Home » Chandu harshavardhan » The Partner

 

    "అతన్ని అనవసరంగా టార్చర్ చేయకండి. ఆ హత్య చేసింది అతను కాదు. " ప్రాధేయ పూర్వకంగా అన్నది ధీరజ.
    "ఆ హత్య అతను చేయలేదు.....చేయలేదు అంటున్నావు. అంత ఖచ్చితంగా చెబుతున్నావు. అలా అని ఏ సాక్ష్యాధారాలు వున్నాయి.....అయినా అతనంటే ఎందుకు ఇంటరెస్ట్ చూపుతున్నావు" వ్యంగ్యంగా అన్నాడు డి.ఎస్.పి.
    'అతనికి అన్యాయం జరుగుతుందని నా బాధ."
    "అదే ....ఎందుకంట? ఎందరో ముద్దాయిలను ఇంటారాగేట్ చేసి వుంటావు. ఇలానే అందరిమీదా జాలి, సానుభూతి చూపిస్తుంటావా?"
    అయన ప్రశ్నకు ఖంగుతిన్నది.....
    సమాధానం చెప్పలేక మౌనంగా వుండిపోయింది.
    "మిస్ ధీరజా.......నేను చెప్పనా .....అతను నీ మాజీ ప్రియుడు కాబట్టి.
    "సర్"
    నవ నాడులు కుంగిపోయినట్టు ఆమె విల విల్లాడిపోయింది.
    "ఎస్ ......ఇటీజ్ ట్రూ.......సే ఎస్ ఆర్ నో.....అందుకే అతనిని రక్షించడానికి ఏదో కట్టుకధ చెప్పబోతున్నావు .....అవునా?"
    ధీరజ మాట్లాడలేదు.
    "ఏమిటి .....నోటిమాట పడిపోయింది? లేక జవాబు ఏం చెప్పాలా అని ఆలోచనలో పడ్డావా?"
    చరాలున కేప్, బెల్టు రివాల్వర్ తీసి టేబుల్ పై వుంచి, పేపర్ పై నాలుగు లైన్లు రాసి, డి.ఎస్. పి చేతిలో వుంచింది.
    అది చూసిన మరుక్షణం బిత్తరపోయాడు అయన.
    అయన ముఖంలో చెప్పలేనంత విస్మయం.
    "వాట్ ఈజ్ దిస్"
    "నా రిజగ్నేషన్....."
    'అదే .......ఎందుకు చేస్తున్నావు ......ఆర్ యూ మాడ్?"
    అంతవరకూ ఉగ్గాబట్టుకుని వున్న ధీరజలోని ఆవేశం ఒక్కసారిగా బరస్ట్ అయింది.
    "అవును.....నాకు నిజంగానే పిచ్చి పట్టింది. లేకపోతే నా కళ్ళ ఎదురుగానే ఒక నిర్దోషి చిత్రహింసలు అనుభవిస్తుంటే ఎలా భరించగలను.....అతను నా క్లాస్ మేట్, స్నేహితుడు, ప్రియుడు.
    అయితే అయి వుండవచ్చు, కానీ ఆ హత్య అతడు చేశాడో లేదో తెలుసుకోవడానికి ఇంత రాక్షసంగా హింసించ నవసరం లేదు....ఇన్ వెస్టిగెట్ చేసి అతను ఆ హత్య చేశాడో లేదో నిర్ధారించ వలసినది పోయి ముద్దాయి నోటివెంట నేరం చేశాను అనిపించు కోవడమే సరి అయిన విధానం అయితే మీ మేధస్సుకు హేట్సాఫ్ సర్.
    "కానీ మనం పెట్టె బాధలకు భరించలేక నేరం చేయకపోయినా చేశాను అని ఒప్పుకున్నాడే అనుకోండి మనం ఏదో గొప్ప విజయాన్ని సాధించినట్టు పొంగవలసిందేనా......నిజం ఏమిటో తెలిశాక ఒక నిర్దోషిని దోషిగా శిక్షించినందుకు ఆ తరువాత చింతించి ప్రయోజనం లేదు. అందుకే ఐ హెట్ దిస్ బ్లడీ జాబ్......
    "ఎదుట వ్యక్తీ ఎలాంటి నేరమూ చేయలేదని నాకు ఖచ్చితంగా తెలిసి పదవిలో వుండి కూడా అతనికి న్యాయం చేయలేనప్పుడు .... ధర్మాన్ని కాపాడలేక, అధర్మానికి జేజేలు పలకడానికా ఈ యూనిఫార,మ్ ....అందుకే రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ పదవి, హోదా ఏమీ అక్కరలేదు బ్రతకడానికి యూనిఫారమ్ వేసుకుని అమాయుకులను, నిర్దోషులను శిక్షించవలసిన అవసరం నాకు అవసరం లేదు..... నాకు చేత కాదు... గుడ్ బై సర్"
    ఆమె వాగ్ధాటికి డి.ఎస్.పి బిత్తర పోయాడు.
    "సారీ ధీరజా.... నేరస్తుడ్ని సెల్ లో వుంచి మీరు మీన మేషాలు లేక్కిస్తున్నరనే వుద్దేశ్యంతో అతని చేత నేరం ఒప్పిద్దామని ప్రయత్నించానే తప్ప అతనిపై నాకు ఎలాంటి ద్వేషం లేదు, జరిగిందేదో జరిగి  పోయింది. అతను నిర్దోషి అని నీకు నమ్మకం వుంటే వదిలి పెట్టేయ్.....అసలు నేరాస్తుడ్ని పట్టిచ్చే బాధ్యత మాత్రం నీదే.
    ఆమె రిజేగ్నేషన్ చింపేసి వెళ్ళిపోయాడు డి.ఎస్.పి.
    వాలిపోతున్న కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూశాడు సునీల్.
    ధీరజ నెమ్మదిగా అతనిని సమీపించింది.


                                                           *    *    *

    సునీల్ పరిస్థితి చూసిన ధీరజ గుండె కలుక్కుమంటున్నది.
    తను ప్రేమించిన ప్రియుడు కటకటాల పాలు అయ్యాడు.
    ఇంత జరిగినా అతను పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
    ధీరజ అతని చూపులలోని భావాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నది.
    అతను దోషి అవునో కాదో తన మనస్సుకు తెలుసు అన్నట్టుంది సునీల్ మౌనం.
    నువ్వు స్వయంగా వచ్చి ఏం చెప్పినా నీ మీదున్న నమ్మకంతో....నీకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాను తప్ప ఎదురు చెప్పను అన్నట్టు వుంది అతని ప్రవర్తన.
    లలితతో అతనికి అక్రమ సంబంధం వున్నదో .....లేదో?
    ఉంటే అతనిని దోషిగా నిలిబెట్టే బలమయిన సాక్ష్యం అదే అవుతుంది.
    కానీ, తన మనస్సులో ఎక్కడో ......అతని పట్ల వున్న నమ్మకం అతను హంతకుడు కాదు అంటున్నది.
    అతను అలాంటి ఘోరం చేయడు.
    కనీసమం ఇప్పటికి అయినా పెదవి విప్పి ఏం జరిగిందో తనతో నయినా చెబితే బాగుంటుంది.
    తన మనస్సులో చెలరేగే సంఘర్షణకు పరిష్కారం లభిస్తుంది.
    అతను అదీ చేయడం లేదు.
    ఉన్నట్టుండి ఏదో ఆలోచన స్పురించడంతో టక్కున లేచి నిలబడింది ధీరజ.
    ఎస్. అంతకు మించిన సాక్ష్యం మరొకటి వుండదు.
    సునీల్ ను రక్షించుకునే మార్గం అదొక్కటే కనిపించింది.
    అప్పుడూ అతను దోషి అనే తేలితే ....అతనిపై మూడుగా యాక్షన్ తీసుకునే మొదటి వ్యక్తీ తనే అవుతుంది.
    తను ఎక్కడకు వెళుతున్నదీ కనీసం సబార్దినెట్స్ కు కూడా చెప్పకుండా వేగంగా బయటకు వెళ్ళిపోయింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    రెండు రోజులు శెలవు కావాలని లీవ్ లెటర్ ను డి.ఎస్. పి ఆఫీసుకు పంపి తను ఎక్కడకు వెళుతుందో చెప్పకుండానే తను చేయదలుచుకున్న పనిలో నిమగ్నమై పోయిందామే.


                                                      *    *    *

    వైజాగ్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ ఎప్పుడు వున్నదో కనుక్కుని ఆ ట్రెయిన్ లో బయలుదేరింది ధీరజ.
    సాయంత్రానికి వైజాగ్ చేరుకున్నది.
    ఆటోలో సునీల్ ప్లాట్ కు వెళ్ళింది.
    డూప్లికేట్ తాళంతో అతని గదిని అంతా శోధించింది.
    చివరకు బీరువా అడుగున ఆమెకు కావలసింది దొరికింది.
    దానిని చూడగానే ధీరజ కళ్ళు మిలమిల మెరిశాయి.
    అది సునీల్ డైరీ.....
    అతనికి డైరీ రాసే అలవాటు వుందని ధీరజకు తెలుసు.
    అందుకే దానికోసం ఇంతదూరం వచ్చింది.
    ఆమె మనస్సులో అతను నిర్దోషి అయి వుంటాడని ఏ మూలో చిన్ని ఆశ.
    అందుకే ఆమె ప్రయత్నం.
    ఆతురతను చంపుకోలేక చకచకా పేజీలను తిప్పింది.
    సునీల్ తనను ఎందుకు కాదన్నాడో ......ఎందుకు దూరమై పోయాడో యక్ష ప్రశ్నలకు సమాధానంగా అద్దం పడుతున్నది ఆ డైరీ.
    అతను ఆరోజు వరకూ గడిపిన జీవితం యెంతటి దుర్భారమైందో ఆమె కళ్ళకు కట్టినట్టుగా తేట తెల్లమయింది.
    అతనిని నేరస్థునిగా శిక్షించాలో .....అమాయకునిలా భావించాలో సమిధలా తన జీవితాన్ని చేజేతులా సర్వనాశనం చేసుకున్నందుకు విచారించాలో తెలియని స్థితి ఆమెను ఆవరించింది.
    ధీరజ మనస్సు ఇప్పుడు జరిగిపోయిన సునీల్ గతం చుట్టూ పరిభ్రమిస్తుంది.
    అతను ప్రతి రోజూ అనుభవించిన మానసిక వేదన ఆ డైరీలోని ప్రతి పేజీ చెబుతున్నది.
    ఆరోజు తనతో అతను ఎందుకు అంత నిరాశగా మాట్లాడాడో ఇప్పుడు అర్ధం అవుతున్నది.
    సునీల్ డైయిరీ లోని ఒక్కొక్క పేజీ చకచకా కదిలిపోతున్నాయి.


                                                           *    *    *

    హాయ్ సన్నీ డార్లింగ్ .......నాలుగు రోజుల నుండీ నీ కోసం వెదుకు తున్నాను? ఏమయిపోయావు....' అంటూ సుడిగాలిలా వచ్చింది ధీరజ.
    సముద్రపు బొడ్డున కొండ గుట్టల దగ్గర కూర్చుని ఉన్నాడు సునీల్.......
    మనస్సు బాగోనప్పుడు ఆ చోటుకు వచ్చి అప్పుడప్పుడూ కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ గడపడం సునీలుకు మాములే.
    అందుకే అతనిని వెతుక్కుంటూ వచ్చింది ధీరజ.
    ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతుంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra