Home » Dr jandhyala papayya sastry » Karunasri Sahityam - 4 - Balasahiti - 2


                                      హంపి యాత్ర

    నిరంతర పరిభ్రమణ శీల మగు నీ కాలచక్రమున మీఁదు క్రిందగు చున్నది. క్రిందు మీఁదగుచున్నది. శైలములు సముద్రము లగుచున్నవి. సముద్రములు శైలములుగా మారిపోవుచున్నవి. పట్టణములు భయంకరారణ్యము లగుచున్నవి. భయంకరాణ్యములు పట్టణములుగా రూపు దాల్చుచున్నవి. ప్రభువు బంటగుచున్నాఁడు, బంటు ప్రభు నగుచున్నాఁడు. స్వతంత్రులు పరతంత్రులగుచున్నారు. పరతంత్రులు స్వతంత్రులగుచున్నారు. అట్లే సంభవ మనంభవముగను నసంభవము సంభవముగ మారిపోవుచున్నది.
    భగవంతుని సృష్టిలో నిట్టి మార్పు సహజము కాబోలు! ప్రకృతికి పరిణామము స్వభావసిద్దము కాబోలు!
    ఏ మహానగరము వేదవేదాంగ విదుఁడగు శ్రీవిద్యారణ్య స్వామి వారి యనంత తపశ్శక్తికిని, నఖండ శేముషీవిశేషమునకును సుదాహరణమై హైందవ రాజ్య రమారమణికి విలస భవనమై విరాజిల్లినదో, ఏ మహానగరము సాహితీ సమరాంగణ సార్వభౌముఁడైన శ్రీ కృష్రాయల సామ్రాజ్య లక్ష్మికి విలసమందిరమై విలసిల్లినదో , ఆ మహానగరము సహజ కోమలమగు నాంధ్రకవితా లతామతల్లికి నాలవాలమై యలరారినదో, ఏ మహానగర మే వేళ గాంచినను ససాధరణ భోగభాగ్యములతోఁ దులతూగుచు పగతుఱకుఁ గన్నేర్ర గావించుచుండేనో , ఏ మహా పట్టణము సిద్దహస్తులగు శిల్ప వరెన్యుల యనల్ప శిల్పకళా నైపుణ్యములకుఁ గావురమై వెలసేనో ఆ విశ్వ విశ్రుతమైన విజయనగరము నేఁడు పూర్వ వైభవమును గోల్పోయి నేలమట్టమై గుర్తించుటకైన వలనుపడని మహాశ్మశానమువలెనై "హంపీ శిధిలము "లను మారు పేరు దాల్చియున్నది. ఆహా! కాలమహిమ యానతిక్రమణీయము గదా!
    బాల్య
కాలమున బడిలోఁ జరుపుకొను రోజులలో  నాకు శ్రీకృష్ణదేవరాయలపై నభిమానము మెండుగా నుండేడిది. సంగ్రామ రంగమునందు మాత్రమే గాక, సర్వతోముఖమగు సాహిత్యరంగమునందు సైతము సార్వభౌమత్వము వహించి, కవిజనకల్పవృక్షమై, సహృదయ శిఖామణియై, సహజ ప్రతిభా ధురంధరుఁడై , సముజ్జ్వలములగు ననేక కావ్య రత్నముల స్వయముగ వెలయించి తన యాస్థాన కవీంద్రులచే వెలయింపఁజేసి యాంధ్రులకు నాంధ్రభాషామతల్లికి నమోఘసేవగావించిన యా మహామహుని దలంచుకొని యే యంద్రుని యంతరంగ ముత్సహతరంగములతో నుప్పొంగ కుందును? కన్యాకుమారి మొదలు కటకము వఱకు నాంధ్ర సామ్రాజ్యమును స్థాపించి వీరాధి]
వీరుఁడై విశ్వవిఖ్యాతిగాంచిన యాశూరశిరోమణిని స్మరించుకొని యే తెలుఁగువాని యెదలు పులకరింపకుండును? కాని యా విశాల విద్యానగర సామ్రాజ్యము నేఁ డేదీ? ఆ మూరురాయరగండని "భువనవిజయ" సభామంటపము నేఁ డెక్కడ మాటుమణఁగి పోయినది! ఆ ప్రభుమూర్ధన్యుని ప్రఖ్యాత ప్రతాప భాస్కరుఁడు నేఁడెక్కడ యస్తమించినాఁడు? పురాతనాంధ్రవైభవచిహ్నములై, పూర్వమహైశ్వర్య సూచకములై ఈ హంపీ శిధిలములేనా మనకు మిగిలినవి! ఈ భగ్న శిలాశకలములేనా మనకు శేషించినవి!!
    ఎన్ని దినముల నుండియో హంపీ క్షేత్రమునకుఁ బోవలయు ననియు నందలి శిధిలములను దర్శింపవలయు ననియు, పురాత నాంధ్రవీర విస్పూర్తి నోక్కమాటు స్మరించుకొని సంతృప్తి పడవలయుఁననియుఁ గోరిక గలదు. ఈ సంవత్సరము గాదు పై సంవత్సరములో ననియునునప్పటి కేవో తప్పనిసరి పనులు వచ్చుటచే నా పయిసంవత్సరము బోవచ్చునులే యనియుఁ జాలకాలము గడిచిపోయినది. చిట్టచివరకు మా యదృష్టవశమున నీ సంవత్సరమే వేసంగి సెలవులలో హంపీ యాత్ర సలుపు నాదృష్టము సంప్రాప్తమైనది.
    ప్రధమమున నేనును, ఆచార్యులు మాత్రమే ప్రయాణమైతిమి. కాని మా హంపీ ప్రయాణము వినుటతోడనే మా శాస్త్రి , శర్మ కూడా మా వెంట రాఁగోరిరి. వీరుగాక మాతో మా బావమరిది శ్యామసుందరుఁడు కూడ బయలు దేరినాఁడు.  ఇఁకనేమి ! ఇరువుర కైదుగుర మైతిమి. ప్రయాణము విసుగు లేకుండ హాయిగా జరుగఁగలదని సంతోషించితిమి.
    మా యైదుగురిలో "శ్యాము" మాత్రము చిన్నవాఁడు . తక్కిన వారలమదఱము ప్రౌడ వయస్కులమే. మార్గమధ్యమున మా శ్యాము మాకు మిక్కిలి యుపకరించినాఁడు. టికెట్ తెచ్చుట మొదలుకొని బజారు వెచ్చములు , భోజన సదుపాయములు మొదలగు సౌకర్యములన్నియు సమకూర్చును మా యాత్రిక సమితికిఁ బ్రధాన కార్యనిర్వహకుఁడైనాఁడు.
    శర్మ తన వెంట "కెమెరా" తెచ్చుకున్నాఁడు. హృదయంగమములగు శిల్పదృశ్యములను ఫోటో తీయుటన్న నతనికి మిక్కిలి యుత్సాహము. శాస్త్రి మాత్రము మా కందఱకు నీ వారము రోజులు సరిపడు తినుబండారములు, రొట్టెలు మొదలగునవి పెద్ద పెట్టె నిండవేసుకొని బయలుదేరినాఁడు.
    శర్మ కొంచెము కుర్రవాఁడుగఁ గనిపించునే కాని ప్రాలుమాలిక యదికము. పట్టుమని పదియడుగులు నడువవలెనన్న బద్దకించును. ఇఁక శాస్త్రీకి నుత్సాహమున్నది గాని యదరము గొప్పదగుటచే మందగమన మలవాటైనది. ఆచార్యులు నేనును బలిష్టులము గాకపోయినను నిట్టి వినోదయాత్రలన్న మిక్కిలి కుతూహలపడుదుము. "మాశ్యాము" చిచింద్రీయే! హంపీ శిధిలము లన్నియు నాలుగైదు రోజులుండి , కాలినడకతో తిరిగి తిరిగి సావకాశముగా సందర్శించి మరి రావాలయునని నిర్ణయించుకొంటిమి.
    మా యందఱిలో ఆచార్యులు మాత్రమే యింతకుముందొకమాటు హంపీ యాత్ర గావించియున్నాఁడు అందువలన నీ మా ప్రయాణములో అయన యాచార్యత్వము నేన్నుకొంటిమి. అవశ్యకమైన ప్రయాణ సన్నాహాముతో మేము యాత్రోన్ముఖుల మైతిమి.
    గుంటూరు ధూమశకటము నేక్కినది మొదలు నా హృదయము ముందునకుఁ  బరువెత్తసాగినది. కుతూహల యత్తమగు చిత్తము పొగబండికంటే ముందుగనే హంపీ క్షేత్రమును జేరినది. అందలి విరూపాక్షాలయము, విఠలాలయము, హజార రామాలయము, విజయదశమి దిబ్బ, యుగ్రనరసింహ విగ్రహము మొదలగు చూడఁబోవు దృశ్యములను తలంచుకొని నాలోని యూహలు పలు విధముల వానికిఁ గ్రొత్తరూపు సంపాదించుచుండెను. మాతంగపర్వత మెంతయెత్తుండునో, తుంగభద్రానది యెంత వేగముగాఁ బ్రవహించుచుండునో శిదిలములగు కట్టడములను దర్శించు సమయమున హృదయములో నెట్టి భావములు పొంగునో యని తదీయ దర్శనాపేక్ష పరువులు వాఱ లోలోపల నువ్విళ్ళూరాసాగితిని.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra