Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


                            జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం |
                     ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముప్పాస్మహే ||
                                     నాలుగవ అధ్యాయము

1.     ఏదమగన్మదేవ యజనం పృథివ్యా యత్ర దేవసో అజుషన్త విశ్వే |
    ఋక్సామాభ్యాం సంతరన్తో యజుర్మీరాయస్పోషేణసమిషా మదేమ
    ఇమాఆపః శముమేసన్తుదేవీఃఓషధేత్రయాస్వ స్వధితేమైన అహింసీః

    యజమాని అనుచున్నాడు:-

    భూమిమీద దేవతలను పూజించుచోటు యజ్ఞస్థలము. మేము అచటికి చేరుకున్నాము. అచట విశ్వేదేవతలు ఎంతో ప్రియముగా వానిని ఆరగింతురు. మేము బుక్కులు, సామగానములు, యజ్ఞవిధానమును బోధించు బుషి వాక్యములచే కర్మపారావారమును దాటుదుము. అందువలన మాకు ధన సమృద్ధి కలుగవలెను. వర్షము కలిగి మాకు ఉల్లాసము కలిగించవలెను.

    (ముండనము చేయునపుడు తలతడుపునీటిని చేతతీసికొని)

    ఈజలము ముండవ కార్యమున శుభంకరమగును గాత.

    (నీటితో తలను తడిపి వెంట్రుకలు, కుశలను ఒక్కచో చేతపట్టి)

    దర్భే! నీవు ఈబాలకుని రక్షింపుము. వజ్రపత్రఛురమా! నీవు ఈబాలుని- ముండన సమయమున- బాధింపకుము.

    2. (స్నానము చేయునపుడు నది మున్నగు వానిలో ప్రవేశించిన యజమాని)

    మాతృవాత్సల్యముగల శీతలజలము మమ్ము పరిశుద్ధులను చేయవలెను. ఘృతము వలె పవిత్రము చేయుజలము స్వశక్తితో మమ్ము పవిత్రులను చేయవలెను. ద్యుతి మంతమగు ఈజలము శరీరపు సకల మాలిన్యములను ఆత్మకు సంబంధించిన పాపములను కడిగివేయవలెను.

    (స్నానము చేసిన తరువాత)

    జలము నన్ను పరిశుద్ధుని చేసినది. జలము నుండి బయటికి వచ్చినాను.

    (ధోవతిని చేత పట్టుకుని)

    ధోవతీ! నేను కర్మమునందు ప్రవృత్తుడనగు దీక్షను - కర్మము వలన కష్టములను నీవు సహించుమూర్తివి. కళ్యాణ కారివి. సుఖప్రదాయినివి. నా శరీరపు శుభవర్గమును ద్విగుణీకృతము చేయుటకు గాను నిన్ను ధరించుచున్నాను. (ధరించవలెను)

    (ఘృతం హి అపాం పరమంతేజః పవిత్రం చ అని ఉవటుడు. ఘృతమే జలమునకు పరమ తేజము. పవిత్రము. జలమున ఘృతమున్నట్లున్నది. గ్రహించవలసి ఉన్నది)

    3. (చేతిలో వెన్న తీసికొని) నవనీతమా! నీవు మహా గోవుల పాలసరమవు. శరీరమునకు కాంతి కలిగించుదానవు. నాకు బ్రహ్మవర్చస్సు యొక్క కాంతిని ప్రసాదించుము.

    (చేత కాటుక అందుకొని) కాటుకా! నీవు వృత్రుని రాలిన కంటినల్లని పాపవు. నీవు కళ్ళకు వెలుగునిచ్చుదానవు.

    కాటుకా! నీవు నాకు కంటిని-కంటివెలుగును-కలిగింపుము.(కాటుక దిద్దుకొన వలెను)

    4. మనసునకు స్వామియగు ప్రజాపతి నన్ను పవిత్రుని చేయవలెను. సవిత అచ్ఛిద్ర పావన వాయువున పవిత్రుని చేయవలెను. సూర్యుడు తన కిరణములచే పవిత్రము చేయవలెను.

    పవిత్రపతే! అట్టి పావనత్వమున నీవు నాకు పవిత్రత ప్రసాదించినావు. దానితో సంకల్పించిన కర్మను పూర్తి చేయగల సామర్థ్యము నాకు కలుగవలెను.

    5. దేవతలారా! మీరు యజ్ఞమున ప్రవర్తమానులయినపుడు మిమ్ము మేము ధనము యాచింతుము మీ యజ్ఞముల సిద్ధివలన కలిగిన ఆశీర్వాదములు యాచించుచున్నాము.

    6. స్వాహా. నేను మనస్ఫూర్తిగా యజ్ఞము ప్రారంభింతును. స్వాహా. నేను విస్తృత అంతరిక్షమునుండి యజ్ఞము ప్రారంభింతును. స్వాహా నేను ద్యావాపృథ్వినుండి యజ్ఞము ప్రారంభింతును. స్వాహా. నేను వాయువు నుండి యజ్ఞము ప్రారంభింతును. స్వాహా.

    7. సంకల్పసిద్ధికిని- యజ్ఞసాఫల్యమునకును అగ్నయేస్వాహా' మేధస్సు మరియు మనోప్రాప్తికొరకు అగ్నయేస్వాహా. దీక్ష మరియు తపస్సు కొరకు అగ్నయేస్వాహా. సరస్వతి మరియు పోషించు దేవత పూష కొరకు అగ్నయే స్వాహా. కంటికి కనిపించు మహాజలము విశ్వము కొరకు శాంతి మయమగును. ద్వావాపృథ్వి, విశాల అంతరిక్షము విశ్వముకొరకు శాంతి మయములగును. బృహస్పతికి హవిస్సులు అర్పింతుము స్వాహా.

    "బృహస్పతయే హవిషా విధేమ స్వాహా"

    8. సవిత విశ్వేదేవతల నేత. అతని మిత్ర భావమును- నరుడు తన కళ్యాణమునకు- వరించవలెను. అందరు ధనమునే యాచింతురు. పోషణ కొరకు ధనమును వరించవలెను. స్వాహా

    (ధనము అపరిమితముగా యాచించరాదు. పోషణకు సరిపోవునంత యాచించవలెను అవసరములకు మించిన అర్థము అనర్థమగును)

    9. (కృష్ణాజినము మీది తెల్లని చారలను స్పృశించి)
   
    ధారలారా! మీరు ఋగ్వేద, సామవేదములు స్వీకరించిన ప్రతిమూర్తులు. ఆరెండును మాకు చెందును గాత. నిన్ను పరచుచున్నాను. ప్రారంభించిన ఈ యజ్ఞపు చివరి ఋక్కు ముగియు వరకు మీరు నన్ను రక్షించండి.

    చర్మమా! నీవు చర్మమవు. నా నమస్కారము అందుకొనుము. నాకు సుఖములు ప్రసాదించుము. హింసించకుము. హింసించకుము.

    10. (మేఖలను చేతపట్టి) మేఖలా! నీవు అంగిరసశక్తివి. ఉన్నవంటి కోమలమైన దానవు. నీవు నాలో బలమునింపుము.

    (మేఖలలో ముడి వేయుచు) ముడీ! నీవు సోమయాగసంబంధగ్రంధివి. వస్త్రమా! నీవు యజ్ఞదేవతకు గృహము వంటిదానవు.

    (కృష్ణమృగపు కొమ్ముఅందుకుని) శృంగమా! నీవు ఇంద్రుని నివాసస్థానమవు. (కొమ్ము తోనేలను త్రవ్వుచు) శృంగమా! నీవు యజమాని  ప్రయత్నములను ఫలవంతము చేయుము.

    (చేత దండము పట్టి) నీవు నిలువుగా ఉండుము. నీవు ఉన్నతుడవు. నన్ను పాపముల నుండి రక్షింపుము. యజ్ఞమును ఉచ్చరించబడు చివరి ఋక్కువరకు నీవు ఇట్లే నిలిచిఉండుము.

    11. (యజమాని అనుచున్నాడు:-)

    ఋత్విజాదులాలా! మీరు నాకొరకు దుగ్ధపానము - వ్రతము -సిద్ధము చేయండి. వాగ్రూప అగ్నియే వేదము. కర్ర యజ్ఞసంబంధి (సమిధరహిత అగ్ని యజ్ఞసంబంధి కాజాలదు.) అగ్నియే యజ్ఞము.

     వేదవాణి దేవసంబంధి. సుఖదాత్రి. బ్రహ్మ వర్చస్సు ప్రసాదించునది. యజ్ఞమును ముందుకు సాగించునది. అట్టి వేదవాణిని- మావశమందుండమని - యాచించుచున్నాము.

    చక్షురాది దేవతలు మనసునుండి పుట్టినవారు మనసుతో సంబంధము గలవారు. యజ్ఞమును ముందుకు సాగించువారు. వారు మమ్ము ఆపదలనుండి కాపాడవలెను. వారు మమ్ము రక్షించవలెను. వారికి స్వాహా "తేభ్యః స్వాహా"

    12. జలమా! త్రాగినంత మీరు త్వరగా జీర్ణమగుదురు. మా ఉదరములందు చేరి సుఖములు కలిగింతురు. యక్ష్మరహితము అన్య వ్యాధిరహితము, నిష్పాపము, ద్యోతమానము, అమృత స్వరూపము, సత్యవర్ధకమగు జలము మాకు రుచికరము కావలెను.
   
    13.(మూత్రవిసర్జన చేయునపుడు కృష్ణమృగపు కొమ్ముతో నేలను త్రవ్వి యజమాని మట్టిపెడ్డ చేతితో తీసికొని)

    లోష్టమా! ఈ నేల నీ యొక్క యజ్ఞ సంబంధి శరీరమగును. (మూత్రము విసర్జించుచు) నేను మూత్రము విసర్జించుచున్నాను - సంతానోత్పాదక వీర్యమును కాదు. విషాక్త జలమును శరీరము నుండి బయటకు పంపి, క్షీరపానమున ముఖాగ్నిని ఆహుతి ఇచ్చుచు నీవు నేలలోనికి ఎండిపొమ్ము. ఏలననగా నీవు పృథ్వినుండియే పుట్టినావు కదా!

    14. (రాక్షసాది బాధానివృత్తి కొరకు అగ్నినే రక్షకుని చేసి పరుండవలెను)

    అగ్నీ! నీవు అప్రమత్తుడవై ఉండుము. మేము సుఖముగా నిద్రింతుము. మమ్ము ప్రమాద రహితులను చేయుము. రక్షింపుము. మరల, మరల మమ్ము మేల్కొలుపుము.

    (మనము మంత్రము చదువుట లేదు. అగ్నిని దీప రూపమున పెట్టుకొనియే పడుకొను చున్నాము)

    15. (మేల్కొనిన యజమాని) మరల - మరల నాకు ఆయువు కలిగినది. మరల మనస్సు మరల ఆత్మ నాకు  లభించినవి మరల కన్నులు - మరల చెవులు నాకు లభించినవి.

    జఠరాగ్ని రూపమున సకలము జీవించి ఉంచు వైశ్వానరాగ్నీ! నీవు అహింసితుడవు. దేహమును పవిత్రము చేయువాడవు. పాపముల నుండి నన్ను రక్షింపుము.

    16. అగ్నీ! మానవులందు మా వ్రతములను రక్షించువాడవు నీవే. యజ్ఞములందు నీవే ఏకమాత్రస్తుత్యుడవు.

    (అపేక్షిత ధనమును తాకి) ధనదాత సవిత మాకు ధనము అందించినాడు. సోమదేవా! నీవు మాకు మరిన్ని ధనములను అందించుము.

    17. (జుహువుతో ఘృతమును తీసి అందు దర్భ స్వర్ణ ఖండము వేసిన యజమాని)

    ఘృతమా!, ఈ ఘృతము నీ శుభ్ర దేహము. ఈ సువర్ణము నీ తేజము. నీవు నీశుభ్ర శరీరముతో ఈతేజమును కూర్చుము. తేజస్సుతో కూడిన సోముని అందుకొనుము.

    వాక్కూ! నీవు వేగవంతవు. మనసు నుండి వెడలిన దానవు. యజ్ఞము కొరకు నియుక్తవు.

    18. శబ్దమా! నేను నీ ఆజ్ఞానువర్తిని. యజ్ఞసమాప్తి వరకు నాదేహము దృఢముగా ఉండవలెను స్వాహా.

    (జుహువు నుంచి బంగరు ముక్కను పైకితీసి యజమాని)

    స్వర్ణమా! నీవు తేజోరూపమవు. ఆహ్లాదకమవు. అమృతమవు. సర్వదేవసంబంధివి.

    19. సోమమును కొనగల వాక్కూ! నీవే నా చిత్తమవు. మనసువు. ధారణాశక్తివి.

    గోవూ! నీవు దక్షిణవు. యజ్ఞమున దక్షినారూపమున ఇచ్చిన ద్రవ్య స్వరూపమవు. నీవు క్షత్రియవర్ణసోమ సంబంధివి. యజ్ఞసంబంధివి. అఖండమవు. మిత్రుడు నీ పాదములను బంధించును గాత. ఇంద్రుడు అధిపతి యగును గాత. పూష నిన్ను సురక్షితముగా ఉంచును గాత.

    20. గోవూ! సోమమును నిన్ను  ఇచ్చి కొనవలసి ఉన్నది. అందుకు ఏ చోటికి పోవుటకైనను నీమాత అనుమతించవలెను. నీతండ్రి అనుమతించవలెను. నీ సోదరుడగు ఎద్దు అనుమతించవలెను. ఏకగర్భజనితయై, ఒకే గుంపున ఉండునట్టి నీ మిత్రుడు ఆబోతు నిన్ను అనుమతించవలెను.

    దేవీ! సోమక్రయిణీ! నీవు ఇంద్రార్థము సోమునిచేరుము. రుద్రుడు నిన్ను అందుకు ఆజ్ఞాపించును గాత. అట్టినీవు స్వమిత్రుడగు సోమసహితముగ తిరిగి రమ్ము.

    21. (సోమము  కొనుటకు ఆవును ఉత్తరదిశకు సాగనంపుచు)

    గోమాతా! నీవు వసుసంబంధినివి. నీవు అదితివి. నీవు ద్వాదశ ఆదిత్యరూపమవు. నీవు రుద్రరూపవు -చంద్రరూపవు. బృహస్పతి నిన్ను సుఖముగా ఉంచును గాత. వసుసహిత రుద్రుడు నిన్ను అభిలషించవలెను.

    22. ఈ భువి అఖండనీయము. ఇది దేవతలను పూజించు ఉత్తమ స్థానము. యజ్ఞమునందు ఉపకరించు ఘృతమా! నేను నిన్ను కాచుచున్నాను.

    యజ్ఞస్థలమా! నీవు గోపదచిహ్నవు. ఇది నీకొరకు ఘృతసహిత ఆహుతి.

    (అధర్యు స్ఫనతో యజ్ఞస్థానమును మూడుసార్లు త్రవ్వి)

    గోపదమా! నీవు మాలో ఉండుము. నీ బంధుత్వము మాతోనే కావలెను. నీలో ఉన్న ధనము నాతో ఉండవలెను.

    (త్రవ్విన మట్టిని పాత్రలో నింపి యజమానికి అందించి)

    గోపదమా! మేము ఋత్విక్కులము. మేము ధన సమృద్ధి విహీనులము కారాదు.

    (యజమాని పాత్రను తన పత్నికి అందించి పత్నీ! ధనము నీవద్దనే ఉండవలెను.)

    23. (సోమమును కొను ఆవును చూచుచు యజమానపత్ని)

    సోమక్రయిణీ! నేను నిన్ను పవిత్ర బుద్ధితోను- ఉదార కుశల దృష్టితోను దర్శింతును. నీవు నా ఆయువును నష్టపరచకుము. నేను సహితము ణీ ఆయువును నష్టపరచను. గోదేవీ! నీదయవలన నాకు పుత్రుడు కలుగవలెను.    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra