Home » Dr. dasaradhi rangacharya » Rigveda Samhitha - Part 1


    2. అగ్నీ ! నీవు ప్రకాశవంతుడవు. పండితుడవు. నీకు ప్రియములయిన స్తవములు పఠించుచున్నాము.

    3. అగ్నీ ! జగమున నిన్ను మించిన బంధువు, నీ యాగమును మించిన యాగము, నిన్ను మించిన ఆశ్రయించదగిన వాడు లేడు.

    4. అగ్నీ ! నీవు జనులకు బంధువుడవు, మిత్రుడవు, స్తోత్రవ్యుడవు, సఖుడవు అగుదువు.

    5. అగ్నీ ! మా నిమిత్తము మిత్రావరుణులను యజింపుము. దేవతలను యజింపుము. యజ్ఞము నిర్వహింపుము. ఈ యజ్ఞగృహమున నివసింపుము.

                డెబ్బది ఆరవ సూక్తము - ఋషి - రహుగణపుత్రుడు గౌతముడు
                           దేవత - అగ్ని, ఛందస్సు- త్రిష్టుప్.


    1. అగ్నీ ! నీ మనసును మావైపు మరలించుటకు మాకు శక్తిలేదు. నిన్ను సంతోష పెట్టునట్లు స్తుతించుటకు మాకు శక్తిలేదు. యజ్ఞములతో నిన్ను వృద్ధిపొందించుటకు మాకు శక్తిలేదు. బుద్ధితో నీకు హవిస్సులు ఇచ్చునంతటి శక్తి మాకులేదు.

    2. అగ్నీ ! నిన్ను ఆహ్వానించుచున్నాము. కదలిరమ్ము. ఆసీనుడవు అగుము. దేవతలను పిలువుము. నీవు ఎట్టి వారికిని లొంగవు సర్వవ్యాపులగు ద్యావాపృథ్వులు నిన్ను రక్షించవలెను. దేవతలకు మా విషయమున సదభిప్రాయము కలిగించుటకు వారిని పూజింపుము.

    3. అగ్నీ ! సర్వరాక్షసులను దహింపుము. మేము చేయు యాగములను ఉపద్రవములనుండి కాపాడుము. తదుపరి ఇంద్రుని రెండు గుఱ్ఱముల సహితముగా తీసుకొనిరమ్ము. అట్లు వచ్చిన ఇంద్రునకు అతిథిసత్కారము చేయుము.

    4. అగ్నిని స్తుతిమంత్రములతో ఆహ్వానించుచున్నాము. అగ్ని సంతానమును ప్రసాదించువాడు. మంటలే నోరుగా గలవాడు. దేవతలకు హవిస్సులు అందించువాడు. అగ్నీ నీవు దేవతలతో కూడి కూర్చుండుము. హోత, పోత చేయు కర్మలను స్వీకరింపుము. అగ్నీ ! నీవే ధనములను ప్రసాదించుచున్నావు. సర్వమును అనుగ్రహించుచున్నావు. నీవు మాకు బోధించుము.

    5. అగ్నీ ! నీవు కవివి. మేదావులగు ఋత్విజులతో కలిసి మేధావి 'మనువు' హవిస్సులతో దేవతలను యజించినావు. హోమకర్తవు, సత్యవంతుడవు అగు అగ్నీ ! అదేవిధముగా ఈ యజ్ఞమున జుహువుతో దేవతలను యజింపుము.

    (జుహువు గరిటెవంటి హోమ సాధనము.)

        డెబ్బది ఏడవ సూక్తము - ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
                   దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.


    1. అగ్ని మహామహుడు. మేము మర్త్యులము. అగ్ని తేజోవంతుడు. దేవతలు సేవింపదగినవాడు. అట్టి అగ్నికి మేము హవిస్సులు ఇవ్వగలమా ? మంత్రములు చదువగలమా ? మరణ రహితుడు, సత్యవంతుడు, దేవదూత, యజ్ఞకర్త అగు అగ్నియే మాయందు ఉండి దేవతలకు హవిస్సులు ఇవ్వవలెను.

    2. అగ్ని యజ్ఞములందు సుఖము కలిగించువాడు. యదార్థమును ఎరిగినవాడు. దేవతలను ఆహ్వానించువాడు. ఋత్విజ యజమానులారా ! అట్టి అగ్నిని స్తుతించుడు. ప్రసన్నుని చేయుడు. అగ్ని యజమాని పక్షమున దేవతల వద్దకు పోవును. దేవతలకు బోధించును.

    3. అగ్ని సర్వకర్మకారకుడు. సృష్టికర్త. సంహర్త. తనకు లేనప్పుడు మిత్రుడు ఇచ్చినట్లు ధనమును ఇచ్చువాడు. యాగములందు దేవతలు అగ్నినే కోరుదురు. ప్రజలు అగ్నినే దర్శింతురు. అగ్నినే ప్రధానుని చేతురు.

    4. అగ్ని యజ్ఞ నిర్వాహకులలో శ్రేష్ఠుడు. శత్రువులను హరించువాడు. అతడు మా స్తుతులను, హవిస్సులను కర్మలను ఆశించవలెను. హవిస్సులు అర్పించి ధనికులు, బలవంతులు అయిన యజమానులు ఋత్విజులచే అగ్నిని స్తుతింప చేయుచున్నారు.

    5. గోతమ ఋషులు విద్వాంసులు. వారు జాతవేది అయిన అగ్నిని స్తుతించినారు. అగ్ని గోతములవద్ద సోమపానము చేసినాడు. హవిస్సులను ఆరగించినాడు. పుష్టిని పొందినాడు. సపుష్టింయాతి

        డెబ్బది ఎనిమిదవ సూక్తము - ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
                     దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.

    1. సర్వభక్షకా ! అగ్నీ ! గోతములు నిన్ను అభిముఖము అగునట్లు మంచి వాక్కులతో నుతించినారు. మేము సహితము నీ గుణము ప్రకటించుటకు స్తుతింతుము.

    2. గోతముడు ధనముకోరి స్తుతివాక్కులతో అగ్నిని సేవించినాడు. మేము కూడ అట్లే సేవింతుము.

    3. అంగిరసులు అన్నము కోరి అగ్నిని స్తుతించినారు. మేము కూడ అట్లే స్తుతింతుము.

    4. అగ్నీ ! నీవు పాపహరుడవు. దైత్యాంతకుడవు. నిన్ను మంత్రములచే స్తుతింతుము.

    5. మేము రహోగణుని పుత్రులము. అగ్ని కొఱకు మంచి మంచి స్తుతులు చదివినాము. అగ్నిని మాటిమాటికి కీర్తించుచున్నాము.

        డెబ్బది తొమ్మిదవ సూక్తము - ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు
        దేవత - అగ్ని, ఛందస్సు 1-3 త్రిష్టుప్, 4-6 ఉష్ణిక్ తక్కినవి గాయత్రి.


    1. అగ్ని జ్వాలారూప కేశములవాడు. దగ్గర ఉన్నవానిని బాధించువాడు. మేఘములను చలింపచేయువాడు. వాయువువంటి వేగము కలవాడు. అగ్ని అందముగ మెరయుచు వర్షింపజేయగలవాడు. ఉష అన్నముకోరి యజించు ప్రజలవంటిది. ఉష వర్షించలేదు.

    2. అగ్నీ ! నీవి ప్రసార గుణముగల కిరణములు గమన గుణముగల మరుత్తులను సహితము కొట్టగలవు. నీ తాకిడికి కారు మేఘము గర్జించును, కాంతులు వెలయించి మెరయును, సాగును, వర్షించును.

    3. అగ్ని వర్షము కురిపించి పాలవంటి రసవంతములతో భూమిని తృప్తిపరచును. అపుడు ఆర్యముడు, మిత్రుడు, వరుణుడు మరుత్తులు ఉదకోత్పత్తి స్థానముల కప్పులు విప్పుదురు.

    4. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. సంపదలకు స్వామివి. మమ్ము అనుగ్రహింపుము. ధనములు ప్రసాదించుము.

    5. అగ్ని కాంతివంతుడు. నివాస హేతువు. బుద్ధిమంతుడు. స్తవనీయుడు. జ్వాలాముఖీ ! అగ్నీ ! మాకు అన్నరూపమగు సంపదను ప్రసాదించుము.

    6. అగ్నీ ! దివారాత్రములందు రాక్షసులను సంహరింపుము. ఒక్క రక్కసిని కూడ విడువకుము. రక్కసులు అందరిని దహింపుము.

    7. అగ్నీ ! నీవు సమస్త కర్మలందును స్తవనీయుడవు. నిన్ను గాయత్రీ ఛందముగల మంత్రముల కీర్తించుచున్నాము. నీవు మాకు రక్షణ కలిగింపుము.

    8. అగ్నీ ! అమాంతముగా దారిద్ర్యమును దూరము చేయునదియు, అందరు కోరదగినదియు, యుద్ధములందు శత్రువు హరించనట్టిదియు అగు ధనమును అనుగ్రహింపుము.

    9. అగ్నీ ! ఆఖము కలిగించునదియు, జీవితాంతము పోషించునదియు, జ్ఞానసహితమును అయిన ధనమును జీవనము కొఱకు ప్రసాదించుము. దేహిజీవసే

    10. గోతమర్షీ ! నీవు ధనము కోరినావు. అందుకుగాను తీవ్రజ్వాలలుగల అగ్నిని గూర్చి పవిత్ర వర్ణనలుగల స్తుతులను కూర్చుము.

    11. గోతమర్షీ ! మమ్ము దగ్గరనుండి, దూరము నుండి బాధించు శత్రువు నశించవలెను.

    12. అగ్ని అనంత సంఖ్యాక జ్వాలానేత్రుడు. సమస్తము చూడగల వాడు. రాక్షసులను దూరము చేయువాడు. అట్టి అగ్నిని సామ మంత్రముల ఉపాసించుచున్నాము. అగ్ని దేవతలను పిలుచును. స్తుతించును. 

        ఎనుబదవ సూక్తము, ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు
                   దేవత - ఇంద్రుడు, ఛందస్సు - పంక్తి.


    1. ఇంద్రా ! నీవు వజ్రహస్తుడవు. బలవంతుడవు. నీవు మాదక సోమము పానము చేసినావు. బ్రహ్మయు, ఋత్విజుడును నీకు వృద్ధి కలిగించు స్తుతులు చేసినారు. అందువలననే నీవు రాజ్యము ప్రకటించుచున్నావు. భూమి మీది వృత్రుని పూర్తిగా శాసించినావు.

    2. సోమము మదమును కలిగించునది. చల్లదనమును ఇచ్చునది. డేగరూపమున గాయత్రిచేత ద్యులోకముండి తేబడినది. ఇంద్రా ! అట్టి సోమము నీకు బలము కలిగించినది. ఆ బలమున నీవు వృత్రుని సంహరించినావు.

    3. ఇంద్రా ! శత్రువును గమనింపుము. అతనిని తిరస్కరింపుము. నీ వజ్రము శత్రువులకు అసాధ్యము. నీబలము ప్రజలను లొంగదీయగలదు. కావున మేఘమును ప్రహరింపుము. ఉదకముల గెలువుము. స్వరాజ్యము సాగింపుము. అప్కోర్చన్నాను స్వరాజ్యమ్

    4. ఇంద్రా ! మేఘమును ద్యులోకము నుండి పంపినావు. భూమిమీద వర్షించునట్లు తాడించినావు. ప్రాణులందరి సంతసమునకుగాను గాలితో కూడిన వర్షము కురిపింపుము. స్వరాజ్యము సాగింపుము.

    5. ఇంద్రుడు కోపించినాడు. గడగడలాడించు వృత్రుని చెంపమీద బాదినాడు. జలమును ప్రవహింపచేసిన ఇంద్రా ! స్వరాజ్యము సాగింపుము.

    6. ఇంద్రుని వజ్రము నూరు అంచులు కలది. దానితో వృత్రుని దవుడలమీద బాదినాడు. యజమానులకు, ఋత్విజులకు అన్నము కలుగ ఉపాయము చూపిన ఇంద్రా ! స్వరాజ్యము సాగింపుము.

    7. మేఘవాహనా ! వజ్రధారీ ! ఇంద్రా ! నీ బలము శత్రువులకు లొంగునదికాదు. మృగరూపము బొందిన మాయావి అయిన వృత్రుని ఇంద్రా ! నీవు మాయతోనే వధించినావు. స్వరాజ్యము సాగింపుము.

    8. వృత్రుడు తొంబది తొమ్మిది నదులను పట్టి ఉంచినాడని ఇంద్రుడు గ్రహించినాడు. అతని వజ్రము నానా రూపములు దాల్చినది. వృత్రుని హతమార్చినది. ఇంద్రా ! నీ వీర్యము గొప్పది. నీ బాహువులందు బలము ఉన్నది. స్వరాజ్యము సాగింపుము.

    9. వేయిమంది కలిసి ఇంద్రుని పూజించినారు. ఇరువదిమంది నుతించినారు. నూరుగురు ఋషులు ప్రశంసించినారు. ఇంద్రుని కొరకు హవిస్సులతో కూడిన అన్నము ఎత్తిపట్టుకున్నారు. ఇంద్రా ! స్వరాజ్యము సాగింపుము. 

    10. ఇంద్రుడు వృత్రుని బలమును తన బలముతో పడగొట్టినాడు. ఆయుధమును ఆయుధముతో కొట్టినాడు. ఇంద్రుని బలము గొప్పది. కావుననే వృత్రుని కొట్టినాడు. ఇంద్రా ! స్వరాజ్యము సాగింపుము.

    11. ఇంద్రా ! మరుత్తులతో కూడి స్వబలమున వృత్రుని అంతమొందించినావు. అప్పుడు భూలోక ద్యులోకములు నిన్నుచూచి గడగడలాడినవి. స్వరాజ్యము సాగింపుము.

    12. వృత్రుడు తన బలదర్పములతోను, గర్జనలతోను ఇంద్రుని భయ పెట్టలేకపోయినాడు. ఇంద్రా ! నీవు వేయి అంచుల వజ్రాయుధమున వృత్రుని సంహరించినావు. స్వరాజ్యము సాగింపుము.

    13. ఇంద్రా ! వృత్రుని వజ్రాయుధమును నీ వజ్రాయుధముతో కొట్టి చంపదలచినావు. అప్పుడు నీ బలము ద్యులోకమున వ్యాపించినది. స్వరాజ్యము సాగింపుము.

    14. వజ్రాయుధ ధారీ ! నీ సింహనాదమునకు చరాచరములు కంపించును. నీకు వజ్రాయుధము ఇచ్చిన త్వష్ట సహితము గడగడలాడినాడు. స్వరాజ్యము సాగింపుము.

    15. ఇంద్రుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. ఇంద్రుని మేము ఎరుగలేకున్నాము. నరులు ఎట్లు ఎరుగగలరు? ఆ ఇంద్రునిలో దేవతలు ధనమును, కర్మను, బలమును నిల్పినారు. ఇంద్రా ! స్వరాజ్యము సాగింపుము.

    16. అధర్వ ఋషియు, దధ్యజ్జు ఋషియు, ప్రజలకు తండ్రి అగు మనువును చేసిన కర్మలందలి హవిస్సులు, మంత్రము పూర్వయజ్ఞములందువలె ఇంద్రునకే చెందినవి.

    ఆలోచనామృతము :

    స్వరాజ్యమును గురించిన ఆలోచన ఆనాడే వచ్చినది. వేదములది అంతటి ప్రగతిశీల ఆలోచనా విధానము.

    ఇంద్రుడు సంకేతము మాత్రము. స్వరాజ్యమున ప్రభుత్వము ఎట్లుండవలెనో వివరించినాడు.

    ప్రభుత్వము తనను, దేశమును రక్షించు సామర్ధ్యము కలిగి ఉండవలెను.

    ప్రజలకు శాంతి సౌభాగ్యము కలిగించు ఉపాయము కలిగి వాటిని అమలు పరచవలెను.

    ప్రజలకు శాంతి సౌభాగ్యము కలిగించు ఉపాయములు కలిగి వాటిని అమలు పరచవలెను.

    ప్రజలకు సంతృప్తికరమగు జీవితము సాధ్యమగు ప్రయత్నము చేయవలెను.

    ఈ లక్షణములు కలదే స్వరాజ్యము అగును.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత మొ.అష్టకము ప్ర. మండలము అయిదవ అధ్యాయము సమాప్తము.)

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra