"నిన్న అగ్గిపెట్టె ఇక్కడే పెట్టాను? లేదు!" నీరజ అగ్గిపెట్టె కోసం వెదుకుతూంటే,
"ఇప్పుడు టి గీ పెడతారా ఏమిటి? నా కోసం అయితే ఏం వద్దు! నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను!" అని వాదించాడు అజిత్.
"మమ్మల్ని మీ ఇంటికి తీసికెళ్ళి అతిధి మర్యాదలు అంత ఘనంగా చేశారే! మా ఇంట్లో కాస్తటి పుచ్చుకోడానికి మీకు అభ్యంతరమా?"
"బదులు తీర్చుకోవాలని మీకంత ఇదిగా ఉంటే మీ ఇంటికి భోజానానికే వస్తాలెండి ఒక రోజు! ఇప్పుడు మాత్రం మీరేం శ్రమ పడొద్దు! మీరు పని చూచుకోండి! నేనిక వస్తాను!" అని, లేచి వెళ్ళి పోయాడు.
అతడు అలా వెళ్ళాడో లేదో, అఖిల కయ్ మని లేచింది. "అతడి కారులో వచ్చి మీ పిన్ని ముందు దిగుతూంటేనే నా తల తిసేసినట్టుగా అయింది! చాలదని అతడిని లోపలికి పిలుస్తావా? ఇక్కడ ఏ మహల్ చూపించాలని? ఆడపిల్లలుండే గదిలోకి మగపిల్లల్ని పిలవడానికి నీకు బుద్దిలేదూ?"
నీరజ తెల్లబోయినట్టుగా, "పిలిచినంత మాత్రాన ఏమ్తెందిప్పుడు?" అనడిగింది.
"మనం మగపిల్లలతో కలసి తిరుగుకున్నామని మీ పిన్ని ఒకటికి రెండు కల్పించి చెప్పిందంటే మనవాళ్ళు మధ్యలోనే చదువా పెసి ఇంటికి ఈడ్చుకు వెడతారు"
నీరజ కళ్ళు కోపంతో ఎర్రబడి పోయాయి. "ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావే, అఖిలా? చదువూ సంస్కారం లేని పశువు మాట్లాడవలసిన మాటలివి! మగపిల్లలతో తిరుగుతున్నామా? అతడితో మనం షి కార్లు కొట్టామా? సినిమాలకి తిరిగామా? నిన్న అతడు సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది గాని, మనం నిన్న ఎలాంటి ఆపదలో చిక్కుకొనేవాళ్ళమో! దేవుడిలా సమయానికి ఆదుకొని ఇంటికి తీసికెళ్ళి రాక రాక ఇంటికి వచ్చిన ఆడపడుచులకు చేసినట్టుగా మర్యాదలు చేసి నందుకు అతడికి మంచి బహుమతి ఇచ్చేలా ఉన్నావు! అతడిని కాస్త గదిలోకి పిలిస్తే గది అపవిత్రమ్తె పోయిందా?"
"రాత్రికి ఆమంచం మీద నువ్వు పడుకోవాల్సిందే! నేను పడుకొను?"
"ని మెడలో పూస్తే కట్టేవాడు మగాడే! వాడి ప్రక్కనేలా పడుకోంటావు?"
"ఏయ్! నిన్ను తంతాను!"
"మొగుడి ప్రక్కన పడుకోవా?"
"నువ్విలా మాట్లాడితే నేనిప్పడే ఊరి కెళ్ళి పోతాను!"
"పోవే! ఉంది ఏం బెదిరిస్తావ్?" నీరజ రుసరుసలాడుతూ మ్తెల బట్టలు, సర్ప్ డబ్బా తీసుకొని బయటికి వచ్చింది.
ఆక్కడ కొయ్యబారి పోయినట్టుగా నిలబడిన అజిత్ ని చూసి షాక్ తిన్నాట్టుగా అయింది.
కారులో ఈ జాకెట్ గుడ్డలు వదిలేశారు, మీరో మీ స్నేహితురాలో! ఇద్దామని వచ్చాను" పేలవమైన స్వరంతో అన్నాడు.
"ఇటివ్వండి!"
తమ కిచులాటంతా అజిత్ విన్నాడనుకొంటే నీరజకు ప్రాణంలో ప్రాణం లేనట్టుగా అయింది. "మీరు విన్నట్టున్నారు! అఖిల న్మాట్లాదింది చాలా తప్ప! తన తప్పకు ఎప్పటిక్తేనా మీ ముందు ఒప్పకోనేలా చేస్తాను! పిలిచి, మీ మనసుకు కలిగించిన కష్టానికి నేను మనసారా క్షమాపణ కోరుతున్నాను, అజిత్ బాబూ!" అని వేడికోలుగా అంది.
"వస్తాను!" పాదాలలోకి శక్తి కూడదిసుకోంటున్నాట్టుగా కదిలాడు.
అఖిలకూడా అతడిని చూసింది. అతడి మాటలు వింది. కొద్దిగా వివర్ణమ్తెంది ఆమె ముఖం!
అజిత్ కారుకదిలి వెళ్ళిపోయాక, నీరజ తారాజువ్వలా వచ్చింది లోపలికి "ఇప్పుడు చల్లబడిందా నీ మనసు? నువ్విచ్చిన బహుమతికి అతడు తలక్రిందుల్తే పోయాడు తెలుసా?"
"క్షమాపణ కోరావుగా? కాళ్ళు మళ్ళి నేలకు ఆనే ఉంటాయిలే!"
"సిగ్గులేదూ, మళ్ళి మాట్లాడడానికి?"
"అంత సిగ్గులేని మాటలు నేనేం మాట్లాడలేదు!" అఖిల రోషంతో ముఖం త్రిప్పకోంది. "అతడి కారులో వెళ్ళాలని ఉబలాటపడింది నువ్వు! అతడి ఆతిధ్యానికి మురిసి ముక్కల్తెంది నువ్వు!నువ్వు లాక్కువెడితే బలవంతానికి వచ్చాను! అతడంటే నీకున్న అభిమానం నాకేం లేదు!"
నీరాజ నిర్ఘాంతపోయింది! "కాస్సేపుపోతే అతడికి నాకూ ఏదో సంబంధం కూడా అంటకట్టేట్టున్నావే!"
"మరి అంతసంకుచితురాలీని ఏంకాదు"
"సంకుచితురాలివి కాకపోతే ఇందాక నువ్వన్నమాటలకి అర్ధం ఏమిటి?"
"ఏమిటి, ఇద్దరూ ఏదో తగవులాడుతున్నరు?" అంటూ పిన్నిగారు రావడంతో టక్కున నోరుమూసేసి, బట్టలు తీసుకొని దొడ్లోకి వెళ్ళి పోయింది నీరజ.
"నీకు కావలసినవాడంది నీరజ! ఎలా కావలసినవాడంటే చెప్పలేదు!"
పిన్నిగారి ప్రశ్నకు గతుక్కుమంది అఖిల. నాకేం కావలసినవాడు కాదంటే అతడి కారులొ ఎలా దిగారని అడుగుతుంది.
అతడితో తమకున్న బందుత్వాన్ని చెప్పకోవాలంటే సిగ్గుచేటుగా ఉంది. బస్సులో వస్తే ఈ బాధంతా లేకపోవునుకదా? ఆ ముసలావిడ అభిమానంకూలా, తమని కార౫ఉలొ పంపెదాకా వదలలేదు. ఇప్పుడు చూడు ఈ తంటా, ఈ నీరజమాత్రం! ఎవరో తెలిసినవాడని చెబితేపోయేదానికి అఖిలకు కావలసిన వాడని ఎందుకు చెప్పాలి?"
"మా నాన్నగారి మేనత్తకి మనుమడు, పిన్నిగారూ!" అంది ముక్త సరిగా.
పిన్నిగారి ముఖం హఠాత్తుగా వెలిగిపోయింది. "మీ నాన్నగారికి ఉన్న మేనత్త ఒక్కతెగా? యశోదమ్మ నాకు బాగా తెలుసు! ఆవిడ కొడుకేగా, మీ త్రిపురత్త బ్రతుకు బండలుచేసింది ఆవిడకి మనుమడంటే మళ్ళి పెళ్ళి చేసుకోన్నదానికి పుట్టినవాడే కదా? ఆవిడ మనకులం కాదుగా?"
"వాళ్ళు రెడ్డిస్, పిన్నిగారూ!"


