Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4


    ఆవేశం తగ్గింది. పరిస్థితిని ఆలోచించే శక్తి చేకూరింది. తనను తను సంబాళించుకుంది. అనూరాధ ఒక్కసారిగా ప్రసాదు బాహుబంధాన్ని విడిపించుకుని దూరంగా జరిగి కూర్చుంది.

 

    ప్రసాదుకు ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేదు. తలవంచుకొని కూర్చున్న ప్రసాదు చెక్కిళ్ళమీద కన్నీటి బొట్లు అద్దంమీద వానజల్లు పడినట్లు దొర్లుతున్నాయి. అనూరాధ రెప్పవేయకుండా ప్రసాదునే చూస్తూ కూర్చుంది. ఆమె ముఖంలో ఎలాంటి ఆవేశంగాని, కోపంగాని లేదు. మంచివాని మనస్సులా అతి నిర్మలంగా వుంది ఆమె ముఖం. ఆమె కళ్ళలో మాత్రం 'ఇదంతా నిజమేనా' అనే సందేహం, ఆ సందేహాన్ని నిజంగా తీర్చుకోవాలనే తహ తహ కనిపిస్తుంది. కలగాపులగంగా నెరసిన జుట్టును, వయస్సు తెచ్చిన మార్పులతో పరిపక్వత చెందిన విశిష్టమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా కనిపిస్తున్న ప్రసాదరావు రూపాన్ని ఆనాటి యువకుడుగా తనకు పరిచయమైన ప్రసాదు రూపంతో పోల్చుకుంటూ కూర్చుంది అనూరాధ.    

 

    కళ్ళకు కండువా అడ్డం పెట్టుకుని మౌనంగా రోదిస్తున్న ప్రసాదు చెయ్యి పట్టుకొని "ఛ. అదేమిటి! అలా ఆడపిల్లలా మీరు ఏడవటం బాగాలేదు" అంది మందలిస్తున్నట్లు. ఆ మందలింపులోని ఆత్మీయతకు ప్రసాదరావుకు దుఃఖం పొర్లుకొచ్చింది. కాని నిభాయించుకొని కళ్ళు తుడుచుకున్నాడు. అదోలా అనూరాధ ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా వుంది. ప్రసాదు ఆవేశంతో ఆమె చేతిని పట్టుకొని "నన్ను క్షమించగలవా అనూ?" అన్నాడు ప్రాధేయపడుతూ.   

 

    అనూరాధ నిస్మయంగా ప్రసాదు ముఖంలోకి చూసింది. చిన్నగా తన చేతిని అతని చేతినుంచి లాక్కుంది. తను ప్రసాదును క్షమించగలదా? క్షమించే తప్పేనా అతను చేసింది? ఎంత తేలికగా క్షమించమని అడుగుతున్నాడు? ఆ మాట తను అనగలిగినా, వ్యర్థమయిపోయిన తన నిండు జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా? అప్పుడే రేఖలు విప్పుకుంటున్న మొగ్గను నిర్దయగా నలిపి దుమ్ములో పారవేశాడు. దాన్ని మళ్ళీ వికసించేలా చేసే శక్తి అతనిలో వుందా? నిండు పాలకుండలాంటి తన జీవితాన్ని నిర్లక్ష్యంగా తన్ని వెళ్ళిపోయాడే! ఆ ఒలికిపోయిన పాలను మళ్ళీ నింపగలడా? ప్రసాదు తన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాడు. కాని తన నిండు జీవితాన్ని - తన ఇరవై సంవత్సరాల యౌవనాన్ని - తిరిగి తనకు ఎక్కడనుంచి తెచ్చి ఇవ్వగలడు? తనలో అతన్ని క్షమించే శక్తి లేదు. క్షమించదు! క్షమించలేదు!

 

    "నేను దుర్మార్గుణ్ణి. నేను నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించవా అనూ?" ప్రసాదు కంఠం బొంగురుపోయింది.

 

    అనూరాధ అదోలా నవ్వింది. ఆ నవ్వు ప్రసాదును "నిన్ను క్షమించాలా?" అని సవాలు చేసినట్లనిపించింది.

 

    "అవును. నేను చేసిన పాపానికి క్షమాపణ లేదు. నన్ను క్షమించకు - శిక్షించు. నా పాపానికి పరిష్కారం చెప్పు. నన్ను నిందించు. నన్ను క్షమించవద్దు అనూ.... నాకు క్షమలేదు. నన్ను తిట్టు - కాని, అలా చూడకు. అలా నవ్వకు. నేను సహించలేను" అన్నాడు - అనూరాధ రెండు అరచేతులనూ పైకెత్తి తన ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ.  

 

    అనూరాధ తన చేతుల్ని లాక్కుంది. కన్నీటితో తడిచిన అరచేతులను చూసుకుంటూ కూర్చుంది.

 

    "నిజం అనూ! నా మాట నమ్మవూ? నీకు నేను కావాలని ద్రోహం చెయ్యలేదు. నా ప్రేమను శంకించకు."  

 

    అనూరాధ ఆశ్చర్యంగా ప్రసాదు ముఖంలోకి చూసింది. "ఇంకా నా దగ్గర ఏముందని అబద్ధాలాడుతున్నావు?" అనాలని అనిపించింది.

 

    "నా మాట నమ్మవూ? నిన్ను చూసిన క్షణంలోనే నాకు మతి పోయింది. జన్మజన్మాంతరాలుగా నాతో  వుంటూ నన్ను విడిచిపోయిన వస్తువేదో అకస్మాత్తుగా మళ్ళీ నాకు లభించినట్లనిపించింది. నేను కాలేజీలో చదివే రోజుల్లో కూడా ఆడపిల్లలవైపు చూసిన పాపాన పోలేదు. కాని నిన్ను చూసిన ఆ క్షణం నాకు కలిగిన అనుభూతి చాలు - ఒక జీవితానికి. నీవు లేకుండా నేను లేను, వుండను - అనుకున్నాను. అందువల్లనే అప్పటికి నాకు వివాహం అయినట్లు నీకు చెప్పలేకపోయాను. అది చాలు పెద్ద తప్పే. కాని, నిన్ను ఏనాడూ వ్యామోహ దృష్టితో చూడలేదు. గుడిలోని దేవతలా గుండెల్లోనే నీ రూపాన్ని నిలుపుకొని పూజించుకోవాలనుకున్నాను."

 

    ప్రసాదు ఓ క్షణం ఆగాడు. అనూరాధ మౌనంగా చూస్తూ కూర్చుంది.

 

    "ఆనాటి రాత్రి నీ జీవితంలో కాళరాత్రిగా మారింది. రోజూలాగే ఆనాడు కూడా నువ్వు నా గదికి పాఠం చెప్పించుకోవటానికి వచ్చావు. ఆ రోజు తలంటి పోసుకున్నావు - వదులుగా జడ వేసుకున్నావు. ముఖంమీద కురులు...."

 

    "ఆగు. ఇంక చెప్పకు రాక్షసుడా!" అరవాలనిపించింది కానీ అనూరాధ గొంతు పెగల్లేదు.

 

    "ఆ నిముషంలో నాకు మతిపోయింది. ఎవరో మంత్రించినట్లు అయిపోయాను. వివేకం నశించింది. పశుత్వం విజృంభించింది. నేను అవివాహితుణ్ణని అనుకుంటున్న నువ్వుకూడా అంత అభ్యంతరం పెట్టలేదు. జరగరానిది జరిగిపోయింది-" వాక్ప్రవాహం ఆగిపోయింది. కొద్దిసేపు కణతలు నొక్కుకుంటూ కూర్చున్నాడు. రక్తనాళాలు తెగుతాయేమోనన్నంతగా తలలో పోటు ప్రారంభించింది.  

 

    "అంత జరిగిన తరవాత కూడా నేను వివాహితుడనని నీకు చెప్పలేదు. కారణం నిన్ను బాధపెట్టటం ఇష్టంలేకనే."

 

    అనూరాధ తిరస్కారంగా నవ్వింది.

 

    "అలా నవ్వకు. కావాలంటే తిట్టు, నీ చేత్తో యింత విషం తాగించు. కానీ నన్ను తిరస్కారంగా చూడకు. ఎగతాళిగా నవ్వకు. నేను చెప్పేది పూర్తిగా విను."

 

    -ఓ క్షణం ఆగి నిట్టూర్చాడు.

 

    ప్రసాదు మళ్ళీ ప్రారంభించాడు:

 

    "మరో నెలకల్లా బొంబాయిలో నా ట్రయినింగ్ పూర్తి అయి ఇంటికి వచ్చేశాను. వచ్చేప్పుడు నెలరోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళతానని చెప్పాను. ఆ మాట నేను నిజాయితీతోటే చెప్పాను - అలా చేద్దామనే ఉద్దేశంతోనే చెప్పాను."

 

    అనూరాధకు ఆశ్చర్యం కలిగింది. అప్పటికే వివాహితుడైనవాడు అలాగ చెయ్యటం సాధ్యమా? ఇది నమ్మవలసిందేనా?

 

    "నా భార్య చాలా ఉత్తమురాలు. నాకు చిన్న తలనొప్పి వచ్చినా భరించలేకపోయేది. నిన్ను చూసేనాటివరకూ నేను ఆమెను ప్రేమిస్తున్నాననే భ్రమపడ్డాను."

 

    అనూరాధ ముఖం చిట్లించుకుంది.

 

    "జరిగిన విషయం నా భార్యతో చెప్పి ఆమెను ఒప్పించి నిన్ను తీసుకెళదామనుకున్నాను."

 

    అనూరాధ ప్రసాదువైపు విస్మయంగా చూసింది.... భార్య, భర్త కోసం ఏమయినా చెయ్యగలదు. కాని, యిది మాత్రం.... తనే ఆమె స్థానంలోవుంటే ఛస్తే ఒప్పుకోదు. తననే దైవంలా భావించి పూజించే భార్యకు ఇంత దారుణమైన విషయం చెప్పగల మగవాణ్ణి ఏమని పిలవాలి?   

 

    ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ప్రసాదు మళ్ళీ ప్రారంభించాడు:

 

    "అప్పటికి రెండో వివాహం మీద నిషేధం లేదు. నా భార్యను ముందు వప్పించి నిన్ను రిజిష్టరు వివాహం చేసుకొని, తీసుకొని రావాలనుకున్నాను. తీరా వివాహం అయినాక తెలిసినా నీవు నన్ను క్షమించగలవనే ఆశతోనే అలా భావించాను. నేను నీ దృష్టిలో పరమ స్వార్థపరుడిగా కనిపించవచ్చును...." ప్రసాదరావు నిట్టూర్చి ఓ క్షణం ఆగిపోయాడు.

 

    "ఆ విషయాన్ని ఎప్పుడు నా భార్యకు చెప్పాలనుకొని, ఎంత ధైర్యాన్ని కూడదీసుకున్నా చెప్పలేకపోయాను. ఎప్పుడు చూసినా ఆమె సంతృప్తిగా అమృతపాత్రగా కనిపించేది. అందులో విష బిందువును కలపటానికి ధైర్యం చాలలేదు. ఇక లాభంలేదు. ఇద్దర్నీ మోసంచేస్తే కాని లాభం లేదనుకున్నాడు. నిన్ను వివాహం చేసుకొని తీసుకొచ్చి ఇద్దర్నీ ఒకేసారి ఒకరికొకర్ని పరిచయం చెయ్యాలనుకున్నాను. కాని, ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే పెనుగాలికి ఊగే వృక్షంలా అయిపోయేవాణ్ణి. చివరకు ముందు నీ దగ్గిర నిజం ఒప్పేసుకొని నీ సలహా ప్రకారం చేద్దామని నిర్ణయించుకున్నాను. సెలవు కూడా పెట్టాను. సెలవు ఇంకా మంజూరు కాలేదు. ఈ లోపల నా భార్యకు ఆకస్మాత్తుగా జబ్బుచేసింది. అది మశూచిగా తేలింది. అప్పటికే నాకు మూడు సంవత్సరాల ఆడపిల్ల వుంది. నా భార్య ఆ వ్యాధితోనే పోయింది. ఆమె పోయినప్పుడు నాకు కలుగవలసినంత బాధ కలగలేదేమని ఇప్పటికీ అనిపిస్తూ వుంటుంది.      

 

    "నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేస్తుంది కదూ! నా భార్య అలా ఆకస్మాత్తుగా పోవటం నేను చేసిన పాపానికి శిక్షగా భావించాను. అలా అసహ్యించుకున్నట్లు చూడకు అనూ! అది నేను భరించలేను. నేను చెప్పేదంతా విని, నాకు ఏ శిక్ష అయినా విధించు. మరో నెలకల్లా నీకోసం బొంబాయి బయలుదేరాను. విధి నా పాపానికి అతి క్రూరంగా శిక్షిస్తాడని వూహించుకోలేదు. కొత్త ఉత్సాహాన్ని కూడదీసుకొని నీకోసం బయలుదేరాను. నేను మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఇంట్లో లేరు. మీ అమ్మగారు నన్ను గుర్తించక పోవడం చూసి ఆశ్చర్యపోయాను. నీకోసం ముఖమంతా కళ్ళు చేసుకొని వాకిలివైపు చూస్తున్నాను. కర్టెన్ కదిలింది. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కాని నీకు బదులు వంటవాడు కనిపించాడు. నిన్ను పిలవమంటే - వాడే విషయమంతా చెప్పాడు. నీవు ఆకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయావని, మీ అమ్మగారికి మతిపోయిందనీ, మీ నాన్నగారు అవమానంతో, దుఃఖంతో కుమిలి కృశించిపోతున్నారని చెప్పాడు. అది విన్న నా మానసిక పరిస్థితిని గురించి వూహించుకోవలసిందేకాని చెప్పలేను. అప్పటినుండి దాదాపు రెండు మూడు సంవత్సరాలు నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకోవడం మానేశాను. నిండా ముప్ఫయ్ సంవత్సరాలు లేని నన్నుఅందరూ మళ్ళీ వివాహం చేసుకోమని బలవంతం చేశారు. కాని, ఆ మాట వినడం కూడా సహించలేకపోయాను. ఆ రోజునుంచి నిన్ను తలచుకొని బాధపడని రాత్రి, నన్ను నేను అసహ్యించుకోని రోజు లేదు. నా బిడ్డకోసం బతకవలసి వచ్చింది..." ప్రసాదు స్వరం దుఃఖంతో పూడుకుపోయింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra