Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    సిరి తేరుకుంటూ "ఇప్పుడు కోయపల్లెకు వద్దులే.....మరోసారివెళదాం" అంది.

    "ఏం....ఇక దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే!" అన్నాడతను.

    రావికూడా వారిస్తూ "ఆలీఖాన్ మామూలు వ్యక్తికాదు. రిటర్న్ లో  మనమీద ఎటాక్ చేయించొచ్చు" అన్నాడు.

    "ఏడిశాడు!" అన్నాడు మహర్షి.

    "ప్లీజ్.....నాకెందుకో భయంగా వుంది. వెనక్కీ వెళ్ళి పోదాం" అంది.

    "ఓ.కే. మీ ఇష్టం" అంటూ కారు వెనక్కీ తిప్పాడు మహర్షి.


                             9

    "రా మహీ...... నువ్వూ మాతో కలిసి టిఫిన్ చేద్దువుగానీ!" సిరి భర్తని తీసుకెళ్ళి ఛెయిర్ లో కూర్చోబెడుతూ అంది.

    అతను అప్పుడే హాల్లోకి అడుగుపెట్టాడు.

    "మీరు కానివ్వండి. నేను తర్వాత చేస్తాను" అన్నాడతను.

    "ఏం..... మాతో కలిసి తినకూడదా?" అంది ఆప్యాయంగా.

    "అలా అని కాదు....." అతనికేం సాకు చెప్పాలో అర్థం  కాలేదు.

    "రా మహర్షీ!" రావికూడా పిలవటంతో కూర్చోక తప్పలేదు. వెళ్ళి రవి కెదురుగా కూర్చున్నాడు.

    టిఫిన్ తింటోండగా, మధ్యలో, నేనీ రోజు ఒక్కడినే కోయపల్లెకి  వెళ్ళి రావాలనుకుంటున్నాను" అన్నాడు.

    "అందరం కలిసి వెళదాం" అంది సిరి.

    "వద్దు. మీరు బయటికి రావటం క్షేమం కాదు."

    "ఫరవాలేదు. మాకేం కాలేదు మహీ"

    "అదికాదు సిరీ! ఆ ఆలీఖాన్ మనం  ఎటువెళ్ళేది కూడా కనుక్కుని ఎటాక్  చేసాడంటే..... అతను సామాన్య మైన వ్యక్తి కాదనిపిస్తోంది. ఎందుకైనా మంచిది మీరు ఇల్లు కదలకుండా ఉంటే బావుంటుంది."

    "నిజమే. ఈసారికి మహర్షి ఒక్కడే వెళ్ళివస్తే బావుంటుంది" రవి అన్నాడు ఆమె మరిక తర్కించలేదు.

    మహర్షి పది గంటలకల్లా కార్లో బయలుదేరాడు కోయపల్లెకి.


                                                   *    *    *


    దాదాపు మూడు గంటలు ప్రయాణించిన తర్వాత పల్లెదగ్గరికి చేరుకున్నాడు. కారు వెళ్ళే రోడ్డు పల్లెవరకూ లేదు. దూరంగానే ఆపుచేసి అడవిలో నడవటం ప్రారంభించాడు. దాదాపు అరగంట నడచిన తర్వాత దూరంగా కోయపల్లె కనిపించింది.

    అక్కడ ఆడుకుంటున్న ఒక పల్లెవాణ్ణి పిలిచి " రామరాజుదొర ఎక్కడుంటాడు" అని అడిగాడు.

    "నాతోరా" అంటూ ఆ కుర్రవాడు గూడెం మధ్యకి తీసికెళ్ళాడు. మిగతా పాకలకన్నా కొంచెం ఎత్తుగా ఉన్న పాకదగ్గర నిలబడి "అయ్యా, అయ్యా....." అని అరిచాడు.

    లోపలినుంచి ఆరడుగుల పొడుగున్న ఒక వ్యక్తి బయటికొచ్చాడు. అతడి  వయసు ముఫ్ఫయ్ అయిదు, నలభై మధ్య ఉంటుంది. కండలు తిరిగిన శరీరం, మెడలో పులిగోరు, నడుముకి చిన్న వస్త్రంలాంటిది కట్టుకొని వున్నాడు. మహర్షి అతడ్ని చూసి "రామరాజుదొర అంటే మీరేనా?" అని అడిగాడు.

    "అవును. నువ్వేడనుంచి వచ్చినావు దొరా?" అని అడిగాడు.

    "నా పేరు మహర్షి. మీతో కొంచెం పనుండి వచ్చాను."

    "కూసో దొరా" అంటూ మంచం చూపించాడు. మహర్షి ఆ జోలెలాంటి మంచంమీద కూర్చున్నాడు. రామరాజు అతనికెదురుగా పాకముందున్న  రాతిమీద కూర్చున్నాడు. "చెప్పుదొరా! ఏం పని?"

    "నా స్నేహితుడికి ఒక ప్రమాదం జరిగి రెండు కళ్ళు పోయాయి. మీరు పుట్టుగుడ్డివాళ్ళకి కూడా కళ్ళు తెప్పిస్తారని విని వచ్చాను. " ఆ మాట వినగానే రామరాజు మోహంలో భావాలు మారాయి. "కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు తెప్పించటం చాలా కష్టం. అసాధ్యం" అన్నాడు.

    "కానే పుట్టుగుడ్డివాళ్ళకి కూడా మీరు కళ్ళు తెప్పించారని విన్నాను. మా స్నేహితుడు పైనుంచి  పడిపోయి మెదడుకి దెబ్బ తగిలి కళ్ళు పోగొట్టుకున్నాడు."

    రామరాజు తల అడ్డంగా ఊపుతూ "లాభంలేదు దొరా, మీ ఇంగ్లీషు మందులతోనే నయం చేసుకోవాలి" అంటూ ఇంకా మాట్లాడవల్సింది ఏమీ లేనట్టు లేచాడు.

    మహర్షి ప్రాధేయపడుతున్నట్టు "రామరాజు! దయచేసి నేను చెప్పేది విను. నేనెంతో నమ్మకంతో వచ్చాను. అక్కడ నా స్నేహితుడు, అతని భార్యా ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎలాగైనా నువ్వే నయం చేయాలి. ఎంత  డభ్భైనా  ఫరవాలేదు" అన్నాడు.

    "మీ డబ్బు మాకెందుకు పనికొస్తుంది దొరా! అందుకు కాదు- కళ్ళు  పోయినోళ్ళకి అవి తెప్పించటం చాలా కష్టం."

    "చాలా కష్టం అంటున్నావంటే అది సాధ్యం కాదనేగా! మహర్షి అడిగాడు.

    ఈ తర్కానికి రామరాజు దొరికిపోయినట్టు చివ్వున తల ఎత్తాడు. అతడి  మొహంలో కొద్దిగా కోపం కూడా కనపడింది. "అవును. అసాధ్యం కాదు. అసలు  మాకేదీ అసాధ్యం కాదు. కానీ, డానికి సరిపడా  మందులు సంపాదించాలంటే మేం  ప్రాణాలకు  తెగించాలి. ఆ మందు  దొరకదు. అసలు  దొరకటంలేదు. నేనా  వైద్యం మానేసి పది సంవత్సరాలైంది. ఒకసారి  ఇట్టాగే  ఆ మందుకోసం బయలుదేరి  నేను  నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను. లాభంలేదు దొరా- వెళ్ళిరండి"

    మహర్షి లేచి నిలబడి, అతని చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టు "రామారాజూ, నీకు కావాలంటే నా ప్రాణాలన్నా ఇస్తాను. నీతోపాటు నేనుకూడా వస్తాను. ఎలాగైనా ఆమందు సంపాదిద్దాం" అన్నాడు.

    రామరాజు చేతులు విడిపించుకుంటూ "లాభంలేదు దొరా- నవ్విడిసి పెట్టు" అని, ఇక  అతనికి మరి మాట్లాడటానికి అవకాశమివ్వకుండా అక్కడినుంచి లోపలికి వెళ్ళిపోయాడు.

    మహర్షి చాలాసేపు అలాగే నిలబడి ఉండిపోయాడు. కనబడినట్టే  కనబడి ఒక ఒయాసిస్సు అదృశ్యమైపోయి ఎండమావిగా మారిపోయినట్టు  అనిపించింది. అతడికి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. కాళ్ళీడ్చుకుంటూ అక్కడినుంచి వెనుదిరిగాడు.

    అడవిలో నడుస్తున్నాడన్న మాటేకానీ అతడి మనసు మనసులో లేదు. అనవసరమైన ఆశలు కల్పించి ఇప్పుడు వెళ్ళి ఆ దంపతులకి ఏం  సమాధానం చెబుతాడు?

    అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని అతడికనిపించింది. కానీ, తన కోసం  సిరిచందన ఎదురుచూస్తూ వుంటుందన్న ఒక్క కారణం అతణ్ణి నడిపిస్తోంది. అతడలా నడుస్తూ వుండగా అప్పుడు వినిపించింది అతనికా కేక!

    ముందు అతను పట్టించుకోలేదు. ఈ సారి మరింత గట్టిగాఅడివంతా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. అది ఒక స్త్రీ ఆర్తనాదం అని అర్థమై  అతడు చుట్టూ చూశాడు.

    చుట్టూ దట్టమైన రెల్లుపొదలు, పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉందా ప్రదేశం.

    మళ్ళీ ఇంకొకసారి కేక వినిపించింది. అతడు ఆ కేక వినిపించిన వైపు  పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరంనుంచి ఒక ఆటవిక యువతి వేగంగా పరుగెత్తుకు రావటం కనిపించింది.

    ఆమె అతన్ని గమనించకుండా ఎవరో తరుముకుంటూ వస్తున్నట్లు, భయాందోళనలతో కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొంది.

    ఆ నిర్జవ అడవిప్రాంతంలో నాగరికుడు కనిపించటంతో ఆమెకి ఆశ్చర్యం కలిగింది. కానీ దాన్ని భయం వెంటాడింది.

    "ఏమైంది?" అని అడిగాడతను.

    ఆమె చప్పున అతని వెనగ్గావస్తూ, తను పరిగెత్తుకొచ్చిన దిశవైపు వేలుపెట్టి చూపించింది.

    చెట్లమధ్య నించి తరుముకుంటూ వస్తుందొక ఎలుగుబంటు.

    అక్కడ ఒకరు కాక ఇద్దరు కనిపించటంతో అది అప్రయత్నంగా ఆగి, గుర్రుమంటూ చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగే వారివైపు వేయసాగింది.

    దాన్ని ఎలా  ఎదుర్కోవాలో అర్థంకాక కళ్ళ చివర్ల నుంచి దుంగలాంటిదేమన్నా కనిపిస్తుందేమోనని అతడు చూశాడు. అక్కడంతా ఎండుగడ్డి తప్ప మరేమీ కనిపించలేదు.

    అతనికేం చేయాలో అర్థంకాలేదు.

    కోయ యువతి అతని వెనకాల నిలబడి చూస్తూ వుంది.

    ఎలుగుబంటి దాడి చేయాలనుకుంటే పదడుగుల దూరం నుంచి ఒక్కసారి లంఘించి తన పంజాతో శత్రువు ప్రాణం నిలువునా తీస్తుంది.

    ఆ ఇద్దరూ కదలకుండా నిలబడి ఉండటం చూసి  డానికి ధైర్యం హెచ్చింది. ఒక్కసారిగా వారి  మీదకు  ఎగరబోయింది.

    అతడు చప్పున  ఆమెని చెట్టు చాటుకి లాగాడు.

    శత్రువు దిశ మార్చటంతో డానికి పట్టుదొరకక నేలమీద పడి, వెంటనే లేచి చెట్టు దగ్గరికొచ్చింది.

    మహర్షి ఆమెని తన  వెనక్కి లాక్కొని, ఎలుగుబంటి విసిరిన పంజాని గాలిలోనే ఒడిసి పట్టుకున్నాడు. అది రెండో పంజా  కూడా అతని మీదికి విసిరింది. ఒడుపుగా తప్పించుకొని దాని రెండో పంజా కూడా పట్టుకున్నాడు.

    ఎలుగుబంటికి, మహర్షికి మధ్య చెట్టు ఉండిపోయింది. అతడు  రెండు చేతులతోనూ ఎలుగుబంటి రెండు పంజాలూ పట్టుకొని దాన్ని  కదలకుండా చేసాడు. ఇప్పుడు చెట్టుకి ఇవతల  మహర్షి...... అవతల ఎలుగుబంటి ఉన్నాయి.

    అతడు కోయ వనితతో "నా ఫ్యాంటు జేబులో అగ్గిపెట్టె ఉంటుంది త్వరగా  తియ్యి" అన్నాడు.

    ఆమె చప్పున  అతని జేబులో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె తీసింది.

    "ఆ గడ్డంతా ఇక్కడవేసి అగ్గిపుల్లతో వెలిగించు" అన్నాడతను తొందర తొందరగా.

    ఆమె గబగబ వెళ్ళి ఎండుగడ్డి మొత్తం లాక్కొచ్చి చెట్టు చుట్టూ కుప్పలా పోసింది. అతను ఎలుగుబంటిని పట్టుకొని అలాగే నిలబడి  ఉన్నాడు. కానీ  ఈలోపు ఆ ఎలుగు తన వాడిగోళ్ళతో అతని చేతుల్ని గీరసాగింది.

    అతని చర్మమంతా చీరుకుపోయి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తోంది. కానీ అతడు మాత్రం పట్టు వదల్లేదు. ఏ క్షణమైతే అతడు దాన్ని  వదిలేస్తాడో అప్పుడు అదే తమ ప్రాణానికి ఆఖరి క్షణమవుతుందని అతనికి  తెలుసు. పళ్ళమధ్యలో బాధని అదిమిపెట్టి అతడు  దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచాడు. ఈ  లోపులో ఆమె అగ్గిపుల్ల తీసి వెలిగించింది. క్షణాల్లో గడ్డి అంటుకుని అక్కడంతా మంట వ్యాపించింది. మంటని చూస్తే ఎలుగుబంటికి భయం. తన చుట్టూ వ్యాపిస్తున్న మంటని చూసి అది గట్టిగా అరుస్తూ అతడి చేతుల్ని  బలంగా  విదిలించుకుంది.

    మరుక్షణం వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయింది.

    గాఢంగా విశ్వసిస్తూ మహర్షి ఆ యువతి దగ్గరకొచ్చాడు. అప్పుడు గమనించిందామె.

    అతడి చేతుల కంటిన రక్తం చూసి "అయ్యో!" అంటూ  గబగబా  వెళ్ళి ఏవేవో ఆకులు తీసుకొచ్చి, చేతుల్లోనే రంగరించి అతడి గాయాలమీద ఆ రసాన్ని పిండింది.

    బాధకు తాళలేక అతను "స్......" అన్నాడు.

    "తగ్గిపోద్ది దొరా. అవునూ, మీరీడకి ఎందుకొచ్చినారు?"

    "ఈ దారిన పోతూపోతూ నీ కేకలు విని వచ్చాను."

    "మీరే గనక రాకుంటే ఈ పూట ఆ ఎలుగొడ్డు బారిన పడేదాన్ని" అంటూ కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించింది.

    "ఫరవాలేదు. దానికేముంది- నువ్వొక్కదానివే వెళ్ళగలవా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra