Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    "రామరాజు చెప్పిన విషయాలు కూడా భ్రమేనా మహీ? నా కోసం, స్వార్థపరుడైన నా భర్త కోసం  నీ జీవితాన్నే బలి తీసుకోవటం కూడా భ్రమే అనుకోవాలా?" ఆమె రెట్టించి అడిగింది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోతున్నట్టు అనిపించసాగింది. "సిరీ, ఎందుకు అంతంత పెద్ద మాటలు! నా చేతనైన సహాయం చేయబోయాను. చిన్న ప్రమాదం జరిగిందంతే. దానికి నువ్వింత వర్రీ అవుతావు దేనికి? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనం బాధపడి మనుషులూ, ఆరోగ్యాలూ పాడు చేసుకోవటం తప్ప ఏముంది?" అనునయంగా చెప్పబోయాడు.

    "చిన్న ప్రమాదం. అవును చిన్న ప్రమాదమే కదూ? సుఖంగా సంసారం చేసుకోడానికి పనికి రాకపోవటం చిన్న ప్రమాదమే. ముఫ్పై ఏళ్ళు కూడా  దాటకముందే నువ్వు నూరు సంవత్సరాల జీవితాన్నీ పోగొట్టుకోవడమూ చిన్న  ప్రమాదమే కదూ?" ఆమె రెట్టించింది. "నీకు తెలుసా? నా భర్త నిన్ను చంపించ బోయాడు."

    దానికి అతను సమాధానం చెప్పలేకపోయాడు. దుఃఖమూ, ఆవేశమూ పొంగిపొర్లగా "ఇంత జరిగినా నా కోసం. నా మీద  ఉన్న ప్రేమ కోసం నీ జీవితాన్నే ధారపోస్తావా?" అంటూ ఒక్క  ఉదుటున మంచం దిగి అతని పాదాలు స్పృశించబోయింది.

    "ప్లీజ్ సిరీ!" అతను వారించబోయాడు.

    ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ అతని చేతుల్లో వాలిపోయింది. కూర్చున్న అతను చేసేదిలేక ఆమెనలాగే పొదివి పట్టుకున్నాడు. మెల్లమెల్లగా ఆమె అతని ఒడిలో ఒదిగిపోయి దుఃఖించసాగింది.

    సరిగ్గా అప్పుడే రవితేజ ఆ గదిలో అడుగుపెట్టాడు.

    వారిద్దర్నీ ఆ స్థితిలో చూసి, అతడు చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనుదిరిగాడు.


                             12

    "సర్" అంటూ లోపలికి ప్రవేశించాడు రవితేజ. ఫైల్ చూస్తున్న అశ్వత్ధామ తలెత్తి "కూర్చో రవితేజ" అన్నాడు ఎదురుసీటు చూపిస్తూ. రవితేజ చేతిలో ఒక ఫైలుంది.

    "చిన్న పొరపాటు జరిగింది సర్"

    "ఏమిటది?"

    "మా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న మహర్షి ఎవరోకాదు. భార్యని హత్య చేసిన నేరం మీద ఉరిశిక్ష పడిన ఖైదీ."

    "వ్వాట్?"

    "అవును సర్. అతను జైల్లోంచి తప్పించుకుని మా దగ్గిర వచ్చి చేరాడు. పోలీసాఫీసర్ని అయ్యుండి ఈ విషయం ఇంత కాలం కనుక్కోలేక పోవటం నా పొరపాటు. ఐయాం సారీ సర్" అన్నాడు. అశ్వత్ధామ కంగారుగా "నువ్వు చెప్తున్నదంతా నిజమేనా రవితేజా?" అని అడిగాడు.

    "అవును సర్. ఆ అనుమానం రాగానే నేను జైలునుంచి ఆ ఫైలు తెప్పించాను. ఇదిగో ఫోటో చూడండి" అంటూ తనతో పాటు తీసుకొచ్చిన ఫైలు ఆయన ముందుకు తోశాడు. అశ్వత్ధామ. దాన్నందుకొని ఫోటో పరిశీలించి చూశాడు. కుర్చీ వెనక్కి వాలుతూ "మైగాడ్!" అన్నాడు.

    "ఒక హంతకుడ్ని ఇంతకాలం మీ ఇంట్లో మీతోపాటు ఉంచుకున్నారన్న మాట."

    "అవును సర్. అందుకు సిగ్గుపడుతున్నాను కూడా"

    "నువ్వేం చేయగలవు రవీ! అసలు స్వరూపం తెలిసేవరకూ అందరూ మామూలు మనుషుల్లానే కనబడతారుకదా. మనం ఇమ్మిడియేట్ గా వాణ్ణి అరెస్ట్ చేయాలి."

    "మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే ఇన్ స్పెక్టర్ని పంపిస్తాను."

    "దీనికి పర్మిషన్ ఎందుకు? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మనకీ విషయం తెలిసిందని ఆ మహర్షికి అనుమానం రాకముందే, తగినంత బలగాన్నిచ్చి ఇన్ స్పెక్టర్ని పంపించు. ఇలా పోలీసు ఫోర్స్ వస్తుందన్న విషయం అక్కడ ఎవరికీ అనుమానం రాకూడదు. ఏ మాత్రం తెలిసినా అతడు మళ్ళీ తప్పించుకుంటాడు" వెంట వెంటనే ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ అన్నాడు అశ్వత్ధామ.

     రవితేజ లేస్తూ "యస్ సర్" అన్నాడు. అతడు గుమ్మం దగ్గరికి వెళ్తూండగా "రవీ" అని పిలిచాడు అశ్వత్ధామ. రవితేజ వెనక్కి తిరిగి అటెన్షన్ లోకొచ్చి "సర్" అన్నాడు.

    "ఆ మహర్షి ఏ మాత్రం ప్రతిఘటించినా షూట్ హిమ్ ఎట్ సైట్ అని నేను ఆర్డరిచ్చానని చెప్పు."

    "అలాగే సర్" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు రవితేజ.

   
                                                  *    *    *

    తలుపు మీద చప్పుడవటంతో "కమిన్" అంది సిరిచందన.

    మహర్షి లోపలికి ప్రవేశించాడు. అతడు తయారై ఉండటం చూసి "ఎక్కడికి వెళుతున్నావ్?" అని అడిగింది. మహర్షి మాట్లాడలేదు.
   
    ఎక్కడికని చెబుతాడు? భార్యని చంపిన నేరానికి ఉరిశిక్ష అనుభవించడానికి వెళుతున్నానని చెబుతాడా? నిన్ను చూస్తూ ఇక్కడే ఉండిపోవాలని వున్నా బలవంతంగా కోరిక చంపుకొని వెళ్ళిపోతున్నానని చెబుతాడా?

    ఏమీ చెప్పలేక క్లుప్తంగా "ఎక్కడో ఓ చోటికి వెళ్ళిపోక తప్పదుగా?" అన్నాడు.

    "ఏం, ఇక్కడ బాగాలేదా?" అని అడిగిందామె.

    "అలా అని కాదు. వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలిగా? ఇక్కడ నా జాబ్  పూర్తయింది. ఒక మరో జాబ్  ఏదైనా వెతుక్కోవాలనుకుంటున్నాను అందుకే ఈ రోజు వెళ్ళి పోతాను."

    "అవసరంలేదు. మా డాడీకి చెప్పాను. ఆయన ఆఫీసులోనే ఏదో ఒకటి చూస్తారు. నువ్వెక్కడికో వెళ్ళి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు."

    అతనికి ఇరుక్కుపోతున్నట్టు అనిపించసాగింది. అయినా వెళ్ళాలన్న నిర్ణయం దృఢంగా ఏర్పడటంవల్ల "లేదు. ఇలా నిన్ను రవితేజను దూరంగా వుండటం చూస్తూ ఇక్కడ వుండలేను. వెళ్ళిపోతాను సిరీ, నన్ను బలవంతపెట్టకు" అన్నాడు. టాపిక్ తనకు తెలియకుండానే ఆమె పర్సనల్ మ్యాటర్ వైపు మారటం అతనికి నచ్చలేదు. కానీ ఎంతకాదనుకున్నా అది అటే వెళుతోంది. ఈ లోపులో ఆమె అంది-

    "ఆ విషయం వదిలెయ్ మహీ. నా మనసు విరిగిపోయింది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత, అనుబంధం ఉండాలి కానీ, దాపరికాలు కావు. ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో స్పష్టంగా చెబితే కాస్తయినా సంతోషించేదాన్ని. కానీ, ఎందుకో ఆయన  నా నుంచి అన్నీ దాస్తున్నారు అనిపిస్తోంది. అలా ఎవరి మనసులోవాళ్ళుతాము చేసేది కరక్టే భాగస్వామి నుండి అన్నీ దాచిపెడితే, ఇక ఆ కాపురానికి అర్థం ఏముంది?" ఆమె నిట్టూరుస్తూ అంది.

    "ఇందులో అతను దాచినదంటూ ఏముంది సిరీ? నువ్వే అనవసరంగా రవితేజని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది" అతను సర్ది చెప్పబోయాడు.

    "ఆ విషయం వద్దులే మహీ, నీ గురించి మాట్లాడుకుందాం. ఊ......చెప్పు, వెళ్ళాలన్న ఆలోచన మానుకున్నట్లేనా?"

    "లేదు సిరీ. నేను తప్పకుండా వెళ్ళితీరాలి. అక్కడ నా కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళున్నారు. తొందరవల్ల ఎవరికీ చెప్పి రాలేదు. నేను వెళ్తాను ప్లీజ్" అతను బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు.

    "నో! నిన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వను. నా కోసం ఎంతో చేశావు. నీ కోసం  కనీసం ఉద్యోగం చూడటమనే చిన్న పనైనా చేయనివ్వు. ప్లీజ్! ఇక్కడే వుండి వైద్యం కూడా చేయించుకుందువుగానీ."

    "ప్లీజ్ సిరీ, నేను చెప్పేది విను."

    "నేను వినను. ఇంకోసారి వెళతానంటే నేను చచ్చినంత ఒట్టే" ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది. అతను నిర్విణ్ణుడై ఆమె వైపు చూశాడు. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా అయిందతని పరిస్థితి. కళ్ళు రాగానే రవితేజ తనని గుర్తుపట్టాడనేది నిర్వివాదాంశం. అయినా అతడు తనని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణం కూడా అతను ఊహించగలడు. ఎప్పుడో ఒకప్పుడు రవితేజ అరెస్ట్ చేయించకమానడు. ఏం చేయాలి? అదే జరిగితే సిరిలో ఇప్పుడు తనపై ఏర్పడిన సదభిప్రాయం సమూలంగా తుడిచిపెట్టుకు పోతుంది. అది అలా వుంచితే ఇప్పటికే ఆమె రవితేజ మీద కోపంతో వుంది. తన విషయం బయటపడితే వెనువెంటనే శ్రీవాణి, రవిల సంబంధం బయటికి రాక తప్పదు. అప్పుడు ఆమె రవిని పూర్తిగా అసహ్యించు కుంటుంది. వద్దు, అలా జరగటానికి వీల్లేదు. తన జీవితం ఎలాగూ నాశనమైంది. కనీసం సిరి జీవితమైనా చక్కబడాలంటే, తను వెళ్ళాక తప్పదు. అతడు ఆలోచిస్తూ ఉండగా ఆమె అంది-

    "అవునూ, వచ్చిన దగ్గర్నించీ చూస్తున్నాను. నువ్వసలు బయటికి వెళ్ళవు దేనికి?"

    ఆమె నుండి ఆ ప్రశ్న వస్తుందని ఊహించని అతడు కాస్త తడబడ్డాడు. ఆమె అతన్ని అబ్జర్వ్ చేస్తుందన్న విషయం స్పష్టమైంది. తటబాటుని మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ "అబ్బే ఏంలేదు. నాకు చాలా ప్రశాంతంగా గడపటం అంటేనే ఇష్టం. బయటికెళితే ఏముంది......వాహనాల రొద, ఫ్యాక్టరీల పొగ. ఊరంతా కాలుష్యంతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా బయటికెళ్ళను" అన్నాడు.

    "చిత్రంగా వుందే! కాలేజిలో చదివే ఆ మహర్షివేనా నువ్వు?" ఆమె ఆశ్చర్యంగా ప్రశ్నించింది.

    "ఏం, మారువేషంలో వచ్చాననుకున్నావా?" అతను నవ్వుతూ అన్నాడు.

    ఆమెకూడా నవ్వి, "అలా అని కాదు. అబ్బ! నువ్వున్నావంటే అప్పట్లో కాలేజీలో ఎంత సందడిగా వుండేదో. అల్లరిలో అయినా, చదువులో అయినా  క్లాసులో మనిద్దరికేగా పోటీ? నీకు గుర్తుందా మహీ! ఆ రోజు తెలుగు మాస్టారు రాకపోతే మన మందరం క్లాసులో కూర్చుని కాబోయే లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో చర్చించుకున్నాం. సాదాసీదాగా ఉండే అమ్మాయి భార్యగా కావాలని నువ్వంటే, అప్పుడు నేను 'నీకు బాగా ఫాస్టు గర్ల్ దొరుకుతుందిలే" అని వెక్కిరించాను. ఆమె  గలగలా మాట్లాడుతూ అనాలోచితంగా అన్న చివరిమాట అతని గుండెల్లో సూటిగా దిగింది.

    శ్రీవాణి ఫాస్టు గర్లా?

    లేదు. ఖచ్చితంగా కాదు. అలా మార్చబడిందంతే. కాలేజీ వాతావరణం స్నేహితుల విచ్చలవిడితనం, తండ్రి ఆంక్షలూ, ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెలో ఇన్ ఫీరియారిటీ పెరిగిపోయి, అది కప్పిపుచ్చుకోవటం కోసం బలవంతంగా ఫాస్టునెస్ లోకి నెట్టబడింది. అంతే! అంతకుమించి ఆమె అమాయకురాలు.

    "హుష్..... మహీ.....ఓ మహీ, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావ్?" సిరిచందన అతని మొహం ముందు చేయి ఆడిస్తూ అంది. అతను శ్రీవాణి తాలూకు జ్ఞాపకం నుంచి తేరుకొని ఆమెవైపు చూసి, పెదవులపై చిరునవ్వు పులుముకుంటూ "అప్పట్లో నువ్వు ఎంత అల్లరి చేసేదానివో గుర్తుతెచ్చుకున్నాను" అన్నాడు.

    "ఏంటీ, ఇప్పుడు మాత్రం అల్లరి చేయటంలేదా ఏమిటి?"

    "ఎక్కడ? నీ కెప్పుడూ మీ ఆయనతో పోట్లాడటమే సరిపోయింది. ఇంక అల్లరి చేయటానికి సమయమెక్కడుంటుంది నీకు?"

    సడన్ గా సంభాషణ అటు వెళ్ళేసరికి ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. భర్త తాలూకు ప్రసక్తి రాగానే ఆమె కళ్ళల్లో నీలినీడలు కదలాడటం చూసిఅతని మనసు ద్రవించింది.

    "సిరీ!" ఆమె కళ్ళల్లోకి ఆత్మీయంగా చూస్తూ పిలిచాడు.

    "ఊ" ఆమె తలెత్తి మెల్లగా అంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra