Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    అదే అతని జీవితంలో తగిలే గొప్ప షాక్..... అతని జీవితంలో ఆ ఇద్దరు స్త్రీలు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతారు. ఒకరు కన్నతల్లి మరొకరు కట్టుకోవాల్సిన ప్రియురాలు. ఒకరు అతని బాధ్యతారాహిత్యానికి సోమరి తాననికి, పిరికితనానికి శాశ్వతంగా దూరమైపోతే.....మరొకరు ఈ జన్మకు  దూరంకావటానికి సిద్ధంగా ఉన్నారు.

    అతనిలో ఆలోచనలు మొదలుకాగానే ఫ్లాష్ బ్యాక్ ని ఇంటర్ కట్స్ లో  చూపిస్తాం..... అప్పుడు చుట్టుప్రక్కలవాళ్లు అతన్ని ఉద్దేశించి చేసిన విమర్శల్ని విజువలైజ్ చేస్తాం....

    "ప్రపంచమంతా చైతన్యంతో అనవరతం శ్రమించి అపారమైన వస్తు సంపదల్ని సృష్టిస్తుంటే వీడు మాత్రం నిత్యం నిద్రలో, మత్తులో మంచానికి అడ్డంగా పడుకుండిపోతాడు"

    "పగవాడిక్కూడా ఇలాంటి వెధవల్ని కొడుకులుగా ప్రసాదించకు భగవంతుడా....."

    "ఇలాంటివాడ్ని చెట్టుకు తలక్రిందుగా వేలాడదీసి, బట్టలు విప్పదీసి చింతబరికెలతో తాటఊడేలా కొడితే తప్ప దారికిరాడు- అలా చేస్తే తప్ప సమాజానికి, దేశానికి పట్టిన దరిద్రంపోదు. ఇలాంటివాడు జపాన్ లో పుడితే రాళ్ళతో తరిమితరిమికొట్టి చంపేస్తారు....."

    "మన పిల్లలు...... వీడికి ఎదురుపడినా, చూసినా, చెడిపోతారు. చిన్నప్పటినుంచే ఇటుపుల్ల తీసి, అటు పెట్టటం కూడా చేయరు. దొంగలు, దుర్మార్గులు, క్రిమినల్స్ నుంచి మాత్రమే మన పిల్లల్ని దూరంగా ఉంచటం కాదు- ఇలాంటివాళ్ళనుంచి కూడా ఉంచాలి"

    "కన్నతల్లి గనుక కడుపులో దాచుకుందికాని- కన్నతండ్రయితే తాటవలిచేవాడే....."

    "కష్టపడే చేతులే కన్నవాళ్ళకు తలకొరివి పెట్టాలిగాని, కన్నవాళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని తెగనమ్ముకొని జల్సాచేసే వాడి చేతులు కాదు....."

    ఇలా చుట్టుప్రక్కలవాళ్లు అతన్ని నిరసిస్తుంటారు-అంటే అతనీ సమాజానికి ఎంత భారమైపోయాడో చూడండి-అలాంటి పాత్ర అది.

    తల్లిచితికి నిప్పంటించబోతూ సిగ్గుపడతాడు.

    ఆత్మశుద్ది చేసుకొంటేగాని అలాంటి గొప్పతల్లి శవానికి కర్మకాండ చేసే అర్హత. లభించదని మండేకట్టేతో తన చేతుల్ని కాల్చుకుంటాడు. ఆ పైనే తలకొరివి పెడతాడు. యిక అప్పటినుంచి- అప్పటివరకు నలుగురిమీద పడి బ్రతికిన తను ఆ నలుగురికి ఉపయోగపడాలని నిర్ణయించుకొంటాడు. ఇకా నిర్ణయానికి తిరుగుండదు-
   
    ఒక జేబుదొంగ చేసేది తప్పే అయినా కష్టపడి దొంగతనం చేసే కడుపునింపుకుంటాడు.

    పొలం ఎక్కువవుంటే సీలింగ్ నిబంధన..... స్థలం ఎక్కువుంటే అర్బన్ లాండ్ సీలింగ్.....బాగానే ఉంది.

    పిల్లలు ఎక్కువమంది పుట్టకుండా కుటుంబనియంత్రణ .....ఆదాయ మెక్కువయితే ఇన్ కమ్ టాక్స్..... మరి  సోమరిపోతుల్ని శిక్షించదేం ప్రభుత్వం.....? దేశాభివృద్ధికోసం జాతీయ స్రవంతిలో కలసి కష్టించని వ్యక్తికి మాతృదేశపుగాలి పీల్చేహక్కు నీరుతాగే హక్కు, తిండితేనే హక్కుల్ని ఎందుకివ్వాలి.....? ప్రతి ఒక్కరూ కష్టపడందే ఏ కుటుంబమైనా ముందుకెళ్ళగలదా? ఏ దేశమయినా పావర్టీలైన్ ని క్రాస్  చేయగలదా?..... లేదు. కళ్ళెదుట అన్యాయం జరుగుతున్నా చూస్తూ  ఊరుకున్నా నేరమే అవ్వాలి. ప్రతి పౌరుడు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కొన్ని సందర్భాలలో పోలీసుకావచ్చు తన కళ్ళెదుటే తప్పుచేసిన వ్యక్తిని అరెస్టుచేయవచ్చు. అయితే శిక్షించేహక్కు మాత్రం లేదు. ఆ నేరస్థుడ్ని చిట్టానికి అప్పగించాలి.

    తుఫాన్ వస్తే బాగుపడేది మంత్రులు, అధికారులు, ప్రభుత్వోద్యోగులు దాతలు బాధితుల కోసం ఇచ్చే విరాళాలు ఎక్కువశాతం వీళ్ళ కైంకర్యం అవుతాయి. వీళ్ళనే గోతికాడనక్కలనేది..... తప్పుడు  సంతకాలు, వెలి ముద్రలువేసి లక్షాధికారులైన ప్రభుత్వాధికారులు ఎంతమందో.....? ఇలాంటి అన్యాయాలపై తిరగబడతాడు.

    ఎందుకూ పనికిరాడనుకున్న స్టుపిడ్ అండ్ యూస్ లేస ఫెలో పూర్తిగా మారిపోయి, తనపేరుకు అర్థంచెప్పి. సమాజంలో జరిగే అక్రమాలపై, అన్యాయాలపై తిరగబడతాడు. ఒకమనిషి నిజంగా తలుచుకుంటే ఏం  సాధించగలడో నిరూపిస్తాడు......" అంది హంపీ ముగిస్తూ.

    ఆమె చెప్పిన తీరు..... ప్రశాంత్ ని - భవానీని ఉద్వేగానికి గురి చేసాయి. ఎంతగా ఆ పాత్రను జీర్ణించుకుంది......? ఎంత ఎమోషనల్ గా కరెక్టరైజ్ చేయగలిగింది......? వింటుంటేనే ఆ పాత్రపై అసహ్యం, కోపం కలిగాయి....... అంతగా జీర్ణించుకున్న ఆమె ఆ పాత్రకు ప్రాణంపోస్తే ఎంత మంది ఉలిక్కిపడతారు..... మరెంతమంది భుజాల్ని తడుముకుంటారు.....? ఇంకెంతమంది సిగ్గుతో చితికిపోతారు.....? దర్శకుడు కథకుడు కాకపోయినా కథనానికి ప్రాణ ప్రతిష్ట చేయగలగాలనే సూత్రానికి ఈమె నిజంగానే విలువను తెస్తుంది.

    "మూడుదశలు...... ఒకటి బాధ్యతలు తెలుసుకోని సోమరిపోతు- రెండు రియలైజ్ అయి మనిషిగా మారి అన్యాయాలకు ఎదురు తిరిగి బాధితులకు న్యాయం చేకూర్చటం -మూడు. ఆ సందర్భంలో అతను తిన్న దెబ్బల్ని ఎదురయిన కష్టనష్టాల్ని ఎదుర్కొని నిలచిన తీరు..... ఎంతో ఏకాగ్రతతో, శ్రద్దతో, పట్టుదలతో చేయవలసిన టిపికల్ కేరక్టర్...." అంది తిరిగి హంపి.

    అంతగొప్ప పాత్రను..... నటుడిగా ఎదిగేందుకు, విజృంభించి నటించేందుకు, గొప్ప అవకాశాన్ని కలిగించే పాత్రను తను ధరించటం నిజంగా తన అదృష్టం.... అనుకున్నాడు ప్రశాంత్ మనస్సులోనే....

    "తొలి దశలో బాగా నటించాలంటే మీకు ఇష్టంలేకున్నా సోమరితనంపై మక్కువను పెంచుకోవాలి. లోకంలోని కష్టజీవులంతా మీకు వెర్రివాళ్ళలా  కనిపించాలి... ఆ ప్రాతను మీలో ప్రతిష్టించుకోండి.....ఆ పాత్రలోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలి. ఫస్ట్ నేను తీయబోయే షాట్ గురించి చెబుతాను మూడ్ లోకి వచ్చేయండి....."

    ప్రశాంత్ అలర్ట్ అయ్యాడు.

    "దూరంగా కనిపించే ఆ శ్రమజీవులు ఒక హౌసింగ్ కో ఆపరేటివ్  సొసైటీ స్థలంలో రోడ్డు వేస్తున్నారు. ఆ ప్రక్కనే వారు నివసించే గుడిసెలు కూడా ఉన్నాయి...... కొండల్ని పిండిచేసి సమాజ ప్రజా సౌఖ్యం కోసం రహదారుల్ని ఏర్పాటు చేస్తున్నారు..... కొందరు డ్రైనేజ్ సౌకర్యాల్ని, ఇంకొందరు వాటర్ పైప్ లైన్స్ ఏర్పాటు  చేస్తున్నారు. వారికి తోడుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కి చెందిన శ్రమజీవులు ఎలక్ట్రిక్ పోల్స్ ని పాతుతున్నారు. కొందరి సౌఖ్యంకోసం ఈ అందరూ కృషి చేస్తున్నారు..... రోళ్లు  పగిలే ఎండలోనూ.....రోమాలు నిక్కబొడిచే చలిలోనూ, జోరున కురిసే వర్షంలోనూ వాళ్లు అలాగే శ్రమిస్తారు....... వాళ్ళను బ్యాక్ డ్రాప్ గా తీసుకుంటాను. మీరు ఈ కనిపించే రాళ్ళగుట్ట ఎక్కి  దానిమీద నిలువుగా నిలిచినా పెద్దరాయి నీడలో నిద్రిస్తుండాలి..... కొద్ది క్షణాలకి ఆవలిస్తూ.... ఇంకా నిద్రమత్తు వదలిపోనట్లుగా నటిస్తూ లేచి కూర్చోవాలి..... పైలట్ లో కథ ఆఫ్ వేలో ఆరంభమవుతుంది. మీ ప్రియురాలు మిమ్మల్ని పూలు కొనిపెట్టమని అడుగుతుంది. అప్పుడు మీదగ్గర డబ్బులుండవు - ఒక్కక్షణం కలవరపడి నాలుగు అబద్దాలు చెబుతారు. ఇవి సంపెంగపూలు..... ఇవి నాకు  ఇష్టముండదు.... నాకు మల్లెపూలంటేనే ఇష్టమని మొదటి అబద్దం చెబుతారు. మల్లెపూలు మా వీధి చివరలో దొరుకుతాయని రెండవ అబద్దం చెప్పి ఆమెను మీ వీధిలోకి తీసుకువెళ్ళి- ఆమెను బయట ఉంచి ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మదగ్గర  పదిరూపాయలు బలవంతంగా తీసుకొని వస్తారు. మా అమ్మ గుర్తుకొస్తే చూడకుండా ఒక్కక్షణముండలేను - అందుకే చూసివద్దామని లోపలకు వెళ్ళానని మూడవ అబద్దం ఆడేస్తారు. నిన్ను కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళి మా అమ్మకి పరిచయం చేసేవాడినే కాని -నీకు మెంటల్ గా  ప్రిపేర్ అయ్యే టైమ్ లేదని ఆపని చేయలేదని నాలుగవ అబద్దం ఆడేస్తారు. అంటే అంతర్లీనంగా సోమరిపోతుల్ని ఆత్మాభిమానం, పౌరుషం ఉన్న ఏ యువతీ ఇష్టపడదని మీరు భావించారు - కనుకే అన్ని అబద్దాలు ఆడారు. మనిషి జీవితంలో తనకు తెలిసే ఒక తప్పు చేస్తుంటే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేయకతప్పని పరిస్థితి - దిగజారక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఆపైన తల్లిచావు..... అక్కడితో ఫస్టు ఎపిసోడ్ పూర్తవుతుంది. సెకండ్ ఎపిసోడ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ని ఏకబిగిన చూపించటం - తనను నిరసిస్తూ తన ప్రియురాలు, తల్లి, తోటివారు చేసిన ఒక్కో విమర్శను పోస్ట్ చేసి అప్పుడు ఫ్లాష్ బ్యాక్ ని  అవసరమున్నంతవరకే చూపిస్తాం.

    అంటే..... మొదటి స్టేజ్ లో మీరు ఒకరకంగా, వర్తమానంలో అంటే మొదటి, రెండు స్టేజెస్ కి మధ్య అంతర్మధనం చెందుతున్నట్లు, సిగ్గుపడుతున్నట్లు, రియలైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా మరో రకంగా నటించవలసి ఉంటుంది. చాలా సీరియస్ గా తీసుకోవాలి. మిస్టర్ ప్రశాంత్...... ఒక వ్యక్తి సజీవ జీవితానికి ఇది రూపకల్పన ..... అని మరచిపోవద్దు...."

    ప్రశాంత్ ఆమె అన్న ఆఖరి మాటలకు ఆశ్చర్యపోయాడు.

    "నిజమా.....? నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడా? ఆశ్చర్యంనుంచి తేరుకుంటూ అడిగాడు ప్రశాంత్.

    "నిజ జీవితంలో అలాంటి వ్యక్తులు మనదేశంలో లక్షలమంది ఉన్నారు..... లేదంటే మనదేశం ఇంతగా వెనకబడి ఉండేది కాదు......"

    "నిజమే..... నిజమే.... బట్.... మీరు ఏ వ్యక్తి జీవితాన్ని ఉత్తేజంగా తీసుకున్నారు.....? ఆయనింకా బ్రతికే ఉన్నారని మీ మాటల్నిబట్టి తెలుస్తోంది. ఎవరాయన..... నేను తెలుసుకోవచ్చా...." రిక్వెస్టింగ్ గా అడిగాడు ప్రశాంత్.

    కొద్ది క్షణాలు మౌనంగా ఉంది హంపి.

    ఆ తరువాత అంది నెమ్మదిగా - "మా నాన్నగారే....." అని. ముందు తను విన్నదేమిటో అర్థంకాలేదు ప్రశాంత్ కి.

    అర్థమయ్యాక విస్మయంగా హంపీకేసి చూసాడు.

    చెప్పే ప్రతిమాట ఎంతో నిస్రబ్ధంగానే కాదు- ఎంతో చనువుగా కూడా ఉంటాయి. ఆవెంటనే తీక్షణంగా నిలదీస్తున్నట్లు స్లోమోషన్ బుల్లెట్స్ లా ఉంటాయి.

    ఆ పాత్రను ధరించటంలో తనేమాత్రం పొరపాటు చేసినా ఆమె క్షమించలేదు. తను జాగ్రత్తగా ఉండాలి అని ప్రశాంత్ మనస్సులో అనుకుంటుండగానే ఆమెలేచి కెమేరా ఉన్న స్పాట్ కేసి వేగంగా నడిచింది.

    "నేషనల్ ఐడెంటిటీ ఉన్న సబ్జెక్ట్ అది. అందుకే హందీలో కూడా తీస్తోంది. టూవెర్షన్స్ ఎట్ ఏ టైమ్...." కె.మే ఎగ్జైటింగ్ గా చెప్పాడు.

    "నేషనల్ నెట్ వర్క్ లో రావాలంటే మండీహౌస్ లో సబ్ మిట్ చేయాలిగదా....? అదో మహాసముద్రం అవుతుందా? ఛస్తుందా......" దశరథ సర్ కాస్టిగ్గా అన్నాడు.

    "టీవీలో ఎన్టీఆర్ సినిమాలు ఇక జన్మలో రావు అని అనుకోలేడూ? బాలకృష్ణ సినిమాలు ఇదివరకు వచ్చాయా.....?

    రాజకీయాలు అలా ఉంచి - రాజకీయాల్లో ఎన్టీఆర్ మంచి పనులు చేసాడా లేదా అనే విషయాన్ని అటుంచితే- ఎన్టీఆర్ గొప్ప నటుడని అందరూ ఒప్పుకున్నా నగ్నసత్యం కదా...... మరి ఓడిన ప్రభుత్వం ఎంత కుచ్చితంతో వ్యవహరించింది..... చిన్నపిల్లల ఉక్రోషంలా ఎన్టీఆర్ సినిమాల్ని టీవీలో బ్యాన్  చేసారు. అది చేయదగ్గ పనేనా....? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత హుందాగా వ్యవహరించాలి.....? మాట్లాడితే మాజీ ప్రధాని.... చిరాకెత్తిపోలేదు.....? ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానంకూడా లేకుండా వ్యవహరించిందా ప్రభుత్వం. ప్రభుత్వాలకన్నా, పార్టీలకన్నా ప్రజలు గొప్పవాళ్ళు. వాళ్ళకు తెలుసు ఎవరికెలా బుద్ధి చెప్పాలో.....? చెప్పారుగా ...ఇప్పుడు ఎన్టీఆర్ ఏ ఎన్ ఆర్..... అందరి సినిమాలు టీవీలో వస్తున్నాయి. జెలసీ ఎలాంటి పాఠాలు నేర్పిందో చూసారుగా? చరిత్ర మహామహులకే గుణపాఠాలు నేర్పింది. ఆ విషయాన్ని విస్మరించి మాట్లాడకండి. సబ్జెక్ట్ మంచిదయితే ప్రసారంచేసే అధికారులు- మంత్రులు ఇప్పుడున్నారు. టిప్పుసుల్తాన్ వస్తుందని ఎవరన్నా అనుకున్నారా.....? వీళ్ళు అలాగే చేస్తే వీళ్ళకు బుద్ది చెబుతారు ప్రజలు. ఎవర్నీ స్పేర్ చేయరు వాళ్లు....." బ్రహ్మానందం ఆవేశంగా అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra