Home » Kommuri venugopala rao » జాలిలేని జాబిలి


    కొత్తగా యేమయినా రాయాలనిపిస్తోంది మధుబాబుకు. మళ్ళీ కథలే! కథలు రాయబుద్ధి కావటంలేదు. ఒకే ఒకవ్యక్తిని వివిధకోణాలతో, జీవితం విసిరేసిన వివిధదశలలో చిత్రించాలని ఉబలాటపడసాగాడు. అతను కాలేజీలో వేసిన నాటకం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అది అచ్చుకాలేదు. ఆ ప్రయత్నంకూడా చేయలేదు తను. ఆ ప్లాట్ తో కొత్తలోతులతో మరో నవల రాయటానికి పూనుకున్నాడు.


                                                                     25


    కొన్నినెలలు గడిచిపోయాయి. ఒకరోజు మధుబాబుకు చిత్రమైన ఉత్తరం వచ్చింది మద్రాసునుంచి.

    "చినబాబూ!

    నేనెవర్నని ఆశ్చర్యపడుతూ వుంటారు. నీ చిన్నతనాన అక్కయ్యతో కలిసి బడికి పోతూవుంటే దారిలో పెంకుటింట్లోంచి ఓ స్త్రీ  మిమ్మల్ని  పిలిచి, కబుర్లు  చెబుతూ వుండేది గుర్తుందా? ఆ రజనిని నేను. సినిమా లోకంలో ప్రవేశించాక శైలజగా మారిపోయాను. నువ్వు సినిమాలు చూస్తుంటావా? నన్నెప్పుడైనా గుర్తుపట్టావా? ఇందులోకి వచ్చేముందు తప్పనిసరిగా నేను చదువు నేర్చు కోవల్సి వచ్చింది. ఎప్పుడైనా కాలక్షేపానికి పుస్తకాలు చదువుతూంటాను. ఈ మధ్య మా సినిమా వ్యక్తుల్లో ఒకరి దగ్గర నీ నవల చూశాను. వట్టి పేరుని బట్టి అయితే గుర్తుపట్టలేకపోయేదాన్నిగాని, వెనక నీ ఫోటో వేశారు. ఎవరబ్బా అని చాలాసేపు ఆలోచించాను. నువ్వు మనసులో మెదిలావు. ఆ రాత్రికి రాత్రి నీ పుస్తకం చదివేశాను. ఎంత బాగుందనుకున్నావు? అవునుగాని యిన్ని విషయాలు ఈ లేతవయస్సులో ఎలా తెలుసుకున్నావు? నువ్వు నాకంటే వయస్సులో మూడు నాలుగేళ్లు చిన్న. మానసికంగా ఎంత ఎదిగిపోయావు? నీ మిగతా పుస్తకాలు కూడా చదవాలనిపించి అన్నీ తెప్పించి చదివాను. గొప్పగా వున్నాయి. కొంతమంది  సినిమా తీద్దామనుకున్నట్లు వినికిడి. అవును గాని నిన్నెందుకో చూడాలనిపిస్తోంది. కారణం తెలియదు. కాని తప్పకుండా కలుసుకోవాలి. నేను అక్కడకి రాలేనుకదా. ఏమీ అనుకోకపోతే నువ్వు యిక్కడకు ఒకసారి రావూ? త్వరగా రావాలి. సమయానికి నీదగ్గర డబ్బు వుంటుందో, వుండదో అని మూడొందల రూపాయలకు డ్రాప్టు పంపిస్తున్నాను. అన్యాధా భావించకు సుమీ. నీకు యిష్టం లేకపోతే తిరిగి తీసుకుంటాను. ప్లేన్ లో వచ్చెయ్యి. ఎప్పుడు వస్తున్నావో రాస్తే కారు తీసుకుని ఏరోడ్రోమ్ కు వస్తాను. ఎదురుచూస్తూ వుంటాను.

                                                                                                                            శైలజ."

    అతను విస్మితుడయాడు. రజని తనని ఇంతకాలం ఎలా గుర్తుపెట్టుకుంది? ఇలాంటి వుత్తరం ఆమెదగ్గర్నుంచి వస్తుందని కలలోకూడా అనుకోలేదు. గత రెండుసంవత్సరాలనుంచీ చాలా సినిమాలలో నటించింది రజని. ఎంతో పేరుప్రఖ్యాతులు గడించుకుంది కూడా. ప్రజలంతా బ్రహ్మరథం పడ్తున్నారు.

    "వెళ్ళటమా? మానటమా?" అని ఆలోచించాడు. వెళ్లకపోవటానికి కారణం ఏమీ కనబడలేదు. నాలుగైదు రోజులక్రిందటే థర్డియర్ పరీక్షలుకూడా అయిపోయినై. ఇవాళో రేపో  యింటికి పోదామనుకుంటున్నాడు. మొదట ఆమెదగ్గరకు వెళ్లవచ్చు. కాని వెడితే యేం మాట్లాడతాడు....? చివరకు ఏమైనా వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. ఈ డ్రాప్టు స్వీకరించటమా? మానటమా? ప్రస్తుతం చేతిలో డబ్బేమీ లేదు. ప్లేన్ లో వెడితే చాలా ఖర్చవుతుంది.

    ఆరోజు శుక్రవారం, ఆదివారం బయల్దేరి ప్లేన్ లోవస్తున్నానని శైలజకు ఉత్తరం రాశాడు, బ్యాంక్ కు వెళ్లి డ్రాప్టు మార్చి డబ్బు తెచ్చుకున్నాడు.


                                *    *    *

    మద్రాస్ ఎరోడ్రోమ్ లో మధుబాబు దిగాడు. పూల్ సూట్ లో వున్న అతని వున్నతమైన మూర్తి శైలజకోసం అటూయిటూ అన్వేషిస్తున్న నేత్రాలతో చూడసాగింది.

    సూర్యరశ్మిలో జిగజిగ మెరిసిపోతున్న దుస్తుల్లో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, చిరునవ్వుతో శైలజ ఎదురుగా వచ్చింది. ఆమెని గుర్తుపట్టి అతను చిన్నగా నవ్వాడు. అతనికి కొంచెం సిగ్గువేసింది.

    "మైగాడ్, ఎంత ఎదిగావు నువ్వు? సినిమా హీరోలా వున్నావు. ఇంకా కొంచెం వళ్ళు వస్తే నీ పర్సనాలిటీముందు ఎవరూ పనికిరారు" అంది ఆమె.

    "విలన్ గా బాగా పనికివస్తానుకదూ" అన్నాడు మధుబాబు నవ్వుతూ.

    "భారీగా  వున్నవాళ్ళంతా విలన్లు కావాలేమిటి?"

    "సినిమాలోకంలో అంతేగా! ఎలకపిల్లల్లాగా, చిన్నగా, ఆడపోలికలతో వున్నవాళ్ళే హీరోలుగా చలామణి అయిపోతున్నారు."

    "ఏమిటిబాబూ... దిగుతూనే మా హీరోలను దుయ్యబడుతున్నావు? వాళ్ళతో నేనింకా ఎన్నో పిక్చర్స్ లో యాక్టు చేయాల్సివుంది. నా యింప్రెషన్స్ పాడు చెయ్యకు. పదపోదాం."

    బయటకు వచ్చాక శైలజ కారు ఎక్కి స్టీరింగుముందు కూర్చుంది. అతనామె ప్రక్క కూర్చున్నాడు.

    అతనామెవైపు పరీక్షగా చూచాడు. అప్పటికన్నా అందంగా ఆకర్షణీయంగా వుంది ఆమె. తనకన్నా వయస్సులో మూడు నాలుగేళ్ళు పెద్దయినా..... యిరవై ఏళ్లకన్నా ఎక్కువ వుంటాయని ఎవరూ  అనుకోరు. శరీరానికి వింతకాంతి వచ్చింది.

    "నాన్నగారూ, అమ్మా అంతా కులాసాగా వున్నారా?" అనడిగింది శైలజ కారు స్టార్టు చేస్తూ.

    మధుబాబు తలవూపాడు.

    "అక్కయ్య."

    "ఇప్పుడు బొంబాయిలో వుంటోంది.... భర్తతో."

    "నేను రమ్మని రాయగానే  వచ్చేశావే. థ్యాంక్స్" అన్నది శైలజ.

    "బెజవాడ పోదామనుకుంటూండగా మీ ఉత్తరం వచ్చింది. రాకుండా వుండలేకపోయాను. సరేగానీ నన్నెందుకు రమ్మన్నారు?"

    "కారణం తెలియదని రాశానుగా. నీ పుస్తకాలు చదివాను. నిన్ను గుర్తుపట్టాను. ఆ పాతరోజులన్నీ గుర్తుకువచ్చాయి. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే మిత్రుడివనిపించింది."

    "అదేం? ఇక్కడ మీకు స్నేహితులు లేరా?"

    "స్నేహం చట్టుబండలు. లైఫ్ భలేగా  వుందిలే. నేను నటించిన సినిమా లేమైనా చూశావా?"

    "చూశాను."

    "నన్ను గుర్తుపట్టావా?"

    "పట్టాను."

    "నా నటన నీకు నచ్చిందా?"

    "నటనని గురించి అంతగా నాకు తెలీదు. కాని ప్రయత్నం లేకుండా, సునాయాసంగా మీరు నటిస్తారని చెప్పగలను. సినిమాలో  మీరు నటించే పాత్రకన్నా, ఆ పాత్ర  డామినేట్ చేసిన మీరు కనిపిస్తారు. మిమ్మల్ని గొప్పనటిగా లోకం అంగీకరించింది."

    "మరి నన్ను గుర్తుపట్టి, నా నటన నచ్చి నాకెప్పుడూ ఉత్తరం రాయలేదేం? అహంభావమా?"

    "కారణం సరిగ్గా చెప్పలేను. కొంచెం అలాంటిదే అయివుంటుంది."

    "అమ్మో, గడుసుతనం కూడా నేర్చావే."

    అతనికేం జవాబు చెప్పాలో తోచలేదు. ముభావంగా  ఊరుకున్నాడు.

    "నన్ను మీరు మీరు అంటావేం నువ్వు."

    "ఇదివరకు కూడా అలాగే పిలుస్తూ వుండినట్లు గుర్తు. పాత అలవాటు  కదా."

    "అవునుగానీ నువ్విక్కడికి రావటం యేమీ సుఖం అనిపించడంలేదా ఇప్పుడు? పశ్చాత్తాపపడటం లేదుగదా."

    "ఉహు లేదు. చాలా సరదాగా కూడా వుంది."

    శైలజ ఓ పెద్ద భవనంముందు కారు స్లో చేసింది. గూర్ఖావాడు గేటు తెరిచాడు. కారుని లోపలికి పోనిచ్చి పోర్టికోలో ఆపింది. ఇద్దరూ బయటకు దిగారు.

    "ఇదే మా ఇల్లు. సంవత్సరంక్రితం కట్టించాను. బాగుందా?" అని ప్రశ్నించింది శైలజ కుతూహలంగా. మధుబాబు తలయెత్తి పరిశీలనగా చూచాడు. 'చాలా బాగుంది' అన్నాడు.

    "లోపలకు పోదాం రా" అంటూ ఆమె మెట్లు ఎక్కిదారితీసింది. పనివాడు వచ్చి మధుబాబు సూట్ కేసుని లోపల పెట్టాడు.

    మేడమీదకు వెళ్ళాక డ్రాయింగ్ రూంలోని సోఫాల్లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. బట్లర్ ని కేకేసి శైలజ ఇద్దరికీ ఫలహారం కాఫీ తీసుకురమ్మని పురమాయించింది.

    "ఇంత పెద్ద ఇంట్లో నేనూ, మా ఆయనా వుంటున్నాం అంతే. ఎవరో చాలామంది స్నేహితులూ, చుట్టాలూ అంటూ వచ్చి పోతుంటారనుకో. పెర్మనెంట్ గా వుండేదిమట్టుకు ఇద్దరమే" అన్నది.

    "ఆయనా?"

    "అవును. అంత ఆశ్చర్యపడతావేం? నేను పెళ్ళి చేసుకున్నాను. ఆయన కూడా ఓ సినిమా ప్రొడ్యూసర్. ఇంతవరకూ రెండుసినిమాలు తీశాడు. రెండింట్లోనూ హీరోయిన్ ని నేనే. నేనిందులోకి గావటానికి కూడా ఒకరకంగా ఆయనే కారణం."

    అతనేం మాట్లాడలేదు.

    అయిదు నిముషాలు గడిచాక కాఫీ ఫలహారాలు వచ్చాయి. అతను వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కువచ్చాడు.

    ప్రక్కన టవల్ వుంది. చేతులు తుడుచుకో."

    "ఉహు. చేతులు కడుక్కున్నాక మళ్లీ టవల్ తో తుడుచుకోవటం శుభ్రత కాదు."

    "అబ్బో! డాక్టర్ చదువుతున్నావుగా, ఎన్నో ఏడు?"

    "ఇది నాలుగోది."

    "ఇది గాకుండా ఇంకో ఏడాదితో కోర్సు పూర్తయిపోతుందన్నమాట. బెజవాడలోనే ప్రాక్టీస్ పెడతావుగా."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra