Home » Vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్

                                                                                                      తిరుపతి
                                                                                                     8-10-03
    రఘుగారికి నమస్తే,
    యీ పూట మనసు మధుబాల మందస్మితమంత  అద్బుతంగా వుంది. ఎందుకంటే; పాపనాశం శివన్ హిందోళ కృతి సామగానలోలమే, గాయత్రిగారు పలికించినది, విన్నాను!
    సంగీతం వాళ్ళు సాధారణంగా అందంగా వుండరు. యం.యస్. సుబ్బలక్ష్మి లాగా, గాయత్రిగారు  బావుంటారు.
    అందాల పోటిలో గెలిచిన వాళ్ళ కంటే, గెలవని వాళ్ళలో యెక్కువ బావున్నవాళ్ళుంటారు.
    భారతీయ శాస్త్రీయ సంగీతం మనోధర్మ సంగీతం వోక్కరే పాడతారు -కూడా  గుంపును  చేర్చారు. DD హ్తేదరాబాద్  వొ గుంపును పోగేసి మందగా కూలబెట్టి వాగిస్తారు- సంగీతం పేరున. సంగిత మూర్ఖులు.
    సంగిత దర్శకుడు మదన్ మోహన్ అన్ని పాటలూ లతా మంగేష్కర్ తో  పాడించాడు. అనికూడా ఆణిముత్యల్లాంటి  మంచి పాటలు.
    వోట్ల రాజకీయ వివక్ష;
    మహాత్మాగాంధీ  తప్ప, పెద్ద పెద్ద మొదటితరం నాయకులెవ్వరి జన్మదినానికి  సెలవివ్వకండా, మొత్తం నాదంలో కలిసిపోతుంది, గాయత్రిగారు తీగ మిటినప్పడు . మిటటం  అసలు ప్రత్యకంగా తెలియదు. మోత్హ్తం వొకే నాదంగా వినిపిస్తుంది.
    యింత వరకూ రాసేసరికి మీరు పంపిన మ్తెదానం లోతుల్లోకి....పుస్తకామూ World Radio చేరాయి. నవంబరు 6న  వొచ్చినప్పుడు నాకోసం  వకటి కొని తెచ్చి యిది తిసుకేడతామన్నారు. దేనికి! యిదే యిక్కడ వుంచేస్తే సరిపోతుంది కదా! (యింకా పెట్టి చూడలేదు. మీరు మెచ్చారు కనక బాగానే వుంటుంది) పోస్టు టైం అవుతూంది. ఆపుతాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

           

                                                                                            -వడ్డెర చండీదాస్.

                                                                                                   తిరుపతి   
                                                                                                    9-10-03

    రఘుగారికి నమస్తే,
    మీరు పంపిన రేడియో Operate  చెయ్యటం నాకు చాతకాలేదు. FM తిరుపతి కూడా నిట్  గా రాలేదు. గీ- అని చప్పుడు Operate చెయ్యబోతే. Manual  వుంటే చాతవునేమో. బీరువాలో భద్రపరిచాను. మీరు వొచ్చినప్పుడు తెలియదుజేద్దురు.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                      -వడ్డెర చండీదాస్.      
                                                                                              తిరుపతి
                                                                                             10-10-03
    రఘుగారికినమస్తే,
    నా దగ్గిరున్న చిన్న philips రేడియో యీ World Receiver కంటే బావుంది. దీన్లో  కంటే నా దగ్గిరున్న PHILIPS లో యెక్కువ స్టేషన్లు యింకా బాగా వొస్తున్నాయి.  3V.  అల్పప్రాణి. 6V. అయివుంటుందని అన్ని Indian stations బాగా వొస్తాయని  అనుకున్నాను. యిలా అని తెలిస్తే తీసుకునే వాణ్ని కాదు. Now okay. యిదేమితా  అని వర్రీ కాకండి. కొనమన్నాను కాబట్టి తిసేసుకుంటాను.
                                                                                             -వడ్డెర చండీదాస్.

                                                                                                   తిరుపతి
                                                                                                18-10-03
    రఘుగారికి నమస్తే,
    మీ కార్డు అందింది. సంతోషం. World Receiver Radio 6th Nov. న వొచ్చినప్పుడు తిసుకేడుదురు. బీరువాలో భద్రపరిచాను. cassettes అవసరంలేదు. యిక్కడ నా మిత్రుడి  వాళ్ళబ్బాయి  బెంగుళూరులో Microsoft Engineer సంగీతాసక్తి. అప్పడప్పడు  నాకు తెస్తుంటాడు. క్రితం నెలలో వెయ్యి  రూపాయలకి cassettes తెచ్చాడు. వారానికి మూడుసార్లు సంగీతం షాపులు తిరుగుతుంటాడట. చాలా సమయం పడుతుందట. సంక్రాంతికి వొస్తాడు. లిస్టు యిచ్చాను. తీసుకొస్తాడు. మీ రాక కోసం యెదురుచూస్తూ.
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                   -వడ్డెర చండీదాస్.

                                                                                                        తిరుపతి
                                                                                                    10-11-03
    రఘుగారికి నమస్తే,
    హిందూస్తానిలో  కంటే కర్నాటకలో కీర్తన యెక్కువ ప్రాముఖ్యం, యెక్కువ సుదిర్ఘం. హిందూస్తానిలో  కీర్తన దాదాపు వుండనట్లే. అందుకే కృతికర్తల పేర్లు చెప్పరు. రాగ లక్షణాలను బట్టి పాడుతుంటారు, స్వరాలతో.
    ప్రభుత్వ మురికి  ఆస్పత్రులలో నర్సులు; తెల్లగులాబిలు.
    చలంలో భాషావ్తెవిధ్యం  ఉండదు, కేవలం చలం భాష. అన్ని రకాల వ్తెవిధ్య పాత్రలు అందరూ కూడా చలం భాషే మాట్లాడతారు.
    నాకు  నచ్చిన కర్నాటక రాగాలలో కొన్ని: హిందోళం, మోహనం, శ్రీ కళ్యాణి, అభేరి, హంసధ్వని, రీతిగౌళ, శుద్దధన్యాసి, బిలహరి, మధ్యమావతి, సామ, తోడి, కాంబోజి, ముఖారి,  జయంత శ్రీ..
    తిరుపతి రేడియో పెట్టాను-మధ్యనాలు వివిధభారతి రిలేకి, శని ఆదివారాలు రాత్రులు అఖిలభారతి సంగిత సభ డిల్లి రిలేకి తప్ప.
    మనదేశంలో ముఖ్యమ్తెన  భాషలలో నేను వినలేనిది, తమిళం తెలియకపోవటం వల్ల  మాట్లాడటం, వినటం తప్పింది.
    The most sensuous Which  is not vulgar  I have ever  seen- telecast by Fashion  TV-The Pirelli  calendar 1999 June- shirley  Mallman.  (చట్టబద్ధం కాదు కనకBlue Films యెప్పుడు చూడలేదు)
    హిందీ పాప్ సంగీతంలో గజల్స్ పాడే జగజీత్ సింగ్ గొంతు యిష్టం.
    హిమానుక్షణికాగ్ని గురించి వ్యాసాలు రాయటానికి పూనుకున్నారు. పెద్దపనే.
    మా అమ్మానాన్నలు సమస్తమూ నా యిష్టానికే  వొదిలేశారు. వాళ్లు నాకు నెర్పిందేమి లేదు. వాళ్ళనుంచి మంచితనమూ,  యెవరిని దేనికి నిర్బామ్దించకపోవటం  వూం  నేర్చుకున్నాను. మా నాన్న జీవకళ వున్నా నలుపు. మా అమ్మ పసిమిరంగు. నిజాం దేశంలో స్కూల్లో వుర్దు మాత్రమే నేర్పేవాళ్ళు. యింటిలో మా అమ్మ తెలుగు నేర్పేది.
    వోజోన్ పోర సమస్య చాలా ప్రమాదకర సమస్య. ప్రపంచదేశాలన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం.
    The   most  Worthy tiny thing. I use,  is collins Gem ENGLISH Dictionary.
    మధ్యమావతి గాయత్రిగారి అభిమానరాగం అనిపిస్తుంది. మధ్యమావతిలో  యెక్కువ  కృతులు  వాయించారు. మధ్యమావతిలో వక గంట సెపు రాగం తానం  పల్లవి యిస్తే బావుండును. (Vocal effect) పదాలను పలికిస్తూ, వాయిస్తారు. కీర్తనల పూర్తి పాఠం తెలిస్తే పూర్తిగా అనుభూతించాటానికి  వీలవుతుంది.
    చాలా సినిమాలున్న కృష్ణకుమారికి  మంచి పాటలు యెక్కువె వున్నాయి.
    పొరపాటున వెలువడిన "తూనీగా" పాట బావుంది.
    విణానాదం అత్యమితంగా యిష్టమ్తేన నాకు;  వీణనాదంలా వుండే  సుశీల కంఠస్వరం  అంతే యిష్టం.
    మ్తేసూర్ దొర్తేస్వామి అయ్యంగార్, రాగం తానం పల్లవి: కాంభోజి,  బావుంటుంది.
    రాగాలు రికార్డు చేయించేట్లయితే 90 నిమిషాల cassettes  మిద చేయించ కండి. 60 నిమిషాల కేసేట్స్ మిద చేయించండి. japan, sony 60 - ఐతే మంచిది.              
                                మీ    నలుగురికి శుభాకాంక్షలు.

                                                                                                        -వడ్దర్ చండీదాస్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra