Home » Merlapaka murali » Cheekatiki Avathala


    "ఈ కన్నీళ్లు అయిపోయిన మరుక్షణం మరణించాలి" అని అతనెప్పుడో నిర్ణయించుకున్నాడు. వెధవ కన్నీళ్లు ఎప్పటికీ కొదవేలేకుండా వస్తూనే వున్నాయి అని అప్పుడప్పుడూ విసుక్కుంటూ వుంటాడు.

 

    అతని కారు, అలవాటు పడిన ఎద్దులు బండిని ఇంటివరకు లాక్కొచ్చినట్టు బార్ లోపల దూరి బుద్ధిగా ఓ పక్కగా ఆగింది.

 

    "అనుభూతి లేక ఎండిపోయిన గుండెను విస్కీ గ్లాసులో ముంచి లేపాలి" అనుకుంటూ లోపలికి నడిచాడు. ఇది ప్రతీసారి బార్ మెట్లు ఎక్కుతున్నప్పుడంతా అనుకుంటూ వుంటాడు.

 

    ఆ రోజూ ఆ వాక్యాన్ని నములుకుంటూ దూరంగా విసిరేసినట్టుండే ఓ టేబుల్ దగ్గరికి నడిచాడు.

 

    అలవాటయిన బేరర్ అతనికి అలవాటయిన ఓ బాటిల్ తెచ్చిపెట్టాడు.

 

    రెండో రౌండ్ లో వుండగా ఠక్కున గుర్తొచ్చినట్టు కళ్ళను తుడుచుకున్నాడు. యథా ప్రకారం చెమ్మ తగిలింది. కన్నీళ్ళ మీద మళ్ళీ విసుక్కున్నాడు. ఈ కన్నీళ్ళయినా అయిపోవాలి, లేకుంటే తనైనా వాటికి ఆనందం అనే అడ్డుకట్ట వేయాలి.

 

    "ఆనందం-" ఆ మాట భలే తమాషాగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ మనసుకు చిక్కని పదం అది. ఆ పదం గుండెల్లో పుట్టడమే మహాపాపం అనుకుంటూ గ్లాసులోని విస్కీని గొంతులో పోసుకున్నాడు. హిస్టీరిక్ గా నవ్వుకుంటూ వుండిపోయాడు. అది నవ్వు కాదు. భోరున ఏడ్వలేక చేసిన ప్రయోగం.

 

    ఒకప్పుడు అతనికి కన్నీళ్ళంటే అసలు ఏమిటో తెలియదు.

 

    బాధంటే అదేదో ఆనందానికి వ్యతిరేకపదంగానే తెలుసు. ఓ పన్నెండేళ్ళు వెనక్కి వెళితే అతను ఇరవై రెండేళ్ళ కుర్రాడు.

 

    కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో వుండేవాడు. తోటి విద్యార్థులంతా కాలంమీద సవారీ చేస్తూ మనసుకు చక్కిలిగింతలు పెట్టుకునే వాళ్ళు. సినిమాలు, షికార్లు, అమ్మాయిలకు లైన్ వేసే కార్యక్రమాల్లో మునిగి తెలేవారు.

 

    చంద్రహాస్ కు వాళ్ళతో బాగానే స్నేహం వుండేదిగానీ వాళ్ళ సరదాల్లో ఎప్పుడూ పాలుపంచుకునేవాడు కాదు. ఏదైనా, దేన్నయినా సంపూర్ణంగా ఆస్వాదించాలనే తత్వం అతనిది.

 

    మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి, టౌన్ కి వెళ్ళి ఏ బార్ లోనో భయం భయంగా బీరు తాగడం అంటే అతనికి అసలు ఇష్టం వుండేది కాదు.

 

    కేవలం ఆపోజిట్ సెక్స్ ఆకర్షణతో సాయం సంధ్యలో మునిగి తేలుతూ వచ్చే ఆడపిల్లల్ని సైట్ కొట్టడమంటే ఎగ్జయిటింగ్ గా వుండేది కాదు. ఎప్పుడో సినిమా మధ్యలో మోకాళ్ళ పైకి చీర తొలగించే హీరోయిన్ ను, కళ్ళను చారడేసి చేసుకుని చూడడమంటే బొత్తిగా నచ్చదు.

 

    దేన్నైనా తుదికంటా ఆస్వాదించాలనే అతనిని మిత్రులు కూడా బలవంతం చేసేవాళ్ళు కాదు.

 

    "నీలాంటి సెన్సిటివ్ వెధవలను ఆడపిల్లలు ఏడ్పించుకు తింటారు- ముఖ్యంగా నీ భార్య, వాళ్ళకు రఫ్ అండ్ టఫ్ గా వుండే మగాళ్ళంటేనే ఇష్టం" అని మిత్రులు అప్పుడప్పుడూ ఎద్దేవా చేసేవాళ్ళు.

 

    "ఏం ఫరవాలేదు. నా భార్య నన్ను వెధవాయి అనుకున్నా నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాను. ఎలాంటి మినహాయింపుల్లేని ప్రేమ ఎంత గొప్పగా వుంటుందో గుళ్ళోనో, బస్సులోనో భుజాలు రాసుకొని సంతృప్తి పడే మీకేం తెలుసు?" అని అలాంటప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు.

 

    "మునివర్యా! మరీ ముక్కు మూసుకొని రూమ్ లో కూర్చుంటే అలాంటి మినహాయింపుల్లేని ప్రేమ దొరుకుతుందా?"

 

    "అవసరం కొద్దీ కక్కుర్తి పడకుంటే చక్కటి పిల్లే దొరుకుతుంది"

 

    అది నిజమైంది. అతనికి మధుమతి లాంటి మంచి పిల్ల దొరికింది. ఆమె ఎవరో కాదు- స్వయానా అతని మేనత్త కూతురు.

 

    వాళ్ళది కావలి దగ్గర ఓ పల్లెటూరు. చంద్రహాస్ తండ్రికీ, మధుమతి తండ్రికీ, అప్పుడెప్పుడో ఆస్తి విషయమై పేచీలొచ్చాయి. దాంతో రెండు కుటుంబాల మధ్య రాకపోకలు వుండేవికావు. అలాగని వాళ్ళు శత్రుత్వం కూడా పెంచుకోలేదు.

 

    ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్ళిలోనో, చావులోనో కనిపిస్తే ఒకటీ రెండు మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఆ రెండు కుటుంబాల మధ్య పేచీలు మొదలయ్యే నాటికి మధుమతి సంవత్సరమే పిల్ల.

 

    తనకో మేనత్త వుందని తెలుసుగాని వాళ్ళని ఎప్పుడూ చూళ్ళేదు చంద్రహాస్. అతను పదవతరగతి నుంచీ పట్నంలో చదువుకోవడంవల్ల బంధువర్గం గురించి పూర్తిగా తెలియదు. మేనత్త అనసూయమ్మ మాత్రం అప్పుడప్పుడూ చంద్రహాస్ గురించి అనుకుంటూ వుండేది.

 

    "మన కుటుంబాల మధ్య ఆ వెధవ పేచీ రాకుండా వుండి వుంటే నిన్ను వాడికిచ్చి పెళ్ళి చేసుండేవాళ్ళం. ఎన్ననుకుని ఏం లాభం? అంత అదృష్టం మనకి లేదు" అని ఆమె మధుమతితో అంటుండేది.

 

    అలా వింటూ వుండటం వల్ల ఆమెకి అతనంటే ఎక్కడో అంతరాంతరాల్లో ఓ విధమైన ఇష్టం కలిగింది.

 

    ఆ ఊర్లో నుంచి రాజ్య అనే ఒకతను ఇంజనీరింగ్ కళాశాలలో చదివేవాడు.

 

    ఓసారి అతన్ని కలుసుకుని మధుమతి "మా బావ చంద్రహాస్ మీ కాలేజీలోనే కదా చదివేది. మేనమామ కొడుకే అయినా ఎప్పుడూ చూడలేదు. ఏమీ అనుకోకపోతే ఓ చిన్న హెల్ప్ చేసిపెట్టకూడదూ" అంది.

 

    "ఏమిటో చెప్పు?"

 

    "మా బావ ఫోటో ఒకటి తీసుకురాకూడదూ."

 

    "అలానే- ట్రై చేస్తాను"

 

    నెక్ట్స్ సెలవులకు వస్తున్నప్పుడు చంద్రహాస్ ఫోటో ఒకటి తెచ్చాడు రాజయ్య.

 

    ఆ ఫోటో చూస్తూనే గుండెంతా విచ్చుకున్నట్టయింది మధుమతికి. సాఫ్ట్ గా, అందంగా, కలలన్నిటినీ కళ్ళల్లో దాచుకున్నట్టు మెరిసిపోతున్న చంద్రహాస్ ఆమె హృదయంలో చెరగని ముద్ర వేశాడు.

 

    రోజులో ఒక్కసారైనా ఆ ఫోటో చూడకుండా వుండలేకపోయేది ఆమె. ఆ ఫోటోని తల్లీ, తండ్రికి తెలియకుండా తన సూట్ కేసులో దాచుకుంది.

 

    ఆ ఫోటో చూస్తే చాలు ఆమె మనసు గంతులేసేది. ఏదో తెలియని భావోద్వేగం మనిషిని ఊపేసేది. ఎద అంతా విప్పారేది.

 

    చదువైపోయాక పల్లెకి వచ్చేశాడు చంద్రహాస్. ఊర్లో అతని ఏకైక ఫ్రెండ్ సూరిబాబు. ఇద్దరిదీ ఒకటే వయసు. సూరి ఎం.ఏ. తెలుగు పూర్తి చేశాడు.

 

    అతనికి పెళ్ళి చేయాలని ఇంట్లో పెద్దవాళ్ళు తెగ ఉత్సాహపడి పోతున్నారు. కావలి దగ్గర ఓ మంచి సంబంధం వుందని చెబితే పెళ్ళిచూపుల కోసం ఆ ఊరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు.

 

    "వీళ్ళతో చచ్చిపోతున్నానురా దేవుడా పెళ్ళిచూపుల పేరిట ఊళ్ళన్నీ తిప్పుతున్నారు. ఒళ్ళు హూనమై పోతోందిరా" అని సూరిబాబు ఓ రోజు చంద్రహాస్ దగ్గర మొర పెట్టుకున్నాడు.

 

    "మరి తప్పదు కదా! పెళ్ళిరా"

 

    "నువ్వూ తోడుగా రారా" చాలాసేపు అర్ధించిన తర్వాత రావడానికి ఒప్పుకున్నాడు చంద్రహాస్.

 

    రెండోరోజు సూరిబాబు, చంద్రహాస్ పెళ్ళిచూపుల కోసం కావలికి బయల్దేరారు.

 

    ఆ ఊరు కావలినుంచి పదికిలోమీటర్లు. రోడ్డు దగ్గర బస్సు దిగి లోపలికి రెండు కిలోమీటర్లు నడవాలి. కిలోమీటరు తరువాత తంగరాజు పాళెం వస్తుంది. అది తన మేనత్త ఊరని చంద్రహాస్ కి తెలుసు కానీ ఆ వూరు దాటుతున్నప్పుడు కూడా చంద్రహాస్ సూరిబాబుకు అది తన మేనత్త వూరని చెప్పలేదు.

 

    వూరుదాటి ఓ పదడుగులు వేశాక "రేయ్! చంద్రా! ఇది మీ మేనత్త వూరు కదా" అని గుర్తు చేశాడు.

 

    "అవుననుకో"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra