Home » Dr c. ananda ramam » గర్ల్ ఫ్రండ్

    నీరద్ తెల్లపోయి "ఎందుకూ" అన్నాడు.
    "నువ్వు తిరిగిరాకపోతే, నాకు చావుకాక మరొకదారి ఏముంది?"
    వెంటనే గీత నోరు తన పెదవులతో మూసేసాడు అతడు- "ఛ! అలా ఎన్నడు ఆలోచించకు. ఇలా చూడు. నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి! ఏ పరిస్థితులోనూ నీకు అన్యాయం చెయ్యను. మనం సాహసించి పెళ్ళి చేసుకున్నాం! ఎన్నెన్నో ఎదుర్కోవలసివస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి!"
    అతడి అనునయంతో చాలావరకూ తేరుకొని అప్పటికీ వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకోలేక "ఎందుకింత ఆలస్యమయింది?" అని అడిగింది.
    "ముందు ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని రా! నిన్నిలా చూడలేను."
    గీత నవ్వింది.
    "అదీ. అలా నవ్వుతూ వుండాలి! అంతేకాదు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి-కృంగిపోకూడదు."
    గీత లేచి అంతరాత్రివేళ వేడినీళ్ళు స్నానంచేసి, తెల్లని బట్టలు కట్టుకొని చల్లగా సువాసనలు విరజిమ్ముతూ అతడిదగ్గరకి వచ్చి కూచుంది.
    "ఇప్పుడు అడగవేం, ఆలస్యమెందుకయిందని?"
    "నీ దగ్గిర ఇలా కూచుంటే. నాకు అన్ని బెంగలూ తీరిపోయినట్లుంది, ఏదీ అడగాలనిపించటంలేదు."
    "నువ్వు అడిగినా అడగకపోయినా, నీకు చెప్పకుండా ఏ విషయమూ దాచను. నాకు ఫ్రెండైన హోటల్ మేనేజర్ ఫోన్ చేసాడని చెప్పాను కదూ? అతడికీ ప్రొప్రైటర్ కీ పడటంలేదట! పైగా ఆ హోటల్లో ఇల్లీగల్ ఎలిమెంట్స్ ఎక్కువయిపోతున్నాయి! ఆ హోటలు వేదిలేసి మరోచోటికి పోవాలనుకుంటున్నానని చెప్పాడు. 'నువ్వే ఎందుకు హోటల్ రన్ చెయ్యకూడదూ? నేను నీకు తప్పకుండా లాభాలు సంపాదించి ఇస్తాను' అన్నాడు. ఆ విషయాలే చర్చించుకుంటూ కూర్చున్నాం, అందుకే ఆలస్యమయింది."
    "మీరు హోటలు నడుపుతారా?"
    "పిచ్చిపిల్లా! హోటలంటే రోడ్డుపక్క టీ స్టాల్ అనుకున్నావా? మేము ప్లాన్ చేస్తున్నట్లు కనీసం త్రీస్టార్ హోటలు నడపాలన్నా బోలెడు డబ్బుకావాలి."
    గీత బెంగగా చూసింది.
    "అదిగో అలా చూడకు! దేనికీ బెంగపడకూడదు. వుయ్ మస్ట్ ఎంజాయ్ లైఫ్! నీకెందుకూ, ఏదేది ఎలా చెయ్యాలో అవన్నీ నేను చూసుకుంటాగా?"
    ఆ దుందుడుకు మనిషిలో అంత సామర్ధ్యముందని గీతకు విశ్వాసం ఏర్పడిపోయింది.
    కానీ, అతడు నేరుగా తమ ఇంటికి తీసుకుపోతానన్నప్పుడు మాత్రం భయపడిపోయింది.
    "ఏం ఫరవాలేదు-మనం ముందుగానే దూరంగా పోవటం దేనికి? అమ్మా నాన్నగార్ల రియాక్షన్ చూద్దాం! నీకేమాత్రం కష్టం కలిగినా నేను సహించనుగా!" అని అతడు అనటంతో ప్రతిఘటించలేకపోయింది.
    గీతా నీరద్ లు భార్యాభర్తలుగా వచ్చి జయపాల్ కు నమస్కరించారు. ఏం చెయ్యాలో పాలుపోలేదు జయపాల్ కి. ఆ సమయంలో అతడు తన మిత్రులతో రాజకీయాలు చర్చిస్తున్నాడు, ఇది అతడెదుర్కొన్న మొట్టమొదటి ఓటమి. 
    నిగ్రహించుకోవడానికి సంయమనశక్తినంతా ఉపయోగించవలసివస్తోంది. మిత్రులు అతడివంక కుతూహలంగా చూడసాగారు. అందరికీ అన్ని సంగతులూ తెలుసు. అలాంటి పబ్లిసిటీ ఇచ్చాడు నీరద్. అతి ప్రయత్నంమీద తననుతాను అదుపులోకి తెచ్చుకొని "లోపలికి వెళ్ళండి" అన్నాడు మామూలుగా.
    గీతతో లోపలికొచ్చాడు నీరద్. మీనాక్షి గుండె చెదిరిపోయింది. జయపాల్ లా నటించటంకూడా ఆమెకు సాధ్యంకాలేదు. తన భర్త ఉంచుకున్న మనిషి. అనుక్షణం తన గుండెల్లో నిప్పును రగిలించే మనిషి. దాని చెల్లెలిని__ తన కొడుకు పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు కోడలిగా.
    తను మంగళహారతిచ్చి ఆహ్వానించాలా?
    "ఇంతకంటే ఒక్కసారే తలకొరివి పెట్టరాదురా! తండ్రిని మించిన కొడుకుననిపించుకున్నావ్? దానిని నా కంటిముందునుంచి తీసుకుపోరా" అని తలకొట్టుకుని ఏడ్చింది.
    గీత ఆకులా వణికిపోతూ నీరద్ కి మరింత దగ్గిరగా వచ్చింది. గీత చెయ్యిపట్టుకొని, తన గదిలోకి వెళ్ళి తనకు కావలసిన సామానులన్నీ సూట్ కేస్ లో సర్దుకొని తల్లిదగ్గిరకు వచ్చాడు.
    "అమ్మా!" అన్నాడు. అతడికీ కష్టంగానే వుంది_కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి....పసితనంనుంచీ తల్లి తనను ఎంత గారాభంగా పెంచిందో అతడికి ఒక్కొక్కటి గుర్తుకురాసాగింది. తండ్రికీ తల్లికీ మధ్య కేవలం శారీరక సంబంధం తప్ప ఏ విధమయిన ప్రేమాభిమానాలూ, అవగాహన లేకపోవటంతో ఆవిడ లోకమంతా తనే ఐపోయాడు.
    డబ్బున్న చాలామంది ఆడవాళ్ళలాగ తల్లికూడా క్లబ్బులంటు తిరిగినా, తనను పూర్తిగా అశ్రద్ధ చేసేదికాదు. అన్నింటికంటే తనకు ఊహ వచ్చిన దగ్గరనుంచీ తల్లి తరచుగా అనే మాటలు అతడికీ సమయంలో గుర్తుకొచ్చాయి. 
    "నీరద్! నాకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూస్తున్నావుగా ఏనాటికయినా ఈ అన్యాయానికి నువ్వే పరిహారాన్ని చెల్లించాలి. జీవితంలో నాకు శాంతి, తృప్తి ఏమైనా నువ్వే కలిగించాలి!"
    అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. మీనాక్షి ఎర్రబడ్డ కళ్ళతో కొడుకునీ, కొడుకు చేతిలో సూట్ కేస్ నీ, పక్కనే ఉన్న గీతనీ చూసింది.
    "తొందరగా వెళ్ళిపోరా! నా నోటితో ఆ అమ్మాయినైనా శపించాలని లేదు. ఎంతయినా  అది నువ్వు పెళ్లిచేసుకున్న అమ్మాయి. ఏ జన్మలోనో ఏదో ఘోరపాపం చేశాను. ఈ జన్మలో అనుభవిస్తున్నాను. మొగుడి దగ్గరనుంచీ చివరకు కొడుకుదగ్గరనుంచీ కూడా ప్రేమాభిమానాలకు నోచుకోని ఇలాంటి అధ్వాన్నపు బ్రతుకు పగవాళ్ళకైనావద్దు భగవంతుడా."
    "అమ్మా!" అంటూ తల్లిదగ్గిరగా వచ్చాడు నీరద్. "ఏనాటికయినా నీకు జరిగిన అన్యాయానికి పరిహారం చెల్లించాలనుకొన్న నా నిర్ణయం ఇప్పటికీ అలాగే ఉందమ్మా. నీకేకాదు, మన సమాజంలో స్త్రీజాతికే జరుగుతున్న అన్యాయానికి పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నాను. నావల్ల ఏనాడు, ఏ స్త్రీకి అవమానం జరగదు. నీమీద నాకు ప్రేమలేదనుకోకు, కానీ ఆ ప్రేమతో గీతను వదిలెయ్యమని శాసించకు. గీత నాలో ఒక భాగం!"
    కొడుకు మాటలు అర్ధంగాక బాధగా చూసింది మీనాక్షి, తన చేతులలో పెరిగిన పసికూన పెరిగి తనదైన వ్యక్తిత్వం ప్రదర్శించే ఆ సృష్టిరహస్యం ఆవిడకిప్పుడు అర్ధంకాదు.
    "ఈ ఊళ్ళోనే ఉంటాం. నువ్వెప్పుడు కబురుచేసినా వస్తాం" అని గీతతో ఆ ఇల్లువదిలి వెళ్లిపోయాడు నీరద్. ఆవేదన భరించలేక తెలివితప్పి పడిపోయింది ఆ తల్లి. 
                                       15
    గీతా, నీరద్ ల్ లు చక్కని ఇల్లు అద్దెకు తీసుకున్నారు. గీత కాలేజీకి వెళ్ళివస్తోంది. నీరద్ రోజూ గీతని తనే కాలేజీలో డ్రాప్ చేసి తిరిగి తనే ఇంటికి తీసుకొచ్చేవాడు. అతడు డాన్స్ ప్రోగ్రామ్స్ కి రోజురోజుకీ మరింత గిరాకీ పెరుగుతోంది. ఇద్దరికీ రోజులు హాయిగా గడిచిపోతున్నాయి.
    ఒకరోజు జయపాల్ కారులో స్వయంగా నీరద్ ఇంటికి వచ్చాడు. గీత తడబడిపోయింది. త్వరత్వరగా కాఫీ తయారుచేసి అతడిముందు ఉంచింది. జయపాల్ ఆ కాఫీ ముట్టుకోలేదు. గీత నమస్కారాన్ని స్వీకరించలేదు. అసలు ఆమెను కన్నెత్తి చూడలేదు. ఇల్లుమాత్రం నాలుగు వైపులా పరిశీలనగా చూశాడు.
    "నీరద్! ఒకసారి ఇంటికి రా! నీతో మాట్లాడాలి" అన్నాడు. అనేసి నీరద్ అంగీకారంకోసమైనా చూడకుండా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయినా గీత గుండెదడ తగ్గలేదు.
    "మీరు మీ ఇంటికి వెళతారా?" అంది దిగులుగా.
    "మరి, నాన్న పిలిచాడుగా?"
    దెబ్బతిన్న లేడిలా చూసింది గీత. అతడు నవ్వి "పిచ్చా? మళ్ళీ-మళ్ళీ, మళ్ళీ చెబుతున్నాను. మననెవ్వరూ విడదియ్యలేరు. నేనున్నంతవరకు నీకేం భయంలేదు" అన్నాడు.
    ఆ మరునాడే తండ్రిని కలుసుకున్నాడు నీరద్. "కూచో!" అన్నాడు జయపాల్. అతడు కూచున్నాడు. కొంతసేపటివరకూ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ జయపాల్ సంభాషణ ప్రారంభించాడు.
    "నువ్వు హోటల్ రన్ చెయ్యాలనుకున్నావటగా."
    "ఎవరు చెప్పారు?"
    నాకు ఎవరూ ఏదీ చెప్పరు-అన్నీ నేను తెలుసుకుంటాను."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra