Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    ఆ ఇద్దరిలోనూ కాలం పెంచే సంచలనాన్ని అంతటితో ఆపాలన్నట్టు 'కిర్రు' మంటూ గేటు శబ్దమయింది.

    ఆత్రుతగా తలతిప్పి చూసిన సిరిచందన కళ్ళు ఒక్కసారిగా దీప్తివంతమయ్యాయి. గేటు తీసుకుని వస్తూన్న మహర్షిని చూడగానే ఆమె దిగ్గున కుర్చీలోంచి లేచి వడివడిగా అతనికి ఎదురెళ్ళింది.

    "మహీ....." ముందుగా అతని క్షేమం కనుక్కోవాలో, వెళ్ళిన పని పూర్తయి మందు దొరికిందో లేదో అని కనుక్కోవాలో క్షణకాలం అర్థంకాక ఆమె మాట పూర్తిచేయలేకపోయింది.

    అలికిడికి రవి "ఎవరూ?" అనడిగాడు.

    "ఓ మహర్షి నువ్వా.....? ఏమయిందీ వెళ్ళినపని?" రవితేజ  ప్రశ్న పూర్తి కాక ముందే ఉద్వేగంగా సిరిచందన "మందు దొరికిందా?" అనడిగింది. వారిద్దరిలోని ఆత్రుతను అర్థం చేసుకున్నట్టు అతను చిన్నగా నవ్వి "తీసుకువచ్చాను" అన్నాడు.

    సిరిచందనలో ఒక్కసారిగా రిలీఫ్ తో కూడిన ఆనందం. రవితేజ మొహంలోకి కూడా వెలుగొచ్చింది. "నీకు చాలా  శ్రమిచ్చాం" అన్నాడు.

    "ఇందులో శ్రమేముంది" అంటూ వెనక్కి తిరిగి, గేటుదగ్గరే ఆగిపోయిన రామరాజును చూసి...... అక్కడే ఆగిపోయావేం రా" అన్నాడు.

    అప్పుడు గుర్తు వచ్చింది సిరిచందనకి. అతను  నాగకోనకు వెళ్ళాడని..... అతని ముఖం వంక పరిశీలనగా చూస్తూ "అలా అయిపోయావేంటి మహీ" అనడిగింది.

    "ఎలా అయిపోయాను....బాగానే వున్నానుగా? ఇంతకీ మమ్మల్ని లోపలికి పిలిచిదంటూ రమైనా  వుందా, లేదా?" నవ్వుతూ మాట మార్చాడు.

    "సారీ. రా లోపలికి" అని రామరాజును కూడా రమ్మని, భర్తని తీసుకురావటానికి రవి దగ్గరికి వెళ్లబోయింది.

    "సిరీ.....రవితేజని లోపలికి తీసుకునిరా. కళ్ళల్లో మందు వేయాలి" అన్నాడతను. "ఒక్కక్షణం, మీరుపదండి. తీసుకువస్తున్నాను" అందామె.

    మహర్షి రామరాజుని తీసుకుని లోపలికి నడిచాడు. సిరిచందన రవితేజని తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాక, "మందు కోసం సాయపడిన కోయదొర ఇతనే" అంటూ పరిచయం చేసాడు.

    రామరాజు తోలు సంచిలోంచి ఆ భరిణెతీసి కొన్నిక్షణాలు కళ్ళు మూసుకుని దైవప్రార్థన చేసి సిరిచందనకి అందించాడు.

    ఆమె అది అందుకుని తిరిగి మహర్షి చేతిలో పెడుతూ" ఆయనకి పనర్జన్మనిచ్చే మంచి పనేదో నీ చేతులమీదుగానే జరగాలి" అంది.

    "అదికాదు సిరీ.....!" అంటూ. ఆమె కళ్ళతోనే అభ్యర్థించింది.

    ఇక తర్కించకుండా మహర్షి అది అందుకుని మూతతెరిచాడు. రవితేజ కళ్ళు సీలింగ్ వేపు తెరుచుకుని జీవం లేనట్టుగా చూస్తున్నాయి. క్షణం ముందు 'లేకపోవటం' క్షణం తరువాత 'రావటం' అనే ప్రక్రియ ప్రతి మనిషిలోనూ ఉత్సుకతను రేపుతుంది. ఆత్మీయుల విషయమైతే మరింత టెన్షన్ వుంటుంది.

    సిరిచందన రెప్పవేయటం కూడా మరిచిపోయింది.

    రామరాజు కళ్లుమూసుకుని దైవాన్ని స్తుతిస్తున్నాడు.

    మహర్షి నెమ్మదిగా ముందుకువంగి, భరిణెలోని మందును రవితేజ కంటికొనల దగ్గర చుక్కలు చుక్కలుగా వంపాడు.

    మిగతా ముగ్గురు రవితేజ దగ్గరగా నిలబడి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

    అక్కడ ఒక సీక్రెట్ ఏజెన్సీ విభాగపు సీనియర్  అధికారి ప్రసంగానికి ముందు ఏర్పడే నిశ్శబ్దం వ్యాపించి వుంది. రవితేజ ముఖకవళికల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు మిగతా ముగ్గురూ.

    నిశ్శబ్దం మహర్షి మనసులో కీడును శంకించేలా చేసింది. అనుమానంగా ముందుకు వంగుతూ "తేజా.....ఎలా వుంది నీకు?" అని అడిగాడు.

    రవితేజలో చలనం లేదు.

    రవినుండి ఏ సమాధానమూ రాకపోయేసరికి సిరి అనుమానంగా ముందుకొస్తూ "ఏమండి!" అని పిలిచింది.

    రవితేజ పలకలేదు. భయంతో వణికిపోతూ భుజాన్ని పట్టి కుదిపింది. ఆమె చేతికి అతని శరీరం చల్లబడుతున్నట్టుగా తోచి "ఏమండీ! మాట్లాడండి. నేను..... మీ సిరిని. ప్ల్లసారి కళ్ళు తెరిచి చూడండీ" అంటూ గట్టిగా అరవసాగింది.

    అతని శరీరం దూదిలా ఎటు కదిలిస్తే అటు వేలాడబడి పోతోంది. ఆమె హృదయాన్ని ఎవరో గట్టిగా పట్టుకుని పిండేస్తున్న అనుభూతి. గుండె వేగం పెరిగింది. వళ్ళంతా చెమటలు పట్టేశాయి.

    అక్కడున్న ఇద్దరి పరిస్థితి కూడా దాదాపు అదే. అతని బుర్ర మొద్దుబారి పోయింది. ఏం జరిగిందో..... ఏం జరగబోతుందో అర్థంకావటం లేదు. సిరిచందన అంతా అయిపోయిందనే అనుకుంది. రవితేజ చేతుల్ని గుండెకు హత్తుకుని రోదించసాగింది.

    మహర్షి ఆమె భుజం తడుతూ "సిరీ......కంగారు పడకు. ఊరుకో ప్లీజ్! తేజకి ఏమీ కాలేదు. కాస్త షాక్  అంతే! తేజాకి మళ్ళీ స్పృహవస్తుంది. ఏడవకు" అంటూ అనునయించసాగాడు.

    ఆ చివరిమాట వినటంతోనే ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆ కళ్ళల్లో అగ్నిజ్వాలలు కనిపించాయతనికి. ఏం జరిగిందో అర్థమయ్యే లోపునే 'ఛేళ్!' మన్న శబ్దం ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనించింది. అతని చేయి అప్రయత్నంగా చెంపమీద కెళ్ళింది. గాలికూడా ఏం జరిగిందో అర్థంకాక తెల్లబోయింది. ఆ భయంకర నిశ్శబ్దానికి భయపడి గాలి కూడా నిశ్చలంగా వుండిపోయింది. క్షణకాలం స్తంభించి, తిరిగి చలనం తెచ్చుకుంది.

    "ఏమయింది సిరీ!" పాలిపోయిన ముఖంతో, ఆమె కళ్ళల్లో మెదిలే కోపానికి కారణం వెదుకుతూ అడిగాడు.

    "పిచ్చి పట్టింది" కర్కశంగా చూస్తూ అంది. "యస్...... నాకు పిచ్చిపట్టింది. నేనూ, నా భర్త అందరం. అందరమూ పిచ్చి వాళ్ళమే. నీ నిజస్వరూపం తెలీక నిన్ను నమ్మిన పిచ్చివాళ్ళం!" అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగిందామె.

    "ఏం....ఏమిటి సిరీ! నువ్వేం మాట్లాడుతున్నావో- నాకేమీ అర్థం కావటం లేదు"

    "ఆపు నీ నాటకం! నిన్ను..... నిన్ను చూడాలంటేనే అసహ్యంగా వుంది నాకు" చీదరించుక్నుట్టుగా  చూస్తూ అంది సిరి.

    "నాటకమేమిటి...... అసలు నువ్వు స్పృహలో వుండే మాట్లాడుతున్నావా?" అయోమయంగా చూస్తూ అన్నాడు.

    "అవును. నువ్వు నాటకమే ఆడుతున్నావు. నీ అంత దుర్మార్గుడే లేడు. నమ్మకద్రోహివి నువ్వు. నన్ను ప్రేమించావు కాబట్టి..... తెలివిగా నా భర్తని చంపేసి ఆ స్థానంలోకి రావాలని చూస్తున్న వంచకుడివి. ఇప్పుడు.....ఇప్పుడర్థమౌతోంది నువ్వెంత స్వార్థపరుడివో?.....నిన్నూ.....నిన్ను ఊరికే వదల్ను. నిన్ను చంపేస్తాను..... చంపేస్తాను!" హిస్టీరిక్ గా అరుస్తూ, విసురుగా లేచి అతని మెడ పట్టుకుంది.

    ఆశ్చర్యమూ.... అపనమ్మకమూ..... అయోమయమూ అయిన అతని మనసు, ఆమె అన్న మాటతో ఒక్కసారిగా అవధిదాటిన అనంత సాగరమే అయింది.

    ఆతమీయుత కురిపించిన కళ్ళు......బడబాగ్ని వర్షించటం......

    అభిమానం చూపించిన మనసు అసహ్యాన్ని వెళ్ళగ్రక్కటం.

    ఈటెలా గుండెను చీల్చిందామె మాట!

    ఆమెను కాంక్షించి...... రవిని చంపటానికి ఇదంతా చేశాడాతను? ఎలా  చెప్పాలి?

    నిజంగా వారి క్షేమంకోరే ఈ పని చేశానని ఎలా చెప్పాలి? ఎలా నమ్మించాలి? చివరికి గొంతు పెగుల్చుకొని-

    "సిరీ...... తెలిసీ నేనేం పాపం  చేయలేదు. ఒకవేళ నీకు అన్యాయమే చేశానని నువ్వనుకుంటే ఇప్పుడే నీ కళ్ళముందే నా ప్రాణం  తీసుకొని నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాను" అన్నాడు దగ్గరగా వెళ్ళి.

    "నువ్వు చచ్చినా నేను నమ్మను" అంటూ అతన్ని విసురుగా వెనక్కి నెట్టి మోకాళ్ళమీద కూలబడింది.

    అతను బెడ్ రూమ్ లోకి వెళ్ళి ధడాలున తలుపు మూసుకున్నాడు. తనుఏ కార్యం నిర్వర్తించటానికి ఇంతకాలం బ్రతికివున్నాడో -అది నెరవేరనప్పుడు పోలీసులు వేసే ఉరికన్నా ఆత్మహత్య చేసుకోవటమే మేలనిపించింది.

    ఆమెకు తనపట్ల అనుమానం పోతే చాలు.

     తన  చావుకి అంతకన్నా పెద్ద సార్థకత వుంటుందని ఎప్పుడూ అతడు అనుకోలేదు.

   
                          *    *    *

    మహర్షి అలా ఆవేశంగా వెళ్ళి తలుపు వేసుకోగానే...... అంతసేపూ జరిగిన తతంగమంతా నివ్వెరపోయి చూస్తున్నరామరాజులో చలనం కలిగింది. "అమ్మా...... ఒక్కమాట సెప్తానుమీరే మునుకోనంటే" అన్నాడు.

    సిరిచందన నిరసనగా చూస్తూ "నేనెవరి మాటలు వేనేస్థితిలో లేను. అయినా నీకూ ఇందులో భాగముందిగా" విసురుగా అంది.

    "మీరు నన్నేమయినా అనండమ్మా! కానీ ఆ దొర గురించి ఓ నిజం  సెప్తాను. దయచేసి ఇదొక్కటీ ఇనుకోండమ్మా" అన్నాడు రామరాజు ప్రాధేయపూర్వకంగా చూస్తూ.

    "ఏమిటో అంత పచ్చినిజం" వెటకారంగా అంది.

    "ఈ మందు తేటం కోసం ఆ దొర తన బతుకునే బుగ్గిపాలు సేసుకు....." ఆ వాక్యం పూర్తి చేయబోయాడు. కాని రవితేజలో చిన్న కదలిక కనిపించేసరికి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేస్తూ అటువైపే చూడసాగాడు.

    అతనలా చెప్పబోయే విషయం మధ్యలో ఆపేసి భర్తవైపు చూడడం చూసి ఆమె అనుమానంగా వెనక్కి తిరిగింది. రవితేజ చేతివేళ్ళలో చిన్న కదలిక. వెళ్ళిపోయిన కెరటం తిరిగి ఒడ్డును తాకినట్టు......ఆమెలో సన్నటి ప్రకంపన. ఒక్క ఉదుటున వెళ్ళి భర్త  చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ చేయి వెచ్చగా తగిలింది. ఆమె సంతోషం పట్టలేక ఆ చేతిని తన చెంపకు ఆనించుకుంది. ఆ తన్మయత్వంలో ఆమె కాసేపు అలాగే వుంది. తన భర్త బ్రతికాడు..... తన భర్త....

    "అమ్మా..... ఆ దొరేదో అఘాయిత్యం చేసుకుంటున్నారు." మూసుకున్న తలుపువేపు వేలుపెట్టి చూపిస్తూ అన్నాడతను.

    అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. క్షణికావేశంలో తనెన్ని మాటలు జారిందో! ఒక హృదయాన్ని ఎన్ని అణువులుగా చీల్చిందో! ఏం జరుగబోతుందో అర్థమయ్యేసరికి ఆమె గుండె క్షణకాలం ఆగి తిరిగి కొట్టుకుంది.

    అంతే! భర్త చేతిని వదిలి సంధించి విడిచిన బాణంలా తలుపువేపు పరుగెత్తింది. వెనకే రామరాజు కూడా పరుగెత్తాడు. తలుపు లోపలినుండి గడియ పెట్టబడి వుంది.


    ఆమె భయంగా తలుపుమీద పిడికిళ్ళతో బాదుతూ "మహీ! తొందరపడకు! ఐయామ్ సారీ..... ఒక్కసారి తలుపు తెరు ప్లీజ్" అంటూ గట్టిగా పిలవసాగింది. లోపల్నుంచి శబ్దంలేదు.

    క్షణక్షణానికి ఆమెలో కంగారు ఎక్కువై మాటకూడా తడబడ సాగింది. అంతసేపూ ఏం చేయాలో పాలుపోని రామరాజు అప్పుడు స్పృహలో కొచ్చినట్లు సిరిచందనను ప్రక్కకు జరిపి నాలుగడుగులు వెనక్కి వేసి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. వేగంగా వచ్చి భుజంతో తలుపును గుద్దాడు. తలుపు శబ్ధమయితే అయింది గానీ తెరుచుకోలేదు. ఈసారి మరింత దూరం వెనక్కి వెళ్లి వేగంగా వచ్చి గుద్దాడు. డోర్ ఊడేలా కనిపించలేదు.

    సిరిలో భయం..... బాధ..... దుఃఖం అన్ని భావాలూ కలగలిపి మెదడు మొద్దుబారి పోతున్నట్లు అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటి సారి ఆమె భగవంతుడ్ని ప్రార్థించింది.

    ఆమె ఆవేదన ఆ దేవుడు ఆలకించినట్లు ఈసారి తలుపు విరిగి తెరుచుకుంది. తలుపుతోపాటు రామరాజు వెళ్ళి దబ్ మని నేలమీద పడ్డాడు. తల అదిరి స్పృహ తప్పింది అతనికి. ఆమె అతని వెనకే గదిలోకి పరిగెత్తింది.

    అప్పటికే ఆలస్యమై పోయింది. అంతకుముందే మహర్షి స్టూల్ ని తన్నేసాడు. గది మధ్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.

    ఆ దృశ్యాన్ని చూడగానే ఆమె అగ్ని పర్వతంలా బ్రద్ధలైంది. సముద్రంలా ఉప్పొంగింది..... "నో ....." అంటూ ఒక్క ఉదుటున వెళ్ళి గాలిలో వ్రేలాడుతున్న అతని కాళ్ళను చుట్టేసింది.

    బలాన్నంతా భుజాల్లోకి తెచ్చుకుని అతడి శరీరాన్ని పైకి లేపింది. శక్తినంతా కూడగట్టుకొని అలాగే ఒడిసి పట్టుకుంది. క్షణక్షణానికి ఆమలో శక్తి క్షీణించసాగింది. ఇంకాసేపు అలాగే వుంటే ఆ బరువును వోపలేక విడిచిపెట్టడం ఖాయమని అర్థమైందామెకు. ఒకవేళ అలా విడిచి పెడితే తాడు మళ్ళీ బిగుసుకుపోతోంది. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది. భుజాల్లో రక్తప్రసారం ఆగిపోయి తిమ్మిరెక్కుతున్నట్టు అవసాగింది.

    సహాయం కోసం రామరాజు వైపు చూసింది. అతను స్పృహతప్పి పడివున్నాడు. "రామరాజూ...... రామరాజు" అంటూ పిలిచింది. అతనిలో చలనంలేదు. ఆమె నిస్సహాయంగా తల తిప్పి గది బయట చూసింది. దూరంగా హల్లోని సోఫాలో భర్త కొద్దిగా కదలడం కనిపించింది. అంతే...... ఆమె ముఖంలో పోయిన కళ వచ్చింది. "ఏమండీ.....ఏమండీ" అంటూ అక్కణ్ణుంచి సహాయం కోసం గట్టిగా పిలిచింది. కానీ రవితేజ మెలకువలోకి రాలేదు.

    ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. బిగ్గరగా రోధించసాగింది. ప్రాణాలు కాపాడడానికి ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు....." అని మనసులోనే వాపోయింది.

    ఆమె దుఃఖం ధ్వని తరంగాలుగా రూపాంతరం చెంది మృత్యువు చివరి అంచున వున్న అతని కర్ణపుటాలకు సున్నితంగా తాకిందేమో.....ప్రియురాలి విషాదరూపం అతని మనోచక్షువు గ్రహించి రక్తకణాలకి సంకేతనం పంపిందేమో అప్పుడే ఘనీభవించబోతున్న రక్తకణాల్లో వేగానికి గుండె సవ్వడి తిరిగి పెరిగింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra