక్కువగా ఉందా?"
    "ఇందాక మీరే చూశారు కదండీ స్థంభానికేసి వీపు రుద్దుకోవడం!..."
    "అయితే అదండీ సంగతి!... మీకు రాజకీయ పార్టీ ఏదైనా పెడ్డాం అని ఒకటే దురదగా ఉంది!! కాబట్టి మీరు పార్టీ పెడ్తె తప్ప మీ దురద తీరడం కష్టం!..
    వెంటనే పార్టీ స్థాపించండి ఆలశ్యం దేనికీ..." అన్నాడు డాక్టరు.
    "నా దురద తీర్చుకోవాలని నాకూ ఉందిగానీ రాజకీయాల్లో నాకు ఏ మాత్రం అనుభవం లేదు కదా అని సందేహిస్తున్నా..." అన్నాడు తింగరయ్య మెల్లగా.
    ఆ మాట వింటూనే డాక్టరు ఘొల్లుమన్నాడు.
    "మీకు దురదే ఎక్కువనుకున్నాను అమాయకత్వం కూడా ఎక్కువే!... మన మినిస్టర్లూ, ఎమ్మెల్యేలకే చాలామందికి రాజకీయ అనుభవంలేదు. రాజకీయంగా అనుభవం లేనివాళ్ళు చాలామంది పార్టీలు పెడ్తున్నారు.. మీరు పెడ్తే ఏంటి తప్పు" అన్నాడు.
    "అంతేనంటారా?..."
    "అంతే..."
    తింగరయ్య మనసు తేలికపడింది.
    పర్లేదు...నేను కూడా ఓ పార్టీ పెట్టొచ్చు! నా దురద తీర్చుకోవచ్చు!!... అనుకున్నాడు.
    అతను డాక్టరుకి ధాంక్స్ చెప్పి ఇంటికెళ్ళి తను పెట్టబోయే పార్టీకి ఏ పేరు పెట్టాలా అని చాలా సేపు ఆలోచించాడు.
    చివరికి"తింగూబ" పార్టీ అని పెడ్తే బాగుంటుందనిపించింది.
    ఒక శుభముహూర్తం చూసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తను కొత్తగా తింగూబ పార్టీని పెడ్తున్నట్టు ప్రకటించాడు తింగరయ్య.
    "మీరు ఈ పార్టీని ఎందుకు పెట్టారు?" అని ఒక విలేకరి అడిగాడు.
    "ఎందుకేమిటి?... ప్రజాసేవ చేయడానికి" అన్నాడు తింగరయ్య.
    "మీ పార్టీ పేరు వింతగా ఉంది... ఇంతకీ అసలు తింగూబ అంటే ఏమిటండి?" ఇంకో విలేకరి అడిగాడు.     "అది వింత పేరేమీ కాదు. తింగూబ అంటే తిండి గూడు బట్ట..."
    మీ పార్టీకి పేరెందుకలా పెట్టారు?'
    "మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ తిండి గూడు బట్ట ఉండేలా చేస్తా. అదే మా తింగూబ ఆశయం..."
    అలా ఆ రోజు విలేకరులు రకరకాల ప్రశ్నలు వేశారు తింగరయ్యని...
    తింగరయ్య ఆ ఊళ్ళో కాస్త పలుకుబడి, డబ్బూ ఉన్న మనిషి కాబట్టి అన్ని పత్రికలూ తింగరయ్య గురించీ తింగూబ పార్టీ గురించీ ప్రముఖంగా రాశాయ్.
    ఆ పార్టీలోంచి ఈ ఒఅర్తీలోంచి వెలివేయబడిన వాళ్ళు చాలామంది తింగూబ పార్టీలో చేరారు.
    వారం తరువాత తింగరయ్య స్నేహితుడు శంకరయ్య ఇంటికి వచ్చి అతడ్ని పలకరించాడు.
    కాస్సేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక "పార్టీ ప్రాముఖ్యత పెరగడానికి ఏం చెయ్యాలని అనుకుంటున్నావ్?" అని అడిగాడు శంకరయ్య.
    "ఇంకా ఏం చెయ్యాలని అనుకోడమా?... అప్పుడే అన్నీ చేసెయ్యడం మొదలుబెట్టా.." గర్వంగా అన్నాడు తింగరయ్య.
    "ఏం చేశావ్ ఇప్పటిదాకా?'
    "కంట్లో పువ్వు లేసిన వాళ్ళకోసం ఐ క్యాంప్ లు నిన్న మొన్నా పెట్టించా..."
    "ఇంకా..."
    "అంతకముందు రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించా..."
    "ఇంకా?..." నవ్వు ఆపుకుంటూ అడిగాడు శంకరయ్య.
    "ప్రస్తుతం వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ళకోసం పాత బట్టలూ చందాలు వసూలుచేస్తున్నా..."
    "ఇలాంటి పన్లన్నీ చేసి ఏం సాధిద్దామని?..." నోట్లో చొక్కా దోపుకుని నవ్వాపుకుంటూ ప్రశ్నించాడు శంకరయ్య.
    తింగరయ్య శంకరయ్యని వెర్రి వెంగళాయని చూసినట్టు చూశాడు.
    "ఏం సాధిద్దామని అంటావేం?... ఇలాంటివన్నీ చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుంది.
    ఆ విధంగా తింగూబ పార్టీ ప్రాముఖ్యత పెరుగుతుంది. రేపొద్దున్న ఎలక్షన్లు వచ్చి మా వాళ్ళు నిలబడితే ప్రజలు మా వాళ్ళకే ఓట్లేస్తారు.అంతే...నేను చీఫ్ మినిస్టరైపోతా..." అన్నాడు తింగరయ్య సంబరంగా.
    "నీ మొహంలే ..ఇలాంటివి చేస్తే ప్రజలకేం గుర్తుండదు... నువ్వు కుటుంబం నియంత్రణల ఆపరేషన్లు చేయిస్తే ఎంత, కంట్లో పువ్వులు తీయిస్తే ఎంత... ప్రజలు పావులారిటీ ఉన్న మనిషిని ఆరాధిస్తారు..." అన్నాడు శంకరయ్య.
    "మరి ఇలా కాకపోతే పావులారిటి ఇంకెలా వస్తుంది?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra