Home » Suryadevara rammohan rao » సాహసి


    "మళ్ళీ ఈ కోట వెలుగుముఖం చూస్తుందని నేననుకోలేదమ్మా" వికసించిన ముఖంతో అన్నాడు కౌశికభూపతి.

    "మళ్ళీ బంగారు రధాల- రోజులొస్తాయి- చూస్తుండండి బాబుగారూ" మీసాల్ని సవరించుకుంటూ అన్నాడు ముత్యాలనాయుడు.

    నిధి అన్వేషణకు సంబంధించి, అంతవరకూ జరిగిన విశేషాలన్నిటినీ చెప్పింది ఇందుమతి.

    అన్నీ వినడం తప్ప, ఏం మాట్లాడలేదు కౌశికభూపతి.

    ముత్యాలనాయుడు నిద్రపోవడానికి తన గదికి వెళ్ళిపోయాక-

    "చూడమ్మా- ఇందూ- మళ్ళీ నువ్వు బయల్దేరే ముందు... చెప్పడానికి వీలవుతుందో లేదో... అప్పటికి జ్ఞాపకం వుంటుందో- కొన్ని అతి ముఖ్యమైన విషయాలివి- జీవితానిక్కూడా ఈ సూక్ష్మాలు వర్తిస్తాయనుకో- నిధి అన్వేషణ యుద్ధం కంటే, వేట కంటే ప్రమాదకరమైంది.

    యుద్ధం విజయగర్వం కోసం చేసేదయితే, వేట పరాక్రమ కుశలత కోసం చేసేది- నిధి అన్వేషణ అంటే... డబ్బు కోసం యాతన, అంతే కదా- ఎక్కడయితే డబ్బు ముడిపడి వుందో అక్కడే ప్రమాదం కూడా ముడిపడి వుంటుంది.

    క్షణ క్షణం ప్రమాదం-

    ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు-

    ఒకటి- నీ ప్రాణంతోపాటు, నీ శీలాన్ని కూడా కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకో- ఎప్పుడూ ఏమరపాటు ప్రదర్శించకు- ముఖ్యంగా మన రాచకుటుంబంలోని వ్యక్తులకు ప్రాణం కన్నా శీలం ముఖ్యం- మూడు- దుర్మార్గం, అసూయ, ద్వేషం... ఏ రూపంలో తొంగిచూస్తాయో తెలీదు- అందుకోసం జాగ్రత్తలు తీసుకో... నీ దగ్గరున్న మనుషుల్లో, ఒకరి మీద ఒకర్ని నిఘా ఉంచు... ఆ విషయం వారికి తెలీకుండా జాగ్రత్తపడు... నాలుగు- వేట నీతి- ఆటవిక నీతి- ఈ నీతిలో- పులి మీదకు సింహాన్ని ఉసి కొల్పాలి- అవసరమయితే- రెండిట్నీ చంపే నీతి చేపట్టాలి... లేడిని తోడేలుకి ఆహారంగా వెయ్యి. తోడేల్ని సింహానికి ఆహారంగా వెయ్యి... మనుషుల విషయంలో కూడా అంతే... అయిదు- వేట సమయంలో 'ప్రేమ' అనే పదం నీ జోలికి రాకూడదు. నిర్ణయాల విషయంలో కర్కశంగా ఉండు. ఫలితమ్మీద, లక్ష్యం మీద నీ ధ్యాస ఉండాలి. గుర్తుంచుకో...

    ఆరు- నిధి దక్కలేడనుకో- నిరాశపడకు- నిధి దొరికిందనుకో అసలు గొడవ అక్కడే వస్తుంది. మానవ స్వభావాలు అక్కడే బయటపడతాయి. డబ్బును సంపాదించాలంటే, డబ్బునే ఖర్చు పెట్టాలి... నిధిని ఎరచూపి నీ పనుల్ని చక్కబెట్టుకో.

    ఏడు- నీ అన్వేషణలో నువ్వు విజయం సాదిస్తున్నావని తెల్సిందనుకో... నీ అన్నదమ్ములు వాలడం ఖాయం. ఆ విషయంలో జాగ్రత్తగా వుండు. భాతృధర్మంతో చెయ్యగలిగింది చెయ్యి- వాళ్ళు నీ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే పరిస్థితి ఏర్పడిందనుకో... చంపడానిక్కూడా వెనుకాడకు- అన్నదమ్ముల్ని చంపడమా- అని ఆశ్చర్యపోకు. 'మహారాజనీతి' లో ఇదొక భాగమే. సామ దాన, భేదాల తర్వాత వచ్చేది ఈ దండనీతేనని గుర్తుంచుకో..."

    తండ్రి చెప్పిన విషయాలన్నీ చాలా జాగ్రత్తగా వింటోంది ఇందుమతి.

    "ఎనిమిది- నీతో వచ్చిన వాళ్ళందరూ ఏకమైపోయి- నిన్ను మట్టుబెట్టడానికో- నీకు హాని చేయడానికో ప్రయత్నించారనుకో- నువ్వు 'దేవులపల్లి కోట' వారసురాలిగా మన గిరిజనుల్ని ఆశ్రయించు.

    ఒక్క ఆటవికుడు, వందమంది నాగరికులకన్నా మానవత్వంలో గొప్పవాడు... గుర్తుంచుకో-

    చివరగా ఆ సహాయం కూడా దొరకని సమయం ఏర్పడినప్పుడు- మన్య ప్రాంతంలో ఒక రహస్య మార్గం ఉండాలి. ఈ లోపల దాని గురించి కనుక్కో. ఆ రహస్య మార్గం నేరుగా మన కోటలోకే ఉంటుంది" చెప్పాడాయన.

    అవన్నీ విన్న తర్వాత కొద్ది క్షణాలు సీరియస్ గా ఆలోచించింది ఇందుంతి. చాలా ఆశ్చర్యపోయింది కూడా.


                                         *    *    *    *


    రాత్రి సరిగ్గా పన్నెండుగంటలయింది.

    కోట చీకటిలో నిద్రపోతోంది...

    తన గదిలో మంచమ్మీద పడుకున్న ఇందుమతి, తండ్రి చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తోంది.

    కౌశిక భూపతి అన్ని విషయాలూ చెప్పి కూతురితో చెప్పకూడదని ఒక విషయాన్ని దాచి వుంటాడు. ఆ విషయాన్ని కూతురు ఇందుమతి అనుసరించి వెళ్ళే ముత్యాలనాయుడుతో- వెళ్ళే ముందు చెప్పాలనుకున్నాడు.

    నిధి అన్వేషణలో చాలా కీలకమైన విషయం అది.


                                       *    *    *    *


    ముద్దబంతి పువ్వుల మధ్య చేమంతి పువ్వులా సూర్యుడు-

    ఆదివారం ఉదయం

    తెల్లవారుఝామునే లేచి, స్నానాదికారాలు పూర్తిచేసి పూజ చేసుకొని వచ్చే అతిధుల కోసం ఎదురుచూస్తోంది ఇందుమతి.

    ఎనిమిది- తొమ్మిది- పది-

    ఓ ఒక్కరూ రాలేదు- వచ్చే అతిధుల కోసం, ప్రత్యేక వంటలు చేయిస్తోంది ఇందుమతి.

    పదింపావుకు నెమ్మదిగా బిక్కు బిక్కుమంటూ అడుగుపెట్టాడు కపాలేశ్వర్.

    అతనికి విచిత్రంగానూ, అనూహ్యంగానూ వుంది.

    ఇందుమతి అంటే ఎవరో కాలేజీ అమ్మాయేమో- ఏదో 'హంటింగ్' మీద ఇంట్రస్టుతో ఏదో చేస్తోందేమో డబ్బుగల అమ్మాయికి అదో హాబీ ఏమో అనుకున్నాడు.

    కానీ కాదని తెల్సిపోయింది! మరేమిటిదంతా...? అదే అర్ధం కాలేదతనికి. విశాలమైన చావిడీలో పాలరాతి గోడ కానుకుని నిలబడ్డ ఇందుమతిని చూడగానే గబగబా నడిచి ముందుకెళ్ళి విష్ చేశాడు.

    "ఊళ్ళో మీ పేరు చెప్పి అడిగాను- ఎవరూ చెప్పలేదు" అన్నాడు కపాలేశ్వర్.

    "ఊరివాళ్ళకు ఆ పేరసలు తెలీదు. యువరాణిగా తప్ప...

    యువరాణీ అని అడిగుంటే చెప్పేవారు. అయినా డైరెక్టుగా కోటకే రమ్మన్నానుగా" అంది ఇందుమతి.

    యువరాణి... యువరాణి ఎవరు? ఈ అమ్మాయా? ఇందుమతా? కథల్లోనూ, నవలల్లోనూ, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లోనూ వినడమే తప్ప, ఒక రాజవంశానికి చెందిన అసలయిన ప్రతినిధిని చూడడం కపాలేశ్వర్ జీవితంలో అదే మొదటిసారి- అందుకే దిగ్ర్భాంతికి గురయ్యాడు. అతనికెందుకో వంటిమీద చిరుచెమట పట్టింది.

    అదే సమయంలో లోన్నుంచి కౌశికభూపతి వచ్చారు. ఆయన మాట్లాడకుండా వచ్చి, వాలు కుర్చీలో కూర్చున్నారు.

    "వారు కౌశికభూపతి... రాజావారు..." ముత్యాలనాయుడు చెప్పాడు.

    కౌశికభూపతి... కౌశిక భూపతి... అంటే యువరాజు- ఆ పేరు వినగానే వళ్ళు జలదరించినట్టయింది కపాలేశ్వర్ కి. దేవులపల్లి కోట మహారాజు... కిరీటిధారిగా కౌశికభూపతి కుమార్తె ఇందుమతి!!

    ఐదు నిమిషాలసేపు నోట మాట రాకుండా నిల్చుండిపోయాడు కపాలేశ్వర్.

    మరో పావుగంటకు ఒక టాక్సీ వచ్చి ఆగింది.

    అందులోంచి దిగారు విశ్వరూపశర్మ, పరంజ్యోతి.

    విశ్వరూపశర్మ, కౌశికభూపతిని పట్టుకుని నిజంగా ఏడ్చేశాడు.

    "తమ గురించి తెలీక, ఎంతో బాధపడ్డాను... ఇందుమతి రాకవలన, మళ్ళీ ఇన్నేళ్ళకు చూడగలిగాను" అన్నాడు ఆనందోద్వేగంతో.

    కౌశికభూపతి పరిస్థితి అలాగే ఉంది. విశ్వరూపశర్మను చూడగానే ఆయన మనసు, దశాబ్ధాల వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటి ముచ్చట్లు- సంగతులు- గుర్తుకొచ్చాయి-

    ఏ ఒక్క అతిధీ ఇక రాడనుకున్నవేళ... గబ్బిలాలకు ఆలవాలంగా మారిపోతుందనుకున్న వేళ- అతిధులొచ్చారు.

    కౌశికభూపతి చాలా ఆనందంగా ఉన్నారు.

    మధ్యాహ్న భోజనాలు పూర్తయ్యాయి.

    కానీ-

    ఇందుమతి మనసు మనసులో లేదు. ఆమె యువరాజు కోసం ఎదురుచూస్తోంది.

    గంటలు గడుస్తున్నాయి.

    మూడయింది- నాలుగయింది- ఐదు అయింది-

    అటూ, ఇటూ వరండాలో అసహనంగా పచార్లు చేస్తోంది. వైశాలి దొరికిందో- లేదో- లాకెట్ దొరికిందో లేదో- ఎన్నెన్నో ప్రశ్నలు- ఆ లాకెట్ దొరక్కపోతే? అందుకే రాజవంశానికి చెందిన వాళ్ళెవరయినా- తమ దగ్గర వున్నది ఏ వస్తువయినా, ఎవరికీ ఇవ్వకూడదని తన తాతగారు తనకు చిన్నపుడు చెప్పటం గుర్తుకొచ్చి- ఒక్కక్షణం బాధపడింది.

    సరిగ్గా-

    ఐదున్నరకు కోటలోకి ఒక కారు ప్రవేశించింది.

    ముందు-

    యువరాజు, ఆ తర్వాత వైశాలి...

    వైశాలిని చూసి ఆశ్చర్యపోయింది ఇందుమతి.

    సాదరంగా ఇద్దర్నీ ఆహ్వానించింది.

    "ఏవిటండీ బాబూ... ఇదేదో... విఠలాచార్య సెట్టింగులా ఉంది తప్ప... ఇల్లులా లేదే" ఆశ్చర్యపోతూ అన్నాడు యువరాజు.

    "దీన్ని ఇల్లని అనరు. కోటంటారు... రాజభవనం అంటారు-" వైశాలి సర్దింది.

    "అదేలెండి. ఆ ముసలాయన ఎవరో..." గొణుక్కున్నాడు యువరాజు.

    "వారే- శ్రీశ్రీశ్రీ కౌశికభూపతి రాజావారు- వారి కుమార్తె యువరాణి ఇందుమతిదేవిగారు-" ముత్యాలనాయుడు, యువరాజు చెవిలో ఊదాడు.

    "అయ్యాబాబోయ్... నిజంగా మహారాజా ఆయన... సిన్మాల్లో చూపిస్తారు టట్టడాం... అని... ఆ మాదిరన్న మాట... అంటే ఇందుమతి మామూలు అమ్మాయి కాదన్న మాట-" బిత్తరపోతూ అన్నాడు యువరాజు.

    నవ్వుతూ ఒకవారగా నిలుచున్న ఇందుమతివేపు చూశాడు యువరాజు. ఆ రోజు జగదంబా జంక్షన్లో, రెండో ఆటో ఎందుకు ఎక్కిందో అర్ధమైంది. ఇందుమతిపట్ల అపారమయిన గౌరవం పెరిగిపోయింది.

    "మహారాజుల లెవలే లెవెల్- ఎక్కడికి పోతుందా రాజసం...?" మనసులోనే అనుకున్నాడు యువరాజు.

    వైశాలి ముత్యాలనాయుడుతో మాట్లాడుతున్న సమయంలో, యువరాజుని పక్కకు పిలిచి అడిగింది ఇందుమతి-

    "ఏమిటి... నేను లాకెట్ ను తెమ్మని చెప్తే... నువ్వు మనిషినే తెచ్చేసావ్-"

    "ఆ ప్రశ్న మీరు వేస్తారని నాకు తెలుసు- నేను ఉత్తినే, వెర్రిదద్దమ్మలా వైశాలిని తీసుకురాలేదు..." జుత్తు ఎగరేస్తూ అన్నాడు.

    "మరి"

    "మనం వెళ్ళేది నిధి కోసం, లాకెట్ ఇమ్మని అడిగితే, నిధి రహస్యం చెప్పాలి. చెప్తే దురాశ పుట్టి లాకెట్ ఇవ్వకపోవచ్చు. గొడవలు జరగొచ్చు అందువల్ల... బోలెడంత ముందుచూపుతో ఆలోచించి... ఆలోచించి... మా గురువుగారైన శ్రీ ఆంజనేయుడుగారు సంజీవిమౌంట్ ని ఎత్తుకొచ్చినట్లు ఆవిడ్ని లేపుకొచ్చేశాను. మంచిదా? కాదా-" అడిగాడు అమాయకంగా యువరాజు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra