Home » Yandamuri veerendranath » ధ్యేయం


    "ఇద్దరమేగా"

    "ఇద్దరమే"

    ఆమె కొంచెంసేపు మౌనంగా వుండి, "ప్రీతమ్, నాకు ఫ్రాంక్ నెస్ అంటే చాలా  ఇష్టం. అలాంటి స్నేహితుడికోసమే ఇంతకాలం ఎదురుచుస్తున్నాను. నీ మనసులో ఏముందో డైరెక్టుగా చెప్పవా ప్లీజ్" అంది.

    "ఒక్కమాటలో చెప్పాలంటే ఐ లవ్ యు నిఖిత" అన్నాడు.

    "థాంక్స్ ప్రీతమ్. ఇప్పుడు నేను చెప్పవలసింది చెపుతాను విను. ఆఫీసుల్లో వర్కింగ్ గర్ల్స్ తోనూ, కాలేజీలో స్నేహితురాళ్ళతోనూ నీలాంటివాళ్ళు ఇలాగే  ప్రారంభిస్తారు. ద్వంద్వార్థాలతో ముందు మాట్లాడతారు. ఆ ఆడవాళ్ళు "ఎందుకిలా అన్నారు?" అని అడగగానే, ప్లేటు మార్చేసి, "నేనేమీ అనలేదే. నువ్వు మనసులో ఏదో వుద్దేశ్యం వుంచుకొని అలా ఊహించుకుంటున్నావు" అని తప్పు ఎదుటి వారిమీదకి తోసేస్తారు. ఇలాంటి సంభాషణ కొన్ని నెలలపాటు జరుగుతూ వుంటుంది. అవతలి వారి మనసులో భావం అర్థమై, కాదని చెప్పలేక, బయట పడలేక ఆడవాళ్ళు మనసులో కుమిలిపోతారు. ఇలాంటివన్నీ నాకు ఇష్టంవుండవు. మొదటిరోజు బిర్లామందిర్, మొదటినెల ఇంగ్లీష్ పిక్చర్, ఆర్నెల్లయ్యాక షమీర్  పేట- చివరికి నీ మనసులో మాట....... అంతేగా! అంత టైమ్ నిరర్థకంగా  నీతో గడపటం యిష్టంలేక మొదటిరోజే నీ మనసులో మాట బయటపెట్టించాను...." అని ఒక్కక్షణం ఆగింది.

    ప్రీతమ్ ఆశ్చర్యంగా బొమ్మలా వింటున్నాడు. ఆమె మళ్ళీ "నీలో నాతో మాట్లాడాలని, నాతో స్నేహం చెయ్యాలని ఆరాటం నాకు కన్పిస్తోంది. ఒక స్త్రీకి మగాడి అవసరం రెండుసార్లు కలుగుతుంది. ఒకటి తోడుకోసం, ఆ తోడుద్వారా అతనిచ్చే చిన్న గుర్తుకోసం. ఆ రెండింటి అవసరం నాకిప్పుడే లేదు. ఎందుకంటే  నాకు జీవితంమీద ఇంకా పూర్తీ అవగాహన రాలేదు. దాన్ని గురించి ఆలోచించేటంతటి వయసు లేదు. కనుక..... ఒక ఫ్రెండ్ గా  మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు కూడా  అదే విధంగా నన్ను గౌరవించగల్గితే నాకేమీ అభ్యంతరంలేదు. అలా కాని పక్షంలో నీతో ఎటువంటి స్నేహమూ నాకిష్టంలేదు.....బై" అంటూ అక్కణ్నుంచిజాగింగ్ కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయింది. 

    ప్రీతమ్ ఆ షాక్ నుంచి తేరుకోవటానికి అయిదు నిముషాలు పట్టింది.

    ఆ తరువాత మళ్ళీ ఆమెతో మాట్లాడే సాహసం చెయ్యలేదు.

                          *    *    *

    ఇది జరిగిన కొన్నాళ్ళకి సునీత అతడికి కనిపించింది.

    ఆనాటి సంఘటన తర్వాత ఆమెను చూడటం ఇదే మొదటిసారి. అప్పటికంటే నాజూగ్గా తయారైంది. ఒక అమ్మాయిని వెంటాడుతూ సూపర్ బజార్లోకి వెళ్ళాడతడు. అక్కడ సునీత ఏవో వస్తువులు తీసుకుంటోంది. ఆమెను చూడగానే ఆనాటి అసంపూర్ణ అనుభవం ఫ్రెష్ గా మనసులో మెదిలింది. "హల్లో ఆంటీ బావున్నావా?" దగ్గరగా వెళ్ళి పలకరించాడు.

    సునీత ఉలిక్కిపడి అతడివైపు చూసింది. కొద్దిక్షణాలపాటు ఆమె కళ్ళల్లో భయం కదలాడింది. అంతలోనే తేరుకుంది.

    "ఊఁ బాగానే వున్నాను. నువ్వు బావున్నావా?" అంది పొడిగా.

    "నేనూ బాగానే వున్నాలే. ఎక్కడుంటున్నారిప్పుడు?" అడిగాడు. ఆమె కొద్దిగా తడబడి తాముండే వీధి పేరు మాత్రం చెప్పింది. అతన్ని చూసిన సంతోషం ఆమెలో ఏ కోశానా కనిపించడంలేదు. పైగా అతడిని వదిలించుకోవాలన్నట్లుగా సామాన్లు తీసుకుని సీరియస్గా  అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. ప్రీతమ్ కి కోపం వచ్చింది. ఆమె తనను అవమానపరిచినట్లు ఫీలయ్యాడు. ఆనాటి అనుభవాన్ని పూర్తి చేసుకోవాలన్న కోరిక మనసుని పీడిస్తోంది. కానీ మరోవైపు భయం......

    వెళ్ళి స్నేహితుడ్ని సలహా అడిగాడు.

    "వెళ్ళి ప్రయత్నం చెయ్యరా. తప్పులేదు. ఆడాళ్ళు ఆ మాత్రం బెట్టు చేస్తారు. పైగా భయపడుతుందేమో" అని ప్రోత్సహించాడు స్నేహితుడు ఆడవాళ్ళ సైకాలజీ కలిసినట్టు. అతడికి ఎగ్జయిటింగ్ గా వుంది. ప్రీతమ్ కి మొదట అవకాశం దొరికితే, తరువాత తనకూ ఛాన్సు వుండొచ్చుకదా.

    "ఏమోరా! అంకుల్ వుంటాడేమోనని నాకు భయంగా వుంది" అన్నాడు ప్రీతమ్. ఆ స్నేహితుడు వదల్లేదు. అప్పటికప్పుడు వెళ్ళి, ఆమె కరెక్టు ఇంటి నెంబరు వెతికి పట్టుకోవడమే కాదు, సునీత భర్త ఆ రోజే క్యాంప్ కెళ్ళాడని కూడా తెలుసుకుని మరీ వచ్చాడు.

    .....రాత్రి పదన్నరకి ప్రీతమ్ ని సునీత ఇంటికి కాస్త దూరంలో వదిలి 'బెస్టాఫ్ లక్' చెప్పి వెళ్ళాడు. సెకండ్ షో వదిలే సమయానికి పక్కనే వున్న  సినిమా  ధియేటర్ దగ్గర తిరిగి ఇద్దరూ కలుసుకునే ఏర్పాటు చేసుకున్నారు.

    ప్రీతమ్ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మెల్లిగా సునీత ఇంటి  దగ్గరకు వచ్చాడు. గేటు తీసే వుంది. ముందు తలుపు వేసివుంది. కిటికీలోంచి హల్లో జీరోవాట్  బల్బ్ వెలుగుతున్నట్లు కనిపిస్తోంది.

    అతడు బెల్ కొట్టలేదు. సునీతతోపాటు ఎవరైనా వున్నారేమో తెలియదు.

    పక్కనుంచి ఇంటి వెనకవైపుకి నడిచాడు. బెడ్ రూం కిటికీ వేసివుంది. కానీ  సందుల్లోంచి లైటు వెలుగుతున్నట్లు కనిపిస్తోంది. మాటలేమీ వినిపించడంలేదు.

    అంటే ఒంటరిగానే  వుందన్నమాట. కాలింగ్ బెల్  కొట్టడం కోసం ప్రీతమ్ ఇంటి ముందువైపుకి రాబోతూ ఆగాడు. అంతలో బయట కారేదో ఆగిన చప్పుడు ఎవరింటికో తెలియలేదు. పట్టుబడతానన్న ఆనాటి భయం వదలకపోవడం చీకట్లో నక్కి కూర్చున్నాడు.

    గేట్ లోంచి ఎవరో లోపలికి వచ్చారు. తలుపు తీస్తున్న చప్పుడు, "సునీత ఆంటీ బయటనుంచి ఇప్పుడే వస్తుందా' అనుకుంటూ ప్రీతమ్ మెల్లిగా లేచి  పక్క కిటికీలోంచి హాల్లోకి చూశాడు. సునీత బెడ్ రూంలో నుంచి బయటకు వచ్చింది. నైటీ వేసుకొని వుంది. ఆ గుడ్డి వెలుతుర్లోనూ ఆమె వంటిసొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయటినించి వచ్చిన వ్యక్తి తలుపులు వేసి గొళ్ళెం పెట్టాడు. ఆమె అప్పటికే అతడి దగ్గరగా వెళ్ళింది. క్షణంలో రెండు శరీరాలు దగ్గిరయ్యాయి. అతడు సునీతని గాఢంగా......కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు.

    "అబ్బ, మీ అయన ఈసారి నెలరోజులపాటు క్యాంప్ కెళ్ళకుండా నన్ను బాగా ఏడిపించేశాడు. ఎంత బాధగా అనిపించేదో తెలుసా?" అన్నాడు.

    ప్రీతమ్ ఆ స్వరం విని ఉలిక్కిపడ్డాడు. ఆ గుడ్డి వెలుతురుకి అలవాటు పడ్డ అతని కళ్ళు ఆ వ్యక్తిని గుర్తుపట్టాయి.

    అది అతడి తం......డ్రి!


                          *    *    *

    సెకండ్ షో చూసివచ్చిన స్నేహితుడు కంగారుపడ్డాడు. ప్రీతమ్ మొహం వేయి లంఖణాలు చేసినవాడిలా వుంది.

    "ఏం జరిగింది? వాళ్ళాయన వున్నాడా? నిన్ను చూశాడా?" అడిగాడు గాభరాగా.

    "లేదు.....ఇంకెవరో వున్నారు. బయటనించే వచ్చేశాను. ముందు ఏదయినా బార్ కి పోదాం పద. నాకు ఫుల్ గా తాగాలని వుంది" అన్నాడు ప్రీతమ్.

    "అదొద్దులే. నీకో మంచి మందిస్తాను పద" దగ్గరలో వున్న కిళ్ళీ కొట్టుకి తీసుకెళ్ళాడు. పదకొండు దాటుతున్నా కిళ్ళీకొట్టు ఒక రకంగా చెప్పాలంటే తెరిచే వుంది. అంటే- ముందు తలుపులు వేసి వున్నాయి. వెనుక చిన్న 'ఖాళీ' వుంది.

    "మస్తావ్, స్పెషల్ సిగరెట్లు రెండివ్వు" అన్నాడు స్నేహితుడు. కిళ్ళీ కొట్టతను చిన్నగా నవ్వి సిగరెట్ పెట్టె అందించాడు.

    "ఇంటికి వెళ్ళి ఇవి కాల్చి పడుకో. మంచి నిద్ర పడుతుంది" అన్నాడు స్నేహితుడు. ప్రీతమ్ కి ఏమీ అర్థంకాలేదు. అయినా అతడు ప్రశ్నించే మూడ్ లో లేడు. ఇంటికొచ్చి తలుపులు వేసుకుని రహస్యంగా సిగరెట్ అంటించాడు.

    రెండు దమ్ములు లాగేవరకు ఏమీ తెలీలేదు. తర్వాత శరీరం తేలిపోతున్నట్లనిపించింది. ఆ తర్వాత అంతా హాయి!

                                            6


    కాలింగ్ బెల్ మోగింది. ప్రీతమ్ కి నిద్ర మెలకువ వచ్చింది. వళ్ళంతా నొప్పులు. తండ్రి యిఅమ్కా రాలేదు. మళ్ళీ బెల్ మ్రోగింది.

    "ఇంత పొద్దుటే ఎవరొచ్చారు?" అనుకుంటూ విసుగ్గా వెళ్ళి తలుపుతీసింది వరూధిని. ఎదురుగా రజనీకాంత్ నిలబడి వున్నాడు. ఆమె గుండె ఒక్కసారిగా లయ తప్పింది. అతన్ని అలా అకస్మాత్తుగా చూడగానే ఎందుకో తెలీకుండా దుఃఖం వచ్చింది.

    "ఇన్నేళ్ళకు గుర్తొచ్చానా? నన్ను వదిలి ఎలా వుండగలిగావు" అని కోపంగా అడిగింది.

    అంతలోనే అతడి పక్కన అమ్మాయి కనిపించింది. "రా రాజీ. ఇదే మా రుక్మిణక్కవాళ్ళ ఇల్లు" ఆమె చెయ్యి పట్టుకుని అపురూపంగా లోపలకు తీసుకెళ్ళాడు. వరూధినివైపు చూసి పలకరించనైనా లేదు. కనీసం నవ్వనుకూడా లేదు.

    "ఎవరదీ" వంటింట్లోంచి బయటకు వచ్చింది రుక్మిణి.

    "నేనక్కా రజనీని. నా భార్య  రాజేశ్వరి. రాజీ అంటాం" గర్వంగా పరిచయం చేశాడు.

    "నీ పెళ్ళికి రాలేకపోయాం. అసలు వీలుపడలేదు. నువ్వే భార్యను తీసుకొని వచ్చావు. సంతోషం." నవ్వుతూ ఆహ్వానించింది రుక్మిణి. వరూధినికి దుఃఖం ముంచుకొచ్చింది. గదిలోకి వెళ్ళిపోయింది. 'బహుశా తల్లిదండ్రులు బలవంతంగా చేసుంటారు. భార్య ముందు బయటపడలేక అలా ప్రవర్తిస్తున్నాడు కాబోలు. ఎప్పుడో వీలు చూసుకుని వంటరిగా కలిసి మాట్లాడతాడేమో' అని సముదాయించుకుంది.

    అయితే రెండు రోజులయినా అతడామెని పలకరించనేలేదు. భార్య కొంగు పట్టుకునే తిరిగాడు. సోఫాలో కూర్చున్నా చేతిలో చెయ్యివేసి కూర్చుంటాడు. సరసాలు, హాస్యోక్తులు......ఇక లోకం అంతా భార్యేనన్నట్లు ప్రవర్తించాడు. సినిమాలకి, షికార్లకి వెంటపెట్టుకుని వెళ్ళిపోయాడు. "వస్తావా?" అనైనా తనని అడగలేదు.

    వరూధిని వళ్ళు మండిపోతోంది. అతడికోసం ఎన్నో ఏళ్ళుగా పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటే అతడింతగా మారిపోయి వస్తాడా? ఇంతడికి బాగా బుద్ది చెప్పాలి. వరూధిని వయసు పదహారేళ్ళు. ఇంటర్ చదువుతోంది. సినిమాల  ప్రభావంతో  పాటు మిల్స్ అండ్ బూన్ నవలల ప్రభావం ఆమెమీద చాలా వుంది.

    ఎప్పుడూ ఏదో  ఊహల్లో తేలుతూ వుంటుంది. విడిపోయిన ప్రేమికులు ఎన్నో  ఏళ్ళ తర్వాత కలవడం, అప్పటికీ వాళ్ళ ప్రేమ సుస్థిరంగా  నిలబడటం ఆ నవలల్లో జరుగుతుంది. వాళ్ళ మనసులో ప్రేయసి\ప్రియుడి రూపం చెదిరిపోదు. ఒకవేళ వాళ్ళు మరో ప్రేమలో పడ్డా చివరకు నిజం తెలుసుకొని చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు.

    కానీ ఇక్కడ యదార్థంలో లా జరగకపోవటంతో ఆమెకి ఉక్రోషం ముంచుకొచ్చింది.

    ఎవరిమీదో తెలీని ఉక్రోషం!

    ఎలా చూపెట్టాల్లో తెలీని ఉక్రోషం!!

    అనాలోచిత చర్య తాలూకు పరిణామం తెలియనివ్వని ఉక్రోషం!

    ఆమె అదే మానసిక స్థితిలో కాలేజీకి బయల్దేరింది.

    దారిలో క్లాస్ మేట్ సుభాష్ కలిశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra