Home » Balabhadrapatruni ramani » మొగుడే రెండో ప్రియుడు

    "అల్లిబిల్లి వూహల పందిరి అల్లుకుని, వాటికి పూసే కోర్కెల్నీ, అనురాగ ఫలాలనీ ఆస్వాదిస్తూ....ఓహ్! ఎంత తియ్యగా వుందీ కొత్త కాపురం! అంతా కొత్త, సరికొత్త! చంద్రుడూ, సూర్యుడూ, భూమీ, ఆకాశంలాంటి అతి పాతవి కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. జీవితంలో నవచైతన్యం, తొలకరికి పులకరించిన పుడమిలా-ఆనంద లహరిలో - అనురాగ జలధిలో-కలసి తడిసి, కరిగి, విడివడి, వడివడిగా తిరిగి జతపడి..."

    అన్ని పనులూ యధాతథంగానే! స్నానం, భోజనం, పనులు చేసుకోవడం, మాట్లాడుకోవడం, చదువుకోవడం, నిద్రపోవడం...అన్నీ ముందటిలాగే, కానీ ఒంటరిగా కాదు!

    కట్టలు తెగిన ఆవేశానికి సిగ్గు ఆనకట్టగా-కాదు వారధిగా వేసి, తీరం చేరుతూ, తిరిగి మునుగుతూ ....ఉక్కిరిబిక్కిరై, తిరిగి వూపిరి పీలుస్తూ...చుట్టూ వున్న లోకం, మనుష్యులూ మాయం అవ్వాలి! నీవూ నేను ఒకరికి ఒకరి, ఆడమ్, ఈవ్ లలా, ఇద్దరం దగ్గరై మన నిట్టూర్పుల వాదంలోంచి జనించే సరికొత్త వేదం సృష్టిస్తూ....

    "ట్రింగ్....గ్..." ఫోను మోగుతోంది.

    అమృత ఆత్రంగా అందుకుంది.

    "అమృతా ఐ లవ్ యూ!" అవతల నుండి వచ్చే ఒక్కొక్క పలుకూ, మరుని శరాఘాతమై ఆమెని తాకింది.

    "హర్షా అలాగే వుండు! పది నిమిషాలు! ఒకవేళ ఇంకా ఎక్కువైనా సరే ఫోను పట్టుకొని అలాగే వుండు ప్లీజ్" అభ్యర్ధించింది.

    "అమృతా ఏం చేస్తున్నావ్? అమ్రూ, అమ్రూ"....హర్ష అడుగుతూనే వున్నాడు ఫోనులో. అటునుంచి సమాధానం లేదు. అతను అలాగే ఫోన్ పట్టుకొని, ఎటూ అర్ధంకాక కూర్చుండిపోయాడు.
   
                                            *    *    *
    ఆఫీస్ ప్రాంగణంలో టి.వి.ఎస్. ఆపి, అమృత వడివడిగా ఆఫీసులోకి వచ్చేస్తుంటే, అందరి కళ్ళలోనూ అదోరకం నవ్వు! ఆమె ఎవరివైపూ చూడలేదు. తిన్నగా డోర్ తెరచుకుని అతని "రూం"లోకి వచ్చేసింది.

    ఇంకా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చునే వున్న హర్ష "అమృతా!" అంటూ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేశాడు.

    అమృత గదిలోకి అడుగుపెట్టటం, కాలితో డోర్ "క్లోజ్" చెయ్యడం ఒకేసారి జరిగాయి. ఆమె వేగంగా అతన్ని సమీపించి అతని చేతిలోంచి ఫోను తీసేసి, అతని పెదవులు అందుకుంది.

    రెండు నిముషాల అనంతరం "హర్షా! నీ గొంతు వింటే నన్ను నేను 'కంట్రోల్' చేసుకోలేను. ఫోన్ తీగెల ద్వారా 'రెసిప్రొకేట్. చేయలేక ఇలా వచ్చేశాను" అంది తమకంగా.

    "అమ్రూ ఐ లవ్ యూ!" ప్రేమగా దగ్గిరికి తీసుకుంటూ అన్నాడు, హర్షా 'ప్రీ...మ...గా.

    ముద్దుపెట్టుకోవడం కామానికి సంకేతం కాదు! ప్రేమనించి జనించే సందేశం! పరమ దురదృష్టవంతులు ఎవరంటే, తమకంగా ఒక్కసారి కూడా ముద్దుపెట్టుకోలేనివాళ్ళు! అధరం, అధరం ముడిపడితే ముద్దు! హృదయం, హృదయం జతపడితే ప్రేమ! రెండవది లేని మొదటిది, మొదటిది లేని రెండవదీ...నిరర్ధకం. శూన్యం నుంచి ఒక విశ్వం, విశ్వం నుంచి ఒక సృష్టి, సృష్టి నుంచి ఒక ప్రేమ పుడితే-ఆ ప్రేమలోంచి మనిద్దరం పుట్టామట.

    "టక్....టక్..." డోర్ ణి మునివేళ్ళతో తట్టిన చప్పుడైంది.

    హర్ష, అమృత ఈ లోకంలోకి వచ్చి అయిష్టంగానే దూరం జరిగారు.

    "కమిన్" అన్నాడు హర్ష.

    అతని పర్సనల్ అసిస్టెంట్ కీర్తి లోపలికి వస్తూ అమృతని చూసి నాలుక కరచుకొని "సారీ!" అంది అపాలజటిక్ గా.

    అమృత ఫరవాలేదన్నట్లు చూసింది.

    కీర్తి హర్షవైపు తిరిగి "అర్జంటు మెస్సేజ్ సార్!" అంటూ ఓ కవరు అందించింది. చాలా గంభీరంగా వుండాలని ప్రయత్నిస్తున్నా, బుగ్గలు ఎర్రబడ్డ అమృతని చూడాలనే కుతూహలం ఆపుకోలేకపోతోంది ఆమె.

    హర్ష వైపు తిరిగి అమృత "వస్తా! ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చాను" అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగానూ నిష్క్రమిస్తూ, కీర్తికి కళ్ళతోటే వీడ్కోలు చెప్పింది.

    ఆమె వెళ్ళగానే, హర్ష రివాల్వింగ్ చైర్ లో కాస్త పక్కకి తిరిగి అక్కడ కీర్తి వుందన్న విషయం కూడా పట్టించుకోకుండా కర్టెన్ కొద్దిగా పక్కకి జరిపి, గేటులోంచి వెళ్తున్న అమృతనే చూడసాగాడు.

    అతని కళ్ళల్లో కదలాడుతున్న ఆరాధానని చూస్తే ఏ ఆడపిల్ల అయినా ఈర్ష్యపడకుండా వుండదేమో!

    కిటికీలోంచి కీర్తికి కింద వెళ్తూన్న అమృత కనిపిస్తోంది. అమృతది అందమా? లేక దర్జానా?అనుకుంది. యువకుల్ని ఆమె కళ్ళల్లోని స్వచ్ఛత, వడివయసు వారిని ఆమె చూపులోని హుందాతనం, పెద్దవాళ్ళని ఆమె మాటలోని మన్ననా కట్టిపడేస్తాయి.

    అమృత టి.వి.ఎస్. స్టార్ట్ చేసి, హర్షకి చెయ్యి వూపింది.

    హర్ష కూడా చేయి వూపాడు. ఆమె వెళ్ళిపోగానే ఎవరో సగం ప్రాణాలు పీల్చేసిన భావన!

    కర్టెన్ యధాప్రకారం జరిపేస్తూ, అసంకల్పితంగా గడియారం వైపు చూసుకున్నాడు.

    ప్రస్తుతం ఆ గడియారం ముళ్ళు అతని శత్రువులు సమయం గడిచేకొద్ది అవి అతనికి మంచి మిత్రులవుతాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra