Home » Kommuri venugopala rao » వ్యక్తిత్వం లేని మనిషి


    మధ్యాహ్నం విరామసమయంలో ఒక్కడూ కూర్చుని ఆలోచనా సముద్రంలో మునిగివుంటే సంజీవరావు వచ్చి పలకరించాడు "ఏమిటోయ్! నీలో నువ్వే పొంగిపోతున్నావు" అంటూ.
    మృత్యుంజయరావుకు గొప్ప ఆధారం లభించిందన్న ఊహ కలిగి, సంతోషంతో భుజాలెగురేశాడు. "సంజీవరావు, రాత్రి గొప్ప సంఘటన జరిగిందోయ్" అన్నాడు గర్వంగా చూస్తూ.
    సంజీవరావు 'నీ జీవితంలోకూడా గొప్పసంఘటనలుంటాయా?' అన్నట్లు అతన్ని విచిత్రంగా చూస్తూ "ఏమిటోయ్ మహానుభావా అది?" అన్నాడు.
    ఆ చూపు అతడ్ని కాల్చినా, పట్టించుకోనట్లు నిర్లక్ష్యంచేస్తూ "ఓ అందమైన యువతి, విద్యావతి రాత్రి నా గదికి వచ్చింది" అన్నాడు గర్వం నటిస్తూ.
    సంజీవరావు ముఖంలో యీసారి ఆశ్చర్యం ద్యోతకమైంది. "చెప్పు చెప్పు" అన్నాడు ఉత్సాహంగా.
    మృత్యుంజయరావు తనకు తెలిసిన తెలుగుభాషను గుర్తుచేసుకున్నాడు. అందమైన పదాలను ఏరుకున్నాడు. పూసగ్రుచ్చినట్లు అంతా ఏకరువు పెట్టాడు.
    అంతా విని సంజీవరావు ముఖం చిట్లించాడు. "చీ, నువ్వింత దద్దమ్మ వనుకోలేదోయ్" అన్నాడు.
    "ఏం?" అన్నాడు మృత్యుంజయరావు బిక్కమొహంవేసి.
    "అలాంటి అవకాశం దొరికితే ఎవరన్నా విడిచిపెడతారా? ఎందుకూ ఈ యవ్వనమూ? కాల్చనా? నేనైతే ఆ స్థితిలో ఏం చేసేవాడినో థెలుసునాఆ?"
    "ఏం చేసేవాడివి?" అనడిగాడు ఉత్కంఠగా.
    "ఆమెను నా స్వంతం చేసుకునేవాడిని."
    అసలతనికి కరువుతీరా కోద్దామనే అనిపించింది. వర్షం... గాలి, చలి... ఆమె సిగలోని మల్లెపూల సువాసన... లేతచిగుళ్ళు కనబరుస్తూ తనని చూసి చిరునవ్వు... తనలో ఉత్పన్నమైన వాంఛ... బరువుగా విడుస్తూన్న ఊపిరి... రక్తంలో ప్రవహించే వేడి... కళ్ళలోని కాంక్ష... ఒకరికొకరు అభిముఖంగా నడవటం... ఆమె మృదువైన భుజాలచుట్టూ తనచేతులు... అదిరే అధరాల మీద తన పెదాలు... శరీరం ఏకం కావటం... యిట్లా ఇష్టమొచ్చినట్లు కోద్దామనుకున్నాడు.  
    కాని అంతా విని అతను "కొయ్" అంటాడేమోనని భయమేసింది. అట్లా అంటే తనకీ బాగుండదు.
    ఇప్పుడు నాలిక కొరుక్కున్నాడు. మంచి ఛాన్సు పోగొట్టుకున్నాననుకున్నాడు. సరే అయిపోయిందేదో అయిపోయింది. ఈసారి జాగ్రత్తపడదామనుకున్నాడు. సాయంత్రం సోమయాజుల్ని వంటరిగా పట్టుకున్నాడు. "ఏమిటోయ్ అదోలా వున్నావు" అని ఆయనచే అనిపించేటట్లు ఫోజులు పెట్టాడు. "అబ్బే, ఏం లేదండీ" అన్నాడు. "ఫర్వాలేదు చెప్పవోయ్. నా ముందు దాపరికం దేనికి?" అనిపించుకున్నాడు. 'చెప్పక తప్పదా?' అన్నట్లు ముఖంపెట్టి యిహ ప్రారంభించాడు. "చలిగాలి... వర్షం... మల్లెపూలు... తెల్లని శరీరం..."
    అంతాచెప్పి సోమయాజులుగారి ముఖంవంక ఆసక్తిగా చూశాడు. ఏమంటాడు? మెచ్చుకుంటాడా? భుజంతట్టి 'భేష్' అంటాడా? మొనగాడవోయ్' అభినందిస్తాడా? 'ఔరా, ఎంతవాడివయ్యావూ?' అని పైకెత్తేస్తాడా?
    కాని సోమయాజులు ముఖం చిట్లించాడు. "నువ్విలాంటి వెధవపని చేస్తావనుకోలేదోయ్" అన్నాడు భారంగా.
    మృత్యుంజయరావుకి పడగొట్టినంత పనయింది. "అదేం?" అన్నాడు హీనస్వరంతో పెదలతడి ఆరిపోతూండగా.
    "ఈపని యింకోరూ యింకోరూ చేశారంటే నేను బాధపడేవాడ్ని కాదు. సంజీవరావు వున్నాడనుకో, అతను చేస్తే ఆశ్చర్యపడను. కాని నువ్వు బుద్ధిమంతుడివనుకున్నాను. పైకొస్తావనుకున్నాను. అయ్యయ్యో! ఇదేమిటోయ్! ఇలా చేశావు? నా అంచనాలన్నీ తలక్రిందులు చేశావు. మనిషికి శీలం ప్రథానం. శీలం లేనివాడు మనిషేకాదు. ఇప్పుడా అమ్మాయిని పాడుచేశావా? కర్మంకాలి ఆ పిల్లకు నెలతప్పితే ఏమవుతుంది? నువ్వు చేసినపని చాలా తప్పోయ్. ఆ అమ్మాయి ఎక్కడుందో వెదుకు. పెళ్ళిచేసుకో, పుట్టినందుకు ఓ మంచిపని చెయ్యి."
    ఇదేమిటి? సోమయాజులు యింత విపరీతంగా మాట్లాడుతున్నాడు? శుక్రాచార్యుడిలా యిన్నినీతులు బోధిస్తున్నాడేమిటి?? 'బుద్ధి గడ్డితిని ఈయనతో కోశాను' నిజం చెబుదామనిపించింది. నమ్మడు. యింకా పోరు పెడతాడు. నీరసంగా అక్కడ్నుంచి తప్పించుకుని బయటపడ్డాడు.
                      *    *    *
    ఆ సంఘటన జరిగిన రెండురోజులకు శేఖరం వచ్చాడు మృత్యుంజయరావు కోసం "సినిమాకు తీసుకెళ్తావా?" అంటూ.
    అసలు ఆవేళ కొంచెం తలనొప్పిగా వుంది. సినిమాకి వెళ్ళే మూడ్ లో లేడు అతను. అయినా స్నేహితుడి మనసు నొప్పించటం ఇష్టంలేక "అరె! సరిగ్గా నేనూ అదే అనుకుంటున్నానోయ్. పద పద" అని బయల్దేరాడు.
    శేఖరం తన కోరికలను అడిగి తీర్చుకోవటంలో మొహమాటపడడు. అట్లా అడిగి తీర్చుకోవటానికి తనకు హక్కున్నట్లు ప్రవర్తిస్తాడు. పైగా తనకు యితరులు చేసిన ఉపకారాలు అతనికెప్పుడూ గుర్తుండవు. అలాంటి స్మృతుల్ని ఎప్పుడూ నెమరువేసుకోడు.

    శేఖరం ప్రక్కన నడవటానికి మామూలువాళ్ళకే మహా యాతనగా వుంటుంది. ఇహ మృత్యుంజయరావు సంగతి చెప్పాలా?
    అతనెప్పుడూ తన ఉనికిని, తన వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని ప్రక్కవాళ్లకి గుర్తుచేస్తూ వుంటాడు. తనకన్నీ తెలుసునని అతని విశ్వాసం. పరిస్థితుల ప్రాబల్యంకొద్దీ కాలం కలిసిరాక యీ దిక్కుమాలిన ఊళ్ళో, దిక్కుమాలిన మనుషులతో కాలక్షేపం చేయవలసి వస్తున్నదిగాని, లేకపోతే తాను ఏ ఢిల్లీ, బొంబాయిల్లోనో, లేనిపక్షంలో విదేశాలలోనో ఉన్నతవర్గాలమధ్య సంచరించ వలసిన దివ్యపురుషుడివని అతని దృఢ నమ్మకం. మాట్లాడేటప్పుడు ప్రదర్శించే భంగిమల్లోనూ, చేతులు కదిలించటంలోనూ, కళ్ళు అటూ యిటూ త్రిప్పటం లోనూ, కంఠస్వరం అవసరాన్నిబట్టి ఎక్కించి తగ్గించటంలోనూ బహు జాగ్రత్త తీసుకుంటాడు. ఏ అంశం ప్రసంగంలో వచ్చినా, దాన్నిగురించి తనకు అంతకు ముందునుంచే చెరగని నిర్ణయాలున్నట్లు ఉపన్యాసాలు దంచుతూ వుంటాడు. ప్రక్కవాళ్ళంతా అతని దృష్టిలో మూర్ఖులు, వాజమ్మలు.
    మృత్యుంజయరావు శ్రద్ధగా ఆఫీసు విషయాలు చెబుతున్నాడు. శేఖరం మౌనంగా నడుస్తున్నాడు. అతను నడుస్తున్నంతసేపూ అతని కళ్ళు ఎదురయ్యే మనుషుల్నీ, రిక్షాలో పోయే అమ్మాయిల్నీ, దాబాలమీద నిలబడివున్న ఆడపిల్లల్నీ అన్వేషిస్తూ వుంటాయి. పెదాలూ, నాళికా ప్రక్కలకూ, బయటకూ కదుల్తూ వుంటాయి.
    శేఖరం చీటికీ మాటికీ తలవెనక్కి త్రిప్పి ఒక డాబావంక చూస్తున్నాడు. అతని పెదాలు హసిస్తున్నాయి.
    ఉన్నట్లుండి "నువ్వు యిందాకటినుంచీ చెబుతూన్నదంతా నేను వినటం లేదోయ్" అన్నాడతను చిరునవ్వుతో.
    మృత్యుంజయరావు చిన్నబుచ్చుకుని ఆ భావాల్ని బయటికి కనిపించనీయకుండా "మరి ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. స్నేహితుడి వాలకాన్ని అతను కనిపెట్టకపోలేదు.
    "ఆ పచ్చడాబామీద నిలబడివుంది చూడు, ఆ అమ్మాయితో ఆడుకుంటున్నాను. మేమిద్దరం ఆడుకుంటున్నాం."
    "ఏమిటోయ్ ఆ ఆట?" అని అడగలేదు మృత్యుంజయరావు.
    అయినా శేఖరం విశదీకరించడు. "మేమిద్దరం వెక్కిరించుకున్నాం, చిరునవ్వులు ఎక్స్ ఛేంజ్ చేసుకున్నాం, ఇంకా చాలా సంజ్ఞలు చేసుకున్నాం."
    మృత్యుంజయరావు తను ఖూనీ అయినంత యాతనపడ్డాడు. అయినా బయటకు ఏమీ లెక్కచేయనట్లు "అహఁ! అలాగా?" అన్నాడు.
    ఇద్దరూ సినిమాకి వెళ్ళి కూర్చున్నారు. సినిమా జరుగుతున్నంతసేపూ హీరోని వ్యాఖ్యానిస్తూనే వున్నాడు శేఖరం.
    వాళ్ళకు ముందువరుసలో ఎవరో స్త్రీ వంటరిగా కూర్చునివుంది. ఆమెకు అటూ ఇటూ రెండుమూడు కుర్చీలవరకూ ఎవరూలేరు. ఆమె నిడుపైన జడ కుర్చీ వెనక్కి నాగుబాములా వేళ్ళాడుతోంది. జడలో తురుముకున్న మల్లెపూలూ, అవిగాక దుస్తులకు పులుముకున్న సెంటువాసనా కలసి చిత్రమైన పరిమళంగా వ్యాపించి, ఆమెవంక అందరిదృష్టీ మరల్చేటట్లు చేస్తున్నాయి. మల్లెపూలకూ, స్త్రీ సౌందర్యానికీ ఎంతదగ్గర సంబంధముందో ఆ క్షణాన తెలిసివచ్చింది మృత్యుంజయరావుకు. ఆమె పమిటచెంగు కుర్చీవెనగ్గా జారి శేఖరం మోకాళ్ళకు తగులుతోంది. శేఖరం స్నేహితుడితో మాట్లాడుతూనే ఆమెజడని ముట్టుకుంటున్నాడు, పమిటచెంగు మృదువుగా లాగుతున్నాడు. ముందుకు వొంగి పొరపాటున తాకినట్లు ఆమెభుజాలను తాకుతున్నాడు. అతని ధైర్యానికి మృత్యుంజయరావుకి ఆశ్చర్యం వేసింది. 'ఆహా! నువ్వోయ్ మనిషివంటే' అని మనసులో అభినందించాడు.
    ఇంటర్వెల్ లో దీపాలు వెలగగానే ఆమె తలత్రిప్పి వెనక్కి చూసింది. ఆమె కళ్ళు చిలిపిగా వెలుగుతున్నాయి. ఆమె పెదవులు కొంటెగా నవ్వుతున్నాయి. ఆమె అందంగా వుంది, కాని ఆమె ఉదాత్తంగా లేదు.
    శేఖరంకూడా జవాబుగా మందహాసం చేశాడు.
    దీపాలు ఆరిపోయాక వాళ్ల కార్యక్రమం మళ్ళీ మొదలయింది. మృత్యుంజయరావుకు వళ్ళంతా తేళ్ళూ, జెర్రెలూ పాకినట్లుగా వుంది. తన డబ్బుతో శేఖరం సినిమాకి వచ్చాడు. తను పొందని ఆనందం పొందుతున్నాడు. తనకు అన్యాయం జరుగుతోంది. తన ఉనికిని చీమకూడా లెక్కచేయటంలేదు.
    సినిమా అయిపోయేదాకా ముళ్ళమీద గడిపినట్లు గడిపాడు. వాళ్ళవిషయం ఏమీ పట్టించుకోనట్లు కనిపించటానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు. మధ్యలో యథాలాపంగా శేఖరంవంక చూసేసరికి, అందుకోసమే కూర్చున్నట్లుగా అతనో వాగ్భాణం విసిరాడు. "నీదార్న నువ్వు సినిమా చూసుకోవోయ్... మా గొడవ నీకెందుకు."
    మృత్యుంజయరావుకు చచ్చినంత పనయింది. గోరుచుట్టుమీద రోకటి పోటులాంటి విసురు.
    అవమానాన్ని దిగమ్రింగుకుని కూర్చున్నాడు మాట్లాడకుండా.
    సినిమా అయిపోయింది. లైట్లు యింకా వేసీ వెయ్యకముందే ఆమె విద్యుల్లతలా లేచి మెరుపులా బయటకు వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ శేఖరంవైపోసారి చూసి ఓ చిరునవ్వు విసిరేసింది.
    కాని శేఖరం కదల్లేదు. అందరితోపాటు లేచి నిలబడి వరుసలో మెల్లగా నడుస్తున్నాడు.
    "ఆమె నాకు ఆహ్వానం పంపింది, చూశావా?" అన్నాడు నడుస్తూనే మృత్యుంజయరావుకు మాత్రమే వినిపించేటట్లు మెల్లిగా. 
    "మరి అంగీకరించలేదేం ఆహ్వానాన్ని?" అనడిగాడు ఆశ్చర్యపడటంకూడా పూర్తిగా చేతకాని మృత్యుంజయరావు సగం ఆశ్చర్యంగా.
    "ఆమె ఆడపిల్ల కావడం సంభవించింది కాబట్టి కాసేపు సరదాగా ఆడుకున్నానుగాని ప్రాస్టిట్యూట్స్ వెంటబడటం నా తత్వానికి విరుద్ధం."
    "ఆమె వ్యభిచారిణా?" అని యీసారి మిగతా సగం ఆశ్చర్యాన్నీ కూడా జోడించాడు.
    "మరి యిందాకటినుంచీ నువ్వు కనిపెట్టిందేమిటోయ్ మహానుభావా? ఆమె కట్టు-బొట్టు, వేషం ఆ మాత్రం అర్ధం చేసుకోలేదా? ఆమె పేరు మంజులత. ఈ ఊళ్ళో ఏ రిక్షావాడిని అడిగినా తీసుకుపోతాడు. ఒక పాతిక రూపాయలు మనవి కాదనుకుంటే ఒకరాత్రి అంతా ఆమె నీదవుతుంది."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra