Home » Dr c. ananda ramam » Cheekati Kadupuna Kanthi

   

    " ఎవరు ? వారిజక్కేనా/ ఎంత మారిపోయవక్కా? ఈరింగులెంత బాగున్నాయో! మువలు ఇంకా బాగున్నాయ్. ఈ గాజులు అన్నీ బంగారువేనా? ఎన్ని కాసులు? ఆ గొలుసు ఎక్కడ చేయించావ్? ఈ చీర ఎంత క్కొన్నావ్? కంచి పట్టా? ధర్మవరమా!"
    "లోపలకు రానియ్యి లతా! అన్నీ చెప్తాను అమ్మ లేదా?"
    "లేకేం? ఎక్కడికి కదుల్తుంది? మంచం మీద పడుకుని సేవలు చేయించుకోటమేగా తన పని..? అందరికీ రోగాలే! తిండికి మాత్రం అందరూ తయారు, మధ్యన వండి వార్చలేక ప్రాణాలు పోతున్నాయి."
    "ఆపవే కాసేపు నీ గోల! వారిజకు కాస్త మంచి నీళ్ళుతే అన్నట్లు పక్కింటి కెళ్ళి వారిజ కుచోటానికి కుర్చీ అడిగి పట్టుకురా. మనింట్లోవన్నీ విరిగిపోయిన కుర్చీలు " అన్నాడు రవి.
    "ఇప్పుడే తెస్తా....." అంటూ బయలుదేరుతున్న లతను బలవంతాన అపుచేసింది వారిజ.
    "నేను మర్యాదల కోసం రాలేదు. మిమ్మల్నందరినీ చూసి పోదామని వచ్చాను. అమ్మ దగ్గర కెళ్తను . అంతలో తూలుకుంటూ దగ్గుకుంటూ పార్వతే వచ్చింది అక్కడికి. వారిజను చూడగానే" వారిజా!" అంటూ చేతులు జాపింది. ఆ చేతుల్లో వాలిపోయింది వారిజ.
    ఇద్దరికీ కన్నీళ్లు కట్టలు తెచ్చుకున్నాయి.
    "ఛీ....ఛీ....ఎప్పుడు ఏడుపులు" విసుకున్నాడు రవి.
    "అక్కా నీ చీర పాడవుతుంది. " కట కట లాడింది.
    పార్వతి కళ్ళు తుడుచుకుని వారిజకు ఎడంగా నిలబడింది.
    "నువ్వు వెంటనే ఇక్కడ్నించి వెళ్ళి పో వారిజా...." అంది పార్వతి . వారిజ ముఖం పాలిపోయింది. దీనంగా తల్లి వంక చూసింది.
    ఆ చూపులకు గుండెలు బద్దలవుతున్నాకర్కశంగా అంది పార్వతి. నువ్వు చచ్చిపోయావని అందరికీ చెప్పెశానమ్మా? ఇప్పుడు నువు బ్రతికున్నట్లు తెలిస్తే లతకు పెళ్లి కాదు. వెంటనే వెళ్ళు. రవికిదెం నచ్చలేదు.
    "అదేమిటమ్మా. వారిజంటే అందరికీ ఎంత గౌరవం. దీన్నీ చూడటానికి ఎంతమంది విరగబడతారు? దాని మూలంగా లతకు పెళ్లి కాదంటావేమిటి?"
    "అవును, విరగబడతారు జనం. గౌరవంతో కాదు, లోకువతో , తిరస్కారంతో కూడిన ఆకర్షణతో, విరగాబడటంలోనే హేళన కూడా వుంది. ఆ సినిమా తారలకున్న కోటి రెట్లు అందంగా ఉన్న కులస్త్రీని యెవరైనా కన్నెత్తి చూడటానికి సాహసిస్తారా? అటు వారిజను చూడటానికి విరగబడతారు. ఇటు లతను చేసుకోవటానికి ఎవరూ రారు.
    "అవెం మాటలమ్మా! సినిమా తారలకే లక్షణంగా పెళ్ళిళ్ళవుతుంటే సినిమా తార చెల్లెలయినందుకు లతకు పెళ్ళి కాదంటావేమిటి?"
    "సంఘాన్ని డబ్బు పరిపాలిస్తుంది. వేలకి వేలు సంపాదించగలిగే సినిమా తారలకు సులభంగానే పెళ్లవుతుంది కాని దమ్మిడి కట్నం ఇవ్వలేని వారిజ చెల్లెలు లతకు మాత్రం పెళ్ళి కాదు."
    వారిజ చటుక్కున లేచింది.
    "మీలో మీరు వాదించుకొకండమ్మా! నే వెళ్తాను. నాన్న కు నమస్కారాలని చెప్పు - ఇంకా అలాగే ఉన్నారా.
    'ఆ! నువు తప్ప ఎవరూ మారలేదు....." వారిజ ముందుకు కదిలింది.
    'అక్కయ్యా! నీ రింగులూ నాకిచ్చి వెళ్ళు" దీనంగా అడిగింది లత. వారిజ తన చెవులనున్న రింగులు, గాజులూ , మెళ్ళో గొలుసు కూడా తీసి లతకిచ్చి బయటకు కదిలింది. అటు పోతున్న టాక్సీని పిలిచి అందులో కూర్చుంది. పరుగునా ఆమెను సమీపించాడు రవి.
    "వారిజా! ఇంటి ఖర్చులకి బొత్తిగా డబ్బు లేదు కొద్దిగా ....."
    వారిజ ఒక వంద రూపాయలు తీసి రవి చేతిలో పెట్టి, టాక్సీతో పోనియ్యమని చెప్పి, రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది.
    తరువాత మళ్ళీ వారం రోజులకే వచ్చాడు రవి. ఆమె దగ్గరికి. "ఏం !" అంది ఆమె పొడిగా. "ఏముందీ> మన ఇంట్లో నీకు తెలిసిందేగా....నీకు ఇబ్బంది లేకపోతే ....." నవాడు రవి జాలిగా!
    వారిజ నిర్లక్ష్యంగా రెండు వందలు అతని మీద గిరివాటు వేసి ' అమ్మకి తెలీకుండా వచ్చావా!" అంది.
    "భలే! అమ్మే పంపించింది నన్ను" అన్నాడు రవి. ఆ రెండు వందలూ జేబులో పెటుకుంటూ.
    మనస్సు భగ్గుమంది వారిజకు. కళ్ళలో నుంచి నిప్పులు రాలాయి. చెయ్యి జాపుతూ "ఆ రెండువందలూ ఇలా తే! నేను మీకేమి ఇయ్యను. ఎందుకీయ్యాలి?" అంది. రవి జేబు రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.
    "వారిజా! నీకు తెలీదు వారిజా! నాన్న ఇంకా లాగే తాగుతున్నాడు. లత ఏడుస్తోన్న లతకి నువిచ్చిన గొలుసు అమ్మేశాడు. ఇల్లు గడవటం లేదు. ప్లీజ్....."
    అసహ్యంతో ముఖం తిప్పుకుంది ఆమె.
    "త్వరగా పో!' గబగబా గుమ్మం దాటబోయాడు.
    "మళ్ళీ మళ్ళీ రాకు" తలాడించాడు రవి.
    గేటు దాటబోతుండగా వెనక్కి పిలిచింది పనిమనిషి. డబ్బున్న జేబు గట్టిగా పట్టుకుని బెదురుగా అడుగు వేస్తూ వచ్చాడు రవి. "రావద్దన్నానని మానేశావు! మరీ అవసరమయినప్పుడు రా!' ఎటో చూస్తూ అంది వారిజ.
    వెలిగిపోయింది రవి ముఖం.....
    "వస్తాను వారిజా! తప్పకుండా వస్తాను నువింతగా చెప్పాలా! నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదూ నాకు వీలయినప్పుడల్లా......"
    "వెళ్ళు' కటువుగా అడ్డుపడింది. తెల్లబోయి వారిజ వంక చూసి గబగబ వెళ్ళిపోయాడు రవి. అప్పటి నుండి తనకు వీలయినప్పుడల్లా త=రెండు రోజులకో సారి వస్తూనే ఉన్నాడు రవి.
    రవిని చూస్తోన్న కొద్దీ తన మీద తనకు, రవి మీద, మనుష్యుల మీద, లోకం ,ఈడ విరక్తి ప్రబలిపోతుంది ఆమెలో - వీలయినంత వరకూ , తనకు తోచినంత రవికి ఇస్తూనే ఉంది ---- అది రవి సవ్యంగా ఇంట్లో ఇస్తున్నాడా , లేక మధ్యలోనే తనే కులాసాగా ఖర్చు పెట్టుకుంటూన్నాడా అని ఆలోచన రాకపోలేదు . కాని ఆ విషయం గురించి చర్చించడాని క్కూడా చిరాకేసింది వారిజకి . ఇటివల వారిజలో ఉత్సాహం నశించి పోవటం, వెనుకటిలా కాకుండా నిర్లిప్తంగా ఏదో మొక్కు తీర్చుకుంటున్నట్లు దగ్గిరికి రావటం గమనించాడు రాధాకృష్ణ.   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra