Home » Bollimuntha nageswara rao » లేటెస్ట్ లవ్ �

'పాలక పక్షం' ప్రతిపక్షం వుంటాయి.
పాలకపక్షం కుంభకోణాన్ని ఎవరు బయటవేసినా, వారికి అండగా ప్రతిపక్షం వుంటుంది. ఇప్పటికే తమరి ఇంటికి పావన్ని వెదుక్కుంటూ ప్రతిపక్ష నాయకులు వస్తూ వుండాలి."
అరుణకుమార్ గా చెప్పుకున్న ఆ సరికొత్త జర్నలిస్టు అన్నాడు.
"అదేం లేదుబాబూ! నాకు ఒకదరిని భయంగా వుంది. ఎవరో దీనికి అలాంటి సమాచారాన్ని అందించి, దీన్ని పావుగా వాడుకుంటున్నారని. నా ఉద్దేశ్యంలో ఇలాంటి సమాచారం మీలాంటివారికి ఆసక్తిగానే వుంటుంది. కానీ మాకు కత్తి పదునుమీద నడకవుతుంది. మేం నడిచేదారుల్లో పూల తోరణాలు కాదు. బాంబుల్ని తోరణాలుగా అడుగడుక్కి అమర్చి వ్రేలాడదీస్తారు. ఎక్కడ ఏది పేలుతుందో- ఏమవుతుందో అనే భయంగా వుంది.
బాబూ! దానికి పెళ్ళి చేయాలి. మంచి మనసున్న ఓ కుర్ర డాక్టరు, ఇదీ ఒకరంటే ఒకరు మనసుపడ్డారు. ముందు జీవితం ఒక పూలబాటలా ఓ ధర్ని కనిపిస్తుంది.
కానీ ఇది ఈ కత్తుల దారికి గేటు తెరుచుకుంటుంది. మీ జర్నలిస్టుల సంఘాలన్నీ దీనికి ఎడ్వైజ్ చేయండి. నేను చెప్తే వినేస్థితిలో లేదు" అని ఆయన కాసేపు మౌనం వహించి తిరిగి అన్నాడు.
"అంబరీషుడి భార్య నాకు శిష్యురాలు.
ఒకరకంగా చెప్పాలంటే అంబరీషుడి తండ్రి మంచి కంట్రాక్టరు. ఇక్కడ మంచీ అనే పదానికి ఒక ప్రత్యేకార్ధం వుంది. ఆ మంచిలో నిస్వార్ధముంది- దేశభక్తి వుంది. సేవాతత్వముంది.
అందులో ఎన్ని మంచిగుణాలు లేకపోతే తన దగ్గర పనిచేసిన ఒక గుమస్తా కుమార్తెను కోడలుగా స్వీకరిస్తాడు?
ఆ పిల్ల ఇప్పుడు తనకు ఒక విషయంలో కోటిరూపాయలు విరాళం యిస్తానంటుంది...." అంటూ తన స్టూడెంట్స్ ప్రాజెక్టును ఆ సరికొత్త జర్నలిస్టు ముందుంచాడు.
అంతా విన్న అరుణకుమార్-
"అయితే సర్! ఒక్క మీ ఇంటిలోనే అంబరీషుడిగారి విషయంలో రెండు దృక్పధాలున్నాయి.
మీ పరంగా ఒక మిత్రభావం!
మీ అమ్మాయిపరంగా ఒక శత్రుభావం!
ఇప్పుడు నాకు మీరు పడుతున్న ఆవేదన అర్ధమయింది.
మీ అసహాయతా అర్ధమయింది. మీ పావని వెనుక ఈ విషయంలో ఏ శక్తులు అండగా వున్నాయో తమకు తెలియదు. ఒక పాజిటివ్ లైన్ లో మీరు ఆ కుంటుంబంతో సంబంధాలు పెంచుకుంటుంటే- మరోదరిని నెగెటివ్ వేలో ఆ కుటుంబంతో మీ పాప ఒక పొలిటికల్ వార్ ఓపెన్ చేసింది. ఒక స్త్రీగా, ఒంటరిగా అలాంటి విషయంలో తల దూర్చటం ఎన్నటికీ సాధ్యం కాదు. అంతలోతుల్లోకి వెళ్ళటం పెద్ద పెద్ద చేతులు తిరిగిన జర్నలిస్టులకే సాధ్యపడదు.
అంబరీషుడు కనుకూలంగా వుండి, అతడ్ని నీడలా ఫాలో అవుతున్న ఒక వ్యక్తి ఎవరో మీ అమ్మాయికి బాగా పరిచయమై వుండాలి. ఈ కుంభకోణంలోని సమాచారం మొత్తం అతడు మాత్రంనే మీ పాప కందించగలడు.
ముందు మీరు ఆ విషయం తెలుసుకోండి.
వీలుగా వుంటే అతడ్ని కలుసుకుని మీ ఆవేదన అతదిముందు వ్యక్తం చేయండి. ఈ విషయంలో నావంతు సహకారాన్ని తమకు అందించమన్నా నాకెలాంటి అభ్యంతరం వుండదు" అన్నాడు.
తిరుమలరావుకు అతడు చెప్పిన విషయంలో ఏదో నిజం వుందనిపించింది. ఆ నిజం తనకు-ఎవరు చెప్తారు? కుమార్తె తను గీ పెట్టి చచ్చినా చెప్పదు. ఇక రెండో ప్రయత్నంగా ఆమె మనసుపడి చేసుకోవాలనుకుంటున్న ఆ డాక్టర్ని కలవాలి.
తిరుమలరావుకు ఆ సమయంలో ఒక తెగింపు వచ్చింది. ఇప్పటివరకూ తను పేద విద్యార్ధుల ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ తన ఇంటిలోన ముంచుకురాబోతున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు. ఇంటిని చక్కదిద్దుకోవాలి.
రేపు తను రుక్మిణి దగ్గరకు వెళతాడు.
ఈ పావని ఎవరు అంటే తనేం చెప్తాడు?
'మా అమ్మాయే! నీ భర్త కుంభకోణాన్ని బయటకు తీస్తుంది. నేనేమో నీ దగ్గరకు కోటిరూపాయలు విరాళంకోసం వచ్చాను. అంటే.....ఆమె మనసులో ఎలాంటి విచిత్రభావాలు కలుగుతాయో?
ఈ జర్నలిస్టు కుర్రవాడు తన ఇంటికి రావటం ఒకరకంగా మేలు జరిగింది. తను వెంటనే సాజిత్ ను కలవాలి.
మనసులో అనుకున్నాడు.
"సరేబాబూ! మంచి క్లూ ఇచ్చావు. ఎలాగయినా ఆ విషయాన్ని సేకరిస్తాను. రెండుమూడు రోజుల తర్వాత తిరిగి నాకు కనపడు. నాకు మగపిల్లలు లేరు. భావసారూప్య మున్న నీవూ, పావని నాకు పిల్లల్లాంటివారు పావని నీ సోదరి అనుకో.
నీ సొంత సోదరి ఇలాంటి విషయాల్లో తలదూర్చితే నీవు ఎలా ప్రతిస్పందిస్తావో అలా స్పందించమని పెద్దవాడినైనా నేను నిన్ను చేతులు ఎత్తి అర్ధిస్తున్నాను" అంటూ ఆయన అరుణకుమార్ కు చేతులెత్తి నమస్కారం చేశాడు.
"అయ్యయ్యో! అంతపని చేయకండి. ఈ విషయంలో నేను తమకు చేతనైనంతవరకు సహాయం చేస్తాను" అంటూ లేచి తిరిగి తిరుమలరావుకు నమస్కారం చేశాడు.
లోపలినుండి లలితమ్మ టీ కప్పుల్నీ, బిస్కెట్ల నీ ట్రేలో పెట్టుకువచ్చింది.
అరుణకుమార్ ని తీసుకోవల్సిందిగా అర్ధించారు.
అరుణకుమార్ వారి ఆధిత్యాన్ని సంతోషంగా స్వీకరించాడు.
పావని విషయం ఒక ఫజిల్ గా అతని బ్రెయిన్ లో తయారయింది.
ఇప్పుడీ సమాచారమంతా తను మంత్రిగారికి తెలియజేయాలి. తను మంత్రిగారి పర్సనల్ అసిస్టెంటు జనార్ధన్ అని వారికి తెలియదు. తెలీకుండా తను మెయిన్ టెయిన్ చేసుకోవాలి.
అరుణకుమార్ గా పరిచయం చేసుకున్న జనార్ధన్ అలా ఆలోచిస్తున్న క్షణాలకు....
అక్కడికి దూరంగా__
అదే సిటీలో....

                      *    *    *    *
అంబరీషుడి తల్లి జానకమ్మ కుర్చీలో కూర్చుని వుంది. ఆమె పట్టు అంచు తెల్లచీర కట్టింది. చేతులకు బంగారు గాజులున్నాయి. మెడలోసన్నని బంగారు గొలుసు వుంది. నొసటిమీద బొట్టులాంటిదేంలేదు. వయసు అరవయ్యో వడికి చేరింది. ముఖంలో ముడతలు వచ్చాయి.
ఆమె భర్త జయవర్ధన్.
అప్పట్లో పెద్ద కాంట్రాక్టరు. చనిపోయి ఐదు సంవత్సరాలవుతుంది. తను కట్టే కట్టడాల్లో ఇసుక, సిమెంటులతోపాటు-కాస్తంత దేశభక్తిని మిళితం చేసేవాడు. అందుకే అవి చాలాచోట్ల చెక్కుచెదరకుండా వున్నాయి. ఫలితంగా కోట్లు కూడబెట్టే అవకాశమున్నా లాభాల్ని లక్షలకే పరిమితం చేసుకున్నాడు.
జయవర్ధన్ ఫోటో గోడకు వ్రేలాడుతోంది. ఫోటో ముందు ఎలక్ట్రికల్ జ్యోతి బల్బు-నిత్యదీపారాధనాలా తన జ్వాలను బల్బులోపల క్రిందకూ పైకీ కదుపుతూ వెలుగుతోంది.
ఆ ఫోటోవంక చూస్తూ తన మనుమడిని ప్రక్కనే నిలబెట్టుకుని నర్స్ నవనీతమ్మ ఆమె ముందు నేలమీద కూర్చుంది.
క్రింద భవంతి నేలంతా ఖరీదయిన గ్రానైటురాయి పరుచబడింది చల్లగా, నవనీతమ్మకు హాయిగా వుంది.
జయవర్ధన్ గారి భార్యకూ నవనీతమ్మకూ ఒక స్నేహం వుంది. ఆ స్నేహానికి ఒక రహస్యం పునాదిగా వుంది. ఆ పునాదిలోని చీకటి ఎంత గాఢమయిందో - మరెంత భయంకరమయిందో నవనీతమ్మకే తెలుసు.
ఆరోజున నవనీతమ్మ జానకమ్మగారి దగ్గరకు తన మనుమడి చదువు గురించి చెప్పి, సహాయం అడగటానికి వచ్చింది.
నవనీతమ్మ అడిగే ఏ సహాయాన్నీ ఈ ముప్పై ఏళ్లుగా జానకమ్మ కాదనలేదు. వందడిగితే పాతికా పాతికడిగితే పదీపరకా నవనీతమ్మ చేతిలో పెట్టి పంపుతూనే వుంది. కేవలం ఆర్ధిక సహాయానికే కాక నవనీతమ్మ అప్పుడప్పుడు సాహార్ధికమైనా కాలక్షేపానిక్కూడా జానకమ్మ దగ్గరకు వస్తుంది.
వారిరువురి స్నేహ సంబంధం-సరిగా ముప్పయ్ ఏళ్ళక్రితం పదివేల రూపాయలతో ప్రారంభమయింది. ఆ పదివేల రూపాయల్ని వెచ్చించే నవనీతమ్మ ఆ సిటీలో అప్పట్లో ఇళ్ళ స్థలం కొంది. ఆ తరువాత కొద్దో- గొప్పో కూడబెట్టి రెండు పోర్షన్ల చిన్న డాబా కట్టుకుంది.
ఇప్పుడు నవనీతమ్మకు ఒక కొడుకు. ఆ కొడుకుకి మరో కొడుకు.
నవనీతమ్మ కొడుకు జనరల్ ఆసుపత్రిలో మేల్ నర్స్ గా పనిచేస్తున్నాడు. కోడలు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సు.
నవనీతమ్మ మనుమడు ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ కాలేజీలో డేస్కాలర్ గా చేరాడు.
రెసిడెన్షియల్ కాలీజీ చదువు ఖరీదయిందవ్వడంతో సంవత్సరానికి పదివేలు కట్టాల్సి రావటంతో.....నవనీతమ్మ మనుమడ్ని తీసుకొచ్చి, జానకమ్మగారికి నమస్కారం చేయించింది. వాడ్ని ఆమె ముందు నిలబెట్టి- తను మాత్రం కూర్చుని మజ్జిగకొచ్చి ముంతదాచే పద్ధతికాకుండా నేరుగా విషయము చెప్పి, సాయం ఎంత చేస్తారని అడిగింది.
జానకమ్మ ఓ ఐదువేల రూపాయిలిస్తానంది.
మిగతాది నీవు భరించుకోమంది.
నవనీతమ్మ ముఖంలో అనుకున్న తృప్తి అరవై కాండిల్ బల్బులా వెలిగింది.
ఆమె ఆశించిన సాయమూ అంతే.
ఆమె ఇస్తానందీ అంతే.
అవునుమరి....తమ సంబంధం ఈనాటిదా? సరిగ్గా ముప్పయ్ సంవత్సరాలక్రింద-దేవీ నర్సింగ్ హోంలో ప్రారంభమయింది.
నవనీతమ్మ మనసు ముప్పుయ్ సంవత్సరాలు వెనక్కిపోయింది.

                    *    *    *    *
దేవీ నర్సింగ్ హోమ్!

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra