Home » Chandu harshavardhan » The Partner

 

    అప్పటి రూపానికి .....ఇప్పుడు తను చూస్తున్న రూపానికి ఉన్న తేడాను పోల్చుకో గలిగాడు.
    ఆమె డాన్స్ కు ప్రేక్షకులు అమోఘంగా రియాక్ట్ అవుతున్నారు.
    కేరింతలు ....చప్పట్లు కొడుతూ లేచి డాన్స్ చేయడం.....
    అంతా గజిబిజి గందరగోళం.....
    ఎలాంటి గొడవలూ చూడకుండా ......ప్రేక్షకులు రెచ్చిపోయి డయాస్ వైపు వెళ్ళకుండా సున్నితంగా కస్టమర్లను డీల్ చేయడం కూడా తన భాద్యతే కాబట్టి డయాస్ ముందు వైపు వున్నా కుర్చీల వైపు కదిలాడు సునిల్.
    ఓవర్ గా రియాక్ట్ అవుతున్న కస్టమర్లను సముదాయించి కూర్చో బెడుతున్నాడు.
    డోస్ ఎక్కువై ఒకళ్లిద్దరూ ఆమెను అందుకోవడానికి ముందుకు కదిలారు కానీ .......సునీల్ వాళ్ళను ఆపి తీసుకు వెళ్ళి వాళ్ళ కుర్చీలలో కుర్చోపెట్టాడు . అంతేకాదు వాళ్ళను కంట్రోల్ చేసే బాధ్యతను వాళ్ళ వాళ్ళ స్నేహితులకు అప్పజేబుతున్నాడు.
    మరలా కిక్కులో లేచి వెళ్ళాలని ప్రయత్నించినా సునిల్ కండలు తిరిగిన పర్శనాలిటీ చూసి ఎందుకులే అని తమ ప్రయత్నాన్ని విరమించుకుని మిన్నకుండి పోయారు.
    డాన్స్ చేస్తూనే మధ్య మధ్యలో సునిల్ ను గమనిస్తూనే వుంది.
    రెండు గంటల పాటు తన నృత్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది రేష్మా.
    ఆమె డాన్స్ అయిపోగానే తన గదికి వెళ్ళిపోయిందామే........
    రాత్రి పది గంటలు అవడంతో కస్టమర్లు బిల్లు పే చేసి నత్తనడకలా నెమ్మదిగా వెళ్ళిపోసాగారు.
    ఒక పావుగంట తరువాత రేష్మా నుంచి అతనికి కబురు వచ్చింది.
    ఆమె ఎందుకు పిలిచిందో ఏమో ....వెళదామా వద్దా అన్న సంశయంలో పడ్డాడు. అయినా మగబుద్దికి సర్ది చెప్పుకోలేక పోవడం వలన ఆమె గదివైపు నడిచాడు సునిల్.
    "కమాన్ హాండ్ సమ్ ......" అన్నది రేష్మా అతనిని చూడగానే.
    "నా పేరు సునిల్ .....! పేరుతొ పిలవవచ్చు" ఆమెను నఖ శిఖ పర్యంతం చూస్తూ అన్నాడు.
    "తెలుసు...! కానీ నేను నిన్ను అలానే పిలుస్తాను."
    ఇప్పుడు తిరిగి ఆమె చీరకట్టులోనే వున్నది.
    "మీరు ఏమనుకుంటున్నారో నేను వూహించగలను ....నేనూ మీ లానే ఈ బార్ లో పనిచేసే ఒక ఉద్యోగిని మాత్రమే.....చక్కగా చీర కట్టుకున్న ఈ అమ్మాయి ఉండీ లేనట్టున్న బట్టలతో అర్ధ నగ్నంగా చిందులు వేయకపోతే గౌరవంగా బతకవచ్చు కదా అనిపిస్తుంది నీకు......నేనూ మీలానే ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించాను, కానీ ప్రతి చోటా శీలానికి ఖరీదు కట్టేవాళ్ళు నాకు ఎదురయ్యారు తప్ప ఉద్యోగం దొరికే మార్గం కనిపించలేదు. నాపైన ఆధారపడి వున్న కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నాకుంది కాబట్టి మనస్సు చంపుకుని ఒకప్పుడు హాబీగా కాలేజిలో నేర్చుకున్న కాంపిటీషన్స్ లో పాల్గొన్నప్పుడు చేసిన డాన్స్ ఇది. కాకపోతే ఆ డాన్స్ ను ఇప్పుడు బార్ లో ఇలా అర్ధ నగ్నంగా ప్రదర్శించి సంపాదిస్తున్నాను. నేను చేస్తున్నది తప్పేమో.....నన్ను చూస్తుంటే మీకు అసహ్యం వేస్తుంది కదూ......."
    ఆమె అన్న చివరి మాటకు సునిల్ చలించిపోయాడు.
    పరిస్థితులకు బానిస అవడం తను మాత్రమే కాదు....... ఆమె కూడా ఉదాహరణ.....
    ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు సునీల్.
    "ఎనీ హౌ ....మీలో నేను ఒక మంచి స్నేహితుడిని చూస్తున్నాను. ఈ స్నేహ బంధం ఎప్పుడూ నిలవాలని కోరుకుందాం ఏమంటారు?"
    చిరునవ్వుతో తల ఊపాడు.
    "మన పరిచయానికి గుర్తుగా రేపు మధ్యాహ్నం నాతొ కలిసి భోజనం చేయాలి" అంది కవ్వింపుగా.
    "భోజనమా.......?"
    "ఎస్....భోజనమే ......ఖంగారు పడకండి ......మా ఇంటి దగ్గరే .... నేనే స్వహస్తాలతో చేసి మీకు వడ్డిస్తాను,  తప్పక రావాలి......."
    ఆమె అభ్యర్ధనను కాదనలేకపోయాడు.
    ఆప్యాయంగా పలకరించే స్నేహితురాలు దొరికినప్పుడు ఇలాంటి యాంత్రిక జీవనంలో అలాంటి మంచి స్నేహితురాలు తప్పక వుండవలసిందే అనుకుని అంగీకరించాడతను.
    ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళారు.
    "సునిల్ ! మీరు వుండేదెక్కడ?"
    ఉన్నట్టుండి ప్రశ్నించింది రేష్మా.
    తను ఉండే అడ్రస్ చెప్పాడు సునిల్.
    "నేను ఏదో ఒక అటో ఎక్కి వెళ్ళి పోతాను హెండ్ సమ్.....
    బైబై....." అంటూ రోడ్ వైపు అడుగులు వేసింది రేష్మా.
    ఆమె చిరునవ్వులతో చేయి ఊపుతూనే నడుస్తున్నది.
    సునిల్ వెనుదిరిగాడు.
    అతను నాలుగు అడుగులు వేశాడో లేదో కేవుమన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది.
    "సునిల్ .....ప్లీజ్ సేవ్ మీ......"
    అది రేష్మా గొంతు.....
    ఆమెకు ఏమయిందో ననుకుంటూ చివాలున వెనుదిరిగాడు సునిల్.
    రేష్మా చుట్టూ నలుగురు యువకులు రౌండప్ చేసి ఉన్నారు. వాళ్ళ ప్రక్కనే అంబాసిడర్ కారు ఆగి వుంది.
    వాళ్ళలో ఒకడు పారిపోయే వీలులేకుండా రేష్మా చేయి పట్టుకుని వున్నాడు.
    మరొకడు ఆమె కేకలు పెట్టకుండా నోరు మూయడానికి ప్రయత్నిస్తున్నాడు.
    మిగిలిన ఇద్దరూ అప్పటికే ఆమెను శవాన్ని మోసుకు పోతున్నట్టు పైకి లేపి కారు వేపు అడుగులు వేశారు.
    ఆ దృశ్యం చూడడంతో కోపాన్ని తమాయించుకోలేకపోయాడు సునిల్.
    "రేయ్ స్కౌండ్రల్స్ వదలండిరా!" పెద్ద పులిలా గర్జిస్తూ రెండే రెండు అంగలలో వాళ్ళను సమీపించాడతను.
    "పోరా .....క్లబ్ లో వున్నంత వరకేరా నీ అధికారం బయటకు వచ్చాక మా ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు ఉంది. కాదు  కూడదని ముందు కొచ్చావో నీ ఎముకలో సున్నం మిగలదు. ఎందుకులే గొడవ పెంచుకోవడం అని క్లబ్ లో మౌనం వహిస్తే పెద్ద మొనగాడిలా ఫోజు పెడుతున్నావెంటి బే" వాళ్ళలో ఒకడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.
    వాళ్ళ ముఖాలను పరిశీలనగా చుసిన సునీల్ కు విషయం బోధపడింది.
    రేష్మా డాన్స్ జరిగేటప్పుడు ఈ నలుగురూ తాగిన మైకంలో డయాస్ వైపు వెళుతుంటే తను అడ్డుకున్నాడు. కోపంగా ఉరిమి చూసినా తను పట్టించుకోలేదు. ఏమనుకున్నారో ఏమో తమలో తాము గొణుక్కుంటూ కుర్చీలలో కూలబడ్డారు. అప్పుడు మౌనం దాల్చడానికి కారణం యిదన్న మాట!
    అయినా తన సహోద్యోగిని కాపాడవలసిన బాధ్యత తనకున్నది" పైపెచ్చు తనను ఒక అత్మీయురానిగా భావించిన రేష్మాను ఆ దుండగుల బారి నుంచి రక్షించడం తన కర్తవ్యమ్ కూడా.
    "సునిల్ ......ప్లీజ్ హెల్ప్ మీ!"
    ఆమె దీనంగా అభ్యర్ధిస్తున్నది.
    సునిల్ ఇక ఆగలేకపోయాడు.
    "చూడండి ఫ్రెండ్స్ ....మీరు తాగిన మైకంలో ఉన్నారు. మత్తులో మీరేం చేస్తున్నారో మీకు తెలియటం లేదు. ఆమె ఆ క్లబ్ లో పనిచేసే తోటి ఉద్యోగి , కైపు ఎక్కినప్పుడు ఎవరయినా మీలా ప్రవర్తిస్తుంటారు. అది మీ తప్పు కాదని నాకు తెలుస్యు. ఆమెను వదిలి వెళ్ళిపొండి. ,మీలాంటి మర్యదస్తులు చేసే పని కాదు ఇది.....' "కోపాన్ని నిగ్రహించుకుంటూ సాధ్యమయినంత సౌమ్యంగా నచ్చచెప్పే ప్రయత్నం చేశాడతను.
    "పోరా బేవ కూఫ్ ......మాకే నీతులు చెబుతున్నావు. మా సంగతి నీకు సరిగా తెలవదు బే మాటలు ఎక్కువగా చెప్పం.. అవసరం అనుకుంటే పీకాలె తెగ నరుకుతాం. ఈ పిట్ట మీద మాకు మనసయింది. మజా చేసుకోవడానికి తీసుకేళుతున్నాం, నీకు కూడా మాతో కలవాలని వుంటే చెప్పు. ఆఖరి చాన్స్ నీకే ఇస్తాం?" అంటూ వెకిలిగా నవ్వాడు మరొకడు.
    అతనితో శృతి కలిపారు మిగతా ముగ్గురు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra