సాలోచనగా లెడ్జర్ లోకి చూస్తూండిపోయాడో క్షణం.


    అప్పుడెప్పుడో తన ఆడిటర్ అన్న మాట వెంటనే స్ఫురించింది.


    బేంకింగ్ రెగ్యులేషన్ ఏక్ట్ 1949 కేవలం లిమిటెడ్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కంపెనీస్ కే తప్ప పార్టనర్ షిప్ ఫర్మ్స్ కి వర్తించదు.


    అదే ధనుష్కోటికి మంచి ఊపునిచ్చిన విషయం.


    రెండు మూడు రోజుల్లో బోర్డెత్తేయాలి. ఈలోగా కనీస జాగ్రత్తల్ని పాటిస్తూ డబ్బుని దారి మళ్ళించాలి.


    పైకి వెళ్ళాలనుకున్నప్పుడు పక్కనున్న వాడి భుజాలపై కాళ్ళేసే రిస్కు తప్పదు మరి.


    అలా అనుకున్న మరుక్షణం ఫోన్ అందుకుని మరో రాష్ట్రంలోని ఓ స్నేహితుడితో ఎస్ టి డి లో మాట్లాడాడు.


    "మే ఐ కమిన్ సార్" ఫోన్ క్రెడిల్ చేస్తుండగా వినిపించిందో కంఠం.


    అక్కడ ఎదురుగా నిలబడి వున్నాడు ఇన్ స్పెక్టర్ రణధీర్.


    డబ్బవసరమైనప్పుడల్లా భార్యకో బామ్మకో కేన్సర్ అంటూ తనను ఆశ్రయించే రణధీర్ లాంటి కొందరు పోలీసాఫీసర్లంటే ధనుష్కోటికి చాలా ఇష్టం.


    "వెల్ కమ్" ఉత్సాహంగా ఆహ్వానించాడు.


                                                     *    *    *    *


    అతి స్వల్పకాలంలో ప్రముఖ షూటర్ గా 'ది రియల్ మార్క్స్ మన్' గా పేరు సంపాదించుకున్న శశాంకకి జరిగిన అనర్థం గురించి తెల్లవారేసరికి సిటీ అంతా ప్రాకిపోవడంతో ముందుగా పత్రికా విలేకర్లు కవరేజ్ కోసం అతడింటికి వచ్చారు.


    శశాంక ఎవర్నీ కలియడానికిష్టపడలేదు.


    కనీసం ఆయన్ని ఫోటో తీసి భార్య వియోగంతో అతనెంత కుమిలిపోతున్నది తమ స్వంత బాణీలో రాసుకుపోదామనుకున్న వారికి సైతం అతడు అవకాశం ఇవ్వకపోవడంతో రాజమణిని చుట్టేశారు.


    కూతురుపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకపోయినా గుండె నిబ్బరం కోల్పోని వ్యక్తిగా ఆయన బేలెన్స్ డ్ గానే జవాబులిచ్చారు తప్ప ధనుష్కోటి ప్రస్తావన తీసుకురాలేదు.


    చట్టం నిర్ణయించాల్సిన పరిధుల్లోకి అడుగుపెట్టి తాను కాంట్రవర్షియల్ గా మాటాడితే పరోక్షంగా శశాంకని రెచ్చగొట్టడమే అవుతుందనిపించి కేవలం శశాంక 'కెరియర్'కి సంబంధించిన ప్రశ్నలకి జవాబులిచ్చారు.


    రాజమణి సైతం గమనించలేదు విలేకర్లతోపాటు అంతవరకూ కూర్చున్న ఓ యువతీ చొరవ తీసుకుని లోపలికెళ్ళడాన్ని.


    "హల్లో"


    ఓ మారుమూల గదిలో అనంతానికి ఆవలి వేపులా నిలబడ్డ శశాంక నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.


    ముభావంగా తలతిప్పుకోబోతూ కూడా విస్మయంగా ఆగాడు.


    "అయామ్ సారీ" నిజాయితీగా ధ్వనించిన ఆర్ద్రత ఆమె గొంతులో "గుర్తున్నాననుకుంటాను" తలవంచుకునే అంది.


    ఎన్నాళ్ళయిది వినీలని చూసి. ఎప్పుడో ఆంధ్ర యూనివర్శిటీలో పరిచయమున్న వినీల ఇన్నేళ్ళ తర్వాత ఇలా కలుసుకుంటుందని శశాంక సైతం ఊహించని విషయమే...


    ముభావంగా లైబ్రరీలో కూర్చుంటే లాలిత్యంగా పలకరించే ఆమె కంఠాన్ని ఎంతమందిలో వున్నా గుర్తించగలడు కాని మాటాడాలంటే తన గొంతు పెగలడం లేదే..."


    కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది నెమ్మదిగా. "ఈ మధ్యనే తెలిసింది మీరిక్కడే వుంటున్నట్టు. ప్రిలిమినరీస్ లో మీరు పాల్గొన్నప్పుడు మీ ప్రత్యేకతను గురించి పేపర్లు రాస్తుంటే మిమ్మల్ని గుర్తుపట్టాను"


    ఆ కొద్దిపాటి సానుభూతికే అణువంతైనా కదిలిన శశాంక ఎరుపెక్కిన కళ్ళనుంచి ఓ నీటి బొట్టు చెంపలపైకి జారిపడింది.


    "నేషనల్ కాంపిటేషన్ లో టివి కవరేజ్ చూసి ఈ రోజు ఉదయాన్నే మిమ్మల్ని కలిసుకోవాలనుకున్నాను. కాని ఇలా కలుసుకుంటాననుకోలేదు" ఉద్వేగ్నతను అదుపు చేసుకుంటూ చెప్పింది. "ఇట్స్ హెల్... ఉదయమే తెలిసింది. ఐనో ఇట్స్ డిఫికల్ట్ టు..."


    "ఐ గాటిట్ ఐ హేటిట్ నౌ ఐ లాస్టిట్" చివరి పదం పలుకుతూ రుద్దమైపోయింది శశాంక గొంతు...


    ఇంకా ఏ భావాన్ని వ్యక్తీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్రేకంగా పిడికిలితో గోడని గుద్ది బాధగా తలకి మోచేతిని ఆనించి నిలబడిపోయాడు.


    సరిగ్గా అప్పుడు లోపలికి వచ్చాడు రాజమణి. వినీల నిశ్శబ్దంగా వెళ్లిపోయింది.


    "శశీ" ఇక నీటిపొర రాజమణి కళ్ళకి అడ్డంపడి శశాంక రూపాన్ని అస్పష్టంగా మార్చింది.


    ఎవరున్నారని ఒకరికొకరు తప్ప...


    "నేను కృపకి తండ్రినే... సి...హౌ బోల్ట్ అయామ్ ఇట్సేలైఫ్ ఇట్ హేపెన్స్..." ఆ రెండు వాక్యాలు పూర్తిచేయడానికి రాజమణి ఎంత శ్రమ పడింది శశాంక సైతం ఊహించి వుండడు... "బి బ్రేవ్"


    "మావయ్యా" వెనక్కి తిరిగిన శశాంకను చూస్తే ఎవరూ గుర్తించరు అతడో దేశం గర్వించదగ్గ గొప్ప షూటరని... "నేను ఒకనాడు" రొప్పుతున్నాడు "గురి తప్పి అమ్మని పోగొట్టుకున్నాను. ఇప్పుడు గురితప్పక కృపని పోగొట్టుకున్నాను."


    "హౌ సెడ్" ఎవరన్నారు నువ్వు గురితప్పకపోవడంతోనే కృపని కోల్పోయావని "యునో తప్పివుంటే నా తపస్సు భగ్నమైనందుకు బహుశా నన్ను పోగొట్టుకునేవాడివి"


    "ఏమి సాధించాను" నిస్సహాయతతో ఉక్రోషంగా అడిగాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra