Home » Mainanpati bhaskar » Mandu Vennela


  లిఫ్టు ఆపరేటర్ గా చేరి వారం రోజులు గడిచినా భానురేఖ ఒక్కసారి కూడా కనిపించలేదు రవిచంద్రకి. కారణం అతను సులభంగానే గ్రహించగలిగాడు. ఆరోజు గొడవ జరిగినప్పటి నుంచి భానురేఖని బయటకు పోనివ్వడం లేదన్నమాట ఆమె తల్లి సహజంగానే! కానీ తనుమాత్రం ఆరాటాన్ని ఆపుకోలేకపోతున్నాడు.
ఒక్కసారి...ఒక్కసారన్నా భానురేఖని చూసి ఆమె ఎలా ఉందో తెలుసుకోకపోతే నిద్రపట్టదు తనకు.
మధుకర్ కాలే తనతో మాటలు తగ్గించాడు. అందుకని అటువైపు నుంచి కూడా ఇన్ ఫర్మేషన్ ఏదీ రావడం లేదు.
భానురేఖ తప్పకుండా కనబడుతుంది - ఇప్పుడో, అప్పుడో అనుకుంటే పొంగిపోతుంది మనసు. భానురేఖ ఇంకెప్పటికీ కనబడదేమో అనుకుంటే కృంగిపోతుంది మనసు. లిఫ్టు పైకి, కిందకీ నిరంతరంగా వెళుతున్నట్లు ఆశ...నిరాశ...ఆశ...నిరాశ...
అతను ఉద్యోగంలో చేరిన ఎనిమిదో రోజున హోలీ అయింది. రంగుల పండుగ కాబట్టి అతను డ్యూటీకి రానఖ్కర్లేదని, శెలవు తీసుకోవచ్చనీ చెప్పాడు కాంప్లెక్సు సూపరింటెండెంటు. అయినా డ్యూటీకి వచ్చేశాడు రవిచంద్ర. తనకి శలవెందుకు? భానురేఖ ఉన్న నెలవులో తప్ప తనకి వేరేచోట శాంతి దొరకనప్పుడు తనకు విశ్రాంతి ఎందుకు?
కాంప్లెక్స్ కి రాగానే లౌడ్ స్పీకర్ లో పాటలు వినబడుతున్నాయి. కోలాహలంగా ఉంది అక్కడంతా.
"హమ్ ప్యార్ మే జల్ నే వాలోంకో చెయిన్ కహా ఆరామ్ కహా!"
లత గొంతు 'ప్రేమజ్యాలో దహించుకుపోతున్న మాకు శాంతి ఎక్కడ? విశ్రాంతి ఎక్కడ?'
గ్రౌండ్ ఫ్లోర్ లోనే చాలామంది గుంపులుగా చేరి పెద్దగా మాట్లాడుకుంటున్నారు. రంగులతో స్నానం చేసినట్లు ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ మధ్య విలాసిని కూడా వుంది. వెండిలా మెరుస్తున్న పెయింటు పూసి ఉంది ఆమె మొహానికి. పింకీ పరుగులు పెడుతూ అందరిమీదా పిచికారీతో రంగు స్ప్రే చేస్తోంది. కార్లు వచ్చి అపార్ట్ మెంట్స్ ముందు ఆగుతున్నాయి. వాటిల్లో వచ్చిన బంధువులూ, మిత్రులూ కాసేపు హోలీ ఆడి మిఠాయిలు తిని, తినిపించి, తలకో చోటికి వెళ్ళిపోతున్నారు.
"అరే! రవీ! ఆగు!" అని కేకపెడుతూ పరిగెత్తుకొచ్చి, అతని మీద రంగునీళ్ళ బక్కెట్ ఒంపేశాడు ఒకతను.
సహనంగా నవ్వి, మొహం తుడుచుకుని, లిఫ్టులోకి వెళ్ళిపోయాడు రవి. ఒక్కొక్క అంతస్తులో ఆగుతూ, అక్కడ జరుగుతున్న తమాషా చూస్తూ పైకి వెళుతున్నాడు.
నాలుగో అంతస్తుకి చేరుకుంటున్న ప్రతిసారీ అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి అందనట్లు అవుతుంది.
నాలుగో అంతస్తు వచ్చింది. లిఫ్టు ఆపి, తలుపు తీశాడు.
ఎదురుగా, పదహారో నెంబరు అపార్టుమెంటు ముందు నిలబడి ఉంది భానురేఖ!
దయతలచి దర్శనమిస్తున్న దేవతలా, నిర్మలంగా ఉన్నాయి ఆమె కళ్ళు. కోపం, తాపం, ఈర్ష్య, అసూయ లాంటి దానవుల మధ్యకి వచ్చేసి, దిక్కుతోచక తనమీద తనే జాలిపడుతున్నట్లు నిలబడి ఉంది భానురేఖ!
మైమరచిపోయి చూస్తూ ఉండిపోయాడు రవి.
అందమైన ఒక దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాలని ఫోటోగ్రాఫరు తాపత్రయపడుతుంటే అనుకోకుండా ఆంబోతు ఒకటి ఫ్రేములో కొచ్చేసినట్లు వచ్చేశాడు సుందరేశన్. నుదుటి మీద విభూతి బొట్టు ఉంది. భానురేఖను చూసి ఆగాడు అతను.   
శూన్యమైన దృక్కులతో, నిశ్చలంగా నిలబడి ఉంది భానురేఖ. ఊరికి దూరంగా దారిన పోతున్న వాళ్ళకి కూడా దురాలోచనలు రేకెత్తించేటంత అందంగా ఉంది తను.
"హోలీ ఆడటంలేదా భానురేఖా?" అన్నాడు సుందరేశన్, ఆమె వంపుల వైపు ఆకలిగా చూస్తూ.
"లేదు" అంది భానురేఖ అతి మెల్లిగా.
"పండుగరోజున సరదాగా ఉండొద్దా! కొంచెం రంగు పూసుకో!"
"వద్దు అంకుల్!"
సుందరేశన్ వినకుండా ఆమె చెంపలని గట్టిగా ఒత్తుతున్నట్లు పట్టుకుని రంగు పులిమాడు. ఆ తర్వాత అతని చేతులు మరింత కిందికి జారాయి.
అతనికి అందకుండా ఉండాలని అటూ ఇటూ జరుగుతూంది భానురేఖ.
తను కలుగజేసుకోవలసిన సమయం వచ్చిందని గ్రహించాడు రవిచంద్ర.
సుందరేశన్ దగ్గరగా వెళ్ళి, "వదిలెయ్యండి ఆ అమ్మాయిని!" అన్నాడు నెమ్మదిగా.
"లిఫ్ట్ ఆపరేటర్ వి! నువ్వు నాకు చెప్పేదేమిటి? వెళ్ళెళ్ళు. వెళ్ళి పనిచూసుకో!" అన్నాడు సుందరేశన్? అతను పాలల్లో గంజాయి కలిపి చేసిన భంగు తాగి ఉన్నాడని గ్రహించాడు రవిచంద్ర.
మత్తులో ఉన్న సుందరేశన్ ప్రవర్తన ఇంకొంచెం అసభ్యంగా మారింది. వెంటనే అతన్ని గట్టిగా వాటేసి కదలకుండా పట్టుకున్నాడు రవిచంద్ర. అదంతా ఏమీ అర్థం కానట్లు చూస్తూ నిలబడి పోయింది భానురేఖ.
మెట్లమీద అడుగుల చప్పుడు వినబడింది. విలాసినీ, పింకీ, రఘురాం పైకి వచ్చారు. వాళ్ళని చూడగానే సుందరేశన్ రవిచంద్ర పట్టు వదిలించుకుని, "హోలీ ఆడుతుంటే ఈ హౌలా అడ్డం పెడుతున్నాడు!" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
రఘురాం మొహం కోపంతో ఎర్రబడింది. రవిచంద్రకి థాంక్స్ చెప్పి, కూతురి భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్ళిపోయాడు.
"ఇలా అయితే ఇంక ఇక్కడ బతకడం కష్టమే!" అంది విలాసిని భర్తతో.
ఆలోచిస్తూనే తలపంకించాడు రఘురాం. అమ్మాయి అమాయకురాలు. ఆ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆమెతో ఆడుకోవాలని చూస్తున్నారు జయరాజ్ లాంటి కుర్రాళ్ళు దగ్గర నుంచి, సుందరేశన్ లాంటి పెద్దాళ్ళదాకా.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra