ఇంట్లో టి.వి. చూస్తున్న లక్ష్మి ఉలిక్కిపడింది. ప్రహసిత్ ఇంటర్వ్యూ కొనసాగించాడు....."నాకు ఆసాధువేదేవి రూపంలో అక్కడ కూర్చొని బంతి ద్వారా నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది. దాంతోపోయిన శక్తి తిరిగి పుంజుకున్నాను"

    ఇంటర్వ్యూ చేసే అమ్మాయి నోరు తెరుచుకుని వింటూంది. ఆంధ్రదేశంలో చాలా మంది కూడా...

    "ఆ సాధువు తిరిగి కనపడ్డాడా?"

    "లేదు. మ్యాచ్ అయిన తరువాత ఆ సాధువు నన్ను తిరిగి కలుసుకుంటాడేమో. అయిదొందల విషయంలో అపార్థం చేసుకున్నందుకు క్షమించమని అడుగుదామనుకున్నాను. కానీ  కలుసుకోలేదు. ఆ సాధువు ఎక్కడున్నా ఈ దూరదర్శన్ ద్వారా ఆయనకి నా నమస్కారాలు అర్పిస్తున్నాను"

    "మరి ఆమె...."

    ప్రహసిత్ మొహంలో ఇంకా ఉద్వేగభావం అలాగే వుంది. "ఆమె కూడా మాయమైపోయింది."

    "ఏమిటీ?" ఇంటర్వ్యూచేసే అమ్మాయి కంఠం కీచుమంది.

    "అవును. మ్యాచ్ అయిపోగానే ఆమెని కలుసుకుందామనుకున్నాను. ఈ గెలుపుకి కారణం ఆమె. కాని ఆమె లేదు. కుర్చీ ఖాళీగా వుంది."

    "వెళ్ళిపోయిందేమో"

    "లేదు. ఆమె రావటమే ఒంటరిగా వచ్చింది. నిశ్శబ్దంగా కూర్చుని, మాయమైపోయింది."

    "ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది ప్రహసిత్ గారూ."

    ఈ వార్తా తెలిసిన విలేకర్లు.... ఈ సంచలన వార్తా  ప్రముఖంగా ప్రచురించటం కోసం ఆయత్తమవుతున్నారు.

    ప్రహసిత్ అన్నాడు..... "సాధారణంగా ఇలాటి మ్యాచ్ లు చూడటానికి వచ్చేవారు ప్రతి చిన్న షాట్ కి, సెట్ కి ప్రతిస్పందన చూపిస్తారు. కానీ ఆమె మొహంలో అటువంటిదేమీ లేదు. కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. కేవలం నన్ను గెలిపించటానికి వచ్చిన స్త్రీలా కనిపించింది. మరోలా చెప్పాలంటే ఆ సాధువు పంపిన శక్తి 'అంశ లా....'

    ఇంటర్వ్యూ మరో పది నిముషాలపాటు కొనసాగింది.

    అది అయిపోయాక లక్ష్మి టి.వి. కట్టేసింది. ఆమెకి ఏ పనీ చేయబుద్ది కాలేదు. కొంచెంసేపు హాల్లోనే అటూ ఇటూ తిరిగింది.
    అతడు తనని ఎంత తప్పుగా అనుకున్నాడో, అది తల్చుకుంటూంటే ఆమెకి కాలు నిలువటం లేదు. అతడు  గెలవడానికి కారణం కేవలం అతడిలోవున్న శక్తే అంతే తప్ప.....సాధువు పంపిన శక్తి కాదు. తాను అంతకన్నా కాదు. తన వొళ్ళో బాల్ పడటం కేవలం యాధృచ్చికం. ఈ విషయం అతనికి చెప్పాలి.

    అతనికి ఫోన్ చెయ్యాలంటే ఆమెకి భయం వేసింది. అసలు ఫోన్ ఇస్తారో, ఇవ్వరో..... ఎంతమంది సెక్రటరీలుంటారో అనుకుంది. కొంచెంసేపు అయ్యాక 'అతడేమనుకుంటే నాకేం?' అనుకుని ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయింది.

    కానీ ప్రొద్దున్నే పేపర్లో ప్రముఖంగా పెద్ద పెద్ద  అక్షరాల్తో 'ఆటగాడిని గెలిపించిన మహాశక్తి' అని పడేసరికి, ఇక ఆపుకోలేక డైరక్టరీ వెతికి ఫోన్ చేసింది.

    'హాల్లో' అట్నుంచి ఆ కంఠం చాలా హుందాగా వినిపించింది. ఆమె ఒక క్షణం తటపటాయించి".....ప్రహసిత్ వున్నారా?" అని అడిగింది.

    "మీ పేరు?"

    "ల.....క్ష్మి"

    అట్నుంచి రిసీవర్ పట్టుకున్న ప్రహసిత్ కుర్చీలో నిటారుగా అయ్యాడు. ఆ క్షణం కోసం అతడు నిన్న సాయంత్రం నుంచీ ఎదురు చూస్తున్నాడు. ఏ ఫోన్ మ్రోగినా ఆమె దగ్గర్నుంచేమో అనుకున్నాడు. ఆ టి.వి ఇంటర్వ్యూ పెద్ద  సంచనం సృష్టించింది. నిజానికి చాలా ఫోన్ లు వొచ్చినయ్. కానీ ఆమె  తన  పేరు చెప్పగానే తను నిన్నటినుంచి వెతుకుతున్నది. ఈమె  కోసమే అని అనిపించింది. అతని వూహ నిజమైంది.

    "నిన్న రాత్రి టి.వి.లో మీ ఇంటర్వ్యూ చూసానండి. మీరనుకున్నట్టు నేను  ఏ శక్తి స్వరూపాన్నీ కాదు. అనవసరంగా అపోహపడ్డారు. అది చెపుదామనే ఫోన్ చేసాను. వుంటానండి" అని ఫోన్ పెట్టెయ్యబోయింది.

    "ఆగండి" కంగారుగా అరిచాడు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె అట్నుంచి ఫోన్ పట్టుకుని వేచివుందని తెలుసు.

    "నేను....నేను ప్రహసిత్ సెక్రటరీని...." అన్నాడు. "నిన్న మా బాస్  చెప్పింది నాకూ నచ్చలేదండీ. ఎవరో సాధువు ఏదో  చెప్పటమేమిటి? మీ  వొళ్ళో బంతిపడగానే మీది శక్తి స్వరూపం అనుకోవటం ఏమిటి?"

    "నేనూ అదే చెపుదామనుకున్నానండి" అంది లక్ష్మి అమాయకంగా. తను అనుకున్నదాన్ని బలపర్చే వ్యక్తి దొరకటంతో ఆమెకి ధైర్యం వచ్చింది. "అయినా దూరదర్శన్ లో అలాటివి చెపుతారటండీ? ఇంకేం పనిలేదా వాళ్ళకి" అంది.

    "దూరదర్శన్ కి అంతకన్నా మంచి పనులుంటాయని నేను అనుకోవటం లేదు లెండి" అన్నాడు అట్నుంటి ప్రహసిత్. "బాబాల పక్క ప్రధానమంత్రులు చిన్న కుర్చీలో కూర్చున్నా దాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు వాళ్ళు. దానికన్నా ఇది మంచిపనే కదండి. ఎవరో ముక్కూ మొహం తెలియని అమ్మాయికి, ఈ టి.వి. ద్వారా మా బాస్  సందేశం అందజేయగలిగాడంటే.....దూరదర్శన్ తన జీవితకాలంలో చేసిన ఏకైక మంచిపని ఇదే అయి వుంటుంది."

    ఆమె ఫోన్ పెట్టేయబోయింది.
   

    "ఆగండాగండి" అన్నాడు. ప్రహసిత్ గారితో  మాట్లాడరా?"

    "ఇక మాట్లాడేదేం వుందండీ. మీరీ విషయం ఆయనకి చెప్పండి"

    "ఆయన మీతో మాట్లాడాలనుకుంటారేమో. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి."

    "వద్దులెండి. చెప్పాలనుకున్నది చెప్పాగా."

    "ప్రహసిత్ బుర్ర పాదరసంలా పనిచేసింది. "చూడండి. మీకు ఓ  దురదృష్టకరమైన వార్తా చెప్పాలి. ఇంకా ఎవరికీ  తెలీదు. టి.వి ఇంటర్వ్యూనుంచి వస్తూండగా ఆ ప్రహసిత్ గారికి గుండెల్లో నొప్పి వచ్చింది. ప్రస్తుతం హాస్పిటల్ లో వున్నారు."

    "అయ్యో" అన్నదామో విషాదంగా. ఆ కంఠంలోకి నిజాయితీ వీణానాదంలా వినిపించింది. అతడికి. కంఠంలో మరింత శోకాన్ని తెచ్చుకుంటూ,"......ఆయన నిన్నటినుంచి మీ విషయమే ఆలోచిస్తున్నారు. బహుశా ఆయనకి గుండె ఆపరేషన్ జరగవచ్చు. ఆపరేషన్ అవగానే నేనీ విషయం చెపితే, ఆయన ముందు మీతోనే మాట్లాడాలనుకోవచ్చు. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వలేదని చెప్తే ఆయనకి మళ్ళీ గుండె  ఆపరేషన్ చేయవలసిరావొచ్చు. ఒక సెక్రటరీగా నేనది భరించలేను. ఆయన మీతో మాట్లాడేలా చేయవలసిన కర్తవ్యం నా మీద వుంది. ప్లీజ్..... చెప్పండి...." అన్నాడు ఆవేదనగా అభ్యర్థిస్తున్నట్టు.

    ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. ఫోన్ నెంబర్ చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడింది.

    ప్రహసిత్ ఇటువైపునుంచి......ఆమె చెప్పబోయే నెంబర్ కోసం ఊపిరిబిగపట్టి ఎదురు చూస్తున్నాడు.

    ఆమె ఒక్కక్షణం ఆగి, 'నేను మళ్ళీ చేస్తాన్లెండి' అని పెట్టేసింది. ప్రహసిత్ గాఢంగా నిశ్వసించాడు.

    తను అప్పటివరకూ ఎవరికోసం ఎదురుచూసాడో ఆ అమ్మాయి ఆచూకీ అభ్యమయి, చివరిక్షణంలో తప్పిపోవటం అతడికి భరించలేనంత నిరాశగా అనిపించింది.

    ఇక అలాగే ఫోన్ వైపు చూస్తూ కూర్చున్నాడు. రపతిలోగా ఆ అమ్మాయి చేస్తే సరేసరి. లేకపోతే ఇక చచ్చినా చెయ్యదు. రేపు పేపర్లో ఈ ఆపరేషన్ వార్త రాదు కాబట్టి, తను చెప్పింది అబద్ధమని తెలిసిపోతుంది.

   
                                                                      6

`    రాత్రి పదకొండయింది. విష్ణు ఇంకా రాలేదు. లక్ష్మి పక్క మీద పడుకుని పుస్తకం చదువుకుంటూ వుంది.

    అతను ఇంటికి ఆలస్యంగా రావటం విశేషం కాదు. త్వరగా వస్తేనే విశేషం. ఏమైనా అడిగితే, అతడేమో "స్నేహితులు....." అంటాడు. ఆమేమో ఈ స్నేహితులందర్నీ వరసగా నిలబెట్టి షూట్ చేసెయ్యాలి అనుకుంటూ వుంటుంది. కానీ, వాళ్ళ భార్యలు కూడా అదేవిధంగా తన భర్తని షూట్ చేయాలని అనుకుంటూ వుంతారన్నా ఆలోచన వచ్చి దాన్ని మానేసింది. పెళ్ళయిన కొత్తలో అతడి కోసం చాలా ఎదురుచూసేది. కిటికీలోంచి చూస్తూకూర్చునేది. బయట ఏ వాహనం  అలికిడి అయినా అతడు వచ్చేడేమో అనుకొనేది. చీకటి దట్టమయ్యేది. రోడ్డుమీద వాహనాల సాంద్రత తగ్గిపోయేది. నిశ్శబ్దం....

    .....ఆ నిశ్శబ్దం ఎంత భయంకరమైనదో అనుభవిస్తేనే తెలుస్తుంది! అలా చీకట్లోకి నిశ్శబ్దంగా చూస్తూంటే, పక్కనే దెయ్యంలా ఒక భయంకరమైన ఫీలింగ్ ఎప్పుడూ కూర్చుని వుంటుంది. 'నేను ఒంటరిదాన్ని నాకెవరూ లేరు' అన్న ఫీలింగ్ అందరూ హాయిగా నిద్రపోతూ వుంటారు. అతనేమో అక్కడ తన స్నేహితులతో తుళ్ళుతూ నవ్వుతూ వుండివుంటారు. ఇక్కడ తనేమో అక్షాలు గవాక్షాలు చేసుకుని ఎదురుచుస్తూ వుంటుంది.

    శాస్త్రజ్ఞులు రహస్యాలు శోధించటంకోసం అణువునుంచి, సూక్ష్మజీవుల వరకూ అన్నిటినీ పరిశోధిస్తారట. ఒక కన్నీటి బిందువును మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తే ఎన్నెన్ని కథలు చెపుతుందది!!

    కాలం గడిచే కొద్దీ తనకూ అలవాటయి పోయింది. కిటికీ దగ్గర ఎదురుచూడటం మానేసి పుస్తకం చదువుతూ పడుకోవటం, అతనోస్తే లేచి తలుపుతీయటం.

    ....ఒక గ్లాసుడు నీళ్ళుపోస్తే.....ప్రతిరోజూ దోసెడు పువ్వుల్ని ఇస్తుంది మల్లెతీగ. చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది మనీ ప్లాంటు. తాను ఎండిపోయాక కూడా గదినంతా పరిమళంతో నింపుతుంది సంపెంగ. కానీ, స్త్రీతో పోల్చుకుంటే ఇవన్నీ ఏ పాటివి? రవ్వంత ఆప్యాయత ఇచ్చి కాసింత సెక్యూరిటీ చూపిస్తే.....నీకు నేనున్నాను అన్నభావం కలిగిస్తే.....మల్లెకన్నా ఎక్కువగా ప్రేమ పరిమళాన్ని ఇస్తూ, తీగేకన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోదూ? ఇంత చిన్న విషయాన్ని పురుషుడెప్పుడు తెలుసుకుంటాడు?

    లక్ష్మి అలాగే చూస్తోంది. పుస్తకంలోకి కాదు. అక్షరగర్భంలోకి. తను తన భర్తని ఎంత ప్రేమించేది! గతం కాదు. వర్తమానంలో కూడా. ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ దుఃఖం వుంటుంది. ప్రేమ దుఃఖాన్ని తక్కువ చేయదు. ఎక్కువ చేస్తుంది. అందుకే ఈ దుఃఖం ఎప్పుడయితే ఈ దుఃఖం తగ్గిపోయిందో, అప్పుడు ప్రేమ తగ్గిపోయిందన్నమాట.

    ఆమె వణికింది. ఈ ఆలోచనకే వణికింది. లేచివెళ్ళి కిటికీలోంచి బయటకు చూసింది. చీకట్లో వంకర తిరిగిన పాములాగా, అదే దారి, నిర్మానుష్యంగా.

    ఒంటరితనం వేరు. ఏకాంతం వేరు. ప్రేమించే వ్యక్తివుంటే ఏకాంతంలో ఆ తలపు ఇచ్చే ఆనందం ఏదీ ఇవ్వదు. ప్రేమించటానికి  ఎవరూ లేనప్పుడు కలిగేది ఒంటరితనం. అంత భయంకరమైనది ఇంకేదీ లేదు.

    ఆమె వెళ్ళి టేప్ రికార్డర్ అన్ చేసింది. ఆమె స్నేహితులు రెండే, టేప్ రికార్డర్.....పుస్తకాలు ఆ రెండూ మనిషిని బాధపెట్టవు. చేతికి అందుబాటులో వుంటాయి మనసులో భావాల్ని పంచుకుంటాయి. అక్షరాలూ గీతాలై మనసుకి సేద తీరుస్తాయి.

    టేప్ లో పాటవస్తోంది. 'హృదయమా......ఓ బేల హృదయమా, ఒకేసారిగా నీకింత సంతోషమా.....' ఎన్నెన్ని పాటలు.....ఎన్నెని భావాలు......ఎందరు కవులు ఎన్నిరాత్రులు......ప్రపంచం అంతా గాఢ నిద్రలో వున్నప్పుడు... తాము మేల్కొని.... తమ గుండెల్ని వెలిగించుకుని, ఆ వెలుతుర్లో మనసు గుహల నిక్షిప్తాల నుండి ఈ భావా సంపదని బయటకు తీస్తారో కదా!

    పాట అయిపోయింది. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra