Home » Chandu harshavardhan » The Partner

 

    సునీల్ అలాంటి ఆ లోకంలో ఉండగానే సుజాత తెల్లని లాల్చీ పైజమా తెచ్చి యిచ్చింది.
    "బాత్ రూమ్ లో హీట్ వాటర్ వస్తుంది.... అక్కడే షేవింగ్ సెట్ వుంది. ముందు షేవ్ చేసుకుని తలస్నానం చేసిరండి...." చిరునవ్వుతో అన్నదామె.
    "కానీ నేను"
    "అవన్నీ తరవాత మాట్లాడుకుందాం"
    'అది కాదు సుజాత గారూ"
    "సునిల్ పేరుపెట్టి పిలవండి బాబు! నా ప్రాణాలను కాపాడారు అందుకే నా ఆతిద్యం స్వేకరించమని మిమ్మల్ని నేను ఆహ్వానించాను వెళ్ళండి" టవల్ చేతికిస్తూ అన్నది.
    ఏమని అభ్యంతరం చెప్పాలో తోచక మౌనంగా బాత్ రూమ్ వైపు నడిచాడు....
    తనలో తను నవ్వుకుంటూ సుజాత కిచెన్ వైపు అడుగులు వేసింది.
    ఒక అరగంట తరువాత హాలులో అడుగుపెట్టిన సునీల్ ను చూస్తూ....
    "వ్వా....వెరీ నైస్ గై " అన్నది సుజాత అప్రయత్నంగా.
    సునీల్ సిగ్గుపడిపోయాడు.
    తెల్లని మల్లె పువ్వులా మెరిసిపోతున్నాడతను. నీట్ గా షేవ్ చేసుకుని ప్రేష్ గా డ్రస్సప్ కావడం వలన కడిగిన ముత్యంలా వున్నాడు.... కండలు తిరిగిన అతని శరీరాన్ని ఆ లాల్చీ పైజమాలు తనలో యిముడ్చుకోలేక పోతున్నాయి.
    అతనిని నిలువెల్లా ఆరాధనా పూర్వకంగా చూసిందామె.
    "సునీల్ కమాన్ మీల్స్ రెడీ"
    మౌనంగా టేబులు దగ్గిర కూర్చున్నాడు.
    అంతకుముందు ఏమాత్రం పరిచయం లేని స్త్రీ అంత చనువుగా మెలగడం భరించలేక పోతున్నాడతను. ఇంత బంగళాలో ఎవరూ లేరు . కనీసం నౌఖర్లు కూడా కనిపించడం లేదు.
    అందుకే ఏదో అనుమానం. తెలియని భీతి అతనిలో చోటు చేసుకున్నాయి.
    భోజనాలు అయ్యాయి.
    ఆమె స్వయంగా కొసరి కొసరి వడ్డించింది.
    అప్పటికి రాత్రి పదకొండు గంటలు దాటింది.
    "థాంక్యు మేడమ్ ! మీ ఆతిధ్యానికి కృతజ్ఞతలు....ఇక నేను వెళతాను" అంటూ వెళ్ళడానికి ఉద్యుక్తుడు అయ్యాడు సునీల్.
    "మీరు ఉండేది ఎక్కడ?"
    సునిల్ సమాధానం చెప్పాడు....
    "ఓహ్....! మరి ఇంత రాత్రి వేళ ఎలా వెళతారు? కనీసం ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు వుంటుంది. ఇప్పుడు మీకు సిటీ బస్ లు గానీ, ఆటోలు గానీ దొరకవు. పోనీ నేను డ్రాప్ చేద్దాం అంటే తిరిగి ఇంత అర్ధరాత్రి వేళ నేను ఒక్క దానినే ఒంటరిగా రావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఈరాత్రికి ఇక్కడే వుండండి....రేపు నేను డ్రాప్ చేస్తాను."
    సునిల్ ఆమెను అర్ధం చేసుకోలేక పోతున్నాడు.
    అలా అని ఆమె ప్రవర్తనను అపార్ధం చేసుకోవానికి వీల్లేకుండా వుంది.
    ఆలోచనలో పడ్డ అతనికి గెస్ట్ రూమ్ ను చూపించింది.
    "లోపల ఫ్రీజ్ లో మంచినీళ్ళు వున్నాయి. వెళ్ళి తలుపు వేసుకుని పడుకోండి.....గుడ్ నైట్ ...." అంటూ ఆమె తన మాస్టర్ బెడ్ రూమ్ కు వెళ్ళిపోయింది సుజాత.
    గదిలో పడుకున్నాడన్నమాటే కానీ సునిల్ కు నిద్ర ఒక పట్టాన రాలేదు.
    సుజాతను గురించే చాలాసేపు ఆలోచిస్తుండి పోయాడు. ఎక్కడో దుబాయ్ కు వెళ్ళి డబ్బు సంపాదించి పంపుతున్న ఆమె భర్త అతని కళ్ళముందు మెదిలాడు.
    ఎంత ఐశ్వర్యం వుండి ఏం లాభం.....కొందరికి మనశ్శాంతి లభ్యం కాదు.....
    అతనికి ఎప్పటికో మాగన్నుగా నిద్ర పట్టింది.
    కలలో ధీరజ.....
    చాలా కలం తరువాత ధీరజను కలుస్తున్నాడతను.....ఇంతకాలం తను హైదరాబాద్ రానందుకు సున్నితంగా ముద్దులతో అతనిని శిక్షిస్తుంది.
    సునీల్ ముఖం ఆమె పెట్టె ముద్దులతో కందిపోయింది.
    "నో.....నో.....ధీరజా.....నేను .....నీకు .....తగను .....ప్లీజ్ తొందర పడకు...."
    అయినా ఆమె వినిపించుకోవడం లేదు.
    ఆమె వదిలే వెచ్చని ఊపిరి అతని ముఖాన్ని తాగి గిలిగింతలు పెడుతుంది.... తన ప్రమేయం లేకుండానే ఆమెను హృదయానికి గాడంగా హత్తుకున్నాడు అతను.
    అంతలోనే అతని వివేకం వెన్నుతట్టి హెచ్చరించింది.
    వద్దు అని వారిస్తున్నా వినిపించుకోకుండా ఆమె తనను ఏదేదో చేయడాన్ని ఇక తట్టుకోలేకపోయాడు. నోరు తెరచి ఏదో అనబోగా వెచ్చని పెదవులు గాడంగా చుంభించాయి..... శరీరం అంతా ఏదో తెలియని మత్తు నిండిపోయి వుంది అని అర్ధం అయింది అతనికి.
    కారణం బోధపడింది అతనికి.
    తనమీద వెచ్చగా కాలిపోతున్న మరొక దేహం.
    సునీల్ ఉలిక్కిపడి మేల్కొన్నాడు.
    మరుక్షణం అదిరిపడ్డాడు.
    తను ఇప్పటివరకూ కలగన్నాడు..... కానీ ప్రస్తుతం నిజంగానే నగ్నంగా ఉన్న సుజాత కౌగిలిలో వున్నాడు. బహుశా ఆమె విజ్రుంభించడం వలనే తను మేల్కొన్నాడు.
    సుజాత తన బెడ్ రూమ్ లోకి ఎలా వచ్చిందో?
    అంటే........ ఒకవేళ అంతా ప్రీ ప్లాన్ గా చేయడం లేదు గదా.....
    అతనికి నోరు తెరచి మాట్లాడే అవకాశం లేదు....
    చలకొచ్చి ముంత దాయడం ఎందుకన్నట్లు అతనిని తనలో ఇక్యం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నదామే. అప్పటికే కలలో రెచ్చిపోయి ఉన్న సునీల్ ఆమె కౌగిలిలో కరిగిపోవడానికి నిశ్చయించుకుని మరొకసారి జీవితంలో దిగజారాడు.
    కోరికలతో కాగిపోతున్న ఆ రెండు హృదయాలు యదేచ్చగా ఒక్కటై పోయాయి.
    ఎప్పటికో తెప్పరిల్లిన సుజాత తృప్తి నిండిన కళ్ళతో తన గదికి వెళ్ళిపోయింది.
    తెల్లవారింది.....
    రాత్రి గడిచిపోయిన సంఘటన తాలుకూ అనుభూతి ఇంకా సునీల్ ను వీడిపోలేదు.
    సుజాత ఎందుకు అలా ప్రవర్తించిందో వూహించాడు. కానీ పరాయి స్త్రీ తో అసలు తను రావడమే తప్పు........తీరా వచ్చాక రాత్రి వుండిపోవడమూ తనదే తప్పు.
    వెచ్చని కౌగిలికి పరితపించిపోతూ ఎన్నో వందల మైళ్ళ దూరంలో వున్న భర్త కోసం ఎదురు చూస్తూ భరించే నిబ్బరం లేక సుజాత వయసు పెట్టిన తొందరలో ఆవేశ పడి వుండవచ్చు.....మరి తనలోని వివేకం ఆ సమయంలో ఏమయిపోయింది.....?
    ఇప్పుడు తనను చూసి సుజాత సిగ్గుపడుతుందో ..... చీదరించుకుంటుందో......తన ముఖం చూడడానికి అసహ్యించుకుంటుందో....
    అసలు తన జీవితంలో ఏమిటో అన్నీ ఇలాంటి విషాద సంఘటనలే ఎదురవుతున్నాయి. ప్రేమించిన ప్రియురాలికి దూరం అయ్యాడు. ఆశించిన ఉద్యోగాన్ని దక్కించులోక పోయాడు. చేతి కందిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేక పోగా కుతంత్రంలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు రక్షించిన పడతినే భక్షించానని సుజాత నిందిస్తే తను తట్టుకోగలడా?
    హాలులోకి వెళ్ళిన సునీల్ కంటికి టీపాయ్ మీద రెపరెప లాడుతున్న ఉత్తరం కనిపించింది. మడిచి పెట్టకుండా వుండడం వలన ఆ ఉత్తరం పై తన పేరు స్పష్టంగా కనిపిస్తుంది.
    అందుకే తనకు వ్రాసిందేనని అర్ధం కావడంతో చేతిలోకి తీసుకున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra