శశి -సంఘమంటే ఎంతమంది వుండాలేం? మన యిద్దరం, ఇతరులతో మనకేం పని అనికుంటే ఒక సంఘ మవుతాం. అప్పుడు మన పెళ్ళి మనం వప్పకుంటే సరి.
రామ- అట్లా ఎట్లా అవుతుంది? సంఘం ఈశ్వరస్వరూపం.
శశి -మంచి స్వరూపమే. ముందు సంఘమెవ్వరు మన కనుజ్ఞ యివ్వడానికి? ఎప్పుడు దాని అధికారానికి లోబడతామన్నాము మనం?సంఘం చేడిపోతుందనే మిషమీద తాము వదలడానికి దైర్యంలేని సమస్త నిచమైన కార్యాలూ, సమర్ధించుకునే వాళ్ళమల్లే మాటలాడుతున్నావే!బానిసలయిన భార్యలనూ, భార్యలను మృగాలకన్ననీచంగా చూసే భర్తలనూ, గౌరవిస్తుందికదా సంఘం? మంత్రాలు చదివి శాశ్వతంగా కట్టివేశామని, ఆ బంధనంనించి తప్పించుకొన్న వాళ్ళని నీచపు పేర్లతో పిలుస్తుంది సంఘం. తనకు భయపడి తనవలెనే పిరికితనంలో లేనివాళ్ళని వేలివేస్తుంది సంఘం. అట్లాంటి సంఘాన్ని చూస్తే నీ కంత గౌరవమేమిటి?మన ప్రేమను అర్ధము చేసికోనగాలదా సంఘం? స్వేచ్చ యనిన యులికిపడు సంఘము ఆదేశించాలా మన వివాహాన్ని? అంతమాత్రము స్వతంత్రముగా ఆలోచింపలేవూ?
రామ - ఈ వాదన యింకేందుకు? శాశ్వతమైన సంబంధముంటేనేకాని వివాహము కాదు. ఇంక మాట్లాడి ప్రయోజన మెముంది?
శశి - అట్లాంటి సంబంధం నా స్వభావమే కాదు. నా నైజమే స్వేచ్చ. నా స్వేచ్చ నిచ్చివేసి నేనెందుకు బతకడం? ఎంత ప్రియమైన వానికి కూడా నేను దినినియ్యలేను. దాన్నడక్కు నా దగ్గరనుంచి. నాకు సందేహంగా వుంది. నిజం చెప్పు ఎప్పుడో నీకు చిన్నప్పుడు ప్రయాణం యిచ్చాననేనా నా మీద ప్రేమ. లేకపోతే అంతకన్నావుందా?నన్ను మొట్ట మొదటి మాటు ఇప్పుడు చూశావనుకో, నా మీద యీ ప్రేమ వచ్చి నన్ను పెళ్ళి చేసుకోమని అడిగేవాడవేనా? నిజం చెప్పు.
రామ - ఈ ప్రేమ వచ్చేదే కాని, ఎట్లాగో వకలాగు అణుచుకోనే వాణ్ని.కాని పెళ్ళి మాత్రం చేసుకోమని అడిగేవాణ్ని కాదు.
శశి- మఱి ఇప్పడేందుకు అడుగుతున్నావు? చిన్నప్పటి వాగ్ధత్తాల వల్ల నేను ని దాన్ని, నీవు నా వాడవు అయినామని నిజంగా నామీద ప్రేమ లేకపోయినా ఆ వాగ్దాత్తాన్ని పట్టి నన్ను పెళ్ళి చేసుకోవాలనుకునే వాడవే?నేనేం చేసినా నీదాన్నే అనుకుంటావు?
రామ- అవును. నువ్వు నా దానివే.నివేట్లా అనుకున్నా నే నెప్పడూ నీవాన్నే అనుకుంటాను. వవాహం చేత నిన్ను నా దాన్ని చేసుకు కాపాడతాను.
శశి- అమ్మో! చిన్నప్పుడు తెలిసి తెలవక నీ దాన్నవుతానని చేసిన ప్రయాణం ఆజన్మాంతం నన్నిట్లా పట్టుకుందే, యిప్పుడు మళ్ళి వివాహం వాగ్దాత్తం, నీ దాన్నయినాననే వాగ్ధత్తం చేస్తే యింక యీ జన్మమే కాదు కదా జన్మ జన్మలూ వదులుతావా?
అని నవ్వుట మొదలు పెట్టును.
రామ - నన్ను చూస్తే అంత అయిష్టమంటే నిన్నిట్లా బాధించే వాణ్ని కాదే?
శశి - రామా! నన్నర్ధం చేసుకోవడంలేదు.నువ్వు, నేను కూడా యేదోవాగ్ధత్తాన్ని పట్టుకు వేల్లాడుతూన్నా ననుకుంటున్నావు.ఈ నిముషంలో నిన్ను చూస్తే ఏమన్నా యిచ్చేటంత ప్రేమ లేకపోతే, డేబ్త్బేవేల వాగ్ధత్తాలు లక్ష్యంచేసే దాన్ననుకున్నావా?అన్ని ప్రమాణాలకన్నఅధికమ్తెన ప్రేమ నన్నిక్కడి కిడ్వకపోతే యీ అర్దరాత్రి నీతో వుంటాననుకున్నావా యిక్కడ?ఎన్నాళ్ళయినా నా సంగతి నీ కర్ధముకాదు?ఇంక నీ వన్నట్టు ప్రయోజన మేముంది?నేను వెడతాను.
అని అతని బుజము పై చేయివేసి ఆమె తలుపు వద్దకు వెళ్ళెను.
రామ - వొద్దు,వొద్దు, వెళ్ళవద్దు. నీ మీద నిజంగా ప్రేమ వుంది. నీకు తెలీదూ వుందని?
రామారావు లేచి ఆమె వద్దకు వెళ్ళెను. ఇద్దరును కిటికీ వద్ద నిలువబదడిరి.
శశి - ఏమో!చెప్పగా విన్నాను వుందని.ఎన్నోసారి యిది చెప్పడం?నీకు చెప్పడానికి విసుగులేదు.నాకు వినడానికి విసుగులేదు.
గాలికి కదిలి శశిరేఖ చిరచేరగు అతని చేతికి తగిలెను.ఆమె మెడలోని పువ్వుల వాసన అతనికి కొట్టెను.రామారావు ఆమె భుజముపై చేయ్యివేసెను.
శశి - వొద్దు,వొద్దు. చాలా తప్పపని చేస్తున్నావు?
రామ- నా హృదయం రాయనుకుంటున్నావా?
శశి- కాకపోవడం చాలా సందేహమే.
రామ - అట్లా అంటావా? న్యాయమేనా?
అతని చెయ్యి ఆ మెడపై పడు వెండ్రుకలతో ఆడుకోనుచుండెను.
శశి - అనక?నీకు ప్రేమ కూడా తెలుసునా? ప్రేమ వున్న వాళ్ళిట్లా నిరంతరం సందేహిస్తో వుండరు.
ఆమె అతనికి దూరముగా జరిగెను.
రామ-ఎందుకు నాతో అట్లా పోట్లాడతావు?
తిరిగి ఆమె మెడచుట్టును చెయ్యివేసి దగ్గరకు లాగుకోనెను.ఆమె చేవినంతను చేతితో కదలించు చుండెను. శశిరేఖ అతని చెయ్యిని తిసివేసెను.
రామ - నీకు నా మీద ఇంకా సందేహమేనా? నువ్వు ఎంత మోసం చేసినా, ఎంత క్రూరంగా నన్ను నమ్మించి వదిలినా, నీ మీద ప్రేమ పోయింది నాకు?


