Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


    2. ఋభువులారా ! మీరు పరిపక్వ జ్ఞానము కలవారు. మాకు పూర్వులు. బంధువులు. సుధన్వపుత్రులు. మీరు సోమరసమును అభిలషించి తపస్సుచేయుటకు వెళ్లినారు. యజమాని మీకు హవిస్సులు ఇచ్చుటకు సోమము సిద్ధముచేసి ఉంచినాడు. మీరు మీ తపోమహిమతో యాగగృహమునకు విచ్చేయుడు.

    3. ఋభువులారా ! మీరు సూర్యునకు సోమపానము సమర్పించినారు. త్వష్ట నిర్మించిన ఒక్కపానపాత్రను నాలుగు చేసినారు. అపుడు మీకు సూర్యుడు దేవత్వము ఇచ్చినాడు.

    4. ఋత్విజులతో కూడిన ఋభువులు సత్కర్మలు చేసినారు. అందువలన వారు నరులయ్యు దేవతలు అయినారు. సుధన్వ పుత్రులగు ఋభువులు సూర్యసమానకాంతిగలవారలు అయినారు. యజ్ఞములందు హవిర్భాగములకు అర్హులు అయినారు.

    5. ఋభువులు త్వష్టచేసిన చమస పాత్రను, కొలత చేసినారు. అప్పుడు ఋభువులను స్తుతించినారు. వారు దేవతలలో ఉన్న హవిస్సులు కోరినారు.

    6. ఋభువులు జగత్పాలకుడయిన సూర్యుని మహిమను పొందినారు. స్వర్గసంబంధమగు హవిరూప అన్నమును పొందినారు. అట్టి అమర ఋభువుల కొఱకు హ్విసులు సిద్ధము చేతుము. స్తుతింతుము.

    7. ఋభువు మాకు ఇంద్రుడు. జీవనాధారమగు ధనమును ఇచ్చువాడు. మమ్ము బ్రతికించువాడు. మా కోర్కెలు తీర్చువాడు. దేవతలారా ! మీ రక్షణలతో మేము యాగవిరోధుల సేనలను యుద్ధమున ఎదిరింతుము.

    8. ఋభువులారా ! మీరు చర్మావశిష్టమైన గోవును బ్రతికించినారు. ఆ గోవును దూడతో కూర్చినారు. వృద్ధులగు తలిదండ్రులను పడుచువారినిగా చేసినారు.

    9. ఇంద్రా ! నీవు ఋభువులతో కూడి ఉన్నావు. అన్నదాన సమయమున మాకు కూడ అన్నము ప్రసాదించుము. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, అంతరిక్షము మమ్ము రక్షించవలెను.
 
        నూటపదకొండవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు
             దేవత - ఋభువు. ఛందస్సు - 1-4 జగతి. 5 త్రిష్టుప్.


    1. ఋభువులు గొప్పపనులు చేసినారు. అందమగు చక్రములు గల రథమును నిర్మించినారు. ఇంద్రుని వాహనములగు అశ్వములను సిద్ధము చేసినారు. తలిదండ్రులకు యవ్వనము కలిగించినారు. ఆవునకు దూడను కూర్చినారు.

    2. ఋభువులారా ! మా యజ్ఞము కొఱకు హవిస్సులు కలిగించుడు. సత్కర్మమునకుగాను మంచి పుత్ర పౌత్రులను, సంతానసహితులమయి జీవించుటకు ధనమును, బలమును ప్రసాదించుడు.

    3. ఋభువులారా ! మేము కర్మలు ఆచరించుటకు తగిన ధనము ప్రసాదించుడు. పుత్ర పౌత్రులకు ధనము ప్రసాదించుడు. అశ్వముల కొఱకు ధనము ప్రసాదించుడు. యుద్ధములందు బంధువునుకాని, ఇతరునికాని, మమ్ము లెక్క పెట్టని వానిని కాని మేము ఓడించవలెను.

    4. మా రక్షణకుగాను ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ఋభు, విభు, వాజులను మరుత్తులను ఆహ్వానించుచున్నాము. మిత్రావరుణులను, అశ్వినులను ఆహ్వానించుచున్నాము. వారందరు సోమపానము చేయవలెను. ఆ దేవతలు మమ్ము ధనార్జనకు, శత్రువును జయించుటకు ప్రోత్సహించవలెను.

    5. సుధన్వ పుత్రులలో మొదటివాడు ఋభువు. అతడు మాకు ధనమును, యుద్ధములకు అనుకూల పరిస్థితులు కల్పించవలెను. మూడవవాడగు వాజుడు మమ్ము రక్షించవలెను. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, పృథ్వి అంతరిక్షము రక్షించవలెను.

    ఆలోచనామృతము :-

    1. "8వ సూక్తము ఆలోచనామృతమున దేవతలలో మరికొందరిని చేర్చు ఆచారము ఉన్నట్లున్నది" అన్నాము. 22వ సూక్తమున ఋభువులు స్వశక్తితో దేవతలలో చేరినారు అన్నాము.

    2. ఈ సూత్రముల ద్రష్ట కుత్సుడు అంగిరస పుత్రుడు. సుధన్వుడు అంగిరస వంశపువాడు. అతనికి ముగ్గురు పుత్రులు 1. ఋభుడు. 2. విభుడు 3. వాజుడు ఈ ముగ్గురు ఋభువులు.

    3. ఋభువులు స్వశక్తితో అనేక ఘనకార్యములు చేసినారు. దేవతలలో స్థానము సాధించినారు. వారు తపస్సు చేసినట్లు చెప్పబడినది. అదియు అప్పటికి నూతనమయిట్లున్నది.

    4. 110వ సూత్రమున వారు చేసిన గొప్పకార్యములను గురించి చెప్పినాడు. 111వ దేవతలనువలె ఋభువులను ప్రార్థించినాడు.

    5. దేవతలు సత్కార్యములు చేయువారు. సత్కార్యములుచేసి దేవతలలో చేరుట సాధ్యమయినది.

    6. కుత్సితుడు అంగిరసుడు. తనవారలయిన ఋభువులకు ప్రాధాన్యత ఇచ్చి స్తుతించినాడు.

        నూట పన్నెండవ సూక్తము - ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
     దేవత-ద్యావాపృథ్వులు,అగ్ని,అశ్వినులు, ఛందస్సు 14,15 త్రిష్టుప్, మిగిలినవి జగతి.

    1. ముందు ద్యావా పృథ్వులను ప్రార్థించుచున్నాను. యాగమునకు వచ్చిన అశ్వినులను ప్రార్థించుచున్నాను. కాంతివంతమయి జ్వలించు అగ్నిని ప్రార్థించుచున్నాము. అశ్వినులు యుద్ధములందు జయము కలుగునట్లు శంఖధ్వానము చేతురు. అశ్వినులు సాధనములతో విచ్చేయవలెను. మమ్ము రక్షించవలెను. ఊతిభిరశ్వినాగతమ్.

    2. అశ్వినులారా ! మీరు స్తవనీయులు. అనాసక్తులు. పండితుడు వాక్కును గ్రహించినట్లు మీరు మీ రథమును అవలంబించినారు. కర్మలకొఱకు యాగములందు ఋత్విజులను రక్షింతురు. ఊతిభిరశ్వినాగతమ్.

    3. అశ్వినులారా ! మీరు యజ్ఞమును నెరవేర్చువారు. ద్యులోకమున పుట్టిన సోమపానము వలన మీరు బలవంతులు అయినారు. ఆ బలముననే ముల్లోకముల జనులకు శిక్షణ ఇచ్చుచున్నారు. ఆ బలముననే గొడ్డుటావును పాలు ఇచ్చునట్లు చేసినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    4. వాయువు తన పుత్రుడగు అగ్ని బలముతోకూడి ద్యులోక భూలోకములను నిర్మించినాడు. సూర్యుడు వేగవంతులలో వేగవంతుడు. పాకయజ్ఞ, హవిర్యజ్ఞ, సోమయజ్ఞములు ఎరిగి కక్షీవంతుడు ప్రజ్ఞావంతుడు అయినాడు. ఊతిభిరశ్వినాగతమ్.

    5. అశ్వినులారా ! బావిలోనికి త్రోయబడిన రేభరుషిని రక్షించినారు. బయటికి తీసినారు. వందనుడను రుషిని నీటినుండి బయటికి తీసినారు. అంధకారమున పడిన కణ్పరుషికి సూర్యుని తేజస్సు కనబరచినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    6. అంతకుని శత్రువులు బావిలో త్రోసినారు. అశ్వినులారా ! మీరు అతనిని రక్షించినారు. సముద్రమున త్రోయబడిన భుజ్యుని రక్షించినారు. కర్కంధవుని, వయ్యుని రక్షించినారు.ఊతిభిరశ్వినాగతమ్.

    7. అశ్వినులారా ! ధనముగల శుచంతుని మంచి సభలందు చేర్చినారు. ప్రవృంజనుడు అగ్నిలో తోయగా తపించుచున్న ఘర్ముని అత్రికొఱకు రక్షించినారు. పృశ్నిగుని, పురుకుత్సుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    8. కోర్కెలు తీర్చు అశ్వినులారా ! కుంటివాడగు పరావృతర్షిని రక్షించినారు. అంధర్షికి చూపు ప్రసాదించినారు. మోకాళ్లులేని శ్రోణర్షిని నడుచునట్లు చేసినారు. తోడేలు మ్రింగిన వర్తిక పక్షిని విడిపించినారు.ఊతిభిరశ్వినాగతమ్.

    9. ముదిమిరాని అశ్వినులారా ! నదులను మధుర ఉదకముల ప్రవాహముగ చేసినారు. వశిష్టుని సంతోష పరచినారు. కుత్సుని, శ్రుర్యుతుని, నర్యుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    10. ధనాపేక్ష గలిగి నడువలేనట్టిది విశ్పల. అశ్వినులారా ! మీరు ఆమెకు ధనమును కలుగచేసినారు. నడుచునట్లు చేసినారు. అశ్వుని పుత్రుని వశుడనుఋషిని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.   

    11. శుభప్రదులగు అశ్వినులారా ! యుశిజ అనునామె పుత్రుడు, వర్తకము చేయువాడు, దీర్ఘశ్రవుడను వాని కొఱకు వర్షము కురిపించి రక్షించినారు. కక్షీవంతుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    12. అశ్వినులారా ! ఎండిపోయిన నదిని నిండుగా పారునట్లు చేసినారు. గుఱ్ఱములు లేని మీ రథమును స్వయంచాలకము చేసినారు. కణ్వపుత్రుడు త్రిశోకుని గోవులను రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    13. అశ్వినులారా ! సూర్యుని రాహుగ్రహణమున రక్షించినారు. మాంధాత చేయు క్షేత్రపాలక యజ్ఞమును రక్షించినారు. భరద్వాజుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    14. దివోదాసుడు గొప్పవాడు. అతిథులను ఆదరించువాడు. రాక్షసులు అతనిని నీట త్రోసినారు. అతడు శంబరుని వధించునపుడు అశ్వినులు రక్షించినారు. పురుకుత్సరుషి పుత్రుడు త్రసదస్యుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    15. వమ్రుడను ఋషి భూసారము మాత్రము తినుచు అందరిచే కీర్తించబడినాడు. అతనిని అశ్వినులు రక్షించినారు. భార్యగల కతిరుషిని రక్షించినారు. గుఱ్ఱములు పోగొట్టుకున్న వేమపుత్రుడు పృథిరుషుని రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    16. పూర్వకాలమున శయుడను ఋషికి అశ్వినులు దుఃఖములేని మార్గము చూపినారు. ఆత్రేయునికొఱకు మార్గముకల్పించినారు. మనువునకు బ్రతుకు మార్గము చూపినారు. స్యూమరశ్మి అను ఋషికి వెదురు బాణము శత్రువుమీద ప్రయోగించుటను నేర్పినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    17. అశ్వినులు దేహబలము గల పఠర్వుడు అను రాజునకు యుద్ధమున కర్రలు అందించి రక్షించినారు. అతనిని యాగాగ్నివలె ప్రకాశింప చేసినారు. శర్యాతిని యుద్ధమునందు రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    18. అశ్వినులారా ! మిమ్ము అంగిరసులు స్తుతించుచున్నారు. మీరు పణి దాచిన గోవులను విడిపించుటకు ముందుగా వెళ్లినారు. శౌర్యవంతుడయిన మనువునకు విత్తనములు అందించి వ్యవసాయము చేయించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    19. అశ్వినులారా ! విమదుడను రాజునకు అతని భార్యకు సఖ్యత కూర్చినారు. స్తుతి కర్తలకు ఎర్రని గోవులను ప్రసాదించినారు. సుదాసునకు, ధనము ప్రసాదించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    20. అశ్వినులారా ! హవిస్సులు అందించు యజమానులకు సుఖములు ప్రసాదించుచున్నారు. భుజ్యుని, అధ్రిగుని ఋతస్తుప్పును రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్. 

    21. అశ్వినులారా ! కృశానుని యుద్ధమునందు రక్షించినారు. పురుకుత్సుని పొగరుబోతు గుఱ్ఱమును రక్షించినారు. మధుప్రియులకు తేనెను రక్షించినారు. ఊతిభిరశ్వినాగతమ్.

    22. అశ్వినులారా ! గోవులకై యుద్ధముచేయు యజమానిని రక్షింతురు. భూమికొఱకు, పుత్రులకొఱకు, ధనముకొఱకు పోరువారిని రక్షింతురు. యజమాని రథములను, అశ్వములను రక్షింతురు. యజమాని రథములను, అశ్వములను రక్షింతురు. ఊతిభిరశ్వినాగతమ్.

    23. బహువిధ కర్మలుగల అశ్వినులారా ! ఇంద్రపుత్రుడు కుత్సుని, తుర్వీతుని, దభీతిని, ధ్వంసంతిని, పురుహంతిని రక్షించిన రక్షణలతో ఊతిభిరశ్వినాగతమ్.

    24. వర్షకారకులు - శత్రునాశకులగు అశ్వినులారా ! మా వాక్కును విహితకర్మయుక్తనుచేయుడు. మా బుద్ధికి సర్వము తెలియునట్లు చేయుడు. మమ్ము రక్షించవలసినదని మిమ్ము ప్రాతఃకాలమున ప్రార్థించుచున్నాము. మాకు అభ్యుదయము కలిగించుడు. అన్నప్రదాతలు అగుడు.

    25. అశ్వినులారా ! రాత్రింబవళ్ళు మమ్ము రక్షింపుడు. బాధించక, ఉత్సాహము కలిగించు ధనమును ప్రసాదించుడు. వరుణుడు, మిత్రుడు, అదితి, సింధువు, భూమి ద్యులోకము మమ్ము రక్షించవలెను.

    ఆలోచనామృతము :

    1. అశ్వినులు చేసిన గొప్పపనులను వివరించినారు. ఈ సూక్తమును చెప్పిన వ్యక్తులందరి వివరములు అంతగా తెలియవు.

    (i) భుజ్యుడు, తుగ్రుడు అను రాజునకు పుత్రుడు. నావికాయుద్ధమున తుఫానువచ్చి అతని పడవ తలక్రిందులు అయినది. అశ్వినులు అతనిని రక్షించినారు.

    (ii) ఆత్రేయుడు ఋషి. అసురులు అతనిని వందద్వారముల గృహమున బంధించినారు. ప్రతి ద్వారముముందు మంటలు పెట్టినారు. అశ్వినులు వారిని కాపాడినారు.

    2. అశ్వినులు సాధించిన ప్రతి పనిని గురించి వివరముగా ఆలోచించవలసి ఉన్నది. వానిలో ముఖ్యములు.
(i) గుఱ్ఱములులేని స్వయంచాలక రథము. ఈనాటి మోటారు బండ్లవంటివి కావచ్చునేమో ! (ii) మనువునకు విత్తనములు ఇచ్చి వ్యవసాయము చేయించుట. (iii) 8వ మంత్రము మూకం కరోతివాచాలం శ్లోకమువలె ఉన్నది.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము ప్ర.మండలమున ఏడవ అధ్యాయము సమాప్తము.)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra