బ్రతుకుతున్నాడా?

    కదులుతున్నాడా?

    ఇంపాజిబుల్... అయిదు నిముషాలక్రితం మరణించిన వాడు ఎలా బ్రతుకుతాడు ?

    అస్పాష్టమైన అయోమయపు భావాల్తో రవిశాస్త్రి అలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆస్పత్రి ముందు ఒక వాహనం ఆగింది. అందులోంచి ఒక లాల్చీ, పైజామా వ్యక్తి దిగి లోపలికి ప్రవేశించాడు.

    రవిశాస్త్రి దగ్గిరగా వచ్చాడు.

    విద్యాధరి అనుదీప్ శరీరం దగ్గిరకు వెళ్తూండగా నేలపై పడిపోయిన పుస్తకాన్ని వంగితీసుకుని వెనుదిరిగాడు. ఆ శబ్దానికి ఆలోచనల నుంచి తేరుకున్న రవిశాస్త్రి చప్పున "ఏయ్! ఎవరు మీరు? ఆ పుస్తకం మీరు తీసుకువెళ్తున్నారేమిటి?" అని గద్దించాడు.

    ఆ వ్యక్తి చిరునవ్వుతో, "ఈ పుస్తకం నాదే" అన్నాడు.

    "మీదా?"

    "అవును. ఆఖరిపేజీ పూర్తిచెయ్యాల్సిన బాధ్యత నామీద వున్నది కదా!"

    "ఆఖరి పేజీనా? ఏం పూర్తిచేస్తారు?"

    "అనుదీప్ బ్రతుకుతాడో లేదో"

    రవిశాస్త్రి అవాక్కయి చూస్తూండగా ఆ వ్యక్తి ఆస్పత్రి బయటకు నడిచాడు.

    అతడు తన వాహనంలో కూర్చుని, పబ్లిషర్ ఆఫీసుకి బయల్దేరాడు. అతడి పక్క సీట్లో ఆ థ్రిల్లర్ పుస్తకం కాగితాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. చివర్లో ఆఖరి పేజీ... ఖాళీగా...

    దాన్ని పూర్తిచెయ్యాల్సింది ఆ వ్యక్తే!

    ఆ వ్యక్తిని నేనే.

                                      యండమూరి వీరేంద్రనాథ్

                                           * * *

                                              చివరిగా ఒక్కమాట!

    ప్రతీ రచయితా ఎక్కడో ఒకచోట స్ఫూర్తి పొందుతాడు. ప్రకృతి, ఒక సాయంత్రం, ఒక పుస్తకం, ఒక సంఘటన, ఒక వ్యక్తి... ఇలాటివేమైనా ఆ స్పూర్తికి కారణం కావచ్చు. కాబోయే రచయితలు తమ నవలలు ప్లాన్ చేసుకోవటానికి ఇలాటి చివరిమాటలు ఉపయోగపడతాయని నా ఉద్దేశ్యం. "జయభారత జనయిత్రీ" అన్న దేవులపల్లి పాట "రాక్షసుడు" నవలకి ప్రేరణ అని, ఆ పుస్తకంలో కూడా వ్రాశాను. అయితే అందులో ఒక చిక్కుంది. ఇలా చివరిమాటలు వ్రాయొద్దని తణుకునుంచి ఒక అభిమాని ఉత్తరం వ్రాశాడు. "వీరేంద్రనాథ్. ఈసారి తెలుగులో వ్రాసినదాన్నే కాపీ కొట్టాడట. దేవులపల్లి అనే ఆయన వ్రాసిన నవలని తిరగ వ్రాశాడట-" అని ఎవరో ప్రచారం చేయటం దీనికి కారణం చాలా ఇరిటేషన్ కలిగింది. అయనెస్కో వ్రాసిన "దున్నపోతులు" అన్న అబ్సర్డ్ నాటకం గుర్తొచ్చింది. "అబ్సరిడిటీ" గురించిన అంకురం మనసులో అప్పుడు పడి వుండొచ్చు బహుశా.

                                                                *    *    *

    చాలా ఇళ్ళల్లో, ముఖ్యంగా పెద్ద కుటుంబాలున్న ఇళ్ళల్లో ఇంటెడు చాకిరీ ఒకరిమీదే పడుతుంది. మిగతావాళ్ళు పై ఎత్తున నుండి పైపై పనులు చేస్తూ వుంటారు. అది ముసలి అత్తగారు కావచ్చు, చిన్నకోడలు కావచ్చు, విధవరాలైన ఆడబడుచు కావచ్చు. జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ కళ్ళల్లో అలసటకన్నా- గుర్తింపు లేకపోవటంవల్ల వచ్చిన విషాదం ఎక్కువ కనపడుతుంది. నా చెల్లెలులాంటి అమ్మాయి చాలాకాలంగా ఈ విధంగా బాధపడటం నేను చూశాను. కుటుంబాల్లో, పైకి కనపడని వ్యాపార సంబంధాలమీద ఒక నవల వ్రాయాలని ఎప్పట్నుంచో ఒక పాత్రని సృష్టించాను. నవల ఫ్లోకి ఇది అడ్డు పడవచ్చు. కానీ దాన్ని తొలగించటానికి నేను ఒప్పుకోలేదు. నా ఉద్దేశ్యంలో ఈ నవలకి వెన్నెముక ఆ ఉత్తరమే. నాతో ఎందరు ఏకీభవిస్తారో మీరే చెప్పాలి.

                                                                  *    *    *

    చాలాకాలం క్రితం ఒక ఉత్తరం వచ్చింది. అడ్రసు లేదు.

    VIRENJI,
    I am in love with a guy ..... No, I was ..... ..... .........
    ......... ......... ......... ........ ........ ............
    A friend is one, in whose presence,
    You can kick off your shoes
    let your hair go
    where you can relax, confess, laugh, weep and sneeze, who can bear the worst you.

    మా స్నేహం మొదలై ఎన్ని రోజులయినా అలాటి పరిస్థితి నాకు రావటం లేదు. I am leaving him, and going insearch of clarifications ....
    
    ...... I dont know why I am writing this letter to you, surely not expecting a letter (as I am not giving my address) but to share the new born through. ఇలా సాగింది ఆ ఉత్తరం. అప్పటికే మరణమృదంగంలో ఇలాటి డిల్యూజన్స్ గురించి వ్రాసి వున్నాను కాబట్టి, ఈ అమ్మాయి కాన్ ఫ్లిక్ట్ కొత్తగా అనిపించలేదు... కానీ, ఏదో తెలియని ఇబ్బంది.... అర్థం చేసుకోలేకపోవటం గురించి.  

                                                                 *    *    *

    ఆ రాత్రి సరిగా నిద్రపట్టక "complete works of swamy vivekananda" చదవటం ప్రారంభించాను. అందులో కొన్ని పేరాగ్రాఫ్ లు నన్ను ఆకర్షించాయి.    

    Doctrine of love is declared in VEDAS..... Real love makes us unattched.... True love can never react so as to cause pain either to the lover or to the beloved.

    అరుణ పాత్రకి అనాలిసిస్, పై పేర్కొన్న అమ్మాయి వ్రాసిన ఉత్తరానికి సమాధానం నాకు ఆ రాత్రి లభించింది. తెలుగులో మొట్టమొదటి అసంగత నవలకి శ్రీకారం ఆ విధంగా అర్థరాత్రి ఒంటిగంటకు చుట్టబడింది. ఆ నవలే ఇప్పుడు మీరు చదివిన థ్రిల్లర్.

    థ్రిల్లర్ తాలూకు చివరి పేజీ వ్రాయవలసిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఆ రాత్రి నేను చదివిన దాన్ని, తెలుగులోకి అనువదించి మీ నుంచి శలవు తీసుకుంటాను.

    "ప్రేమ తాలూకు స్వరూపం వేదాల్లో వివరించబడింది. నిజమైన ప్రేమ మనిషిని బంధనాల నుంచి విడగొడుతుంది. ప్రేమలో బాధకి చోటులేదు. నువ్వేమీ ఆశించకపోతే నీకు బాధ ఎందుకు? .... .... ..... భార్యనీ పిల్లల్నీ ప్రేమించడంలో స్వార్థం లేదు. భౌతికమయిన దగ్గరితనం కావాలనుకోవటమే బాధకి నాంది. అందులో స్వార్థం వున్నది. కాబట్టి - వేల వేల మైళ్ళదూరంలో వున్నా ప్రేమని ప్రేమించేవారు బాధపడరు. వారు ఏమీ ఆశించరు. ప్రేమలో ఇవ్వటమే తప్ప తీసుకొనేది ఏమీ లేదు.

    ఒక స్త్రీని ఒక వ్యక్తి ప్రేమిస్తే. ఆమె తన దగ్గిరే వుండాలని, తను ఆమె స్వంతమనీ, అందువల్ల ఆమె తనకు స్వంతం అయివుండాలని అనుకుంటూ, ఆమె చుట్టూ బంధనాలు కల్గిస్తాడు. అది ప్రేమ ఎలా అవుతుంది.? ఒక మనిషిని శృంఖలాలతో బంధించి నీకు బానిసగా చేసుకుని నీ అభిరుచుల కనుగుణంగా నడవమన్నప్పుడు, ఆ మనిషి నిజంగా స్వేచ్చాజీవి అయితే, నిన్ను ప్రేమించడు. ద్వేషిస్తాడు. అలాంటి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకు నీ ప్రియుడుతోగానీ, ప్రియురాలితోగానీ పనిలేదు. అప్పుడు నీ ప్రేమ బంధనాలు తెంచుకుని విశ్వవ్యాప్తమవుతుంది. నీలో సంతోషమే తప్ప బాధ ప్రసక్తే రాదు. (స్వామి వివేకానంద)

                                                              *    *    *

    అనుదీప్ పాత్ర చెప్పేది అదే. ఎందరో మహానుభావులు. అర్థంచేసుకున్న వారందరికీ వందనాలు.

                                            యండమూరి వీరేంద్రనాథ్

                                        * THE END *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra