Home » Kommuri venugopala rao » Aalochana Oka Yagnam


గతంలోకి...అదో వ్యాధిలా...
    
    'ఇది వరకు' అనేపదం చాలామందికి పెద్ద దుర్వ్యసనమైపోయింది.
    
    మనమిప్పుడు చాలా ముఖ్యమైన అంశంగురించి చర్చించబోతున్నాం. మీ జీవితాలను పీల్చి పిప్పి చేస్తోన్న అంశాన్ని.
    
    కాలమెప్పుడూ ముందుకు కదులుతూ వుంటుంది. ఇప్పుడు మీరనుభవిస్తున్న ఈ క్షణం, మరోక్షణం గడిచేసరికి గతంలో కలిసిపోతూ వుంటుంది.
    
    ఆ గతాన్ని మనమేం చేయాలి? మననెంతో గొప్పవారిని చేసిన ఆ కాలాన్ని కృతజ్ఞతతో మరిచిపోవాలా? లేక అనుక్షణం మురిసిపోతూ స్మరించుకుంటూ ఉండాలా? లేక ఆ గతం పీడకలలాంటిదైతే దాన్ని అసహ్యించుకుంటూ వుండాలా?
    
    అదికాదు...
    
    అసలు గతానికీ, ఇప్పటికీ గల సంబంధ బాంధవ్యాలు (లింక్) ఏమిటో అర్ధం చేసుకోగలిగితే, దాని రూపురేఖలూ, పర్యవసానాల గురించి తర్వాత చర్చిద్దాం.
    
    కొంతమంది గతంలో కొంతగానో, గొప్పగానో ఆర్ధిక వైభవాన్ని అనుభవించి వుంటారు. పరిస్థితుల్ని బట్టి ప్రస్తుతమున్న విపరీతమైన ధరల పెరుగుదల వల్లో, కుటుంబసభ్యులు పెరిగి, అవసరాలు శక్తికి మించిపోవటం వల్లో, ఇప్పుడున్న పోటీకి తట్టుకోలేక సంపాదన క్షీణించిపోవటంవల్లో పూర్వంలా సౌకర్యంగా జీవించలేకపోతున్నారు.
    
    కాని ఇంట్లోని కొందరు ఈ సత్యాన్ని జీర్ణించుకునేందుకు ప్రయత్నించరు. కనీసం ఆలోచించటానికి ప్రయత్నించరు. ఇంకా చెప్పాలంటే కొంచెం విశాలహృదయంతో ఆలోచించడానికి ప్రయత్నించరు.
    
    డబ్బు ఖర్చుపెట్టే సందర్భాలొస్తాయి. ఉదాహరణకు..... పెళ్ళికో, ఇంకేదన్నా శుభకార్యానికో ఊరు వెళ్ళాలి.
    
    ఇంట్లో ఫ్రిజ్, టీవీ... ఇలాంటి పెద్ద వస్తువులకు రిపేరొచ్చింది.
    
    ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళకు దర్జాగా మర్యాదలు చేసి బట్టలు పెట్టాలి.
    
    ఇంట్లో.... పిల్లల బర్త్ డే.... ఇలాంటివి గ్రాండ్ గా చెయ్యాలి.
    
    చేతిలో డబ్బుండదు డబ్బు చాలదు.
    
    "ఇదివరకు పరిస్థితి ఇలా వుండేదా? ఆయన రెండుచేతులతో సంపాదించి పోస్తుండేవారు."
    
    "మా ఇంట్లో రోజుకు పదిమంది తింటుండేవారు."
    
    "నా చెయ్యి చాలా భారీ చెయ్యి, ఇలా గీసి గీసి ఇవ్వటం నాకు చేతకాదు."
    
    "అప్పుడు పని చేసిందే సుబ్బలక్ష్మి, అది చేసినట్లు వీళ్ళేం చేస్తారు? దాన్నడగండి చెపుతుంది నా గురించి."
    
    "ఊరు బయలుదేరితే నా దగ్గర నాలుగువేలన్నా  లేకపోతే కాలు బయట పెట్టేదాన్ని కాదు. ఈ ముష్టి నాలుగైదు వందలతో ఎలా కదలను?"
    
    "అప్పుడు నా ఒంటినిండా బంగారం వుండేది. ఆ చేతికిన్ని గాజులూ, ఈ చేతికిన్ని గాజులూ..."
    
    "ఆయనకు రెండుచేతుల్లో సంపాదన..."
    
    ఈ మాటల్లో ఇప్పుడు లేనందుకు సానుభూతికన్నా, తమనిన్ని కష్టాలపాలు చేస్తున్నాడన్న ఈసడింపు వుంది.
    
    అప్పుడెందుకు సంపాదన వున్నదో, ఇప్పుడెందుకు పడిపోయిందో అవగాహన లేదు.
    
    అప్పుడు దర్జాగా బ్రతికాం. ఇప్పుడు బ్రతకలేకపోతున్నాం అనే బాధ.
    
    అప్పుడు రెండుచేతులా ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు ఖర్చు పెట్టలేకపోతున్నాం అనే ఉక్రోషం.
    
    కాని... గ్రహించవలసిన మహత్తరసత్యమొకటి వుంది. కారణం ఏదైనా కానీ ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ ఒకలా వుంది, ఏ కొద్దిమందికో ఇది సాధ్యం. చాలామంది జీవితాల్లో మధ్యలో విరుచుకుపడిన మార్పుల వల్ల ఇలాంటి ఒడిదుడుకులు తప్పవు. అలాంటి ఆర్ధికమాంద్యంలో పడిపోయినప్పుడు సంపాదించే వ్యక్తితోపాటు ఇతర కుటుంబసభ్యులూ సంయమనం పాటించాలి, సహకరించాలి సరిపెట్టుకోవటం నేర్చుకోవాలి.
    
    ఒకప్పుడు కార్లలో తిరిగివుండవచ్చు. ఇప్పుడు స్కూటర్లమీద తిరుగు స్కూటర్లమీద తిరిగే వయసు కాకపోతే రిక్షాలలో తిరుగు అదీ భారమనిపిస్తే సిటీబస్సుల్లో తిరుగు.
    
    "ఎవరైనా ఏమన్నా అనుకుంటారు" అన్న ఆలోచన చాలా పిరికితనంతో కూడినది. మనం గొప్పగా వున్నప్పుడు వాళ్ళు "ఆహా!... ఆహా!" అంటే మనకు ఒరిగిందేమీ లేదు. ఆ 'ఆహాహా'ల వెనక ఎంతో వ్యంగ్యం, అసూయా వున్నవన్న విషయం గుర్తించు. అలాగే మనం సాదాసీదా స్థితిలోకి దిగజారినప్పుడు ఎవరో హేళనగా చేసిన వ్యాఖ్యానాలు మనం లెక్కపెట్టవలసిన అవసరంలేదనీ తెలుసుకో. నీ విశిష్ట వ్యక్తిత్వం అచంచలంగా వున్నప్పుడు, ఇలాంటి హేళనలు నిన్నేమీ చేయలేవు. నీకంటే అనేకరంగాల్లో ఎంతో ఉన్నతస్థితిలో వున్నవాళ్ళు నీకంటే ముందు ఇలాంటి స్థితినే అనుభవించారనీ, వారిలో చాలామంది చాలా హుందాగా ప్రవర్తించారనీ అర్ధంచేసుకో.
    
    గొప్ప గొప్ప సినిమాతారలు తమ చివరి రోజుల్లో పూర్వవైభవాన్ని కోల్పోయారు. మహా మహా దేశనాయకులు ఎన్నో అపనిందలను ఎదుర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దేశప్రధానులు జైళ్ళపాలయ్యారు. అయినా... అలాంటి పరిస్థితులలోకూడా విశిష్ట వ్యక్తిత్వంతో, గుండెనిబ్బరంతో ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళ విలువలను పోగొట్టు కోలేదు. కొంతమందికి పెరిగింది కూడా. తడబడిపోయి ఇంకా అపశ్రుతులలోకి దొర్లిపోయినవాళ్ళు చరిత్రలో కొట్టుకుపోయారు.
    
    కాబట్టి గతవైభవం ఒకవేళ (ఒకవేళ అని ఎందుకంటున్నానంటే కొంతమంది గతంలో ఏమీ లేకపోయినా అది చాలా వైభవోపేతంగా వున్నట్లు సృష్టించుకుంటూ వుంటారు) వుండి వుంటే దాన్నిగురించి పదేపదే గుర్తుచేసుకోవటం అనారోగ్యకరం.
    
    గతాన్ని ఎలా తేలిగ్గా తీసుకోవాలో.....కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు.
    
    నాకు తెలిసిన ఒక పెద్ద బిజినెస్ మేగ్నెట్ వున్నాడు. సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో వుండేవాడు. నాలుగైదు కార్లు, ఇతర ఊళ్ళకు పోవాలంటే ఫ్లైట్లు ఎప్పుడూ స్టార్ హోటల్స్ లో పార్టీలు, చాలా కోలాహలంగా వుండేవాడు. ఆయన భార్య కూడా సోఫిస్టికేటెడ్ సొసైటీలో తిరుగుతూ గొప్పస్థాయిలో వుండేది.
    
    క్రమంగా బిజినెస్ దెబ్బతింది. ఒకటొక్కటీ హరించుకుపోవటం మొదలుపెట్టాయి. అప్పులు పెరిగిపోయాయి. చివరకు బిజినెస్ మూతపడి, ఆ ఆస్తులూ, ఇళ్ళూ, కార్లూ అన్నీ వెళ్ళిపోయాయి. కాపురానికి అద్దెఇంట్లోకి మారారు.
    
    కాని ఆ భార్యాభర్తల ముఖాల్లో చిరునవ్వుగానీ, వ్యక్తిత్వం గానీ, దృఢత్వంగానీ కొంచెంకూడా మాసిపోలేదు.
    
    ఒకప్పుడు కార్లలో తిరిగేవారు. ఇప్పుడు సిటీబస్సులలో తిరుగుతున్నారు. ఒకప్పుడు స్టార్ హోటల్స్ లో లంచ్ లూ, డిన్నర్లూ ఆరగించేవారు. ఇప్పుడు సాదాసీదాగా హోటల్స్ కు వెళ్ళి టిఫిన్లు తీసుకుంటున్నారు. సాయంత్రాలు పిల్లలతో రోడ్డుమీద హాయిగా నడుస్తూ ఎన్నోసార్లు కనిపించారు.
    
    ఈ దృశ్యాలు నన్నెంతో కదిలించేవి. ఎలాంటి కదలిక? సానుభూతీ, బాధా పక్కన పెట్టండి. జీవితంలో మహత్తర సత్యాలను స్ఫురింపచేసే 'కదలిక'.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra