Home » Yandamuri veerendranath » అతడు ఆమె ప్రియుడు


    "అబద్దం..... నీదంతా నాటకం!" అంతకన్నా గట్టిగా  అరిచాడు అబ్బాస్.

    సిరి భర్తవైపు చూసింది. ఆమె అయోమయం ప్రయోజనం?" రవి అడిగాడు.

    "రెండు బ్రీఫ్ కేస్ ల గోల్డ్ బిస్కట్స్"

    "అంటే నీ ఉద్దేశం..... అవి నేను కాజేశాననా?"

    "యస్" అన్నాడు అబ్బాస్. "...... ఆ రోజు హొటల్ రూమ్ లో మా వాళ్ళిద్దర్నీ బెదిరించి, వాళ్ళు పారిపోయాక మీరు స్వాధీనం చేసుకున్న బ్రీఫ్ కేస్ ల గురించి నేను అడుగుతున్నాను."

    "నువ్వు  పోరపడుతున్నావ్ ఆలీఖాన్. ఆ రోజు నేను ఆ బిస్కెట్స్ మా డిపార్టుమెంట్ కి హాండోవర్ చేయకముందే మీ వ్యక్తి నన్ను క్రిందికి తోసేశాడు. అంతే. ఆ తరువాత నాకేం జరిగిందో తెలీదు. నా కళ్ళు పోవటం మాత్రమే తెలుసు."

    "రవితేజా..... నువ్వు మళ్ళీ సినిమా స్టార్ వై పోతున్నావ్?"

    "అంటే..... నేను చెప్పేదంతా అబద్ధమంటావా?"

    "యస్...... పచ్చి అబద్ధం"

    "అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?" విసుగు, కోపం ధ్వనిస్తున్న గొంతుతో అడిగాడు రవి.

    "అసలు మా వాళ్ళు నిన్ను హొటల్ పైనించి త్రోసేయలేదు గనక!" బాంబు పేల్చినట్టు అన్నాడు అబ్బాస్. ".....నీకు గిట్టని వాడెవడో ఈ పని చేసి  వుంటాడు. లేదా -కావాలని నువ్వే దూకి వుంటావ్! అయినా  నువ్వెలా పడ్డావనేది నా కానవసరం. నాకు నా గోల్డ్ కావాలి. దట్సాల్!" స్థిరంగా చెప్పాడు ఆలీఖాన్. ఆ  స్థితిలో కూడా.... రవిని స్మగ్లర్స్ తోసెయ్యలేదన్న విషయం తెలిసి సిరి  నిర్ఘాంతపోయింది. ఈ లోపులో రవి అన్నాడు.

    "నిజంగా ఆ రెండు బ్రీఫ్ కేసులూ ఏమయ్యాయో నాకు తెలీదు"

    ఆలీఖాన్ సహనం నశించి పోయింది. "నిన్ను బ్తహిమాలి లాభం లేదు" అంటూ వెనక్కి తిరిగి "రఫీక్! వాడి పెళ్ళాన్ని బయటికి లాగరా!" అన్నాడు అనుచరుని ఉద్దేశించి.

    ఆ మాట వినగానే అంతసేపూ ఆశ్చర్యంతో చూస్తున్న సిరి భయంగా కారులో ఓ మూలకి జరిగింది.

    "నో....నా భార్యనేమీ చేయొద్దు. నాకేం తెలీదు. మమ్మల్ని విడిచిపెట్టు" అంటూ అరిచాడు.

    బిగ్గరగా నవ్వాడు ఆలీఖాన్.

    "నీ వీక్ పాయిట్ ఏమిటో నాకు తెలీదనుకున్నావా?" అంటూ  అతని అనుచరులు లాక్కువచ్చిన సిరిచందన చేయి పట్టుకుని దగ్గిరకి లాక్కున్నాడు.

    అతని ఉద్దేశ్యం, రవి కళ్ళు ఉన్న పక్షంలో భార్యని పరాయి  మగవాడు  కౌగిలించుకోవటం చూసి సహించలేక బయటపడతాడని.

    సిరి బీతహరిణిలా బెదిరిపోయింది. ఆలీఖాన్ ఉక్కుహస్తం ఆమె  చేతిని ఒడిసి పట్టుకుని వుంది. నిస్సహాయంగా "ఏమండీ!" అంటూ అతనివైపు వెళ్ళడానికి గింజుకోసాగింది.

    ఆలీఖాన్ "చుప్! అంటూ, ఆమె చెంపమీద బలంగా కొట్టాడు.

    రవి తట్టుకోలేకపోయాడు. ఆమె స్వరం వినిపించిన వేపు  గాలిలో  చేతులు సాచి, "సిరీ!" అంటూ ముందుకు రాబోయాడు.

    అతడు నిజంగా గుడ్డివాడా కాదా అని పరిశీలిస్తూ, ఆలీఖాన్- సిరి  చేయి పట్టుకుని రోడ్డు ఎడ్జ్ వరకూ తీసుకువెళ్ళి, అక్కడినుంచి బాగా డౌన్  గా వున్న చిన్న పోదపక్క ఆమెను పడుకోబెట్టబోయాడు. కాలు వెనుక కాలువేసి క్రిందికి లాగాడు. కెవ్వున అరిచింది సిరిచందన.

    "మహీ......" ఆమె గొంతునుండి అప్రయత్నంగా మహర్షి పేరు  వెలువడింది. ....రోడ్డు పక్కన ఉన్న బండారాయి కొట్టుకుని క్రిందపడ్డాడు. పడటం పడటమే  అతని శరీరం ఆ డౌన్  లోకి జారింది. అతను ఆసరా కోసం ఆ  బండరాయి పట్టుకోబోయాడు. అతని బరువుకి అదికూడా అతనితోపాటు లోయలోకి జారింది.

    అతని శరీరం పాతిక అడుగులు క్రిందికి దొర్లుకుంటూ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది. అది చూసి అబ్బాస్ బిగ్గరగా నవ్వాడు.

    మహర్షి నిద్రా మేలకువా కాని స్థితిలో అప్పుడే స్పృహలోకి  వస్తున్నాడు. అతని చెవులకు "హెల్ప్........ హెల్ప్....." అన్నా కేకలు లీలగా వినిపిస్తూంటే దాన్ని  సిరి కంఠంగా గుర్తించి స్ప్రింగులా పైకి లేచాడు.

    సిరిగొంతు చాలా స్పష్టంగా వినిపిస్తోంది.
   
    ఇక ఆలస్యం చేయలేదు రోడ్డు వైపు పరుగుతీసాడు.

    అక్కడ ......సిరి అబ్బాస్ అధీనంలో నిస్సహాయంగా గింజుకుంటూ, వదిలించుకోలేక- నేలమీద నించి కేకలు వేయటం కనపడింది. అబ్బాస్ ఆమెని పూర్తిగా కవర్ చేసి వున్నాడు.

    .....రవి ఎక్కడున్నాడో తెలియలేదు. అబ్బాస్ అనుచరులిద్దరూ చాలా తాపీగా, జరుగుతున్న దాన్ని తమాషాగా చూస్తున్నారు.

    అబ్బాస్ కి  సిరిమీద కోరికేమీ లేదు. దానికన్నా- రవితేజ ఆడుతూన్న నాటకం బయటపెట్టాలన్న కోరికే ఎక్కువ వుంది. రవితేజని మానసికంగా 'బ్రేక్' చేయాలని, సిరి శారీరం మీద వేయరాని చోటుల్లో చేతులు వేస్తూ ఆమెని మరింత రెచ్చగొట్టసాగాడు. రోడ్డు  నిర్మానుష్యంగా వుంది.

    ఆమె నిస్సహాయమైన కేకలు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ కేకలే  మహర్షికి శక్తినిచ్చాయి. శరీరపు మూల మూలల్లో  వున్న శక్తంతా కూడగట్టుకున్నాడు.

    అక్కడ కాపలాగా నిలుచున్న ఇబ్రహీం, శాస్త్రి అతను పరుగెత్తుకు రావటం చూసి అటాక్ చేయబోయారు. మొదట అడ్డం  వచ్చినవాడి తలపై ఆ దుంగతో కొట్టాడు. వాడు బాధతో తల పట్టుకుని కింద కూలబడ్డాడు. శాస్త్రి బటన్ చాకు  తీసుకుని లంఘించబోయాడు. అదే దుంగతో అతని గడ్డం క్రిందికి గురిచూసి విసిరి పొత్తికడుపులో బలంగా ఒక్క తనను తన్నాడు మహర్షి, అతడా బాధ  భరించలేక విపరీతంగా అరుస్తూ క్రిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు.

    అప్పుడు కదిలాడు ఆలీఖాన్ వేపు వేగంగా.

    అరుస్తూ క్రిందపడ్డ అనుచరులు లేవలేక అలాగే పడి పోయారు మూల్గుతూ.

    మహర్షి తనవైపు వేగంగా రావటం చూసి ఆలీఖాన్ చప్పున జేబులో నుంచి పిస్టల్ తీసి. అతనికి గురిపెట్టి "స్టాప్  దేర్!" అన్నాడు.

    ఈ హఠాత్ సంఘటనకి మహర్షి అప్రయత్నంగా ఆగిపోయి చేతులు పైకెత్తాడు.

    సిరి భయంగా చూస్తోంది. ఆమెని కదలకుండా ఒక చేత్తో పట్టుకుని, మరోచేత్తో గుండెలకి గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీద  బిగుసుకుపోసాగింది.

    సరిగ్గా అప్పుడే........ వెనకాల చిన్న అలికిడయింది. అతను వేలమీద  ఒరిగిపోయాడు. ఆ క్షణమే అతడి ప్రాణం పోయింది. దేశానికి సంబంధించిన అతి పెద్ద స్మగ్లర్ అంత చిన్న ఎన్ కౌంటర్ లో అంత మామూలుగా ప్రాణాలు పోగొట్టుకున్నాడని అక్కడున్న ముగ్గురికీ తెలీదు. దూరంగా వున్న ఇబ్రహీంకి మాత్రం అనుమానం వచ్చింది. ఈ ఆకస్మిక సంఘటనకి శాస్త్రి కూడా బెదిరిపోయాడు.

    సిరిచందనకి ఇవేమీ తెలియవు.

    ఆశ్చర్యంగా వెనక్కీ తిరిగి చూసిన సిరికి అక్కడ రవి నిలబడి  ఉండటం చూసి కళ్ళు పెద్దవైనాయి.

    అక్కడ చేతిలో బండరాయి  పట్టుకుని రవి నించునివున్నాడు.

    అతని ముఖం రౌద్రంగా వుంది.

    భర్త కళ్ళు పోలేదా......?

    అలా ..... ఇన్నాళ్ళూ కళ్ళు పోయినట్టు నటించాడని అర్థమవగానే అతనిపై ఆమె నమ్మకం కొడిగట్టిన దీపంలా ఊగిసలాడింది...

    అంటే.....అంటే ఇన్నాళ్ళూ తన భర్త గుడ్డివాడిలా ప్రపంచాన్ని  నమ్మించింది ఆ బంగారం కాజేయడానికా.....?

    ఈ లోపులో రవి గాల్లో చేతులు సాచి ముందుకు వస్తూ "సిరీ ఆర్ యూ ఆల్ రైట్?" అంటూ ప్రశ్నించాడు.

    స్థాణువులా నిలబడి భర్తలోని  'మరో రూపానికై' వెదుకుతున్న ఆమె  కనురెప్పల్లో చిన్న కదలిక. "ఊ' అని మాత్రం అనగలిగింది. నమ్మకమో..... అపనమమ్మకమో..... అది ఖేదమో..... మోదమో...... ఆమె  అంతకుమించి మాట్లాడలేకపోయింది.

    ఎవరికీవారు అలా స్థాణువుల్లా నిలబడి వుండటం చూసి ఇబ్రహీం ఆలీఖాన్ ని మోసుకుని తీసుకెళ్ళి జీప్ లో  పడుకోబెట్టి స్టార్ట్ చేశాడు. పరుగెత్తుకెళ్ళి వెనకాల కూర్చున్నాడు శాస్త్రి.

    అంతసేపూ రావినే గమనిస్తున్న మహర్షి మస్తిష్కానికి  అప్పుడు ఏదో జరుగుతున్నట్టు అనిపించి తలత్రిప్పి చూశాడు.

    జీప్ స్టార్టయి, రివర్సవుతోంది.

    అంతే..... ఆలస్యం చేయకుండా ఆ జీప్ ని  అందుకోవడానికి పరిగెత్త బోయాడు.

    అది గమనించి సిరి చప్పున అతనికి అడ్డువస్తూ "నో..... వెళ్ళొద్దు"

    "లేదు. వాళ్ళని పట్టుకుని పోలీసుల కప్పగించాలి."

    "వద్దు నువ్వెళ్ళడానికి వీల్లేదు."

    "ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు" ఆమెని తప్పుకుని వెళ్ళబోతున్న అతని చప్పున రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని, "ఉహూ నిన్ను వెళ్ళనివ్వను. వాళ్ళు నిన్నేమయినా చేస్తే......"

    "నాకేం కాదు"

    "నీకేమైనా అయితే నేను భరించలేను".

    "వద్దు మహర్షీ! పోనీ , వాళ్ళని" అన్నాడు రవి. అప్పటికే జీప్ కనుచూపుమేర దాటిపోయింది. కారు డోర్ తీసుకుని కూర్చున్నాడు మహర్షి.

    సిరి కూడా వెళ్ళి వెనుక డోర్ తీసుకుని కూర్చోబోయి, భర్త కేసి చూసింది. అక్కడ రవి  కదలకుండా అలాగే  నించుని వున్నాడు.

    రెండు క్షణాలు భర్త ముఖం వంకే పరిశీలనగా చూసి "రండి" అని పిలిచి, డోర్ తెరుచుకుంటూ కూర్చుంది.

    అతను తడుముకుంటూ ముందుకు వస్తుంటే మహర్షి దిగి వెళ్ళి చేయందుకుని తీసికెళ్ళి కార్లో కూర్చోబెడుతూ "రమ్మంటే ఎలా వస్తారనుకున్నావ్. ఏదైనా రాయి తగిలి కాలు స్లిప్ అయితే....." అన్నాడు సిరితో.

    ఆమె కోపంగా ఏదో అనబోయి, తమాయించుకుంటూ "అంత సూటిగా వాడి తలమీద దెబ్బకొట్టిన  వారికి- కారు దగ్గరికి నడిచి రావటం  ఒక లెక్కా?" అంది  భర్తనే ఓరకంటితో గమనిస్తూ.

    "నిజమే......అంతసేపు మీరసలు ఎక్కడికి వెళ్ళారు? అదీగాక రావటం రావటమే వాడితలమీద ఎలా కొట్టగాలిగారు?" అని అడిగాడు మహర్షి.

    "నేను లోయలోకి జారిపోయాక స్పృహతప్పింది. కానీ సిరికేకలు వేయటంతో తిరిగి స్పృహలోకొచ్చాను. చేతికి రాయి దొరికింది. ఆలీఖాన్ గొంతు వినిపిస్తున్నవైపు శబ్దం కాకుండా ప్రాకుతూ వచ్చాను. వెనగ్గా వచ్చాక అతని గొంతు ఎంత  హైట్ లో వినిపిస్తుందో గమనించి...... ఐ.పి.యస్ ట్రైనింగ్ గుర్తు తెచ్చుకుని చేతిలో ఉన్న రాయితో తలపై మోదాను. నిజానికి ప్రక్కన  సిరి ఉన్నదని, ఆమెకు తగిలే ప్రమాదం ఉందని తెలిసీ రిస్క్ తీసుకోక తప్పలేదు. అదీగాక సిరి హైట్ నేను కాలిక్యులేట్ చేసుకున్నాకే  ఆ ఎటాక్  చేశాను" అని చెబుతుంటే వింటున్న సిరి మస్తిష్కంలో అడ్డు  రాబుతున్న తెరలు తొలగిపోయాయి.

    కన్నుల్లో పశ్చాత్తాపం ప్రతిఫలిస్తుండగా భర్త భుజమ్మీద తల వాల్చింది. "సమయానికి మీరు రాబట్టి సరిపోయిందిగానీ, లేదంటే ఏం జరిగేదో.....!" అన్నాడు కారు స్టార్టు చేశాక ముందుకు పోనిస్తూ మహర్షి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra