Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    "నేనే వేగా  బి సెవెన్ ని" అంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అతడు నడుస్తున్నట్లుగా లేదు. గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది.

    "వీళ్ళు ప్లోటర్స్(Floaters)కాదుగదా, జూపిటర్ గ్రహంలో యిలాంటి మనుష్యులుండవచ్చని ఒకప్పుడు శాస్త్రజ్ఞులు అనుకునే వారట" యశ్వంత్ మనసులోనే అనుకున్నాడు. అతడి మనసులో భావం వేగాకి వెంటనే చేరిపోయింది.

    "మేము ప్లోటర్స్ కాము! మాలో కాస్త వాయురూపం ఎక్కువ వున్నమాట నిజమే. అలా అని పూర్తిగా  సింకర్స్ (బరువు ఎక్కువగా వుంచి నేల నానుకుని వుండేవాళ్ళు) కూడా కాము. మా గ్రహంలో వాతావరణం మీకున్నంత ఆకర్షణతో లేదు. అందువల్ల యిలాగున్నాం. మా గ్రహంలో వాతావరణం మీకున్నంత ఆకర్షణతో లేదు. అందువల్ల యిలాగున్నాం. మా గ్రహంమీద మీరు మామూలుగా నడవాలంటే యిలాంటి కవచాలు ధరించాలి."

    "ఏదేమైనా మీరు మాకు చేసిన సాయానికి కృతజ్ఞతలు. వాయుపుత్ర మాకంతా చెప్పాడు. మమ్మల్ని కాపాడినందు కెంతో బుణపడి వుంటాం" అన్నాడు యశ్వంత్.

    "మీరు పదే పదే మాకు కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం లేదు. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మా బాధ్యత. మా హక్కులెంత స్ట్రిక్టుగా సాధించుకుంటామో, బాధ్యతలను అంతకంత తప్పనిసరిగా పాటిస్తాం. కాబట్టి మాకు క్షమాపణలు, కృతజ్ఞతలు అవసరం వుండదు."

    "మేము మీ గ్రహాన్ని చూస్తే అవకాశం యివ్వగలరా?" అడిగాడు యశ్వంత్.

    "తప్పకుండా, కాని మీకు ఎక్కువ సమయంలేదు. వీలయినంత త్వరగా మీరు ఇంటర్  ప్లానెటరీ సొసైటీ వాళ్ళకు మీ నివేదిక సమర్పిస్తే మంచిది. మీరు వచ్చిన వార్త ఆల్ఫాగ్రహవాసులకు తెలిసిపోయే వుంటుంది. మీ కోసం ఎదురు చూస్తుంటారు."

    "నాదో సందేహం" అన్నాడు వాయుపుత్ర.

    "ఏమిటి?" అడిగాడు వేగా బి సెవెన్.

    "మీరు మా కోసం  ఇంత శ్రమ తీసుకుని ప్రాణాలు కాపాడారు. కాని ఆల్ఫాగ్రహవాసులు మొత్తం మా భూమినే నాశనం చేయాలనుకుంటున్నారు. ఎందువల్ల?"

    "దానికి సమాధానం వాళ్ళే చెప్తారు. ఒక్కమాట మాత్రం మీకు తెలియపరుస్తాను. ఇంటర్ ప్లానెటరీ సొసైటీ వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఒకవేళ అది మీకు వ్యతిరేకంగా వుంటే మేము ఎలాంటి సహాయం చెయ్యబోం కూడా. ఇక మనం బయలు దేరితే మంచిదనుకుంటాను."

    అతడు అందించిన దుస్తులు తీసుకున్నారు నలుగురూ. అల్యూమినియం ఫాయిల్ తో చేసినట్లు చాలా తేలిగ్గా వున్నాయవి. కాని వేసుకునేటప్పటికి శరీరాలు బరువెక్కిన ఫీలింగ్.

    మొదటిసారిగా వేగా గ్రహం నేలమీద కాలుపెడుతుంటే కాళ్ళు వణికాయి. భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో.....నక్షత్రాల సమీపంలో.....మనిషి ఊహ కందని ఆ సుదూర తీరాల్లో.....

    ..... ఆ నేలమీద నడుస్తుంటే భూమిమీద నడుస్తున్నట్లుగానే వుంది. బయటకు రాగానే తలలు ఎత్తి ఆకాశంలోకి చూశారు. ఆకాశంనిండా రంగు రంగుల హరివిల్లులు...... నాలుగు చందమామలు. అవి మిగతా నాలుగు గ్రహాలుగా గ్రహించారు. అందులో ఒకటి తమకు శత్రువైన ఆల్ఫాగ్రహవాసులది!

    వాహనం స్టార్ట్ చేసిన చప్పుడు కూడా లేదు. కాని చాలా  వేగంగా వెళుతున్నట్లు అర్థమయింది అందరికీ.

    "మీరు ఊహించింది నిజమే. మా వాహనాలు అన్నీ న్యూట్రాన్ శక్తితో నడుస్తాయి. అంతా ఆటోమేటిక్. అందువల్ల ఎలాంటి యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు" యశ్వంత్ మనసులో ప్రశ్నలకు జవాబు చెప్పాడు వేగా.

    కాసేపు ఎవరూ మాట్లాడలేదు. మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా వుండడం ఎంతటి అసాధ్యమో వాళ్ళకు అర్థం అవుతోంది. పదిహేనువేల సంవత్సరాలు ముందుకు వెళ్ళిన సైన్సుని వాళ్ళు చూస్తున్నారు.

    వాహనం ఊళ్ళోకి ప్రవేశించింది. ఎక్కడా  మల్టీస్టారీడ్ భవంతులు లేవు. ఇళ్ళన్నీ దాదాపు ఒకేమాదిరిగా వున్నాయి. కళ్ళు మిరుమిట్లు కొలిపే లైట్లు లేవు. కాని వెలుతురికి కొరతలేదు. రోడ్ల మీద వాహనాలు వస్తూపోతూ వున్నాయి. కాని ఎక్కడా శబ్దం లేదు. ప్రశాంతమైన ఆధునీకరణ అది.

    "మాకు రోజుకి దాదాపు ముప్ఫయి గంటలు. అందులో పదిహేను గంటలు అందరూ తప్పనిసరిగా కష్టపడి పని చెయ్యాల్సిందే. అంత కష్టపడితే గాని మాకు కావలిసింది సాధించుకోలేమని మీరు అనుకుంటే పొరపాటు. మా శక్తిని వినియోగించడానికి మాకు కావలసినంత న్యూట్రాన్ శక్తి వుంది. పక్కనే వున్న ఆండ్రోమేడా గాలక్సీ నించి తెచ్చుకున్నాం. అయినా అందరికీ ఒక వ్యాపకం వుంటుంది. ఆ తర్వాత మిగిలిన పదిహేను గంటలలో ఎనిమిది గంటలు విశ్రాంతి  తీసుకుంటాము. మిగిలిన ఏడు గంటలూ మా కుటుంబాల కోసం వినియోగించుకుంటాం. కుటుంబం అంటే పెళ్ళిళ్ళు అవీ వుండవు మాకు. అందర్నీ సమంగా చూస్తాం. పెద్దవాళ్ళు పనిలో వున్నంతసేపు అంటే  రోజుకి పదిహేను గంటలు పిల్లలంతా ఏ వయసు వాళ్ళైనా స్కూల్లో వుంటారు. వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ వుంటాయక్కడ. పెద్దవాళ్ళు యింటికి రాగానే  ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వదలబడతారు. భోజనం అంతా అన్నివేళలా అందరికీ ఫ్రీగా యివ్వబడుతుంది." వాహనం ఒకచోట ఆపి భోజనం పట్టుకొచ్చాడు వేగా. "తీసుకోండి. మీకు ఎలాంటి హాని కలించని పదార్థాల మావి. ఇవి తింటే హైపవర్ టెన్షన్ లు, గుండెజబ్బులు ఏవీ రావు. మా గ్రహవాసులకి శక్తి నివ్వడానికి తయారుచేయబడ్డాయి."

    చాలా రుచికరంగా వున్నాయా పదార్థాలు. నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి. కొంచెం తినగానే కడుపు నిండిపోయింది. వాళ్ళు మరొకటి గ్రహించారు. వేగా గ్రహవాసులకి దాహం లేదు. వాళ్ళది సలికాన్ సివిలిజేషన్ అయివుండవచ్చు.

    "తీరిక వేళ్ళల్లో మీవాళ్ళు ఎలాంటి వినోదాన్ని యిష్టపడతారు?" అడిగాడు నిఖిల్"

    తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూపించమంటారా?"

    "చూపించండి."

    వాహనంలో టీ.వీ. స్ర్కీన్ లాంటిది వెలిగింది. దానిమీద కనిపించే దృశ్యం వెంటనే అర్థంకాలేదు వాళ్ళకు. అది అర్థంకాగానే స్థాణువులై పోయారు. అదో పెద్ద హాలు నిండా జనం వున్నారు. కాని చెప్పులు తీసి విసురుకుంటున్నారు. కుర్చీల నెత్తి పడేస్తున్నారు గట్టిగా అరుచుకుంటున్నట్లు నోళ్ళు కదులుతున్నాయి.

    "అది మీ భూమిమీద  ఒకదేశపు పార్లమెంటు సమావేశం. దేశాన్ని అభివృద్ధి పరచడానికి శపథాలుచేసి ప్రజలచే ఎన్నికయిన వాళ్ళు వాళ్ళంతా. మేము చూసి ఆనందించడానికి ఇంతకంటే హాస్యసన్నివేశాలు ఏముంటాయి చెప్పండి. ఇది కాకుండా రకరకాల ఆటలు, పాటలతో చాలా త్వరగా గడిచిపోతుంది మాకు."

    "అంత నిశితంగా మా భూమిని గమనిస్తున్నారా మీరు?"

    "ఎప్పుడూ కాదు. చెప్పాంగా రోజుకి ఏడు నుంచి ఎనిమిదిగంటల వరకే మాకు విశ్రాంతి సమయం. అందులో కొంతసేపు ఇలాంటి దృశ్యాలు చూస్తాం" అని వెనుదిరిగాడు వేగా.

    "ఇక మనం వెనక్కు వెళదాం. మీరు వెంటనే మీ వాహనంలోనే అల్ఫాగ్రహానికి చేరుకుంటే మంచిది. డానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి" అన్నాడు వేగా బి సెవెన్. "మీకు ఐక్యరాజ్య సమితి వున్నట్లుగా మాకు ఇంటర్ ప్లానెటరీ సొసైటీ ఆ ఆల్ఫాగ్రహంలో వుంది. మా తరపున లాయర్లు కూడా వస్తారు. మీ వాదన  మీరు వినిపించవచ్చు."

    "మీ సహాయం మర్చిపోలేనిది. ఆల్ఫాగ్రహవాసులతో పోటీలో మాకు విజయం చేకూరే ఉపాయం చెప్పలేరా?" అడిగాడు నిఖిల్.

    "వాళ్ళ న్యూట్రాన్ శక్తి కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా మాత్రమే వుంది. వాళ్ళేదైనా శక్తి తెచ్చుకునే ప్రయత్నంలో వుంటే మేము వాళ్ళకు సహాయం చేయక తప్పదు.INTER GALAXY VOYAGEలో వాళ్ళు ఆండ్రోమేడా నించి న్యూట్రాన్ శక్తిని తెచ్చుకోవచ్చు. అయినా వాళ్ళు మీ సూర్యుడినే ఎన్నుకున్నరంటే దానికి కారణం వేరే వుంటుంది. అదేమిటో మీరే  తెలుసుకుంటే మంచిది."

    "వాళ్ళు మమ్మల్ని హిప్నాటైజ్ చేసి మాచేత  వాళ్ళకు కావలసిన విధంగా మాట్లాడిస్తే?" అడిగాడు యశ్వంత్.

    "అలాంటిదేం జరగదు. అయిదు గ్రహాలనించి అయిదుగురు జడ్జీలు వుంటారు. ఇంటర్ ప్లానెటరీ సొసైటీలో మీకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసే బాధ్యత వాళ్ళది. మా జడ్జితోపాటు నేనుకూడా వస్తాను."

    "మీరీ గ్రహానికి- ఐమీన్ దేశానికి అధికారా?" అడిగాడు వాయుపుత్ర.

    "ఏమీ  కాను. ఇక్కడ అధికారులంటూ వేరే వుండరు. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసేటప్పుడు అధికార్ల అవసరం వుండదు. అందరూ సమానమయిన తెలివితేటలు గలవాళ్ళే ఇక్కడ. మాకూ బాధ్యతలను సరిసమానంగా పంచే పరికరాలుంటాయి. ప్రస్తుతం మీ భూగ్రహవాసులని తీసుకొచ్చి ఇంటర్ ప్లానెటరీ సొసైటీ ముందుకు తీసుకెళ్ళే బాధ్యత నాకు అప్పగించబడింది అంతే" అన్నాడు వేగా బి సెవెన్.

    "మీరు కూడా మాతో ప్రయాణం చేస్తారా?"

    "లేదు. త్వరలో వచ్చి కలుసుకుంటాం. మీరు వెళ్ళవలసినదారి గురించి మీ కంప్యూటర్ కి ఫీడ్ చేసేశాం. ఇకపోతే మీ భాషలో చెప్పాలంటే ఒకటే వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. విష్ యు గుడ్ లక్" వేగా వెళ్ళిపోయాడు.

    సుహృద్భావ్ పైకి లేచింది.


                                                                               7

    ఇండోర్ స్టేడియం లాంటి పెద్ద హాలది. ఒక పక్కగా అయిదుగురు జడ్జీలు ఆసీనులయ్యారు. వారికి ఎడమపక్క భూమి నుంచి వచ్చిన నలుగురికి సోఫాల్లాంటివి అమర్చబడ్డాయి. కుడి వైపున ఒకటి కుర్చీలాంటిది వుంది. ఆల్ఫాగ్రహం నించి వాదించడానికి ఒకే వ్యక్తి వచ్చాడు. భూగ్రహవాసుల తరపున యశ్వంత్ ని ఎన్నుకొన్నారు.

    చూడడానికి వచ్చిన జనంతో హాలంతా నిండిపోయింది. వాళ్ళు వచ్చిన వాహనాలను గుర్తుపట్టాడు వాయుపుత్ర. అన్నీ వేర్వేరు అంతరిక్ష వాహనాలే. అంటే  అయిదు గ్రహాలనించి జనం వచ్చారన్నామాట. నిజమే. వాళ్ళ గ్రహాలలో ఇలాంటి సన్నివేశం మొదటిసారి కదా.

    వాదన మొదలవచ్చునన్నట్లు సన్నటి శబ్దం వచ్చింది. యశ్వంత్ మొదలుపెట్టాడు.

    "మాది భూమి. మా సౌరకుటుంబంలోని సూర్యుడి  శక్తిని వినియోగించు కోవడానికి ఎవరికైనా అభ్యంతరం వుంటే ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి తెలియచేయమని ఇచ్చిన సంకేతాల్ని మేము అందుకున్నాం. మా సౌరకుటుంబంలో నవగ్రహాలున్నా అందులో భూమి ఒక్కటే ప్రాణికోటికి నిలయం. ఆల్ఫాగ్రహవాసులు పరిశోధనకి వచ్చి, మా సూర్యుడి శక్తిని కొద్దిగా తెచ్చుకొన్నప్పుడే అంతరిక్షంలో తిరుగుతున్న మా  స్పేస్ సిటీ నాశనమైపోయింది. చాలా ప్రాణనష్టం జరిగింది. సూర్యుడిలో శక్తి తగ్గిపోయిన కొద్దీ ఆ ప్రభావం మా భూలోకవాసులమీద పడుతుంది. మా మానవజాతే నశించిపోతుంది. అందుకే మా భూలోకం తరపున మా సూర్యుడి నించి ఇకమీదట ఎలాంటి శక్తి తీసుకోరాదని ఆల్ఫాగ్రహవాసులకు విన్నవించు కుంటూ మా అభ్యర్థనని ప్లానెటరీ సొసైటీకి తెలియచేస్తున్నాం. మా విజ్ఞప్తిని పరిశీలించి మాకు న్యాయం చేకూర్చమని వేడుకుంటున్నాం." తమ డిఫెన్స్ వాదనని ముగించాడు యశ్వంత్.

    "మీ నిర్ణయం ఏమిటి? వాళ్ళ అభ్యర్థనని మన్నిస్తారా?" అడిగాడు ఒక జడ్జి ఆల్ఫాని.

    "మీకు తెలుసు మాకున్న నూట్రాన్ శక్తి బాగా తరిగిపోతూందని. ఈ గెలాక్సీలోనూ మన పక్కనున్న గెలాక్సీలోనూ కొన్ని లక్షల నక్షత్రాలున్నా మేము ఈ సూర్యుడినే ఎన్నుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటి కారణం: మిగతా వాటితో పోలిస్తే అది చిన్న నక్షత్రం. ఆ శక్తినంతా పదార్ధంగా మారిస్తే అది కేవలం రెండు మైళ్ళ చదరపు వస్తువుగా మారుతుంది. దాన్ని మా గ్రహానికి తరలించడం చాలా సులభం. పైగా సూర్యుడు సెకండ్ జనరేషన్ స్టార్. కాబట్టి మాకు వీళ్ళ సూర్యుడునే కొల్లగొట్టి తెచ్చుకోవడానికి అనుమతి నివ్వవలసిందిగా కోరుకుంటున్నాం" అన్నాడు ఆల్ఫా. యశ్వంత్ ఆవేశంగా, "ఇది అన్యాయం. సర్వప్రాణం సమానత్వం చాటుకునే మీరు, కేవలం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ సూర్యుడి శక్తిమీద కొన్ని కోట్ల జనాభావున్న ఓ గ్రహం ఆధారపడి వుందని తెలిసీ మీరీ నిర్ణయం తీసుకోవటం అమానుషం! అన్యాయం!! మా సూర్యుడినుంచి ఎలాంటి శక్తి తీసుకోవడాని మేము అంగీకరించం. ఈ విషయంలో మాకు న్యాయం కలిగేలా మీరే చేయాలి" యశ్వంత్ జడ్జీల నుద్దేశించి అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra