ఎక్కడా ఏ అలికిడి లేదు. ఒకవేళ లైటువేసి ఆఫ్ చెయ్యటం మరచిపోయారా? థియేటర్ డోర్ తెరిచివుంది. ఏమిటో తెలుసుకుందామని డోర్ తీసుకుని లోపలకు వెళ్ళింది. మెయిన్ థియేటర్ ఇవతల ఓ రూమ్ వుంటుంది. దానివరకూ మాస్క్ లూ వగైరాలూ లేకుండా వెళ్ళవచ్చు. ఆ గదికూడా చాలా నిశ్శబ్దంగా వుంది. అసలు మనుషులు లోపలవున్న సూచనలే లేవు. ఎందుకో చాలా క్యూరియాసిటీ అనిపించింది. ఏమయితే అయిందని మెయిన్ థియేటర్ డోర్ తెరిచి లోపలకడుగు పెట్టింది. ఆపరేషన్ టేబిల్ మీద ఓ స్త్రీ పడుకోబెట్టబడివుంది. దగ్గరకు వెళ్ళింది. ఆమెను చాలా తేలిగ్గా గుర్తుపట్టింది. ప్రఖ్యాత సినీతార హేమసుధ. కళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత వేసే బ్యాండేజెస్ వున్నాయి. అంత ముఖ్యమైన వ్యక్తిని తారాపథంలోవున్న మహానటిని అలా ఒంటరిగా దయనీయమైన స్థితిలో చూసేసరికి ఏదో జరగకూడనిది జరిగిందనిపించింది. పైగా అర్థరాత్రి. ఆమెది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదని ముందే తెలుసు.

 

    భుజంమీద చెయ్యి వేసి "హేమసుధగారూ! హేమసుధగారూ" అని పిలిచింది. "ఊ" అంది ఆమె చాలా కష్టంగా. మాట ఎక్కడ్నుంచో వెలువడుతున్నట్లుంది. "ఏం జరిగింది?" అనడిగింది తాను "తె..లీ...దు..."

 

    "ఇక్కడెందుకున్నారు? "తె...లీ...దు..." ఆమె గుండె ద్రవించిపోయింది. సమ్ థింగ్ ఈజ్ రాంగ్. తమ హాస్పటల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు. ధైర్యంచేసి బ్యాండేజెస్ ప్రక్కకి తొలగించి చూసింది. మైగాడ్! ఆమె రెండు ఐ బాల్స్... హారిబుల్... పెరికివేయబడి వున్నాయి. గట్టిగా అరుస్తూ తాను బయటకు పరిగెత్తింది.

 

    రంజిత నైట్ డ్యూటీ వాచ్ మెన్ ని కలుసుకుంది.

 

    "రాత్రివేళల లోపలికెవరయినా ఎలా వస్తూ వుంటారు?"

 

    "గేట్ పాసులున్నవారు మాత్రమే అనుమతించబడతారు."

 

    "గేట్ పాస్ లు లేకుండా ఇన్ ఫ్లుయెన్స్ చేసో, డబ్బు ఎరజూపో ఎవరయినా లోపలి వచ్చే అవకాశముందా?"

 

    రంజితకు తన ప్రశ్న తనకే సిల్లీగా వున్నట్లనిపించింది. ఒకవేళ అలాంటిదేమయినా వున్నా వాచ్ మెన్ నిజం చెప్పడు.

 

    "లేదు. ఆ విషయంలో హాస్పటల్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా వుంటాయి."

 

    "పోనీ గేట్ పాస్ చూపించి నువ్వు డ్యూటీలోకి వచ్చాక ఆరడుగుల పొడవు, చాలా బలంగావున్న మనిషి ఎవరయినా లోపలికి వచ్చారా?"

 

    "రాలేదు."

 

    "రాలేదని ఎలా చెప్పగలవు? ఇది చాలా పెద్ద హాస్పటల్. ఎంతో మంది వస్తూ ఉంటారు. నీకు గుర్తు ఉండకపోవచ్చు కదా!"

 

    "ఎంతమందిని చూసినా నాది చాలా ఎలర్ట్ గా ఉండే స్వభావం. ఏ మాత్రం ప్రత్యేకంగా వున్నా గుర్తుపెట్టుకోగలను."

 

    "అలాగా! ఆ రాత్రికి ప్రత్యేకంగా కనిపించిన వారి గురించి చెప్పు చూద్దాం."

 

    "మూడడుగులో, ఆపైన కొంచమో ఉన్న మరుగుజ్జు మనిషి ప్యాంట్, ఇన్ షర్ట్ వేసుకున్నాడు. అతను..." అంటూ ఏదో అలికిడైతే "అరె, అతనే!" అంటూ గట్టిగా అరిచాడు.

 

    రంజిత తృళ్ళిపడి అటుకేసి చూసింది. ఆరోజు కారులో ఎక్కి, పారిపోయిన మరుగుజ్జువాడు. చేతిలోవున్న వస్తువును వాచ్ మేన్ వైపు విసరబోతూన్న వాడల్లా వాళ్ళు తనని గమనించేసరికి వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు.

 

    "స్టాప్ హిమ్!" అంటూ రంజిత అతన్ని వెంటాడింది.

 

    హాస్పటల్ కాంపౌండ్ వాల్ కివతలకు రకరకాల చెట్లు వ్యాపించి ఉన్నాయ్. అవన్నీ హాస్పటల్ కు ఉన్నతమైన వాతావరణమివ్వటం కోసం పెంచబడినవే. మరగుజ్జువాడు ఆ చెట్ల మధ్యకు దూరిపోతున్నాడు.

 

    "ఆగు!" అని అరుస్తూ రంజిత హేండ్ బ్యాగ్ లోని చిన్న రివాల్వర్ ని చాలా వేగంగా బయటకు తీసింది.

 

    మరుగుజ్జువాడు వెనక్కి తిరిగి "హహహ" అని నవ్వాడు. అతని పళ్ళు భయంకరంగా మెరిశాయి. మరుక్షణం అతని చేతిలోని చిన్న ఆయుధం ఆమెవైపు విసురుగా రాసాగింది!

 

    ఏదో ఆయుధం విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతూ, రయ్ మని శబ్దం చేస్తూ ఆమె మీదకు దూసుకొచ్చింది. రంజిత చాలా మెలకువగా, మెరుపు వేగంతో ప్రక్కకి తప్పుకుంది. ఇదంతా కనురెప్పపాటులో జరిగింది. రంజిత స్థిరపడి చూసేసరికి ఆ మరగుజ్జువాడక్కడలేడు. ఆమె చెట్ల మధ్యకు వెళ్ళి చూసింది కాని, అతనెక్కడా కనిపించలేదు.


                                        8


    ఎస్.పి. జయసింహ తన డిపార్టుమెంటులోని ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేశాడు. రంజిత కూడా ఆ సమావేశంలో పాల్గొంది.

 

    "దేశంలో గొప్ప నేత్రవైద్యశాలలలో ఒకటిగా పేరుపడిన పద్మ నేత్రాలయంలో ఇటువంటి అమానుషమైన సంఘటన జరగటం దురదృష్టకరం. ఎక్కడో చాటుగా కాకుండా కొన్ని వందలమంది తిరిగేచోట. పైగా ఆపరేషన్ థియేటర్ లో అతనీపని చేశాడంటే, అన్నిటికీ బరితెగించిన భయంకరమైన మనిషై ఉండాలి" అన్నాడు ఎస్.పి. ఆయన గొంతులో చాలా ఆందోళన ధ్వనిస్తోంది.

 

    "మందాకిని కళ్ళు పెరికేసినవాడూ, హేమసుధకి ఆ ఘోరం చేసినవాడూ ఒకరేనా అన్న విషయంకూడా ఆలోచించాలి" అన్నాడు ఏ.ఎస్.పి.

 

    "హేమసుధ ఇంకా ఎవరితో మాట్లాడే స్థితిలో లేదు. ఆమెను వీల్ చైర్ లో తీసుకెళుతున్న వ్యక్తిని చూసినవాళ్ళు ఇచ్చిన ఆనవాళ్ళనుబట్టి ఒకరే అనుకోవల్సి వస్తోంది."

 

    "ఒకరే ఐతే ఇంకో రెండు పాయింట్లు. ఆ వ్యక్తి డాక్టరా? కాదా? హాస్పటల్ కు సంబంధించిన మనిషా? బయటివాడా?"

 

    "అతను కళ్ళు పెరికివేసే పద్ధతీ అదీ చూస్తోంటే ఎంతో అనుభవమున్న సర్జన్ చేసినట్లుగా వుంది. కాని అత్యంత పవిత్రమైన డాక్టర్ వృత్తిలో వుండి ఇంత హేయమైన పని చెయ్యగలరా? ఇహ ఆ వ్యక్తి హాస్పటల్ సిబ్బందికి చెందినవాడా కాదా అన్నది ఎంక్వయిరీలో తేలవల్సిన విషయం."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra